జూనియర్ వైద్యులు(జూడా)లతో చర్చలు విఫలం
- స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నారు
-13 అంశాల్లో 11 అంగీకరించాం
-సమ్మె విరమణపై విన
-వారి వెనుక రాజకీయ శక్తులు
-కేబినెట్ ఉపసంఘం ఆరోపణ
-చర్చలు జరుగుతుండగానే బెదిరించారు
-రేపటి నుంచి తలలు పగులుతాయన్నారు
-స్టైపెండ్‌పై పక్కదోవ పట్టిస్తున్నారు
-అత్యవసర సేవలు మెరుగుపర్చాలి
-సమ్మెపై వెనక్కి తగ్గం: జుడాల స్పష్టీకరణ
-ఉద్యమ కార్యాచరణపై నేడు ప్రజా సంఘాలతో చర్చ
-13 అంశాల్లో 11 అంగీకరించాం
-సమ్మె విరమణపై విన
-వారి వెనుక రాజకీయ శక్తులు
-కేబినెట్ ఉపసంఘం ఆరోపణ
-చర్చలు జరుగుతుండగానే బెదిరించారు
-రేపటి నుంచి తలలు పగులుతాయన్నారు
-స్టైపెండ్‌పై పక్కదోవ పట్టిస్తున్నారు
-అత్యవసర సేవలు మెరుగుపర్చాలి
-సమ్మెపై వెనక్కి తగ్గం: జుడాల స్పష్టీకరణ
-ఉద్యమ కార్యాచరణపై నేడు ప్రజా సంఘాలతో చర్చ
హెదరాబాద్, ఫిబ్రవరి 11 (): జూనియర్ వైద్యులు(జూడా)లతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూడాల డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి జూడాలు అత్యవసర సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పవూతుల్లో పరిస్థితి విషమించింది. మరణాల సంఖ్య పెరుగుతోందనే వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం చర్చలకు రావాలని జూడాలను ఆహ్వానించింది. సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, గీతాడ్డి, కొండ్రు మురళి, జూడాల తరపున జూడాల సంఘం ప్రతినిధులు ఆదిత్య, ఫణి మహేష్, నరేష్, హనుమాండ్లు, అస్లంబాబా, అశోక్, కిరణ్, కార్తీక్, రేవంత్ పాల్గొన్నారు. అయితే.. చర్చల పట్ల మొదటి నుంచీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిన ప్రభుత్వం ఈసారి కూడా అదే వైఖరి కొనసాగించింది. స్టైపెండ్ పెంపు సహా చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖజానాపై ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నందున, ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి ఆనం కీలక పాత్ర పోషించాల్సింది. కానీ ఆయన తన చాంబర్‌లోనే ఉన్నారు. తొలి విడత చర్చల్లో గీతాడ్డి, కొండ్రు మురళి మాత్రమే పాల్గొన్నారు.
సుమారు రెండున్నర గంటల పాటు చర్చించిన తర్వాత మంత్రులు ఇద్దరు ఆనంను కలిసి పరిస్థితి వివరించారు. ఈసారి ఆనంతో సహా వెళ్లి మళ్లి చర్చలు జరిపారు. ఇలా రెండు పర్యాయాలు విడతలుగా చర్చించినప్పటికీ అంతిమంగా చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం మంత్రులు గీతాడ్డి, కొండ్రు మురళీ మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమవడానికి జూడాల వైఖరే కారణమని దెప్పి పొడిచారు. ‘ జూడాల సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు అనేక పర్యాయాలు మంత్రులు వారితో చర్చలు జరిపారు. ప్రతి సారి ఏవో క్లారిఫికేషన్స్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇన్ని గంటల పాటు చర్చించినా స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నారు. మంత్రిగా కొండ్రు మురళి కొత్తగా వచ్చారు, ఆయనకు కొంత సమయం ఇవ్వాలని చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పినా వినడం లేదు. స్టైపెండ్ పెంపుపై మంత్రికి కొంత సమయం ఇవ్వాలని కోరినా మొండికేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుని, ప్రభుత్వం నుంచి స్టైపెండ్ తీసుకుంటూ ప్రజలకు సేవలు చేయడం అంటే ఎంత వరకు సబబు? మాకు విధులు కాదు, నిధులే ముఖ్యమన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’ అని గీతాడ్డి అన్నారు.
ఇదంతా రాజకీయంగా జరుగుతుంది?: మంత్రి కొండ్రు మురళి
‘ఇదంతా రాజకీయంగా జరుగుతుందని మా వద్ద సమాచారం ఉంది. వారు ఎవరి వలలో ఉన్నారో మాకు తెలుసు. జూడాలు చెప్పిన 13 డిమాండ్లలో 11 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. కేవలం స్టైపెండ్ విషయంలో వాళ్లు పట్టుబడుతున్నారు. చదువుకున్న వైద్య విద్యార్థులు ఇలా ఉంటారా? అని నేను అనుకోలేదు. నేను కొత్తగా వచ్చాను, ఏప్రిల్ మొదటి వారం వరకైనా సమయం ఇవ్వాలని అడిగాను. ఆర్థిక మంత్రి ఆనం కూడా జూడాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో వివరంగా చెప్పారు. అయినా వాళ్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మంచిది కాదు. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని, ప్రభుత్వం మీకు మద్ధతుగా ఉంటుందని నచ్చజెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు టీసీఎస్ వంటి కంపెనీల్లో రూ.15 వేలు ఇస్తున్నారు. మేం అంతకంటే ఎక్కువగానే ఇస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుంది. 00 మంది పీజీ విద్యార్థులు సమ్మెలో ఉంటే, 0 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాం. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు.’ అని మంత్రి కొండ్రు మురళి పేర్కొన్నారు.
ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: జూడాలు
మంత్రుల ఆరోపణలను జూడా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తాము స్టైపెండ్ గురించి పెద్దగా డిమాండ్ చేయలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మాతో చేయించుకునే పనికి స్పష్టమైన నిబంధనలు చెప్పాలని కోరామని అన్నారు. అత్యవసర సేవా విభాగాలను ఆధునీకరించాలని అడిగితే హామీ ఇవ్వలేదన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా ఈడిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రజలు చచ్చిపోతున్నారని మాపై నిందలు వేస్తున్నారు. అవసరమైన ఇంజెక్షన్ అందుబాటులో లేక మా కళ్ల ముందే రోగులు చనిపోతుంటే మేం ఎన్నోసార్లు ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రజలు చనిపోకూడదనే అత్యవసర వైద్య సేవలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆస్పువూతులకు ఎస్‌పీఎఫ్ ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పినా ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. లైబ్రరీని ఆధునికరించడం ద్వారా పేద ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే అవకాశముందని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు. అలాగే ప్రధానంగా ఎంసీఐ నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ సిస్టమ్‌ను అమలు చేయాలని చేసిన డిమాండ్‌ను పట్టించుకోకుండా, స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నామని ప్రజలకు తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చర్చలు జరుగుతండగానే మమ్మల్ని బెదిరించారు. ఓ వ్యక్తి వచ్చి నేను మంత్రుల తరఫున చెబుతున్నాను, వెంటనే సమ్మెను విరమించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి తలలు పగులొచ్చని బెదిరించారు. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళదామంటే, వాళ్లు మాకు అవకాశం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఏదేమైనా తమ పోరును విరమించబోమని, ఆదివారం సాయంత్రం వివిధ ప్రజా సంఘాలతో చర్చించి భవిష్యతు కార్యచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వ లోపాలు, ఆస్పవూతుల్లో చోటుచేసుకుంటున్న లోపాలను ప్రజలకు తెలియజేస్తామని జూడాలు వెల్లడించారు.
By: T News
0 comments:
Post a Comment