ఆత్మహత్యలు ఆపుదాం.. తెలంగాణలో ప్రతిజ్ఞలు
జేఏసీ పిలుపు మేరకు 'ఆత్మహత్యలు ఆపుదాం' అంటూ తెలంగాణ వ్యాపితంగా సామూహికంగా ప్రతిజ్ఞలు చేశారు. విద్యార్థులు,యువకులు కళాశాలల్లో, పాఠశాలల్లో, కూడళ్లలో, రోడ్ల వెంట భారీగా బారులు తీరారు. జేఏసీ, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు వారితో ప్రతిజ్ఞ చేయించారు.తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ,యూనివర్సిటీల్లోనూ ఈ కార్యక్రమం జరిగింది.
నల్లగొండ: తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఏ విద్యార్థి ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. బుధవారం ఆమె నల్లగొండ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఊపిరి పోశారన్నారు. ఆంధ్ర నేతలు, తెలంగాణ స్వార్థ రాజకీయ నేతల ప్రకటనలతో విద్యార్థులు అయోమయానికి లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్‌లో కవిత మాట్లాడుతూ తెలంగాణ మొదటి విలన్ ఆం««ధ నేతలు కాగా, రెండో విలన్ మీడియా అని ధ్వజమెత్తారు.
మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లా వ్యాపితంగా సా మూహిక ప్రతిజ్ఞలు చేశారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మె ల్యే కావేటి సమ్మయ్య, మందమర్రిలో నల్లాల ఓదె లు, మంచిర్యాలలో జేఏసీ కన్వీనర్ గోనె శ్యాంసుందర్‌రావు, గురిజాల రవీందర్‌రావు, నిర్మల్‌లో టీఆర్ఎస్ కన్వీనర్ శ్రీహరిరావులు పాల్గొన్నారు. మం డల కేంద్రాలలో, ఆయా ముఖ్య పట్టణాలలో ప్రతిజ్ఞలు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాఠశాలల్లో ప్రతిజ్ఞ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జేఏసీ నాయకులతో పాటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా అంతటా తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ఆయా కళాశాలల కు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్ర తిజ్ఞ చేశారు. టీఎన్జీఓల ఆధ్వర్యంలో కలెక్టరేట్ తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేశారు.
జిల్లాలో గోదావరిఖని, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మెట్‌పల్లి, హుస్నాబాద్, మంథని, పెద్దపల్లిల్లో విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు.
రంగారెడ్డి: జేఏసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లాలో అన్ని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజు, విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు శుభప్రద్‌పటేల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జేఏసీ జిల్లా తూర్పు విభాగం చైర్మన్ చల్మారెడ్డిల ఆధ్వర్యంలో ప్రమాణం చేశారు. సంగారెడ్డి: తెలంగాణ కోసం బలిదానాలు వద్దం టూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. గజ్వేల్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ శాసన సభా పక్ష నాయుడు ఈటెల రాజేందర్, ఉప నాయకుడు హరీష్‌రావు, గాయపకుడు దేశపతి శ్రీనివాస్, లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. మెదక్‌లో టీఎన్జీ వోలు విద్యార్థుల ప్రతిజ్ఞకు మద్దతు తెలిపారు. సిద్ది పేటలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డిలు విద్యా ర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రం సంగా రెడ్డితో పాటు జహీరాబాద్, నర్సాపూర్, దుబ్బాక తదితర ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ప్రతిజ్ఞ చేశారు. మెదక్‌లో విద్యార్థులు భారీ మానవహారం నిర్మించారు.
This News Take By: www.andhrajyothy.com
0 comments:
Post a Comment