పెన్సిల్ హిస్టరీ - Pencil History
హోంవర్క్ చేయాలంటే పెన్ను కావాలి. బొమ్మలు గీయాలంటే.. పెన్సిల్ కంపల్సరీ! మరి పెన్సిల్ ఎలా తయారయిందో.. ఆ కథాకమామీషు ఏంటో తెలుసా? ఇంగ్లాండ్‌లో జోసెఫ్ డిక్సన్ అనే ఓ పేదవాడు ఇల్లు గడవడానికి చిన్న దుకాణంలో పనికి కుదిరాడు. యజమాని చెప్పింది గుర్తు పెట్టుకునేందుకు ఏం చెయ్యాలో తెలియక, ఓ నల్లటిరాయితో గోడమీద రాసుకునేవాడు. ఆరోజు నుంచీ క్రమం తప్పకుండా డిక్సన్ యజమాని చెప్పిన విషయాలను గోడమీద నల్లరాయితో రాసేవాడు. ఆ నల్లటిరాయే ‘గ్రాఫైట్’. రోజులు గడుస్తుండగా డిక్సన్‌కు ఓ చిన్న ఆలోచన వచ్చింది. ఆ గ్రాఫైట్ రాయిని పొడి చేసి కొంచెం ముద్దగా ఉండటానికి ఆముదం లాంటి పదార్థాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాసి చూశాడు. బాగానే ఉంది. కానీ.. కొంచెం బరువుగా ఉండి రాసేందుకు అంత వీలుకాలేదు.
అంతేకాదు చేతులు కూడా నల్లగా తయారయ్యాయి. దీంతో చాలా ప్రయోగాలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఒక ఉపాయం తట్టింది. ఒక సన్నటి కొయ్యముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంధ్రం చేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను అందులో నింపి, బాగా ఎండిన తర్వాత రాశాడు డిక్సన్. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా రాస్తోంది అది కూడా సన్నగా. చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడంలాంటి లక్షణాలు కలిగిన దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు డిక్సన్. అలా పెన్సిల్ తయారైంది. గ్రాఫైట్ అనేది కర్బన సమ్మేళనం. మొదట్లో పెన్సిళ్లు గుండ్రంగా వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో ఇప్పుడు రకరకాల పెన్సిళ్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.
0 comments:
Post a Comment