రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు - వస్తున్నా మీకోసం’ యాత్రలో చంద్రబాబు
(మహబూబ్‌నగర్): ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు
వ్యతిరేకిని కాదు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సింది కాంగ్రెస్.
తెలుగుదేశం కోరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు. తెలంగాణలో
టీడీపీని అంతమొందించేందుకు పలు పార్టీలు చేస్తున్న కుట్ర ఇది. తెలంగాణ
ఏర్పాటుపై గతంలోనే టీడీపీ స్పష్టమైన అభివూపాయం తెలిపింది’’ అని టీడీపీ
అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ‘వస్తున్నా
మీకోసం’ పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల
ప్రాజెక్టు మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించింది. ఇక్కడ తెలంగాణ
ఆడపడుచులు బతుకమ్మలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పాదయాత్ర
రాజోలి గ్రామానికి చేరుకుంది. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు
ప్రసంగించారు.
రాష్ట్రంలో కొన్ని పార్టీలు తనను తెలంగాణ
వ్యతిరేకిగా ముద్ర వేశాయని ఆయన వాపోయారు. 2009లోనే ప్రణబ్‌ముఖర్జీకీ
తెలంగాణపై తమ పార్టీ తరఫున వైఖరి స్పష్టం చేసి, కేంద్రానికి లేఖ ఇచ్చానని
తెలిపారు. తెలంగాణ ఇచ్చేది తన చేతుల్లో లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటు కోసం ఇటీవల కూడా కేంద్రానికి లేఖ రాశానన్నారు. కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే దొంగపూవరో.. దొరపూవరో
తెలుస్తుందని చంద్రబాబు చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే టీడీపీ
స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుందన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం
నాన్చుడుధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల తన పాలనలో రాజోలిబండ
మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు అన్యాయం జరగలేదని,జిల్లాకు సాగునీటి వాటాలో
అక్రమాలు జరగలేదని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలోనే అభివృద్ధి పనులు
చేపట్టామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత
కల్పించేందుకు కృషి చేస్తామని, నిరుద్యోగులకు రూ. వెయ్యి భృతి కల్పిస్తామని
హామీ ఇచ్చారు. మూడేళ్ల కిత్రం వచ్చిన వరదలకు రాజోలి గ్రామం పూర్తిగా
మునిగిపోవడంతో ప్రజలు, చేనేత కార్మికులు నిరాక్షిశయులయ్యారని, వారిని
కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆదుకోలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే
నేతన్న అభివృద్ధి కోసం రూ కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామన్నారు. బహిరంగ
సభకు ముందు సుంకేసుల ప్రాజెక్టు నుంచి వస్తూ మధ్యలో గంగమ్మ ఆలయంలో పూజలు
నిర్వహించారు. అనంతరం మసీదును సందర్శించి ముస్లింలతో మాట్లాడారు. సుంకేసుల
ప్రాజెక్ట్ నుంచి సీమ ప్రాంతానికి సాగునీటిని తరలిస్తూ మహబూబ్‌నగర్
జిల్లాకు కనీసం తాగునీటిని కూడా అందివ్వలేదని పలువురు రైతులు ఫ్లెక్సీలతో
నిరసన తెలిపారు. అనంతరం రాజోలి నుంచి శాంతినగర్ వరకు చంద్రబాబు పాదయాత్ర
నిర్వహించారు.
నేడు అలంపూర్ నియోజకవర్గంలో బాబు పాదయాత్ర
హైదరాబాద్:
చంద్రబాబు చేస్తున్న ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర మంగళవారం మహబూబ్‌నగర్
జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అలంపూర్ నియోజకవర్గంలోని శాంతినగర్ పెట్రోల్ బంక్, జోలకల్లు, కోంకల క్రాస్
రోడు, వెంకటాపురం స్టేజ్, ఐజ మండలంలోని పడిదాపురం, ఉప్పల క్రాస్
ప్రాంతాలలో సాగుతుందని వెల్లడించాయి.
- T News
0 comments:
Post a Comment