గిలానీకి ఊరట
-ప్రజాస్వామ్యానికే పాకిస్థాన్ పార్లమెంట్ ఓటు
-విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధాని.. మూడింట రెండొంతుల మెజారిటీ
-19న సుప్రీంకోర్టుకు హాజరవుతా: గిలానీ ప్రకటన
-రాజీనామా చేయరన్న పీపీపీ నేత
-నష్టనివారణ చర్యల్లో అధికార పక్షం
-కోర్టు తీర్పును గౌరవిస్తామని ప్రకటన
-‘ధిక్కారం’ కేసులో 19న హాజరవ్వాలని గిలానీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశం
-ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
-జర్దారీని కలిసిన గిలానీ
-స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
మెమోగేట్ కుంభకోణం నేపథ్యంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సైన్యం ఓవైపు.. అవినీతి కేసులను తిరిగి తెరిచే విషయమై నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు మరోవైపు.. ప్రజలను గాలికొదిలేసి, నేరస్తులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తుతున్న ప్రతిపక్షాలు ఇంకోవైపు.. ముప్పేట దాడిలా చుట్టుముట్టిన సమస్యలతో, నిత్యం మనుగడ ప్రశ్నార్థకమైన పాకిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య అనుకూల తీర్మానాన్ని పార్లమెంట్ దిగువ సభ సోమవారం రాత్రి మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించింది. దీంతో యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వానికి ఊరట లభించింది. వారం రోజులుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు సుప్రీంకోర్టు గిలానీకి కోర్టు ధిక్కార నోటీసు జారీచేయడంతో ఆయన ఇక పదవి నుంచి దిగిపోవడం ఖాయమనిపించింది. కానీ పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షలో విజయం ఆయనలో కొత్త ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా గిలానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఇవాళ చాలా మంచి రోజని అభివర్ణించారు. పార్లమెంట్ రబ్బర్ స్టాంప్ కాదని, ప్రజాస్వామ్యమే అన్నింటికన్నా గొప్పదని అన్నారు. సర్వాధికారాలు గల పార్లమెంట్‌కే అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. మిలిటరీ, న్యాయవ్యవస్థలతో తమకు విభేదాలున్నా ప్రజాస్వామ్య పరిరక్షణలో అవి కూడా కీలకపాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతానని, కోర్టు ధిక్కారం కేసులో బేషరతు క్షమాపణ చెబుతానని అన్నారు.
ఇస్లామాబాద్, జనవరి 16:రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం చుక్కెదురైంది. ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీకి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కార నోటీసులు జారీచేసింది. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోపాటు మరో ఎనిమిది వేల మందిపై అవినీతి ఆరోపణల కేసులను తిరిగి తెరవాలని ఆదేశించినా ఎందుకు పట్టించుకోలేదో ఈ నెల 19వ తేదీన తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు విచారణను జస్టిస్8 నజీర్ ఉల్ ముల్క్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం చేపట్టింది. తమ ఆదేశాలను పాటించాలంటూ సుప్రీంకోర్టు గిలానీకి పలుమార్లు గుర్తుచేసినా ఆయన కావాలనే పెడచెవిన పెట్టారని, అందువల్ల తనపై కోర్టు ధిక్కార విచారణను ఎందుకు చేపట్టకూడదో ఆయన చెప్పాలని పేర్కొంది.
ఏజీపై ధర్మాసనం ఆగ్రహం
అవినీతి కేసులను తిరిగి తెరవాలంటూ తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ అందలేదని అటార్నీ జనరల్(ఏజీ) అన్వర్‌ఉల్‌హక్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనకు చీవాట్లు పెట్టింది. తమ ఆదేశాలకు ప్రభుత్వం ఏవిధంగా స్పందించిందో తమకు ఎందుకు తెలియజేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను దేశ అధ్యక్షుడికి, ప్రధానికి, ఇతర అధికారులకు తెలిపానని, వారి నుంచి తనకు ఎలాంటి స్పందనలూ రాలేదని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలిస్తోందని ఏజీ.. కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముల్క్.. ఏజీపై మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వానికి తెలపటం, వారి స్పందనలను కోర్టుకు చెప్పటం మీ బాధ్యత కాదా?, ఇందులో మీరు కొత్తగా చేస్తున్నదేమిటి? అని సూటిగా ప్రశ్నించారు.
ఏదేమైనా కేసులను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ ఆదేశాలు కావాలని తేల్చిచెప్పారు. అనంతరం విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. విచారణ తిరిగి ప్రారంభమైన తర్వాత ఏజీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేలా హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అయితే ఈ సమయంలో అలాంటిదేమీ చేయొద్దని ధర్మాసనం ఏజీకి సూచించింది. అనంతరం గిలానీకి నోటుసు జారీ చేసింది. ‘కోర్టు ఆదేశాలను గిలానీ అమలుచేయనందునే ఆయనకు ఈ నోటీసు జారీచేశాం’ అని ముల్క్ విలేకర్లకు చెప్పారు. మెమోగేట్ కుంభకోణం విషయమై ఇప్పటికే సైన్యంతో ముఖాముఖి తలపడుతూ అస్థిత్వ ప్రమాదం ఎదుర్కొంటున్న పాక్ సర్కారు పరిస్థితిని సుప్రీంకోర్టు తీర్పు మరింత దిగజార్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. కాగా పాక్ ప్రధానికి కోర్టు ధిక్కార నోటీసులు రావడం ఇది రెండోసారి. 1997 నవంబర్‌లో అప్పటి ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌కు కూడా ఈ తాఖీదులు అందాయి.
జర్దారీతో గిలానీ భేటీ
సుప్రీంకోర్టు నోటీసు, పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో ప్రధాని గిలానీ.. అధ్యక్షుడు జర్దారీ, అధికార పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అగ్రనేతలతో సోమవారం భేటీ అయ్యారు. కోర్టు నోటీసు జారీచేసిన కొద్దిసేపటికే ఆయన జర్దారీని కలిశారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనతో చర్చించారు. అనంతరం పీపీపీ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ కమిటీతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జర్దారీ కూడా హాజరయ్యారు. కోర్టు నోటీసుపైన, సాయంత్రం పార్లమెంట్‌లో జరిగే అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌పైన ఈ భేటీలో చర్చించారు. సైన్యంతో జగడం, కోర్టు నోటీసుల వల్ల రాజకీయంగా వాటిల్లే నష్టాన్ని నివారించేందుకు గిలానీ చేత రాజీనామా చేయించాలని పీపీపీ అగ్రనేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు పీటీఐ వార్తా సంస్థకు తెలిపాయి.
రాజీనామా చేస్తానన్న గిలానీ!
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పదవికి రాజీనామా చేస్తానని ప్రధాని గిలానీ అన్నట్లు వార్తలొచ్చాయి. తన రాజీనామా ప్రభుత్వాన్ని, పార్లమెంట్‌ను సుస్థిర పరుస్తుందంటే పదని నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పినట్లు ఆర్మీ న్యూస్8 చానెల్ తెలిపింది. గిలానీ దిగిపోతే కొత్త ప్రధానిగా పీపీపీ నేత ఖమర్ జమాన్ ఖైరా, ఆధ్యాత్మిక వ్యవహారాల మంత్రి ఖుర్షీద్‌షా, కీలక భాగస్వామ్య పక్షం(పీఎంఎల్-క్యూ) నేత పర్వేజ్‌ఇలాహీల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఈ మీడియో పేర్కొంది. కానీ ఆ వార్తలను అవామీ నేషనల్ పార్టీ చీఫ్ ఖండించారు.
ప్రధానితోపాటు కోర్టుకు వెళ్లనున్న పీపీపీ నేతలు
పీపీపీ నేతలు, భాగస్వామ్యపక్షాల నాయకులు ఈ నెల 19న ప్రధాని గిలానీతో కలిసి సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని న్యాయశాఖ మంత్రి మౌలాబుక్స్ చందోలియా తెలిపారు. గిలానీ ప్రభుత్వం తన పూర్తికాలం అధికారంలో ఉంటుందని చెప్పారు. తమపై జరుగుతున్న ఈ కుట్రలల్నీ భగ్నమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
కోర్టు నోటీసును స్వాగతించిన ఇమ్రాన్‌ఖాన్
ప్రధాని గిలానీకి సుప్రీంకోర్టు నోటీసు జారీచేయటాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. యావద్దేశం కూడా న్యాయస్థానం ఆదేశాల పట్ల హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పారు. ‘సామాన్యుల సాధకబాధకాలను తీర్చాల్సిన పాలకులు నేరస్తులను కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఈ మేరకు న్యాయవ్యవస్థను కూడా భష్ఠుపట్టించాలని చూస్తున్నారు. జర్దారీని రక్షించేందుకు వారు ఎంత మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను మోహరించినా ప్రజలంతా దేశ అత్యున్నత న్యాయస్థానంపై నమ్మకంతో ఉన్నారు’ అని ఇమ్రాన్‌ఖాన్ పేర్కొన్నారు.
సమాచారం ఇచ్చేందుకు బ్లాక్‌బెర్రీ నో
మెమోగేట్ కుంభకోణానికి సంబంధించి పాక్-అమెరికా వ్యాపారి ఇజాజ్, అమెరికాలో అప్పటి పాకిస్తాన్ రాయబారి హుస్సేన్ హక్కానీలు తమ నెట్‌వర్క్ ద్వారా ఇచ్చిపుచ్చుకున్న సమాచారాన్ని వెల్లడించేందుకు బ్లాక్‌బెర్రీ ఫోన్‌ల తయారీ సంస్థ రీసెర్చ్ ఇన్ మోషన్(రిమ్) నిరాకరించింది. వినియోగదారుల అనుమతి లేకుండా ఈ వివరాలను తాము బయటపెట్టలేమని తేల్చిచెప్పింది. ఈ కేసును విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్‌కు ఈ విషయాన్ని ఏజీ తెలిపారు. హక్కానీ ఉపయోగించిన రెండు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు అమెరికాలోని అతని కార్యాలయంలోగానీ నివాసంలోగానీ దొరకలేదని కూడా చెప్పారు.
ఏమిటీ మెమోగేట్?
ఒసామా బిన్ లాడెన్ హతమైన అనంతరం పాక్‌లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం కుట్ర పన్నుతోందని అధ్యక్షుడు జర్దారీ భయపడ్డారు. ఈ కుట్రను నిలువరించేందుకు అమెరికా సాయం కోరారు. ఈ మేరకు సంతకంలేని ఓ మెమో పంపారు. జర్దారీ తరఫున హక్కానీ రాసిన ఆ లేఖను ఆయన ఆదేశాల మేరకే తాను అమెరికాకు అందజేశానని పాకిస్తానీ-అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్‌ఇజాజ్ బహిరంగంగా చెప్పారు. ఇది వివాదాస్పదమవడంతో హక్కానీ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
‘మెమో’ దర్యాప్తునకు ఇజాజ్ డుమ్మా
మెమోగేట్ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇజాజ్ ఈ కేసుపై సోమవారం జరిగిన జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తునకు డుమ్మా కొట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిషన్ ముందుకు భద్రతా కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ దాక తనకు గడువు ఇవ్వాలని కోరారు. కమిషన్ మూడోసారి సోమవారం భేటీ అయిన కొద్దిసేపటికే ఇజాజ్ తరఫు న్యాయవాది అక్రమ్‌షేఖ్ ఈ విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. కుంభకోణంలో.. ఇజాజ్, హక్కానీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న సమాచారాలను వెల్లడించేందుకు రిమ్ నిరాకరించిన నేపథ్యంలో ఇజాజ్ గైర్హాజరీ ప్రధాన్యం సంతరించుకుంది.
ఇజాజ్, హక్కానీ, పాషాలకు సమన్లు
జ్యుడీషియల్ కమిటీ దర్యాప్తునకు గైర్హాజరైన ఇజాజ్‌కు పాకిస్థాన్ పార్లమెంటరీ కమిటీ సోమవారం సమన్లు జారీచేసింది. ఈ నెల 26న జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. మీరు కూడా 23వ తేదీన హాజరై వాంగ్మూలాలు ఇవ్వాలని హక్కానీ, ఐఎస్8ఐ చీఫ్ అహ్మద్‌షుజాపాషాలకు కూడా పార్లమెంటరీ కమిటీ సమన్లు ఇచ్చింది.
‘ముషారఫ్ తల’కు నూటొక్క మిలియన్లు
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌ను హతమార్చిన వారికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని బలోచిస్తాన్ జాతీయ నేత అక్బర్‌బుగ్తి మనవడు షాజైన్‌బుగ్తి ప్రకటించారు. నగదు బహుమతితోపాటు వంద మిలియన్ల విలువైన బంగ్లాను కూడా ఇస్తామని విలేకర్లకు ఆదివారం చెప్పారు. 2006లో ముషారఫ్ ఆదేశాలతో బలోచిస్తాన్‌లోని కుహ్లు జిల్లాలో జరిగిన మిలిటరీ ఆపరేషన్‌లో అక్బర్‌బుగ్తి మృతిచెందారు?
ఏ సంస్థనూ లక్ష్యంగా చేసుకోలేదు
-‘ఎన్నార్వో’ తప్పు చేసింది ఎవరు: గిలానీ
ఇస్లామాబాద్, జనవరి 16: పార్లమెంట్‌లో విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రధాని గిలానీ మాట్లాడుతూ సైన్యంగానీ న్యాయస్థానాలుగానీ వ్యవస్థను గాడితప్పించేలా వ్యవహరించకూడదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. మెమోగేట్ కుంభకోణం, అవినీతి కేసుల విషయంలో సైన్యం, సుప్రీంకోర్టు ప్రభుత్వంతో వ్యవహరించిన తీరును గిలానీ ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు గౌరవం ఉంది. కోర్టులపై మాకు పూర్తివిశ్వాసం ఉంది. అందుకే ఈ నెల 19న సుప్రీంకోర్టుకు హాజరవుతాను. పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానంపై ఓటు విషయంలో మేము ఏ వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకోలేదు. జర్దారీకి రాజ్యాంగం రక్షణకవచంలా ఉంది. సర్కారును నిందించేవారు.. అవినీతి కేసుల నుంచి నిందితులను కాపాడేలా జాతీయ సయోధ్య ఉత్తర్వులు (ఎన్‌ఆర్‌ఓ) రూపొందించినవారిపై ఎలాంటి చర్యలూ కోరకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని గిలానీ.. ముషారఫ్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఎన్‌ఆర్‌ఓను ఎవరు తెచ్చారు. ఆ తప్పు మేం చేయలేదు. ఆ పొరపాటు చేసినవారు ఇప్పుడు దేశం బయటున్నారు. మళ్లీ ఇప్పుడు దేశంలోకి రావాలనుకుంటున్నారు’’ అని పాక్‌లోకి మళ్లీ రావాలనుకుంటున్న ముషారఫ్ ప్రయత్నాలను గిలానీ ఎండగట్టారు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందని ప్రపంచానికి చాటేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

Take By: T News
0 comments:
Post a Comment