నిత్య శృంగారి.. ఈ తాత!
96 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తండ్రితాతా
పెళ్లి చేసుకుంటావా? అనడిగితే.. బోసినోటితో చిరునవ్వులొలికిస్తూ.. ఈ
వయసులో నాకెవరు పిల్లనిస్తార్రా? అంటూ సిగ్గుపడిపోయే తాతల గురించి
తెలిసిందే! కానీ.. ఈయన మాత్రం అలాంటి తాతకాదు.. 96 ఏళ్ల వయసులోనూ ఓ బిడ్డకు
జన్మనివ్వగలిగిన ముదుసలి! పెద్ద వయసులో తండ్రి అయి.. ప్రపంచ రికార్డు
నెలకొల్పిన ఈయన పేరు రాంజీత్ రాఘవ్! హర్యానాలోని సోనిపేటలో ఖర్‌ఖోడా అనే
గ్రామానికి చెందిన ఈయన సాధించిన ఘనత గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే..
తన ఘనత వెనుక అసలు రహస్యాలను ఇటీవల ఒక పత్రికతో రాంజీత్ పంచుకున్నాడు. తాను
ప్రతి రోజూ రాత్రి తన భార్య శకుంతలతో మూడుసార్లు శృంగారంలో పాల్గొనడం,
బాగా పాలు తాగడం, నెయ్యి వాడటమే తాను మరోసారి తండ్రి కావటానికి కారణమని
వెల్లడించాడు. ‘‘తన భార్యను సుఖపెట్టాలని ప్రతి పురుషుడూ కోరుకుంటాడు.
ఇందులో తప్పేమీ లేదు.
నేనిచ్చే సలహా ఏమిటంటే.. పాలు తాగండి.
ఆల్మండ్‌లు, పండ్లు తినండి. రోజూ వ్యాయామం చేయండి. మల్లయుద్ధం అయితే మరీ
మంచిది. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మల్లయోధుడినే’’ అని రాంజీత్ చెప్పాడు.
2010లో ఈ జంట తమ తొలి సంతానం కరంజీత్‌కు జన్మనిచ్చారు. అప్పటికి అదే
రికార్డు. కాగా.. తాజాగా ఆ రికార్డును ఆయనే అధిగమించారు. తాను పూర్తి
శాకాహారినని రాంజీత్ తెలిపారు. ఈయన ఘనతను జంతు సంరక్షణ కోసం పాటుపడే పెటా
కూడా గుర్తించింది. 96 ఏళ్ల వయసులోనూ శృంగారాన్ని అనుభవిస్తున్నది శాకాహారం
వల్లేనని పేర్కొంటూ ఒక ఫొటో కూడా తయారు చేసింది. ఈ పోస్టరును అన్ని సంతాన
సాఫల్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని భావిస్తోంది!
0 comments:
Post a Comment