జై తెలంగాణ అన్న విద్యార్ధిపై ఉపాధ్యాయురాలి దాడి
తూప్రాన్, ఫిబ్రవరి17 : తెలంగాణలో జై తెలంగాణ అనే స్వేచ్ఛలేకుండా పోతుంది. సహాయనిరాకరణ ఉద్యమంలో తరగతి గదిలో జై తెలంగాణ అన్నందుకు దెబ్బలు తి నాల్సి వచ్చింది. ఆంధ్ర ఉపాధ్యాయురాలు కొట్టిన దెబ్బకు కన్ను వద్ద గా యం అయ్యింది. ఈ సంఘటనతో రెచ్చిపోయిన తెలంగాణవాదులు పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు. ఆ ఉ పాధ్యాయురాలిని నిలదీసి దాడి చేసినంత పని చేశారు. టీఆర్ఎస్ నాయకు ల రాకతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారిపోయింది. దాంతో విద్యార్థులు రోడ్డెక్కి హైవేపై రాస్తారోకో చేశారు.
ఈ సంఘటన తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని గురుకుల పాఠశాలలో గు రువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జిల్లాలో కొనసాగుతున్న సహాయనిరాకరణలో భాగంగా మండలంలోని అల్లాపూర్ శివారులో ఉన్న బాలుర గురుకుల పాఠశాలలో సైతం సహాయనిరాకరణను ఉపాధ్యాయులు పాటించారు. విద్యార్థులకు పా ఠాలు చెప్పడం మానేసి తెలంగాణ పాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. గు రుకుల పాఠశాలకు సమీపంలో ఉన్న హైవే టోల్‌గేట్ వద్ద పలువురు ఆందోళన చేస్తు తెలంగాణకు జైకొట్టారు. ఆ సంఘటనలను చూసిన విద్యార్థులు తరగతి గదుల్లోనే జై తెలంగాణ అంటు నినాదాలు చేశారు.
8వ తరగతిలో విద్యార్థులు కల్వకుంటకు చెందిన వెంకటేశ్, మరో విద్యా ర్థి భరత్‌లు జై తెలంగాణ అంటూ నినాదా లు చేశారు. ఆ తరగతిలోకి వచ్చిన ఆంధ్ర ఉపాధ్యాయురాలైన సహాయ ప్రిన్సిపాల్ శారద కర్రతో విద్యార్థులను కొట్టింది. దాం తో వెంకటేశ్‌కు ఎడమ కన్ను వద్ద గాయమై, కొంచెంలో ప్రమాదం తప్పింది. అలాగే 9వ తరగతికి చెందిన చరణ్‌సాయిరెడ్డి, కె. సాయికిరణ్‌లను సైతం కొట్టినట్లు చె ప్పారు. మధ్యాహ్న భోజన విరామ స మయంలో బయటకు వచ్చిన విద్యార్థులు టోల్‌గేట్ వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ జేఏసీ నాయకులకు చెప్పడంతో జేఏసీ నాయకులు అక్కడకు వెళ్లి దాడికి పాల్పడిన ఉపాధ్యాయురాలిని నిలదీశారు.
విద్యార్థులు జేఏసీ నాయకులు ఎదుటే ఆందోళన చేస్తూ, జై తెలంగాణ అంటు నినాదాలు చేశా రు. ఆంధ్ర ప్రాంతం వారిక్కడ పనిచేయరాదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అక్కడకు చేరుకొని గురుకుల పాఠశాలలో ఆందోళన వ్యక్తం చేశారు. దాడి చేసిన ఉపాధ్యాయురాలిని ఎందుకు దాడి చే శారని ప్రశ్నించారు. గొడవ చేస్తే కొట్టినట్లు తెలిపింది. విషయం తెలుసుకు న్న ఎస్ఐ జగదీశ్వర్ అక్కడకు చేరుకుని టీఆర్ఎస్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. జై తెలంగా ణ నినాదాలు చేస్తు విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి44వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టారు.
టీఆర్ఎస్ నాయకుడు దోమల ఆంజనేయులు రోడ్డుపై నృత్యం చేయగా, విద్యార్థులు అతడిని అనుసరించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలితో క్షమాపన చెప్పిస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. ఎస్ఐ జగదీశ్వర్ ఉపాధ్యాయురాలు శారదను తీసుకువచ్చి తెలంగాణ విషయంలో కొట్టలేదని చెప్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, హరికిషన్‌రెడ్డి, పాండురంగారావు, మధుసూదన్‌రావు, బాలనర్సింహారెడ్డి, శంకర్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మానిక్‌రావు, చంద్రారెడ్డి, శ్రీశైలంగౌడ్, నాగరాజు, నాయక్‌లు పాల్గొన్నారు.

Take By: Andrajyohti
0 comments:
Post a Comment