గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి
గాలికంటే ఘనుడు యాదగిరి కోట్ల కిరికిరి
ఇదీ యాదగిరి చిట్టాపద్దు
- సోమశేఖరరెడ్డి నుంచి అడ్వాన్సుగా రూ.9.5 కోట్లు.
- యాదగిరి నొక్కేసింది రూ.6.5 కోట్లు
- గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో రూ.3.75 కోట్ల నిల్వ
- చలపతిరావుకు ఇచ్చింది రూ.3 కోట్లే
- ఇంటి పక్కనే ప్లాటు కొనుగోలుకు రూ.40 లక్షలు
- నాచారంలో ఇల్లు కొనుగోలుకు రూ.20 లక్షలు
- మారుతి స్విఫ్ట్ కారు కొనుగోలుకు రూ.8.10 లక్షలు కుక్కలను కట్టేసేచోట ఆస్తుల పత్రాలు
- గెస్ట్‌హౌస్‌లో వాటర్‌ట్యాంక్‌కు 20 సీసీ కెమెరాల నిఘా
- డబ్బు స్వాధీనం.. పత్రాలు సీజ్
- లెక్క దొరకని మొత్తం రూ.2.07 కోట్లు
- కర్నూలులో యాదగిరిని పట్టుకున్న ఏసీబీ అధికారులు
- అజ్ఞాత జీవితానికి గాలి సోదరుడి సహకారం!
- మొబైల్ కాల్స్‌ను ట్రాక్ చేసి పట్టుకున్న ఏసీబీ బెయిల్ ఫర్ సేల్ కేసులో రౌడీషీటర్ అరెస్ట్
హైదరాబాద్, జూలై 2 (): బెయిల్ ఫర్ సేల్ కేసులో కీలక పాత్రధారి అయిన రౌడీషీటర్ యాదగిరిరావు అలియాస్ యాదగిరి అలియాస్ గిరిని ఏసీబీ అధికారులు కర్నూలులోని ఓ హోటల్‌లో అరెస్టు చేశారు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించేందుకు అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి అడ్వాన్సుగా 9.5కోట్ల రూపాయల నగదును తీసుకున్నట్టు యాదగిరి విచారణలో వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను రిటైర్డ్ జడ్జి చలపతిరావుకు ఇచ్చినట్టు వెల్లడించాడు. కొంత డబ్బును తన నివాసంలో దాచిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున యాదగిరిని వెంటబెట్టుకుని నాచారంలోని అతని ఇంటికి వచ్చిన ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. అదే ప్రాంతంలో ఉన్న యాదగిరి గెస్ట్‌హౌస్‌లో కూడా సోదాలు చేసి, వాటర్‌ట్యాంక్‌లో దాచిపెట్టిన రూ.3.75కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కుక్కలను కట్టి ఉంచే చోటు నుంచి విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
యాదగిరి తండ్రి బాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలికి బెయిల్ డీల్‌లో ఇంకా స్వాధీనం కాకుండా ఉన్న 2.07 కోట్ల రూపాయలు ఎక్కడికి? ఎవరి చేతికి? వెళ్లాయన్న దానిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బెయిల్ డీల్‌లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి చేతికి ఈ డబ్బు చేరిందా? లేక యాదగిరి ఈ మొత్తాన్ని తన సంబంధీకుల వద్ద దాచి పెట్టుకున్నాడా? అన్న కోణాల్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మంగళవారం యాదగిరిని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఆ తరువాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని మొత్తం వ్యవహారంపై అతన్ని క్షుణ్ణంగా ప్రశ్నించాలని నిశ్చయించారు.
గాలి బెయిల్ డీల్‌లో భాగంగా అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి 9.5కోట్ల రూపాయల నగదును అడ్వాన్సుగా తీసుకున్న యాదగిరి బెయిల్ మంజూరైన రాత్రే తన మనిషి ద్వారా చలపతిరావు ఇంటికి రూ.3 కోట్లు ఇచ్చి పంపించాడు. మిగిలిన రూ.6.5కోట్లను తన వద్దనే పెట్టుకున్నాడు. ఒప్పుకున్న ప్రకారం రూ.5కోట్లు ఇవ్వాలి కదా.. అని చలపతిరావు ఫోన్ చేయగా గాలికి మంజూరైన బెయిల్‌పై సీబీఐ అధికారులు హైకోర్టుకు వెళ్లారని, దానిపై నిర్ణయం వెలువడిన తరువాత మిగతా రూ.2కోట్లు ఇస్తానని చెప్పాడు. అయితే.. చలపతిరావు సీబీఐ అధికారులకు చిక్కగానే యాదగిరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ కోసం డీల్ కుదుర్చుకున్న ఆయన తమ్ముడు సోమశేఖరడ్డి, కర్ణాటక రాష్ట్రం కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబులు యాదగిరికి సహకరించారని, పోలీసులకు చిక్కకుండా యాదగిరిని కొన్నిరోజులు బెంగళూరు శివార్లలో దాచిపెట్టినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.
యాదగిరి కోసం వేటను ముమ్మరం చేసిన ఏసీబీ అధికారులు.. బెంగళూరుకు ప్రత్యేక బృందాలను కూడా పంపించారు. సోమశేఖరడ్డి తదితరుల కదలికలపై నిఘా పెట్టారు. యాదగిరితోపాటు సోమశేఖరడ్డి తదితరుల మొబైల్‌ఫోన్లపై కన్నేసి ఉంచారు. దీనిని పసిగట్టిన యాదగిరి ఇటీవలే కర్నూలుకు చేరుకుని ఓ హోటల్‌లో బస చేశాడు. అతని మొబైల్‌ఫోన్ కాల్స్ ద్వారా యాదగిరి కర్నూలులో ఉంటున్నట్టు పసిగట్టిన ఏసీబీ అధికారులు ఆదివారం రాత్రి దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
9.5కోట్లు తీసుకున్నా : విచారణలో యాదగిరి
గాలి జనార్దన్‌డ్డికి బెయిల్ ఇప్పించటానికిగాను అతని సోదరుడు సోమశేఖరడ్డి నుంచి రూ.9.5కోట్లను అడ్వాన్సుగా తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు జరిపిన విచారణలో యాదగిరి వెల్లడించాడు. దీంట్లో నుంచి రూ.3కోట్లను వెంకట చలపతిరావుకు అందచేసినట్టు తెలియచేశాడు. కొంత డబ్బును తన గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో భద్రపరిచినట్టు చెప్పాడు. ఇక, అడ్వాన్సుగా తీసుకున్న మొత్తం నుంచి రూ.40లక్షలు వెచ్చించి తన ఇంటి పక్కనే ఉన్న ప్లాటును, మరో 20లక్షల రూపాయలతో నాచారంలో ఓ ఇల్లును కొన్నట్టు వెల్లడించాడు. మరో 8.10లక్షలు ఖర్చు చేసి మారుతి స్విఫ్ట్ కారు కొన్నట్టు చెప్పాడు.
తెల్లవారుజాము సమయంలో..: ఈ నేపథ్యంలో యాదగిరిని వెంటబెట్టుకుని ఏసీబీ అధికారులు సోమవారం తెల్లవారుజామున నాచారంలోని అతని ఇంటికి చేరుకున్నారు. యాదగిరి నివాసంతోపాటు అతని గెస్ట్‌హౌస్‌లో తనిఖీలు జరిపారు.
తనిఖీల్లో గెస్ట్‌హౌస్ వాటర్‌ట్యాంక్‌లో యాదగిరి దాచిపెట్టిన 3.75 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సెక్యూరిటీగా యాదగిరి 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతోపాటు ఓ వాచ్‌మెన్‌ను కూడా నియమించుకున్నట్టు విచారణలో నిర్ధారించుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న తరువాత ఏసీబీ అధికారులు యాదగిరితోపాటు తమ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మరోసారి ప్రశ్నించగా విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తన ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశంలో భద్రపరిచినట్టుగా యాదగిరి వెల్లడించాడు. దాంతో మధ్యాహ్నం 12.30గంటలకు మరోసారి యాదగిరిని వెంట తీసుకుని నాచారం వచ్చిన ఏసీబీ అధికారులు అతని ఇంట్లో కుక్కలను కట్టేసే ప్రదేశం నుంచి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Take By: T Media
0 comments:
Post a Comment