అందినంత దోచుకో - Lanco refutes allegation of Rs 13k cr scam
అందినంత దోచుకో అదే లగడపాటి ల్యాంకో!
నిబంధనలకు నిలువు పాతర.. జాతీయ సౌరశక్తి పథకానికి టోకరా
9 దొంగ కంపెనీలతో కాంట్రాక్టులు.. అల్లిబిల్లి కంపెనీలన్నీ ల్యాంకోవే!
డైరెక్టర్లుగా ఉద్యోగులు, వారి కుటుంబీకులు
9, 10 ఏళ్ల చిన్నారులూ డైరెక్టర్లే.. కంపెనీల అడ్రస్‌లన్నీ ఒక్కచోటే!
రూ.13 వేల కోట్ల
‘సౌరశక్తి’
కుంభకోణం!
వెలుగులోకి
తెచ్చిన సీఎస్‌ఈ
విచారణ
జరుపుతామన్న
కేంద్రం
ఇది లగడపాటి మాయాజాలం! రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టుల పేరుతో, వక్ఫ్‌భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వెనకేసుకున్న కోట్లు చాలవన్నట్లు.. పాతికేళ్లలో 13వేల కోట్ల రూపాయలు అప్పనంగా బొక్కేందుకు రచించిన వ్యూహం! నిబంధనలకు పాతరేసి.. దొంగ కంపెనీలను సృష్టించి.. సూర్యకాంతినీ చెరప చేస్తున్న పన్నాగం! ఒక కంపెనీకి ఒకటే ప్రాజెక్టు దక్కాల్సి ఉన్నా.. టెండర్లు వేసేందుకు ఎవరూ రాని అవకాశాన్ని అందిపుచ్చుకుని.. అప్పటికప్పుడు కంపెనీలను సృష్టించి.. అన్ని కంపెనీలకూ ఒకే సెల్ నెంబర్ ఇచ్చి, అన్ని కంపెనీలనూ ఒకేచోట నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసి, ల్యాంకో ఉద్యోగులను ఆఖరుకు ఉద్యోగుల పిల్లలను సైతం కంపెనీలకు డైరెక్టర్లును చేసేసి, ఐదు పైసల తేడాతో బిడ్లు దాఖలు చేసి 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించి ‘రాజ’ మార్గంలో దోపిడీకి సిద్ధమైన వైనం! ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధనతో సౌర విద్యుత్ రంగంలో కొత్త కంపెనీలు పోటీ పడేందుకు ఉద్దేశించిన స్ఫూర్తికి అక్రమ మేధస్సుతో కొట్టిన గండి! సౌర విద్యుత్ ఉత్పత్తికి స్వర్గధామంగా భాసిల్లుతున్న రాజస్థాన్‌లో జైసల్మేర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో దీని మూలాలు బయటపడ్డాయి! నెలల తరబడి శ్రమించిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే సంస్థ ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది! లగడపాటి మాయా సామ్రాజ్యాన్ని దేశం కళ్లముందు నిలబెట్టింది!
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (): నక్కజిత్తుల వ్యవహారాలతో రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులు, వక్ఫ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కోట్లు దండుకుంటున్న ల్యాంకో... ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్రమాలకు తెరలేపిందా? దేశాన్ని కుదిపివేసిన 2జీ కుంభకోణం రీతిలో సోలార్ మిషన్‌లో వేల కోట్లు బొక్కేందుకు పన్నాగాలు రచించిందా? అల్లిబిల్లి కంపెనీలను అల్లి.. ఏకంగా 13వేల కోట్ల రూపాయలకు ‘టెండర్’ పెట్టిందా? అవుననే అంటోంది ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ). అనడమే కాదు.. అందుకు పకడ్బందీ ఆధారాలను సైతం బయటపెట్టింది. దీనిపై విచారణకు ఆదేశిస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకటించింది.
దేశంలో విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు 2022 సంవత్సరం నాటికి 20,000మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయాలని జవహర్‌లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్(జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2013 సంవత్సరాంతానికి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సాధించాలని నిర్దేశించుకుంది.
మొదటి దశలో 150 మెగావాట్ల ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్స్, 470 మెగావాట్ల సోలార్‌థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ‘ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన’తో కేంద్ర న్యూ అండ్ రినెవబుల్ ఎనర్జీ(ఎంఎన్‌ఆర్‌ఈ) మంత్రిత్వ శాఖ బిడ్‌లను ఆహ్వానించింది. ఏ ఒక్క కంపెనీకీ 5 మెగావాట్లకు మించకుండా ఫోటో వోల్టాయిక్(పీవీ)ప్లాంట్, 100 మెగావాట్లకు మించకుండా సోలార్‌థర్మల్ ప్లాంట్ కేటాయించాలని జాతీయ సౌరశక్తి పథకం నిబంధనలు విధించింది. ఆ నిబంధనలకు లోబడి ఒక్కటంటే ఒక్కడి కూడా బిడ్ దాఖలు కాలేదు. నియమ నిబంధనలను అతిక్షికమించడంలో ఆరితేరిన ల్యాంకోకు చెందిన ల్యాంకో ఇన్‌వూఫాటెక్ సంస్థ తన నక్కజిత్తుల ఆలోచనలకు పదును పెట్టింది. అవకాశం వచ్చిందే తడవుగా దొంగ కంపెనీలను సృష్టించి, 235 మెగావాట్లకు విద్యుత్ ఉత్పాదనకు అనుమమతులు సాధించింది.
నేషనల్ సోలార్ మిషన్ మొదటి దశకు బిడ్ ఆహ్వానించిన 620 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పాదనలో 40 శాతం (235 మెగావాట్లు) మేరకు కైవసం చేసుకుంది. ల్యాంకో సృష్టించిన తొమ్మిది కంపెనీలు దాఖలు చేసిన బిడ్స్‌లలో ఒక్కొక్క దానికి కేవలం రూ.0.05పైసల చొప్పునతేడాలు ఉండడం గమనార్హం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీల్లో ఏడు కంపెనీల ఈక్విటీ షేర్లు కేవలం రూ.10లక్షలు, రూ.11లక్షల వరకే ఉన్నాయి. సదరు కంపెనీలకు ఆస్తులు గానీ, బ్యాంకు ఖాతాల్లో రిజర్వు ఫండ్ గానీ లేకపోవవడం మరో విశేషం. ఈ దొంగ కంపెనీలన్నీ నేషనల్ సోలార్ మిషన్ బిడ్డింగ్ సమయంలోనే పుట్టుకువచ్చాయి. ఇలాంటి అంశాలు నేషనల్ సోలార్ మిషన్ నిబంధనలను పూర్తిగా విరుద్ధం. ల్యాంకో సృష్టించిన దొంగ కంపెనీలన్నింటిలోనూ ల్యాంకో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. కళ్ళు తిరిగే నిజమేమిటంటే.. ఒక కంపెనీలో తొమ్మిదేళ్ళ బాలుడు, పదేళ్ళ బాలుడు డైరెక్టర్లుగా నమోదై ఉన్నారు.
వీరిద్దరూ ల్యాంకో గ్రూప్‌లోని సుబ్రమణ్యం అనే ఉద్యోగి పిల్లలుగా, సదరు సుబ్రమణ్యం ల్యాంకో సంస్థకు అత్యంత విశ్వాసమైన వ్యక్తిగా, నమ్మకస్తుడిగా అభివర్ణింస్తూ ల్యాంకో ఇన్ హౌజ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ మొత్తం ప్రక్రియ ఎన్‌వీవీఎన్ ఆధ్వర్యంలో జరిగిందని, తాము కేవలం నిబంధనలను మాత్రమే రూపొందించామని నవీన పునర్వినియోగ ఇంధన శాఖ కార్యదర్శి గిరీశ్ ప్రధాన్ చెబుతున్నారు. ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన రీత్యా దీనిపై తాము లోతుగా విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే సీఎస్‌ఈ ప్రకటనలపై ల్యాంకో అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ వద్ద ధ్రువీకరించుకోకుండానే ఆరోపణలు చేశారని పేర్కొంటోంది. కానీ.. సీఎస్‌ఈ మాత్రం తాము ల్యాంకో అభివూపాయాల కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని, కానీ వీలుకాలేదని తెలిపింది.
ల్యాంకో కథా కమామిషు
ల్యాంకో ఇన్‌వూఫాటెక్ సంస్థ ల్యాంకో గ్రూప్ కంపెనీల్లో ప్రధానమైంది. దీనిని 196లో ప్రస్తుత విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్థాపించారు. ల్యాంకో ఇన్‌వూఫాటెక్ కంపెనీ చైర్మన్ లగడపాటి రాజగోపాల్ అయితే ఆయన సోదరుడు లగడపాటి మధుసూదనరావు ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ల్యాంకో 2006 సంవత్సరంలో గ్లోబెపూక్ అనే సింగపూర్ సంస్థతో కలిసి మధ్యవూపదేశ్‌లోని ససన్ వద్ద 4,000మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును అత్యంత తక్కువ ధరకు అంటే యూనిట్‌కు రూ.1.196పైసల చొప్పున కోట్ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్ పూర్తికాగానే ల్యాంకో-జిందాల్‌స్టీల్ కంపెనీలు కలిసి గ్లోబెపూక్ కంపెనీని కొనుగోలు చేశాయి. తొలుత సింగపూర్‌కు చెందిన గ్లోబెపూక్ ఆర్థిక స్థితుల ఆధారంగానే ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు వచ్చింది.
ల్యాంకో వ్యవహారం దేశంలో పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తించింది. దీంతో ల్యాంకోను అనర్హంగా ప్రకటించారు. అదే విధంగా ల్యాంకో ఆంధ్రవూపదేశ్‌లో కొండపల్లి వద్ద ఒక పవర్ ప్రాజెక్టు, హర్యానాలో మరొక పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండు ప్రాజెక్టులు సైతం అవినీతి ఊబిలో కూరుకుపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కొండపల్లి పవర్ ప్రాజెక్టును 16 నెలల్లో పూర్తిచేస్తానని బిడ్‌ను దక్కించుకున్న ల్యాంకో.. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 43 నెలల సమయం తీసుకుంది. టెండర్ నిబంధనల ప్రకారం యూనిట్‌ధర కనీసం రూ.0.30పైసలు తగ్గించాల్సి ఉండగా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏటా ఎపీ ట్రాన్స్‌కో, డిస్కమ్‌లపై సుమారు రూ.90కోట్ల మేరకు భారం పడుతున్నది. గత పదకొండు సంవత్సరాలుగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ల్యాంకో దోచుకుంది. అలాగే కొండపల్లి పవర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 351 మెగావాట్ల నుంచి 369 మెగావాట్లకు పెంచి చూపించి, విద్యుత్ కంపెనీలకు సుమారు రూ.వంద కోట్లకు పైగా నష్టాలను కలిగించింది. సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ అథారిటీ(సీఈఏ) సైతం కొండపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 351 మెగావా నిర్థారించినప్పటికీ ల్యాంకో సంస్థ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ కాలయాపన చేస్తోంది.
సమాచార చట్టానికి అతీతమట!
ల్యాంకో ఇన్‌వూఫాటెక్ దక్కించుకున్న సోలార్ పవర్ ప్రాజెక్టు వివరాలు అత్యంత గోప్యంగా ఉంచేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. వీరితో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎన్టీపీపీ విద్యుత్ వ్యాపార నిగమ్‌లు కొమ్ముకాస్తున్నాయనే విమర్శలున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ సోలార్ మిషన్ బిడ్డింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. చివరకు చట్టబద్ధంగా సమాచార హక్కు చట్టం కింద 2011 సెప్టెంబర్‌లో కేంద్రంలోని సంబంధిత శాఖను, సెంట్రల్ ఎలక్షిక్టిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సీఈఆర్‌సీ)ని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను ఆశ్రయించింది. అయితే కేంద్ర విద్యుత్ నియంవూతణ మండలి(సీఈఆర్‌సీ), విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సోలార్ ప్రాజెక్టుల వివరాలు తమ పరిధిలోకి రావని, ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగంను సంప్రతించాలని ఉచిత సలహా ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్టీపీసీ సంస్థ ఆ సమాచారం అత్యంత గోప్యమైందని పేర్కొంటూ సదరు కంపెనీలకు సంబంధించిన సమాచారం వెల్లడించినట్లయితే ఆయా కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొనడం గమనార్హం. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఎన్టీపీసీ అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించింది. అయితే ఇప్పటి వరకు సమాచారం ఇంకా బయటకు రాలేదు.
ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు నిబంధన ఎందుకు?
సోలార్ పవర్ ప్రాజెక్టు మిషన్ కింద 20వేల మెగావాట్ల సామర్థ్యాన్ని 2022 నాటికి సాధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ప్రస్తుతం సోలార్ విద్యుత్ ధర ఆకాశాన్ని అంటుతున్నది. ధరను అందుబాటులోకి తీసుకురావాలంటే సౌర విద్యుత్ రంగంలోకి ఎక్కువ కంపెనీలు వచ్చేందుకు వీలుగా ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు అనే నిబంధనను విధించారు. దీంతో పోటీ పెరగడంతో పాటు భవిష్యత్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి సౌర విద్యుత్ ఉత్పత్తి ధరలు తగ్గుముఖం పడుతాయనే ఆలోచ . ల్యాంకో చేసిన నిర్వాకంతో సోలార్ మిషన్ స్ఫూర్తికే గండికొట్టినట్లయ్యింది.
దొంగ కంపెనీ అర్హత ఎలా?
ఉదాహరణకు డీడీఈ రెన్యూవబుల్ ఎనర్జీ (డీడీఈఆర్‌ఈ) 5 మెగావాట్ల పీవీ ప్లాంట్‌ను దక్కించుకుంది. ఈ కంపెనీ కిషన్ లలిత్ బన్సల్, అతని ముగ్గురు పిల్లల పేరు మీద నమోదైంది. ఇదే బన్సల్ పేరుతో డీఈఈ డెవలప్‌మెంట్ ఇంజనీర్స్(డీఈఈడీఈ) అనే మరొక కంపెనీ నమోదై ఉంది. ఎంఎన్‌ఆర్‌ఈ నిబంధనల ప్రకారం బిడ్‌లో పాల్గొనేందుకు బిడ్డింగ్‌కు వారం రోజుల ముందు కంపెనీ మూలధనం కనీసం రూ.17కోట్లు ఉండాలి. అయితే బిడ్‌లలో డీడీఈఆర్‌ఈ కంపెనీ డీఈఈడీఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్లను సమర్పించి బిడ్‌లో అర్హత సాధించింది. దీని ఆధారంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ డీడీఈఆర్‌ఈ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేసింది.
అడ్రస్‌లన్నీ ఒక్కటే
విచిత్రం ఏమంటే సోలార్ ప్రాజెక్టు బిడ్‌లను దక్కించుకునేందుకు పుట్టించిన కంపెనీల అడ్రస్‌లు అత్యంత గోప్యంగా ఉంచారు. ప్రపంచంలో దేని గురించైనా ఇట్టే క్షణాల్లో గుర్తించేందుకు వీలుగా ఉన్న గుగూల్ సెర్చ్‌లో కూడా బిడ్‌లు దక్కించుకున్న కంపెనీల వివరాలు లేవంటే అవి ఎంతటి గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) సంస్థ సోలార్ పవర్‌కు స్వర్గధామంగా భావిస్తున్న రాజస్థాన్‌లో దీని మూలాలు ఉండవచ్చనే అనుమానంతో రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్‌ను కూడా సంప్రతించింది. అనుకున్నట్లే సదరు కంపెనీల మూలాలు రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా ఆస్కందార గ్రామంలో ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ గ్రామంలో సౌర విద్యుత్తు కోసం వెయ్యి హెక్టార్ల భూమిని ఎంపిక చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే వాటికి సంబంధించి ఎక్కడా ఒక్క బోర్డు కానరాదు. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ ల్యాంకో కోసమే పని చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారని సీఎస్‌ఈ పేర్కొంది. రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అన్ని కంపెనీలకూ కలిపి ఒకే సెల్ ఫోన్ నెంబర్ ఉండడం గమనార్హం.
లాభం అంతా
ల్యాంకోదే!
ఖాయా, దివాకర్ సంస్థలు ల్యాంకోకు అనుబంధ సంస్థలు. అలాగే కెవికె ఎనర్జీలో సంస్థకు 49 శాతం వాటా ఉంది. డీడీఈ, ఎలక్షిక్టోమెక్ కంపెనీలలో 26 శాతం ఉంది. ఈ సంస్థ న్నింటి ప్రిఫన్షియల్ షేర్లలో ల్యాంకోకు 100 శాతం వాటా ఉంది. ఈ మొత్తం విలువ నేరుగా సోలార్ మిషన్‌లో భాగంగా ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందేందుకు ఒక సంస్థకు ఉండాల్సిన నెట్‌వర్త్ (నికర ఆస్తుల విలువ)తో సమానంగా ఉంది. సోలార్‌మిషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పొందడానికి ఈ కంపెనీలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించుకున్న విషయం ఇక్కడే ే టతెల్లం అవుతోంది. ప్రిఫన్షియల్ షేర్లు మూలధన వాటాలతో సమానంగా భావిస్తారు. అందునా ఈ షేర్లను భవిష్యత్‌లో ఈక్విటీ వాటాల రూపంలోకి బదలాయించుకునే అవకాశం ఉన్నందున ఈ కంపెనీలన్నింటిలో ల్యాంకోకు 99 శాతం వాటా దక్కే అవకాశం ఉంది.
ఎమ్‌ఎన్‌ఆర్‌ఈ
మార్గదర్శకాల ఉల్లంఘన
సోలార్ పవర్ ప్రాజెక్టు ఎంపికకోసం
జులై 2010లో ఈ మార్గదర్శకాలు
జారీ చేశారు.
1. సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్డింగ్‌కోసం ఓ కంపెనీ కేవలం ఒకే అప్లికేషన్ దాఖలు చేయాలి. సోలార్ విద్యుత్ ప్రాజెక్టు డెవలపర్లు భాగస్వామ్య కంపెనీలైనా, వ్యక్తిగత కంపెనీలైనా, గ్రూప్ కంపెనీలైనా 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికోసం ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక కంపెనీకి ఒకే ప్రాజెక్టు లభించనుంది.
2. సోలార్ థర్మల్ ప్రాజెక్టు బిడ్డింగ్‌కోసం ఏ కంపెనీ అయినా నిర్దేశిత ప్రాంతంలో మాతృసంస్థకానీ, ఏదైనా గ్రూప్ సంస్థకానీ 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ నిర్మాణానికి మాత్రమే అనుమతిస్తారు. కంపెనీలు బహుళ ప్రాంతాలలో ఎన్ని ప్లాంట్లను నెలకొల్పినా మొత్తం 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మించి అనుమతి లేదు.
3. కంపెనీని నడిపే ప్రమోటర్ కనీస మూలధనం వాటా నిబంధనను పరిమితులకు లోబడి అనుమతిస్తారు. పై నిబంధనలే అన్ని కంపెనీలకు వర్తిస్తాయి. స్టాక్ ఎక్సేంజిలలో లిస్టెడ్ కంపెనీలకు సోలార్ ప్రాజెక్టులను స్థాపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ప్రాజెక్టు డెవలపర్‌కు ఈ కంపెనీలో కనీసం 27 శాతం వాటాతోపాటు ఓటింగ్ హక్కులు కలిగి ఉండాలి. ఇలాంటి అన్ని హంగులు కలిగిఉన్న కంపెనీలకు ప్రాజెక్టు నిర్వహించబడిన సంవత్సరం కాలం తర్వాత విద్యుత్ పంపిణీకి అనుమతిస్తారు.
డీడీఈ పునరుత్పాదక సంస్థ
1. 17నవంబర్ 2009న డీడీఈ పునరుత్పాదక సంస్థ కే బస్నాల్ ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు డైరెక్టర్లుగా, ఓనర్లుగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ లక్ష రూపాయల ఈక్విటీవిలువ కలిగి ఉంది.
2. 10 సెప్టెంబర్ 2010న నైస్ ఇన్‌ఫ్రాకాన్
నైస్ ఇన్‌ఫ్రాకాన్ కార్పొరేట్ సంస్థ టోను కుమార్, క్రిష్ణ కుమార్ డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. లక్షరూపాయల ఈక్విటీ విలువ కలిగిన ఈ కంపెనీలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
3. 10-11 సెప్టెంబర్ 2010న ల్యాంకో ఉద్యోగి పిల్లలు ప్రేమ్ చంద్, సాహితి కుర్మోజు నైస్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలో డైరెక్టర్లుగా చేరారు. కుమార్ ఆ కంపెనీకి రాజీనామా చేశారు.
4. అక్టోబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 2009-10 సంవత్సరానికి బాలెన్స్‌షీట్ సమర్పించింది. ఇందులో ఓనర్షిప్‌లోగాని, ఈక్విటీలోగాని ఎలాంటి మార్పులు లేవు.
5. 16 నవంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు బిడ్ గెలుచుకుంది.
6. 31 డిసెంబర్ 2010న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ 15.2 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాధాన్యతా షేర్లను క్రిష్ణన్ లలిత్ బన్సల్ స్థాపించిన డీడీఈ డెవలప్‌మెంట్ ఇంజినీర్స్ కంపెనీకి బదలాయించింది.
7. ఫిబ్రవరి 2011న 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్‌ను సమర్పించింది. 23 శాతం క్రిష్ణన్ లలిత్ బన్సల్ పేరిట మరో 77 శాతం పేరు తెలియని వాణిజ్య సంస్థ పేరిట చూపించారు. అదేరోజు బాలెన్స్‌షీట్‌లో కంపెనీ కొత్త డైరెక్టర్లుగా ప్రేమ్‌చంద్, సాహితి కుర్మోజులను పేర్కొంది.
. 30 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ నుంచి క్రిష్ణన్ లలిత్ బన్సల్ మినహా బన్సల్ కుటుంబ సభ్యులంతా కంపెనీ డైరెక్టర్లుగా రాజీనామా చేశారు.
9. 31 మార్చి 2011న డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థలోని మెజారిటీ షేర్ 74 శాతం సొంతం చేసుకుని కంపెనీని హస్తగతం చేసుకుంది. అదేసమయంలో ల్యాంకో 26 శాతం వాటాతోపాటు 15.2 కోట్ల ప్రిపన్షల్ షేర్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత కంపెనీ 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలతోపాటు 5 లక్షల రూపాయల నగదు, బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు వివరించింది.
10. 14 నవంబర్-16 డిసెంబర్ 2011 తేదీలలో డీడీఈ రెనెవబుల్ ఎనర్జీ సంస్థ/నైస్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలలో రవీందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లుగా వచ్చారు. వీరిలో రవీందర్ సింగ్ ల్యాంకో సోలార్‌లో పని చేస్తున్నారు.
ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థ
11. 2 జనవరి 200న లక్షరూపాయల ఈక్విటీ కలిగిన ఎలక్షిక్టోమెక్ మారిటెక్ సంస్థలో తుషార్ వినాయక్ మెహెందాలె, అవంతి తుషార్ మెహెందాలె డైరెక్టర్లుగా ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఈ కంపెనీలో ఉంది.
12. 7 సెప్టెంబర్ 2010న గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ సంస్థ టోను కుమార్, క్రిష్ణన్ కుమార్ శర్మ డైరెక్టర్లుగా ఏర్పాటైంది. లక్ష రూపాయల ఈక్విటీ విలువకలిగిన ఈ సంస్థలో వీరిద్దరికీ చెరో యాభైశాతం వాటా ఉంది.
13. 10-11 సెప్టెంబర్ 2010న సురేశ్, యర్రగుంట్ల నాగరాజు గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులో కొత్త డైరెక్టర్లుగా చేరారు. వీరిద్దరూ కుర్మోజు పక్కింటివారు కావడం విశేషం. అదేరోజు కుమార్ రాజీనామా చేశారు.
14. 16 నవంబర్ 2010న ఎలక్ట్రో మారిటెక్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ బిడ్ గెలుచుకుంది.
15. 31డిసెంబర్ 2010న తుషార్ బీఎమ్ సారథ్యంలోని ఎలక్షిక్టోమెటీరియల్ హాండ్లింగ్ కంపెనీకి 15.2 కోట్ల ప్రిఫన్షల్ షేర్లను ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ బదలాయించింది.
16. 2 జనవరి 2011న ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీ 2009-10 సంవత్సరానికి సవరించిన బాలెన్స్ షీట్ సమర్పించింది. ఇందులో 0.01 శాతం వాటాలను తుషార్ వీఎమ్ పేరుపై 99 శాతం పేరు తెలియని కంపెనీ పేరుపై చూపించింది. ఇక కంపెనీ ఈక్విటీ విలువ లక్షరూపాయలుగా, లక్షరూపాయలు బ్యాంక్ బాలెన్స్ ఉన్నట్లు బాలెన్స్‌షీట్ వివరించింది.
17. 29 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీనుంచి అవంతి టీ మెహెందాలె రాజీనామా చేశారు. అదేరోజు సురేశ్‌తోపాటు నాగరాజ యర్రగుంట్ల అడిషనల్ డైరెక్టర్లుగా కంపెనీలో చేరారు. ్చటఠ్ఛిజిఝ్చజీజూ.ఛిౌఝ ఈ-మెయిల్ అడ్రస్ నుంచి వీరిద్దరికీ నియామకపవూతాలు జారీ అయ్యాయి. ఈ- మెయిల్ అడ్రస్ ల్యాంకో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిది కావడం గమనార్హం.
18. 31 జనవరి 2011న ఎలక్షిక్టోమెక్ కంపెనీ మరోసారి 2009-10 సంవత్సరానికి బాలెన్స్ షీట్‌ను సవరించింది. తుషార్ పేరుపై 0.01 శాతం వాటా మరో 23 శాతం వాటా వాటాదార్లపేరుపై చూపించారు. 76.99 శాతాన్ని వేరే కంపెనీల పెట్టుబడులుగా చూపించారు.
19. 31 మార్చి 2011
ఎలక్షిక్టోమారిటెక్/గోప్డూన్ ఇన్‌వూఫావూపాజెక్ట్స్
ఎలక్షిక్టోమారిటెక్ కంపెనీలో 74 శాతం ఈక్విటీని సొంతం చేసుకుని గోల్డెన్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ చేజిక్కించుకుంది. లాంకో కంపెనీ 26శాతం ఈక్విటీతో 15.2 కోట్ల రూపాయల ప్రిఫన్షల్ షేర్లను సొంతం చేసకుంది. ఆ తర్వాత కూడా కంపెనీ 15.2 కోట్ల రూపాయలతో ప్రిఫన్షల్ షేర్లను విడుదల చేసింది. కంపెనీ పేరుపై 15 కోట్ల రుణాలను తీసుకుంది. రెండు లక్షల రూపాయల నగదు బ్యాంక్ బాలెన్స్ కలిగిఉంది.
-24 సెప్టెంబర్ 2010 తేదీన ఎంపిక ప్రక్రియ కోసం అభ్యర్థన మేరకు చివరితేదీని సవరించింది.
-ఈకాలంలో వాటాదారులను మార్చడాన్ని, షేర్ల బదిలీని అనుమతించరు.
-10 జనవరి 2011 తేదీన విద్యుత్ కొనుగోలుకోసం ఎన్‌వీవీఎన్ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది.
-ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తర్వాత ఏడాదివరకు ప్రాజెక్టు సొంతదారు షేర్లపై తన నియంత్రణను మార్చుకోరాదు.
-10 జనవరి 2012 ప్రాజెక్టుల ప్రారంభానికి తుది గడువు.
నిబంధనలు తుంగలో తొక్కి
13 వేల కోట్లకు లగడపాటి టెండర్
- జాతీయ సోలార్ మిషన్‌కు టోకరా !
- బోగస్ కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలి
- లగడపాటిని అరెస్టు చేయాలి
- టీఆర్‌ఎస్ పోలిట్ బ్యూరోసభ్యుడు దాసోజు శ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (: తెలంగాణ ప్రాంతాన్ని దోపిడి చేసి వేల కోట్ల రుపాయలు దోచుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దృష్టి ప్రస్తుతం జాతీయ సంపదపై పడిందని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో విలేకర్లతో ఆయన మాట్లాడారు. తెలంగాణ బొగ్గును దోచుకుని ఆంధ్రలో విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి లగడపాటి డబ్బు చేసుకున్నాడని విమర్శించారు. వక్ఫ్ భూములను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో హిల్స్ నిర్మించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు జాతీయస్థాయిలో దోపిడీకి లగటపాటి తయారయ్యారని శ్రవణ్ దుమ్మెత్తి పోశారు. ప్రస్తుతం జాతీయ సోలార్ మిషన్ విద్యుత్ ప్రాజెక్టులలో నిబంధనలను అతిక్షికమించి 13 వేల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో జాతీయ సంపదను కొల్లగొట్టాడని ధ్వజమెత్తారు. అర్హతలేని వ్యక్తుల పేర్లతో తొమ్మిది బినామి కంపెనీలను సృష్టించాడన్నారు.
దొంగ బాలన్స్ షీట్లతో 13 వేల కోట్ల రుపాయల సబ్సిడీ గల 235 ఎంవిఏ సామర్థం ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టును పొందిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం ఒక కంపెనీకి 105 మెగావాట్ల ప్రాజెక్టును మాత్రమే అప్పగించాలి. కానీ లగటపాటి జిత్తులమారి ఎత్తులతో గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు ప్రదర్శించి 235 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకున్నారన్నారు. లగడపాటిని తక్షణమే అరెస్టు చేసి, ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే స్వచ్ఛందసంస్థ పూర్తి స్థాయి విచారణ జరిపి లగడపాటి అవినీతి బాగోతాన్ని బయట పెట్టిందని, దీనిని జాతీయ పత్రికలు వెలుగులోకి తెచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించినందుకు కేంద్రవూపభుత్వం లగడపాటికి దీనిని కానుకగా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోక పోతే తామే సీబీఐని సంప్రదిస్తామని తెలిపారు. ఈ విషయాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చి జాతీయ సోలార్ మిషన్ లగడపాటికి ఇచ్చిన అగ్రిమెంట్‌ను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ల్యాంకో గ్రూప్‌పై విచారణకు ఆదేశం
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ జాతీయ సౌర విద్యుత్ ప్రాజెక్టును పొందిందన్న సెంటర్‌ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థ ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ‘ఈ అంశంపై మేం విచారణకు ఆదేశించాం. వ్యక్తిగతంగాగానీ, ప్యానెల్ ఏర్పాటుద్వారా గానీ విచారణ చేపడతాం’ అని కొత్త శక్తుల పునరుత్పాదక మంత్రిత్వ శాఖ ఉమ్మడి కార్యదర్శి తరుణ్ కపూర్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినట్లు తేలినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Take By: T News
0 comments:
Post a Comment