చంద్రబాబు వల్లే ఇవ్వలేకపోయాం
హైదరాబాద్, మేజర్‌న్యూస్: కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా మూడు రాష్ట్రాలతో పాటు తెలం గాణను సైతం ఇవ్వాలని ఉన్నప్పటికీ అప్పట్లో తమ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు నాయుడు అభ్యంతరం వల్లనే సాధ్యం కాలేదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ తేల్చి చెప్పారు. అప్పట్లో టీడీపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని బలపరచటం, ఆ పార్టీ సీనియర్ నేత లోక్‌సభ స్పీకర్‌గా ఉండటం, చంద్రబాబు తో తమకు సత్సంబంధాలు ఉండటం వంటి కారణాల రీత్యా తెలంగాణ సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. నిజామ్ కాలేజీ మైదానంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురు వారం జరిగిన ఎన్డీయే కూటమి మహా పోరాటం సభను ఉద్దేశించి అద్వానీ ప్రసంగించారు. చంద్రబాబు విషయం లో తాము సంకీర్ణ ధర్మాన్ని పాటించామని, అందుకే ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను మాత్రమే ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
మన్మోహన్‌దే ఆ ఘనత...
దేశంలో ఇంత అవినీతి తాండవించేందుకు కారణమైన ఘనత ప్రధాని మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందన్నారు. స్వా తంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అవినీతి ఏ పాలనలోనూ జరగలేదన్నారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో ప్రధాని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించటం దేశ చరిత్రలో ప్రథమం అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు గతంలోనూ ఉన్నాయని, మొరార్జీ దేశాయి, అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాలూ సంకీర్ణాలే అని, ఏనాడూ అవినీతికి పాల్పడ లేదన్నారు. ఆదర్శ్, 2జీ, కామన్‌వెల్త్ గేమ్స్ కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని వేసేందుకు కేంద్రం అంగీకరించనున్నట్టు తెలిసిందని, అయితే అంత మాత్రా న అవినీతిపై తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదన్నారు.
దేశం లో అన్ని అనర్థాలకూ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు అమె రికా, జర్మనీ లాంటి దేశాలు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న తమ దేశస్థుల పేర్లను తెప్పించుకుని చర్య తీసుకున్నాయని, మన సర్కార్ మాత్రం అందుకు వీల్లేదని చెబుతున్నదన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ చూస్తే జాలి వేస్తుంది తప్ప కోపం రాదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికా రంలోకి వస్తే తప్పకుండా తెలంగాణ ఇస్తామని అద్వానీ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ విశ్వాస ఘాతుకం...గడ్కరీ
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆరో పించారు. శ్రీకృష్ణ కమిటీ పేరిట కాలయాపన చేస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరాన్ని కుంభకోణాల సంవ త్సరంగా ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కామన్‌వెల్త్ గేమ్స్ సందర్భంగా ఢిల్లీలో ఒక్క స్టేడియం నిర్మాణానికి కేవలం రూ.100 కోట్లు అవసరమైతే రూ.950 కోట్లు ఖర్చు చేయటమే ఈ అవినీతికి ఉదాహరణ అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ విషయంలో రాజాను చాలాకాలం పాటు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తన కింది మంత్రులు ఏమి చేస్తున్నారో తెలియని ప్రధాని ఆ కుర్చీలో ఎందుకు కూర్చు న్నారని ప్రశ్నించారు. బీజేపీ దేశ భవిష్యత్తును మారుస్తుం దని, దోపిడీ నుంచి దేశాన్ని రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అతివృష్టి కారణంగా అతలా కుతలం అయితే పరామర్శించటానికి ప్రధాని, సోనియా, ఢిల్లీలోని ఆంధ్ర మంత్రులకు తీరిక లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ దొంగల పార్టీ...శరద్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ దొంగలపార్టీ అని ఎన్డీయే కన్వీనర్ శరద్ యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అక్రమ సంపాదనను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. తన ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి విషయం తనకు తెలి యదని చెప్పే రాజును గద్దె దించాలని చాణక్యుడి సిద్ధాం తం చెబుతున్నదని, ప్రధాని విషయంలో ఇది వర్తిస్తుంద న్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ దొంగాట ఆడుతు న్నదని ధ్వజమెత్తారు. చిదంబరం తెలంగాణ అంటే ప్రధా ని శ్రీకృష్ణ కమిటీ అంటున్నారని, ఆ పార్టీ ఇలాగే వ్యవహ రిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల బీహార్‌లో వచ్చిన ఫలి తాలే వస్తాయని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధి కారంలోకి రాగానే అవినీతిని అంతం చేస్తామని, దోషు లను జైలుకు పంపి తీరుతామని యాదవ్ స్పష్టం చేశారు.
సీఎంల మార్పుతో సమస్య తీరదు...వెంకయ్య
రాష్ట్రంలో ముఖ్యమంత్రుల మార్పులతో సమస్యలు తీర వని జాతీయ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రంలో ప్రస్తుతం అవినీతి, అస్తవ్యస్త, అరాచక, అధిక ధరలను అదుపు చేయలేని ప్రభుత్వ పాలన సాగుతున్న దని ఎద్దేవా చేశారు. యూపీఏకు దశా దిశా లేవన్నారు. ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నా ప్రధాని మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నల్లధనం దాచుకున్న వారి పేర్లు చెప్పాలని అడిగితే ప్రధాని, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పెళ్ళికూతుళ్ళలా సిగ్గు పడుతున్నారని చమత్క రించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కపట నాటకం ఆడుతున్నదని, 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని లబ్ధి పొంది తర్వాత గాలికి వదిలేసిందన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం అని వెంకయ్య స్పష్టం చేశారు.
మేమే ప్రత్యామ్నాయం...కిషన్
రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారటం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము కేంద్రంలో అధికారంలో ఉండగా మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశామని, అక్కడ ఇప్పుడు బీజేపీయే అధికారంలో ఉంద న్నారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి రావటం ఖాయం, తెలంగాణ ఇవ్వటం ఖాయమన్నారు. అప్పుడు తెలంగాణలో బీజేపీయే బలపడుతుందని, మజ్లిస్ భయానికి అదే కారణమన్నారు. సీనియర్ నేతలు బండా రు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, ఎన్.ఇంద్రసేనా రెడ్డి, జాతీయ కార్యదర్శి కె.లక్ష్మణ్, సినీ నటుడు కోట శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.
భారీగా జనం...
బీజేపీ అనేక రోజుల నుంచి కష్టపడి భారీగా జన సమీకరణ చేయటంతో నిజామ్ మైదానం కిటకిట లాడింది. మహిళలు సైతం అధిక సంఖ్యలో రావటం విశేషం. సభ సందర్భంగా తెలంగాణ కళాకారులు పాడిన పాటలు, నృత్యాలు అందరినీ అలరించాయి.
take BY: Suryaa.com

0 comments:
Post a Comment