'సర్కారు’ కరెంటు బకాయిలు వెయ్యి కోట్లు!
-నిధుల్లేక చేతుపూత్తేస్తున్న శాఖలు
-కనెక్షన్లు కత్తిరిస్తున్న డిస్కమ్‌లు
-అంధకారంలో సంక్షేమ హాస్టళ్లు,స్కూళ్లు, పీహెచ్‌సీలు
-తాగునీటి పథకాల బోర్లకూ కట్
-నీటి కోసం అల్లాడుతున్న పల్లెలు
-కనెక్షన్లు కత్తిరిస్తున్న డిస్కమ్‌లు
-అంధకారంలో సంక్షేమ హాస్టళ్లు,స్కూళ్లు, పీహెచ్‌సీలు
-తాగునీటి పథకాల బోర్లకూ కట్
-నీటి కోసం అల్లాడుతున్న పల్లెలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2 ():ఆ స్కూళ్లో బోరుంది! కానీ.. గొంతు తడుపుకుందామంటే విద్యార్థులకు గుక్కెడు నీళ్లు కరువు! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో సంక్షేమ హాస్టల్! తమ పిల్లలను చదివించే ఆర్థిక స్థోమతలేని పేద తల్లిదంవూడులకు ఇవి ఆశాదీపాలు! కానీ ఇప్పుడవి అంధకారంలో మగ్గుతున్నాయి! ఆ విద్యార్థులకు గ్యాస్8నూనె దీపం వెలుతురులే గతి! కారణం.. కరెంట్ కనెక్షన్ కత్తిరించడమే! అదో ప్రభుత్వ ఆస్పత్రి! పేదల పాలిట సంజీవని! కానీ..సెల్‌ఫోన్ లైట్ వెలుగులోనే డాక్టర్లు సూదిమందు వేస్తున్నారు! టార్చిలైట్ వెలుతురులోనే రోగులను పరీక్షిస్తున్నారు! దీనికి కారణం కూడా.. కరెంట్ కనెక్షన్‌ను కత్తిరించడమే! ఇక గవర్నమెంట్ ఆఫీసుల సంగతి చెప్పనక్కర్లేదు! ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో నెలకొన్న దుస్థితి. గత ఆరు నెలలుగా ప్రభుత్వ శాఖల నుంచి విద్యుత్ బకాయిలు రాకపోవడంతో డిస్కమ్‌లు వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నాయి. కరెంటు వైర్లను కత్తిరిస్తున్నాయి. ఫలితంగా.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోతున్నాయి. సంక్షేమ హాస్టళ్ళు, పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అంధకారంలో మగ్గుతున్నాయి. బడ్జెట్‌లో ప్రభుత్వ శాఖలకు వందల కోట్ల కేటాయింపులు జరుగుతున్నా చిట్టచివరకు కరెంటు బిల్లులకే నిధులు లేని దుస్థితి నెలకొనడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలు వెల్లు ఆర్థికభారం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు.. వందకు వంద శాతం విద్యుత్ చార్జీల వసూళ్లు ఉండేలా సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి.
అయితే ప్రభుత్వ శాఖలకు సంబందించిన బకాయిలే ఎక్కువ మొత్తంలో పేరుకుపోయి ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో వాటికి సరఫరా నిలిపివేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.567.63 కోట్ల మేరకు కరెంటు బిల్లుల బకాయిలు ఉండడం గమనార్హం. తదుపరి స్థానంలో రూ.154.13 కోట్లతో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నిలిచింది. ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు వినియోగానికి సంబంధించి రూ.122 కోట్ల విద్యుత్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇలా ఆయా శాఖల నుంచి దాదాపు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయాయి. వాస్తవానికి రాష్ట్రస్థాయిలో సంబంధిత శాఖలు కరెంటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి నిధుల సర్దుబాటుచేయాల్సి ఉన్నా కొన్ని నెలలుగా ప్రభుత్వానికి పట్టించుకోవ మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నిధుల మంజూరులో ఆర్థిక శాఖ అనేక కొర్రీలు వేసే అవకాశాలు ఉంటాయి. దాంతో ఆయా శాఖల బకాయిల చెల్లింపులు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు బిల్లులు చెల్లించని వినియోగదారులు ఎంతటి వారైనా వాటికి విద్యుత్ సరఫరాను తొలగించాలని డిస్కం యాజమాన్యాలు అధికారులను ఆదేశించాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి పథకాల బోర్లు పని చేయడం లేదు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో 21,806 గ్రామ పంచాయతీలుండగా, వాటిలో 1,247 మేజర్ గ్రామపంచాయతీలు, 20,559 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఆదాయవనరులు అంతంతమావూతంగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు నిత్యం కరెంటు వాడకం అవసరం కావడం వల్ల బిల్లుల చెల్లింపుల్లో గతంలో ప్రభుత్వం కొంత వెసలుబాటును కల్పించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో నిర్ణయం తీసుకుంది. అయితే గత ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పంచాయతీల కరెంటు బిల్లుల విషయంలో ప్రభుత్వం అశ్రద్ధ వల్ల వేలల్లో, లక్షల్లో ఉన్న విద్యుత్ బిల్లులు కాస్తా వందల కోట్లకు చేరాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment