Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, July 3, 2012

శాఖ కరెంటు టెంటు ఆంధ్రోళ్ల టెంటు

Power500 talangana patrika telangana culture telangana politics telangana cinema

తరలిపోయిన
కీలక ప్రాజెక్టులు
యథేచ్ఛగా
ఉద్యోగాల దోపిడీ
తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన
ప్రాజెక్టులను సీమాంవూధకు
తరలించడం ద్వారా ఉద్యోగాల్లో జరిగిన నష్టం
వనరుల్లేనిచోట పవర్‌ప్లాంట్లు
తెలంగాణకు మొండి చేతులు
ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు
పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
కోల్పోయిన తెలంగాణ ప్రాంతం
సీమాంధ్రలో నూరుశాతం స్థానికులే
అందుకోసం జీవోలూ జారీ
నెల రోజుల్లో అమలైన జీవో 564
దశాబ్దంగా మూలపడి
ఉన్న జీవో 610
నిర్ణయాత్మక స్థానాల్లో
సీమాంధ్రులు
వారి ప్రాంతాలకు
అనుగుణంగా జీవోలు
కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు
dddd talangana patrika telangana culture telangana politics telangana cinema

తెలంగాణ ప్రాంతంలోని జెన్‌కో పవర్ ప్రాజెక్టుల్లో 60 శాతం ఉద్యోగులు సీమాంవూధవారే! కానీ.. సీమాంవూధలోని జెన్‌కో ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల జాడే కనిపించదు! తెలంగాణ ప్రాంతానికి నీరందించే శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టులో 70 శాతం ఉద్యోగులు సీమాంవూధులే! కానీ.. విజయవాడలోని వీటీపీఎస్ ప్రాజెక్టులో కేవలం పట్టుమని ఐదుగురు తెలంగాణ ఉద్యోగులు కూడా లేరు! 2011 మార్చి వరకు విద్యుత్‌రంగంలో 80,920 పోస్టులు మంజూరై ఉండగా, వాటిల్లో 23,366 పోస్టులు మాత్రమే తెలంగాణ వారికి దక్కాయి! ఇందులోనూ మూడు వేల మంది తెలంగాణకు వలస వచ్చినవారే! అంటే.. తెలంగాణ గడ్డపై పుట్టిన వారికి దక్కింది కేవలం 20వేల ఉద్యోగాలేనన్నమాట! అంతేకాదు.. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులు సీమాంవూధకు తరలిపోవడంతో ప్రత్యక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలను, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలను తెలంగాణ కోల్పోయింది. సమైక్యాంవూధలో తెలంగాణకు జరిగిన నష్టానికి విద్యుత్ రంగంలోని ఈ అన్యాయాలు మచ్చుతునకలు! విద్యుత్ బయటికి కనిపించదు.. కానీ పట్టుకుంటే షాక్‌కొడు తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలూ అంతే.. పట్టిచూస్తే కానీ అంతుచిక్కవు!!

శాఖ కరెంటు ఆంధోళ్ల టెంటు
తరలిపోయిన కీలక ప్రాజెక్టులు.. యథేచ్ఛగా ఉద్యోగాల దోపిడీ
- వనరుల్లేని చోట పవర్‌ప్లాంట్లు.. తెలంగాణకు మొండి చేతులు
- ప్రత్యక్షంగా వేల ఉద్యోగాలు.. పరోక్షంగా లక్షల ఉపాధి అవకాశాలు
- కోల్పోయిన తెలంగాణ ప్రాంతం.. సీమాంవూధలో నూరుశాతం స్థానికులే
- అందుకోసం జీవోలూ జారీ.. నెల రోజుల్లో అమలైన జీవో 564
- దశాబ్దంగా మూలపడి ఉన్న జీవో 610
- నిర్ణయాత్మక స్థానాల్లో సీమాంవూధులు
- వారి ప్రాంతాలకు అనుగుణంగా జీవోలు
- కాంట్రాక్టర్లలోనూ వారిదే ఆధిపత్యం
- సమ్మె ఒప్పందాలు బుట్టదాఖలు

Contral0 talangana patrika telangana culture telangana politics telangana cinema
హైదరాబాద్, జూలై 2 (): సీమాంధ్రులు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రాంత విద్యుత్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతున్నది! విద్యుత్‌రంగంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, 4 డిస్కమ్‌లలోని ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కకుండా సీమాంవూధులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతల వాదన! లోతుగా తరచి చూస్తే.. నివురుగప్పిన అన్యాయం.. నిప్పులా కనిపిస్తుంటుంది. శాతాలు, జనాభా ప్రాతిపదికన తెలంగాణకు వాటా దక్కినట్లు కనిపించినా.. కనిపించని అన్యాయం మరోటి ఉంది. అదే తెలంగాణ కోల్పోయిన ఉద్యోగాలు! విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు పుష్కలంగా లభ్యమవుతున్నా తెలంగాణ ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టకపోవడం, ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ప్రాజెక్టులను సీమాంవూధకు తరలించడం, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో తెలంగాణ నష్టపోయిన ఉద్యోగాలు 16వేలకుపైనే! ట్రాన్స్‌కోలో 8,302 మంది, జెన్‌కోలో 15,647 మంది, నాలుగు డిస్కమ్‌లలో 56,971 మంది ఉద్యోగులున్నారు.

రాష్ట్రంలో ఉన్న నాలుగు డిస్కమ్‌లలో రెండు డిస్కమ్(ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్)లు పూర్తిగా సీమాంధ్ర పరిధిలోనే ఉన్నాయి. వీటిలో 26,605 మంది పనిచేస్తుండగా, సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో 30,366 మంది ఉద్యోగులున్నారు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం జిల్లాలో ఎక్కువ మంది వలసవాదులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సీపీడీసీఎల్ పరిధిలో రాయలసీమకు చెందిన కర్నూలు, అనంతపురం జిల్లాలు కూడా ఉండడంతో ఈ రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పనిచేస్తున్నారు. సీమాంవూధలో నూటికి నూరుశాతం అక్కడివారే ఉద్యోగాలు పొందుతుండగా అదే విధానం తెలంగాణలో ఎందుకు పాటించడం లేదన్నది ప్రశ్న!
Power10 talangana patrika telangana culture telangana politics telangana cinema

అంటే.. వంద మార్కులు వచ్చేలా చదివిన విద్యార్థికి 40మార్కులు వేసి.. అసలు ఒక్కమార్కు వచ్చేందుకూ ఆస్కారం లేని విద్యార్థికి 60 మార్కులు వేసిన ప్రభుత్వం.. సమతుల్యం పాటించామంటూ మోసగించే యత్నాలను నిస్సిగ్గుగా చేస్తున్నది! అంతేకాదు.. ఈ అన్యాయంలో పెను జీవన విధ్వంసం కూడా కనిపిస్తుంది. సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు సరఫరా కోసం తెలంగాణ నుంచి బొగ్గు అందిస్తున్నారు. ఈ పేరుతో భారీ స్థాయిలో ఓపెన్‌కాస్ట్ గనులను తవ్వి.. వందల వేల గ్రామాల ఉనికిని అదృశ్యం చేస్తున్నారు. వెరసి.. విద్యుత్ రంగంపై సీమాంధ్ర పాలకుల వివక్ష ఫలితంగా అటు ఉద్యోగిత పరంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగానూ తెలంగాణ నష్టపోయింది. మరోవైపు వనరుల్లేని ప్రాంతాల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి బొగ్గు రవాణా, అక్కడి ప్రాజెక్టులనుంచి విద్యుత్ పంపిణీలో నష్టాలు కలిసి.. అక్కడ తయారయ్యే విద్యుత్ ఖరీదును అమాంతం పెంచివేస్తున్నది.

1969లో వికసించిన విద్యుత్ తేజం
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉవ్వెత్తున రాజుకొనడానికి నాంది పలికింది విద్యుత్ రంగమే! 1957లో ఏపీ ఎంప్లాయ్‌మెంట్ యాజ్ టు రెసిడెన్సీ యాక్ట్‌ను విద్యుత్ బోర్డు.. నాటి ఎపీఎస్‌ఈబీలో అమలు చేయాలంటూ ఓ విద్యార్థి చేసిన ఆమరణ నిరాహార దీక్ష.. దవానలంలా వ్యాపించి.. తెలంగాణ పది జిల్లాలకూ విస్తరించింది. జై తెలంగాణ అంటూ యావత్ ప్రాంతం నినదించేందుకు గొంతుక అయ్యింది! అదే స్ఫూర్తి విద్యుత్ రంగంలో ఇప్పటికీ కొనసాగుతున్నది.

మొన్నటి సహాయ నిరాకరణ ఉద్యమం, తదుపరి సకల జనుల సమ్మెలో విద్యుత్ తేజం వికసించింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సమరశంఖం పూరించింది. విద్యుత్ రంగంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకుండా సీమాంవూధులు కుట్రలు చేస్తే ఉప్పెనలాంటి ఉద్యమాన్ని చవిచూడాల్సి ఉంటుందని తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా ఉన్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ(టీ జాక్) హెచ్చరిస్తున్నది. గత ఆరు దశాబ్దాల చరివూతను నెమరేసుకుని సీమాంధ్ర ఉద్యోగులు, రాజకీయనేతలు మసలు కుంటారో, మలిఉద్యమాన్ని చవిచూస్తారో వారే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలకు వర్తింపజేయాల్సిందేనని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులుంటే ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది.
Power50 talangana patrika telangana culture telangana politics telangana cinema

1957లో చట్టం
ఏపీ ఎంప్లాయ్‌మెంట్, రిక్రూట్‌మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్-1957 ప్రకారం 14 ఏళ్లపాటు పాటు స్థానికంగా ఉన్న వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. ఈ చట్టాన్ని విద్యుత్‌బోర్డు(ఎపీఎస్‌ఇబి)లో వర్తింపజేయాలని తెలంగాణ యువకులు హైకోర్టుకు వెళ్లారు. అయితే ఈ చట్టం విద్యుత్‌బోర్డుకు వర్తించదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా 1969లో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఒక విద్యార్ధి చేసిన ఆమరణ నిరాహారదీక్ష తీవ్రత దావానలంగా తెలంగాణ జిల్లాలకు విస్తరించి 1969 తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. హైకోర్టు తీర్పుపై కొందరు సుప్రీంను ఆశ్రయించారు.

అయితే సుప్రీంకోర్టు సైతం విద్యుత్‌బోర్డుకు 1957 చట్టం వర్తించదని హైకోర్టు తీర్పునే ఖరారుచేసింది. దాంతోపాటు 1957 చట్టం అమలుకు ముందున్న ముల్కీ నిబంధనలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు 1971లో తీర్పు ఇచ్చింది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న పీవీ నరసింహారావు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దానిని జీర్ణించుకోలేని సీమాంధ్ర రాజకీయనేతలు ముల్కీ రూల్స్ అమలుచేస్తే తమకు ఉద్యోగ అవకాశాలు దక్కవని గుర్తించి, ప్రత్యేక రాష్ట్ర అకాంక్షతో జై ఆంధ్రా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర రూపందాల్చడంతో నాటి కాంగ్రెస్ అధిష్ఠానం పీవీతో సీఎం పదవికి రాజీనామా చేయించింది. ఆ తర్వాత కేంద్రం 1974లో రాజ్యాంగ సవరణ (37) చేసి ముల్కీ నిబంధనలను తొలగించింది. అనంతరం 1975 నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాయి. అయితే నాడు అధికారంలో ఉన్న పాలకులు రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులు, రాజకీయనేతల ఉద్యమం ఫలితంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గిర్‌గ్లానీ కమిషన్ 2004లో ప్రభుత్వానికి సుదీర్ఘమైన నివేదిక సమర్పించింది. విద్యుత్ రంగానికి సంబంధించిన ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో సంస్థల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని సిఫారసు చేసింది.

బొగ్గు సింగరేణిది-సోకు సీమాంధ్రులుది
విద్యుత్ రంగంలో మొదటి నుంచి సీమాంధ్ర పెట్టుబడిదారులదే పైచేయిగా ఉంది. ప్రత్యేకించి గత మూడు దశాబ్దాలుగా సీమాంవూధులు విద్యుత్‌రంగాన్ని కబ్జా చేశారని చెప్పుకోవచ్చు. విద్యుత్‌రంగంలో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రం ఎల్లలుదాటి ఇతర రాష్ట్రాలకు, మరో అడుగు ముందుకేసి విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టేస్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి సహజవాయు నిక్షేపాలు, సహజ వనరులను సొంతం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. తెలంగాణ నుంచి వచ్చే బొగ్గు ఆధారంగానే సీమాంవూధలో విద్యుత్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ తెలంగాణ ప్రాంతానికి దక్కాల్సిన ప్రాజెక్టులు. కానీ.. సీమాంధ్ర పాలకులు వాటిని తమ తమ ప్రాంతాలకు తరలించుకుపోయారు. దీనికి అదనంగా తెలంగాణలో బొగ్గు తవ్వకాలకు ఓపెన్‌కాస్టుల పేరిట పెను జీవన విధ్వంసం జరుగుతున్నది.

సీమాంధ్రులదే పెత్తనం......
విద్యుత్‌రంగంలో అన్ని కంపెనీల్లోనూ ఉద్యోగులుగా, డైరెక్టర్లుగా సీమాంవూధులే అగ్రభాగంగా ఉన్నారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. ఒక్క ట్రాన్స్‌కోలోనే రిజిస్టర్ అయిన బడా కాంట్రాక్టర్లు 21మంది ఉంటే.. వారిలో 19మంది సీమాంవూధులే. ఇలాంటి పరిస్థితులకు నాటి సీఎం చంద్రబాబు ప్రధాన కారణమన్న విమర్శ బలంగా ఉంది. సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసి, ప్రైవేటురంగంలో విద్యుత్ ఉత్పత్తికి ఆయన హయాంలోనే ప్రాధాన్యం ఇచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు కొత్తగా విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకుకు అవకాశాన్ని కల్పించారు. చంద్రబాబు హయంలో సీమాంవూధుల నక్కజిత్తుల కారణంగా ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టులు ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఏపీఎస్‌ఈబీ నాటినుంచే సీమాంవూధులు కుట్రలు కుతంవూతాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో పనిచేసిన మెజారిటీ డైరెక్టర్లు బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన దాఖలాలున్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించుకుంటూ, వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కుట్రపూరితంగా ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సంస్కరణల తదుపరి అప్పట్లో విద్యుత్ బోర్డులో డైరెక్టర్లుగా పనిచేసినవారు ఇప్పుడు అదే సీమాంధ్ర పవర్ ప్రాజెక్టుల్లో కీలకపదవుల్లో కొనసాగుతున్న తీరే ఇందుకు నిదర్శనం.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌వూపాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎన్నో మతలబులున్నాయి. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో ప్రాజెక్టు విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. ప్రభుత్వ వ్యయంతోనే ల్యాంకో ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకరపల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ మతలబు ఉంది. అంతే కాకుండా మర్చంట్ పవర్‌వూపాజెక్టుగా ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టును ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు వచ్చాయి. ఆ విధంగా వచ్చిన ల్యాంకో ఇటీవల సకల జనుల సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడు రాష్ట్రానికి విక్రయాలు జరిపింది. ఫలితంగా కరెంటు కోతలతో ఒకవైపు పంటలు ఎండిపోయి రైతాంగం నష్టపోగా, పరిక్షిశమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా రైతుకూలీలు, పరిక్షిశమల్లో పనిచేసే కార్మికులకు ఉపాధి కొరవడింది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాలేదు. సత్తుపల్లిలో 600మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. చుట్టూ బొగ్గు ఉన్నా కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు అమలుకు నోచుకోలేదు. సత్తుపల్లి ప్రాజెక్టు వస్తే తెలంగాణ సస్యశ్యామలమై ఉండేది. కరీంనగర్ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల సామర్థ్యంగల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు 2002లోనే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. కేవలం 26 నెలల లోపు పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తికాలేదు.

గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. సకాలంలో ఇది పూర్తి అయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. దాంతో జెన్‌కోకు పేరు ప్రతిష్ఠలు రావడంతోపాటు వ్యవసాయ, పారిక్షిశామికరంగాల్లో తెలంగాణ దూసుకు పరిస్థితులుండేవి. ఇదే సమయంలో 2003లో సీమాంవూధకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే 220 మెగావాట్లు, వేమగిరి 370 మెగావాట్లు, గౌతమి 464 మెగావాట్లు, కోనసీమ 445 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులకు మాత్రం గ్యాస్ కేటాయింపులు చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో 1400 మెగావాట్ల సామర్థ్యం గల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్నీ అనుమతులు వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసింది. కాంతానపల్లితోపాటు మరికొన్ని హైడెల్ పవర్ ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో వ్యవసాయరంగం, పారిక్షిశామికరంగాలు ఎదగాల్సినంతగా ఎదలేకపోయాయి. అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయింది.

ఒప్పందాల ఉల్లంఘనలు
విద్యుత్ సంస్కరణల సమయంలో చేసుకున్న ఒప్పందాల్లో అనేకం ఈనాటికీ అమలుకు నోచుకోలేదు. గతేడాది సకల జనుల సమ్మె సందర్భంగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రైతాంగానికి, వినియోగదారులకు మెరుగైన కరెంటు సేవలు అందిస్తూనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగస్వామ్యమై కీలక భూమిక పోషించారు. సింగరేణి కార్మికుల సమ్మె, తదుపరి కరెంటోళ్ల సమ్మె సర్కారును ఇరకాటంలో పెట్టింది. దాంతో గత ఏడాది అక్టోబర్ 25న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ యాజమాన్యాలు రాతపూర్వక ఒప్పందాలు చేసుకున్నాయి. ఆచరణలో అవి అమలుకు నోచుకోలేదు. మొత్తం 13 అంశాలపై యాజమాన్యాలు అధికారికంగా ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు కే రఘు, పీ మోహన్‌డ్డి, ఎం జానయ్య, ఎస్ స్వామిడ్డి, టీ అంజిడ్డితో పాటు దాదాపు 22 మంది సంతకాలు చేయగా, విద్యుత్ సంస్థల యాజమాన్యాల తరఫున ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జెన్‌కో ఎండీ విజయానంద్, సెంట్రల్ పవర్ డిస్కమ్ సీఎండీ అనంతరాము, ట్రాన్స్‌కో జేఎండీలు రమేష్, రఘనాథంలతో పాటు ఏడుగురు అధికారులు సంతకాలు చేశారు.

జీవోల అమలులో ఎంతో తేడా
ఆచరణలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాకపోవడంపై వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకతలను తట్టుకునేందుకు 1985 డిసెంబర్‌లో అప్పటి సీఎం ఎన్‌టీఆర్ 610 జీవో తెచ్చారు. విచిత్రం ఏమంటే 610 జీవో జారీకి నెల ముందు రాయలసీమ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 564ను తీసుకువచ్చింది. రాయలసీమ జిల్లాల్లో (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు) ఇతర జిల్లాల ఉద్యోగులు ఉండరాదనేది జీవో సారాంశం. ప్రభుత్వం ఈ జీవోను నెలలో అమలుచేసి రాయలసీమలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఉన్నపళాన వెనక్కి పంపించింది. అప్పట్లో రాయలసీమ నేతలు తెలంగాణ ఉద్యోగుల పట్ల కిరాతకంగా వ్యవహరించిన తీరును ఇప్పటికీ ఉద్యోగులు మరచిపోలేదు. కేవలం నెల గడువులో 564 జీవోను నిఖార్సుగా అమలు చేసిన ప్రభుత్వం దశాబ్దకాలంగా 610 జీవోను అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నదంటే తెలంగాణపై ఎంతటి పక్షపాతధోరణి ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రత్యేకవాదులు అంటున్నారు.

రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌వూపాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్ళు లేవని సాకులు చెప్పిన ఆనాటి పాలకులు నీళ్ళు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, పోతిడ్డి పాడు నుంచి నీళ్ళు సరఫరా అవుతున్నాయి. ఆర్టీపీపీ కోసం దాదాపు రెండు వందల కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పొతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒప్పందంలో అంశాలు ఈ విధంగా ఉన్నాయి
1. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం.
2. విద్యుత్ ఉద్యోగులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు జరిపిన సమ్మెకాలాన్ని డ్యూటీగా పరిగణించడం.
3. సమ్మె కాలానికి వేతనాలు తీసుకోని ఉద్యోగులకు ఒక నెల జీతం అడ్వాన్సుగా చెల్లించడం.
4. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ట్రాన్స్‌కో, జెన్‌కో, సీపీడీసీఎల్ (హైదరబాద్), ఎన్పీడీసీఎల్(వరంగల్) కంపెనీ ఉద్యోగులు, సిబ్బంది పట్ల భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు, వేధింపులకు పాల్పడకుండా ఉండడం.
5. సమ్మె కాలంలో టీజాక్ సభ్యులపై నమోదైన కేసుల ఉపసంహరణ.
6. తెలంగాణ ప్రాంతంలో జెన్‌కో పరిధిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులైన నేదునూరు, సత్తుపల్లి, శంకరపల్లి, కాంతానపల్లి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేయడం.
7. కేటీపీఎస్ అవసరాలను కాదని సింగరేణి బొగ్గును వీటీపీఎస్‌కు, ఆర్టీపీపీకి తరలించకుండా చర్యలు తీసుకోవడం.
8. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీసీడీసీఎల్) పరిధిలో ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాలను తప్పించి కర్నూలు జోన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లాను వేరు చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవడం.
9. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వెయి కల్పించి, వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవడం.
10. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడం.
11. ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన (కాంపాసినేట్ అపాయింట్‌మెంట్), అవసరాలను బట్టి సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి చర్యలు.
12. ట్రాన్స్‌కో, జెన్‌కో, సీసీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లలో అవసరాలకు
అనుగుణంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా భర్తీచేసేందుకు ప్రభుత్వాన్ని కోరడం.
13. హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ చారివూతక స్మారక స్తూపాన్ని
తెలంగాణ చౌరస్తా (మింట్ కాంపౌండ్)వద్ద ఏర్పాటు చేయడం.

Take By: T Media

0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP