ఆపరేషన్ కేసీఆర్
ప్రజారాజ్యం పార్టీ విలీనంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం మరో అడుగు ముందుకేసి, టీఆర్‌ఎస్‌ను కూడా తనలో విలీనం చేసుకుని, అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలన్న వ్యూహంతో అడుగులేస్తోంది. ఆ మేరకు కేసీఆర్‌ను ఒప్పించే బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీని వాస్‌కు అప్పగించారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే అంశంపై గురువారం సోనియా తనను కలసిన డీఎస్‌తో సుదీర్ఘంగా చర్చించారు. విశ్వస నీయ సమాచారం ప్రకారం.. జగన్ నిష్ర్కమణ, తిరుగుబాటుతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు అని శ్చితి దిశగా సాగుతున్న ఆందోళనకర వాతావరణం నుంచి బయటపడేందుకు, పీఆర్పీని తాజాగా తనలో విలీనం చేసుకుని సీమాంధ్రలోఒకింత ఊపిరిపీల్చుకున్న నాయకత్వం... తాజాగా తెలంగాణలో బలం ఉన్న టీఆర్‌ఎస్‌ను సైతం విలీనం చేసుకుని సీమాంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది.
అందులో భాగంగా.. గురువారం తనను కలసిని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో చర్చించాలని ఆమె డీఎస్‌ను ఆదేశించారు.
తెలంగాణ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉందని, అయితే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటుచేసేం దుకు కేసీఆర్‌ను అంగీకరింపచేయాలని మేడమ్ డీఎస్‌ను ఆదేశించారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల వరకూ కేసీఆర్‌ను మౌనంగా ఉండాలని, ఆ తర్వాత హైద రాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటుచేసి, రాష్ట్రాన్ని విభజిస్తా మని కేసీఆర్‌కు హామీ ఇవ్వాలని డీఎస్ ఆదేశించారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ను విలీనం చేసిన తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు, పార్టీలో కీలక పదవులు అప్పగిస్తామని చెప్పాలన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో అనుకోని పరిస్థితిలో ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటే, సర్కారును గట్టెక్కించా లని కేసీఆర్‌ను కోరాలని సోనియా డీఎస్‌ను ఆదేశించారు. ఈ అంశంపై అహ్మద్‌పటేల్, ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొ యిలీతో చర్చించాలని ఆదేశించారు. కేసీఆర్‌తో చర్చించి, విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
ఢిల్లీలో టీఆర్‌ఎస్ విలీన ప్రక్రియను పక్కకుపెడితే.. కాంగ్రెస్ తెలంగాణను ఇస్తే సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామని, కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ ఇస్తే బర్కాస్ కావడానికి సిద్ధంగా ఉన్నానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీన ప్రక్రియ వ్యవహారం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తున్నాయి. దానికితోడు తెలంగాణ ఇచ్చి తాము టీఆర్ ఎస్‌కు ఎందుకు క్రెడిట్ ఇస్తామని, అందువల్ల టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత బాహాటం గానే వ్యాఖ్యానించిన విషయం విస్మరించకూడదు. స్వయం గా డీఎస్ సైతం తమకు ఎవరి అవసరం ఉంటే వారితో మాట్లాడతామని, కేసీఆర్‌తో కూడా మాట్లాడమని వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
నిజానికి... కేసీఆర్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిపై చాలాకాలం నుంచీ గురి ఉందన్న వ్యాఖ్యలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నవే. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఆయన జన్మదినం సందర్భంగా సోనియా స్వయంగా ఫోన్ చేసి అభినందలు తెలిపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసీఆర్ వెంటనే చిన్నారెడ్డికి ఫోన్ చేసి, తాను ఇక కాంగ్రెస్‌లో చేరి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తీసుకుం టానంటూ అక్కడ తాను విందు ఇచ్చిన జర్నలిస్టుల సమక్షంలో చెప్పిన విషయం చర్చనీయాంశమయింది.
అయితే.. ఢిల్లీలో జరుగుతున్న విలీన ప్రక్రియ ప్రయత్నాలను టీఆర్‌ఎస్ నేత వినొద్‌కుమార్ కొట్టివేసినా, కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో అనుసరించిన వైఖరి పరిశీలిస్తే దీన్ని కొట్టిపారేయడానికి లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు వార్తలను ఖండించిన కేసీఆర్ ఆ తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009 నాటి ఎన్నికల ముందు టీడీపీతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలపైనా ఆయన మండిపడ్డారు. ఆ తర్వాత మహాకూటమిలో భాగస్వామిగా మారారు.
గతానుభవాల దృష్ట్యా.. కాంగ్రెస్‌లో విలీనంపై టీఆర్‌ఎస్ వాదన కూడా అదేవిధంగా ఉందంటున్నారు. పీఆర్పీ అధినేత చిరంజీవి సైతం తన పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతుందన్న వార్తలపై పలుమార్లు అగ్గిరాముడ య్యారు. తిరిగి ఆయనే గత ఆదివారం స్వయంగా ఢిల్లీకి వెళ్లి. సోనియా సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
take BY: Suryaa.com
0 comments:
Post a Comment