ప్రాణం విలవిల -
-పేద రోగులతో సర్కారు ఆటలు
-ప్రభుత్వ ఆస్పవూతుల్లో స్తంభించిన అత్యవసరం
-రాష్ట్రంలో13 మంది రోగుల మృతి
-గాంధీలో 10 మంది.. నీలోఫర్‌లో ఒకరు, కర్నూలులో ఇద్దరు..
-జూడాలతో చర్చలు విఫలం
-స్టైపెండ్ పెంచేది లేదన్న సర్కారు
-డిమాండ్లు తీరేదాకా సమ్మె
-తేల్చిచెప్పిన జూడాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 ():ప్రభుత్వం మొండితనం, నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పవూతుల్లో రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. అత్యవసర సేవలు అందక శుక్రవారం రాత్రి నుంచి 24 గంటల వ్యవధిలో 13 మంది రోగులు మృత్యువాత పడ్డారు. అయితే ఈ మరణాలను ప్రభుత్వం సాధారణ చావులుగానే పరిగణించింది. ఆస్పవూతుల్లో వైద్య సేవలు అందక.. ప్రైవేట్ ఆస్పవూతులకు వెళ్లే స్థోమత లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా.. వాటి ఆనవాళ్లు ఆస్పవూతుల్లో మచ్చుకు కూడా కనిపించడంలేదు.
అన్ని ఆస్పవూతుల్లో అన్ని వైద్య సేవలు దాదాపు స్తంభించిపోయాయి. ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో సాధారణ రోగుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలనూ నిలిపివేసిన తొలిరోజే శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఆస్పవూతుల్లో 13 మంది రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక్క గాంధీ ఆస్పవూతిలోనే 10 మంది రోగులు వైద్యం అందక తనువు చాలించారు. నీలోఫర్‌లో అత్యవసరం వైద్యం అందక ఓ చిన్నారి కన్నుమూసింది. కర్నూలు జనరల్ ఆస్పవూతిల్లో మరో ఇద్దరు రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో రోగులు ప్రభత్వ ఆస్పవూతులకు వెళ్లాలం జంకుతున్నారు. మరోవైపు, జూడాలతో శనివారం కేబినెట్ సబ్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
రోగుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని పట్టువిడుపుదల ధోరణితో వ్యవహరించాల్సిన ప్రభుత్వం అదే మొండివైఖరిని ప్రదర్శించడంతో జూడాలు కూడా పట్టువీడలేదు. దీంతో సాయంత్రం మొదలైన చర్చలు అర్ధరావూతివరకు కొనసాగినా ఎటూ తేలకుండానే ముగిశాయి. జూడాల తీరువల్లే చర్చల వల్లే చర్చలు విఫలమయ్యాయని ప్రభుత్వం పేర్కొంటే.. ప్రభుత్వ తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడిందని జూడాలు ఆరోపించారు.
జూడాల 13 డిమాండ్లలో పదకొండింటిని అంగీకరించామని, అయినా వారు స్టైపెండ్ కోసం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రభుత్వం ఆరోపించింది. జూడాల వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని, అందుకే ఇదంతా జరుగుతోందని పేర్కొంది. చర్చల ప్రక్రియను ప్రభుత్వమే ఉద్దేశపూర్వంగా చిక్కుముడిగా మార్చిందని, ఎమ్జన్సీ సేవల బంద్ విరమించుకోకుంటే సోమవారంనుంచి తలల పగులుతాయని హెచ్చరించిందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టైపెండ్ కోసం తాము పట్టుబడుతున్నామని ఉద్దేశపూర్వకంగా దుష్ర్పచారం చేస్తోందని అన్నారు. తమ పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని, సమ్మె కొనసాగిస్తామని, ప్రజా సంఘాలతో ఆదివారం చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
By :T News
0 comments:
Post a Comment