రగిలిన రాజోలి
-బాబుకు అడుగడుగునా నిరసనసెగ
-ఉద్రిక్తంగా మారిన ‘వస్తున్నా మీకోసం’
-కోదండరాం, స్వామిగౌడ్ తదితరుల అరెస్టు
-అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు
-అరెస్టులపై మండిపడిన తెలంగాణవాదులు
-బాబు వెంట 300 వాహనాల్లో ప్రైవేటు సైన్యం
-పొరుగు జిల్లాల నుంచి భారీగా సమీకరణలు
రాజోలి
రగిలింది. తెలంగాణపై వైఖరి చెప్పని చంద్రబాబుకు.. ప్రత్యేక సెగను
అంటించింది. తెలంగాణ పోరు పౌరుషాన్ని మరోసారి చాటింది. చంద్రబాబు
పాదయావూతను అడుగడుగునా అడ్డుకునేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. తన
సీమాంధ్ర బుద్ధి చాటుకున్న సర్కారు.. సంప్రదాయం ప్రకారం సీమాంధ్ర నేత
పర్యటనకు తెలంగాణలో నీడలా ఉండి భద్రత కల్పించడమే కాకుండా.. పాదయావూతకు
నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు
చేసింది. బాబు యాత్రకు అడ్డంకులు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది.
దానికితోడు చంద్రబాబు పర్యటన కోసం 300 వాహనాల్లో పొరుగు జిల్లాల నుంచి
తరలించిన ప్రైవేటు సైన్యం అండగా నిలిచింది. దాంతో చంద్రబాబు రాజోలికి
చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు.
బాబు
పాదయావూతకు నిరసన తెలిపేందుకు బయల్దేరిన టీజేఏసీ నేతలు కోదండరాం,
స్వామిగౌడ్ తదితరులను రాజోలికి చేరుకోకముందే వడ్డేపల్లి మండలం శాంతినగర్
వద్ద అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి కొత్తపేట
పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులపై జిల్లావ్యాప్తంగా తీవ్ర నిరసన
వ్యక్తమైంది. వారిని విడుదల చేయాలని జిల్లాలో ఆందోళనలు జరిగాయి. 44వ నంబరు
జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రాస్తారోకో చేశారు.
చివరకు సాయంవూతానికి నేతలను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. కోదండరాంను
అరెస్టు చేసి నాలుగు గంటలపాటు డీసీఎంలో తిప్పడంతో ఆయన అస్వస్థతకు
గురయ్యారు.
( మహబూబ్‌నగర్) :వస్తున్నా
మీకోసం అంటూ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
నాయుడుకు మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసన సెగలు తాకాయి. ఆయన పర్యటనను
తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు
పాదయావూతకు ఆటంకాలు లేకుండా చూసిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు..
తెలంగాణవాదులను విచ్చలవిడిగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్‌లకు
తరలించారు. దీంతో చంద్రబాబు పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగుతున్నది.
సోమవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా నుంచి సుంకేసుల ప్రాజెక్టు మీదుగా
జిల్లాలో ప్రవేశించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర
ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని చంద్రబాబుకు నిరసన తెలియజేస్తామని టీ
జేఏసీ నేతలు, తెలంగాణవాదులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లాలో
పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచే తెలంగాణవాదులను బయటకు
వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారు. చంద్రబాబు పాదయావూతకు నిరసన
తెలిపేందుకు బయల్దేరిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వడ్డేపల్లి
మండలం శాంతినగర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కొందరు మాదిగ
దండోర నాయకులు కోదండరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త
పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ సమయంలో పోలీసులు దండోరా నాయకులను
చెదరగొట్టారు. తమను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరాంతో సహా జేఏసీ
నాయకులు రోడ్డుపై బైఠాయించారు. జై తెలంగాణ, చంద్రబాబు డౌన్, డౌన్ అంటూ
నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై స్పష్టమైన
వైఖరి చెప్పకుండా జిల్లాలో వామనపాదం మోపేందుకు వస్తున్న చంద్రబాబునాయుడిని
అడ్డుకోమని, కేవలం నిరసనలు, నిలదీతలు చేస్తామని ప్రకటించారు. ఇంతకాలం
తెలంగాణపై మోసం చేస్తూ మళ్లీ ఈ ప్రాంతానికి వస్తున్న చంద్రబాబును
నిలదీసేందుకు ప్రతి ఒక్క తెలంగాణవాది సిద్ధంగా ఉన్నాడని ఆయన అన్నారు. నిరసన
తెలిపేందుకే రాజోలి వెళుతున్న తమను అడ్డుకోవడం సీమాంధ్ర ప్రభుత్వం
చేస్తున్న కుట్రలో భాగమన్నారు. తమను అడ్డుకున్నంత మాత్రాన తెలంగాణ
రాకుండాపోదని కోదండరాం చెప్పారు. రోడ్డుపై బైఠాయించిన జేఏసీ నేతలను
పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. అనంతరం డీసీఎంలో ఉంచి మానవపాడు
పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తామని ప్రకటించారు.
కానీ కొత్తకోట మీదుగా
ఆత్మకూర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొత్తకోట వద్ద జాతీయ
రహదారిపై కోదండరాం ఉన్న డీసీఎంను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూర్ తీసుకెళ్ళాల్సిన పోలీసులు
కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, స్వామిగౌడ్, వేదకుమార్, టీఎస్ జేఏసీ నాయకుడు
కరాటే రాజు మరి కొందరిని కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందుకు
నిరసనగా జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జేఏసీ
నేతలను పోలీసులు సాయంత్రం విడిచిపెట్టడంతో జేఏసీ నేతలు రాస్తారోకో
విరమించారు. కోదండరాంను అరెస్టు చేసి నాలుగు గంటల పాటు డీసీఎంలో తిప్పడంతో
ఆయన అస్వస్థతకు గురయ్యారు. కోదండరాం అరెస్టుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా
పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. కోదండరాం, ఇతర జేఏసీ నేతల అరెస్టును తెలంగాణ
నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఖండించారు.
సోమవారం
ఉదయం నుంచి మక్తల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల తదితర ప్రాంతాలలో
టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్‌అరెస్ట్ చేశారు. టీ జేఏసీ జిల్లా
చైర్మన్ రాజేందర్‌డ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేసి మహబూబ్‌నగర్
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినా..
తెలంగాణవాదులు భారీ సంఖ్యలో రాజోలికి చేరుకున్నారు. ఉదయం నుంచే పోలీసులు
తెలంగాణవాదులను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా జిల్లా
వ్యాప్తంగా తెలంగాణవాదులు ఆందోళనలు చేపట్టారు.
- T News
0 comments:
Post a Comment