టీఆర్ఎస్‌లోకి వలసలు నేడు హైదరాబాద్‌లో చేరిక
టీఆర్ఎస్‌లోకి వలసలు నేడు హైదరాబాద్‌లో చేరిక
( మంచిర్యాల) ఈ నెల 23వ తేదీన జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో భారీగా వలసలకు ముహూర్తం పెట్టుకున్నారు. నిన్నటి వరకు 80 వాహనాలలో వెళతామన్న వారు ఇప్పుడు వంద వాహనాలకు పెరిగింది... కొద్ది మంది టీడీపీ నాయకులు తాండూరులో శనివారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, జీ అరవింద రెడ్డి, బెల్లంపల్లి నియోజక వర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ ప్రవీణ్, కవి దేశపతి శ్రీనివాస్ నేతృత్వంలో టీఆర్ఎస్‌లో చేరారు.
వారు కూడా హైదరాబాద్‌కు తరలివెళుతున్నారు. మందమర్రి నుంచి కూడా కొంత మంది నాయకులు టీఆర్ఎస్‌లో చేరడానికి మంతనాలు జరుపుతున్నారు. వారు కూడా టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లోకి వస్తున్నవారే... బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాల నుంచి ఈ నెల 23వ తేదీన టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతున్నారు.
ఇదిలా ఉండగా కొంత మంది స్థానిక ప్రజా ప్రతినిధులను చేరకుండా నాయకులు ఆదివారం ఆపే ప్రయ త్నం చేసినప్పటికీ వారు ససేమిరా అన్నట్లు తెలిసింది. పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇందులో అనుమానాలు లేవు. అనుమాన పడాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా ప్రత్యేక తెలంగాణపై స్పష్టమైన నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారని, టీఆర్ఎస్‌లోకి వెళ్లబోయే వారిని నాయకులు బుజ్జగించినప్పటికీ వినే వారు లేకుండా పోయారని ఆదివారం సాయంత్రం ఇక్కడ కొంత మంది టీడీపీ ముఖ్యులు 'ఆన్‌లైన్'తో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఎవరు వినేటట్లు లేరు. జనానికి టీడీపీ మీద నమ్మకం పోయింది. తెలంగాణపై వ్యవహరిస్తున్న తీరు పార్టీ విధానంను సామాన్య జనం సైతం అంగీకరించడం లేదు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ వదిలి బయటకు వెళ్లకపోతే మా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారయ్యేట్టు ఉంది.
జనం ముందు కనీసం వ్యక్తులుగానైనా నిలబడి ఉండాలంటే ఖచ్చితంగా టీడీపీని వదిలేయాల్సిందే. ప్రత్యామ్నాయం టీఆర్ఎస్ తప్ప వేరే మార్గంలేదు. అందుకే ఆ పార్టీలోకి వెళుతున్నాం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అది, తెలంగాణ ఏర్పాటు ఇక టీఆర్ఎస్‌తోనే అవుతుందనే నమ్మకం కూడా ఉందంటూ పేర్కొంటున్నారు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమవుతున్న టీడీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు.
ఇదీ ప్రస్తుతం జిల్లాలోని టీడీపీ పరిస్థితి... ఇక టీడీపీకి స్థానిక ఎన్నికలలో కూడా కష్టమే అయ్యేట్టు ఉంది. ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా ఈ వలసల విషయంలో అసలు నోరు తెరువడం లేదు. జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు మాత్ర మే విషయంపై మాట్లాడుతున్నారు.
0 comments:
Post a Comment