వైకాపాలోకి నాగార్జున, మంచు లక్ష్మి?
టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరైన నాగార్జున
వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీలో చేరబోతున్నారట. నాగ్ విజయవాడ ఎంపీ సీటుని
టార్గెట్ గా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన
చర్చలు, మంతనాలు అన్నీ పూర్తయ్యాయి. ముహూర్తం ఒక్కటే మిగిలివుంది. లగడపాటి
రాజగోపాల్ లాంటి గట్టి ప్రత్యర్ధిని ధీటుగా ఎదుర్కోవాలంటే నాగార్జునే
కరెక్ట్ అని వైఎస్స్ జగన్ కూడా భావిస్తున్నారట. ఈ మధ్యన పలుమార్లు
నాగార్జున చంచల్ గుడా జైలుకి వెళ్ళివచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే జైలులో నాగార్జున బిజినెస్స్ పార్టనర్
నిమ్మగడ్డ ప్రసాద్ ఉంటున్న సంగతి తెలిసిందే. నాగార్జున పైకి ప్రసాద్ ని
కలవడానికి వెళుతున్నా అని చెబుతున్నా, నాగ్ మాత్రం జగన్ ని కూడా కలిసేవారని
గుసగుసలు వినిపించేవి. ఈ విషయం మీద ఎవరూ పెద్దగా మాట్లాడకపోయినా, నాగ్
మాత్రం రాజకీయ తీర్ధం పుచ్చుకునే ఆలోచనతోనే జగన్ ని కలవడం జరిగిందట.
మరొకవైపు మంచు లక్ష్మి కూడా వైకాపాలో
చేరనుందని సమాచారం. జగన్ కి మంచు ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న సంగతి
తెలిసిందే. ఈమె ఎక్కడినుంచి పోటీ చేస్తుంది? ఎంపీ సీటుకా ఎమ్మెల్యే సీటుకి
పోటీ చేస్తుందా అనేది తెలియాల్సి వుంది.
- T.V. Com
0 comments:
Post a Comment