తెలంగాణ కాంగ్రెస్ పెద్దల దొంగాట
-నాలుకలు మడతేస్తున్న నేతలు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు
-ముఖాలూ మార్చేస్తారు!
-అధికారమే పరమావధిగా మంత్రులు
-అభివృద్ధి నిధులతో ఎమ్మెల్యేలు
-ప్రలోభాలతో అందరూ కామోష్!
-తెలంగాణ ఉద్యమం బలిపెట్టి ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను
-సీఎం రేసులో ఆరుగురు
ఈ నేతలకు రెండు నాల్కలే కాదు.. రెండు ముఖాలు కూడా! తెలంగాణ ఉద్యమం విషయంలో నాల్కలు మడతేయడమే కాదు.. ముఖాలూ మార్చేయగల నైపుణ్యం వీరి సొంతం! ఒక నాలుక తెలంగాణ ఉద్యమం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంది! మరో నాలిక పార్టీ అధిష్ఠానం వద్ద వక్రభాష్యాలు చెబుతుంది! ఒక ముఖం ఉద్యమ శ్రేణుల ఎదుట వీర గంభీరంగా కనిపిస్తుంది.. మరొకటి నాలుగు గోడల మధ్య.. పార్టీ పెద్దల ముందు ముడుచుకుని కూర్చొంటుంది! అధికారం వీరి పరమావధి! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఇందుకు వారధి! పదవులు ఓ లెక్క కాదంటారు.. కానీ వారి లెక్కలన్నీ పదవుల చుట్టూనే తిరుగుతుంటాయి! సచివాలయం దరిదాపులకు వెళ్లేది లేదని భీకర వచనాలు చెబుతారు.. కానీ.. ఇంటికే ఫైళ్లు తెప్పించుకుని సీఎం మెప్పు పొందేలా సంతకాలు బరికేస్తారు! ఉద్యమంలో దూకుతామంటారు.. ఇచ్చేది.. తెచ్చేదీ తమ పార్టీయేనంటారు.
నిర్ణయాత్మక దశలో మాత్రం పత్తా లేకుండాపోతారు! ఉద్యమ శ్రేణులు సెగ పెట్టినా తట్టుకుంటారు.. కానీ.. అధిష్ఠానానికి ఆ సెగ తీవ్రతను చెప్పడానికి ఇష్టపడరు. ఐదు రాష్ట్రాల ఎన్నికలని ఒకసారి, అమ్మకు ఒంట్లో బాలేదని ఒకసారి, పండుగలు పబ్బాలని మరోసారి, ఆజాద్ చర్చిస్తున్నారని ఇంకోసారి, ఇదిగో కోర్ కమిటీ సమావేశం అదిగో సీడబ్ల్యూసీ భేటీ.. అంటూ ఎప్పటికప్పుడు తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ.. ఇప్పుడు మరోసారి ఎన్నికల బూచిని ముందుకు తెస్తూ అధిష్ఠానం దోబూచులాడుతుంటే.. నిలువరించే సత్తా లేక.. అధిష్ఠానా నికే జీ హుజూర్..
అంటూ సాష్ఠాంగపడిపోయిన నేతలు! ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ వాళ్లను మోసం చేయడం.. తెలంగాణ ప్రాంత నేతలుగా తమకు తెలిసినంత మరెవరికీ తెలియదని ఢంకా బజాయించి మరీ చెప్పగలిగే నేతాక్షిగేసరులు! వీరిలో కొందరిది మరీ అత్యాశ! ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపైనే వీరి కన్ను! సీఎం కుర్చీ అప్పగిస్తే ఉద్యమం అణచివేతలో తడాఖా చూపిస్తామని అధిష్ఠానం వద్ద తొడలు కొడతారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌ను మార్చేస్తారన్న ఊహాగానాలతో.. ఉద్యమం ముసుగులో సీఎం కుర్చీపై కర్చీఫ్ వేసుకుని.. కలలు కంటున్నారు! పదేళ్లుగా ఈ నేతల తీరిదే. ప్రత్యేకించి గత రెండేళ్లుగా మహోధృతంగా సాగుతున్న మలి విడత తెలంగాణ పోరాటంలో వీరిది ప్రతినాయక పాత్రే! ఇదీ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకుల ద్రోహ చరిత్ర! అనేకానేక మంది నేతలు.. ఎన్నదగినవారు కొందరు! జానాడ్డి, జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, జే గీతాడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య! వీరు మచ్చుకే! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తమ రాజకీయ స్వలాభం కోసం తాకట్టు పెట్టిన పెద్దలు! సీమాంధ్ర పాలకులతో కుమ్మక్కయి.. ఉద్యమాన్ని నాశనం చేసేందుకు వ్యూహ రచనలు చేస్తున్న ద్రోహచింతన గల నేతలు! ఉద్యమం గుండెలపై తన్ని.. రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్న టీ కాంగ్రెస్8 నేతలు ఎందరో! ఇది సకల తెలంగాణం చేస్తున్న విమర్శ!
ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యాక తెలంగాణ ఏర్పాటు విషయంలో నిర్ణయం ఉంటుందన్నారు కాంగ్రెస్8 అధిష్ఠాన పెద్దలు. ఎన్నికలయిపోయి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలేర్పడ్డాయి. ఆ తర్వాత సోనియాకు ఆరోగ్యం బాగోలేదు.. ఆమె విదేశాల నుంచి వచ్చాక నిర్ణయం అన్నారు. ఆమె తిరిగి వచ్చేశారు. దీపావళి, బక్రీద్ పండుగల సాకు చెప్పారు. ఆ తర్వాత ఆ మాట ఎవరన్నారని ప్రశ్నించారు. ఆజాద్ మాట్లాడుతున్నారని మరోసారి చెప్పారు. అజాద్ మాట్లాడేశారు. నివేదికలు ఇచ్చేశారు. జాతీయ స్థాయి నేతల అభివూపాయాలన్నారు. ఆ ప్రక్రియ కూడా ముగిసింది. కోర్‌కమిటీ భేటీలన్నారు. మినీ కోర్‌కమిటీ అని చెప్పారు. ఇదుగో సీడబ్ల్యూసీ అన్నారు. తెలంగాణ అంశం గుండ్రంగా ఉంటుందని నిరూపించాలని భావించినట్లున్నారు.. ఇప్పుడు మళ్లీ మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలను బూచిగా చూపిస్తున్నారు! ఈ మాటల మాయాజాలం సాగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగింది.
పల్లెలు పట్టాలపైకెక్కి ఢిల్లీకి ఉద్యమ తీవ్రతను కూతవేసి చాటాయి. వంటావార్పుతో పొయ్యిల మంటతో జనం సెగ తగిలించారు. అన్నింటికీ మించి 42 రోజుల పాటు జరిగిన సకల జనుల సమ్మెతో తెలంగాణ ఆకాంక్ష బలాన్ని చాటిచెప్పారు. రోజువారీ ఆందోళనలు, నిరసనలు సరేసరి! ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బలమైన విమర్శలు వస్తున్నాయి.
( హైదరాబాద్)ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులుగా, 4కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్8 నాయకులు.. ఆ పని చేయకపోగా.. ఉద్యమ ద్రోహానికి పాల్పడ్డారని ప్రత్యేకవాదులు ఆరోపిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని నేతలు ఆచరణలో రుజువు చేసుకుంటున్నారని పరిశీలకులంటున్నారు. కేసీఆర్ దీక్షనేపథ్యంలో డిసెం బర్ 9న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన, దానిని సీమాంధ్ర నేతలు అడ్డుకోవడం,జేఏసీ ఆవిర్భావం, ఉద్యమాలు, ఆయా సమయాల్లో జరిగినపరిణామాల్లో టీ కాంగ్రెస్8 నేతల తీరుతెన్నులు వారిని ద్రోహులుగా నిలబెడుతున్నాయని విమర్శలు వెల్లు తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది మేమే అంటూ నినదించిన టీ కాంగ్రెస్8 నేతలు.. నేడు తెలంగాణవాదంపై మౌనం వహిస్తూ.. ఈ ప్రాంత ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైగా ‘‘ఉన్నత పదవుల్లో మమ్మల్ని కూర్చోబెట్టండి. తెలంగాణవూపజలను మేమే పకడ్బందీగా భ్రమల్లో పెడుతాం. ఆ కళ మాకే తెలుసు. 4దశాబ్దాలుగా ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నాం. మా ప్రాంత ప్రజలను ఎలా మోసం చేయాలో మాకే ఎక్కువ తెలుసు’’ అంటూ అధిష్ఠానం వద్ద మహజరులు సమర్పించుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటిదాకా తెలంగాణ అంటూ మాట్లాడిన జానాడ్డి లాంటి సీనియర్‌లు నేడు ప్రేక్షకపాత్ర వహించడమే నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీఎం కుర్చీ నుంచి కిరణ్‌కుమార్‌డ్డిని అధిష్ఠానం తప్పిస్తుందన్న అంచనాలో కొందరు టీ కాంగ్రెస్8 నేతలున్నారు.ఉద్యమం పేరుతో ఈ నేతలు సీఎం కుర్చీపై కన్నేసినట్లు తెలుస్తోంది.
సమైక్యరాష్ట్రానికి తమను సీఎంగా చేస్తే తెలంగాణవాదాన్ని ఎదుర్కొంటామని అధిష్ఠానం వద్ద నమ్మబలుకుతున్న వారిలో జానాతో పాటు జైపాల్‌డ్డి, డీ శ్రీనివాస్8, గీతాడ్డి, రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య ఉన్నట్లు వినిపిస్తోంది. దీనికోసం హైకమాండ్‌ను మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. సీఎం కుర్చీ కోసం తెలంగాణ కోటాలో కర్చీఫ్ వేసినట్లు చెబుతున్నారు. కిరణ్‌ను మార్చాల్సివస్తే ఈసారి తెలంగాణ ప్రాంతానికి సీఎం పదవి ఖాయమని, అందుకే ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చినప్పుడు టీ మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేయకుండా కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామాతోనే సరిపెట్టారు. దీనిపై విమర్శలు ఎదురైనా దులిపేసుకున్నారు. తెలంగాణలోని ఏడున్నర లక్షల మంది ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి 42 రోజుల పాటు సకలజనుల సమ్మెకు దిగడం, తెలంగాణ కోసం త్యాగాలు చేయడం, అడ్వాన్స్‌లు తప్ప ఇప్పటి వరకు వారి జీతాలపై నిర్ణయం జరగకపోవడం, విద్యార్థులు చదువులు కోల్పోవడం, రవాణా వ్యవస్థ స్తంభించి పోయి తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే టీ మంత్రులు మాత్రం దర్జాగా హోదాలు, ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తూ గడిపారే తప్ప, తెలంగాణ కోసం ఉద్యమకారులతో కలిసిరాలేదనివారు విమర్శిస్తున్నారు.
సచివాలయ నాటకం..
మంత్రి పదవులకు రాజీనామాలు చేయలేదనే కానీ.. మేం అసలు సచివాలయానికి వెళ్లడం లేదని గప్పాలు కొట్టిన మంత్రుల నాటకం సీఎం వ్యాఖ్యలతోనే బయటపడింది. సచివాలయానికి వెళ్లని మంత్రులు.. ఫైళ్లను ఇంటికి తెప్పించుకుని చకచకా సంతకాలు లాగించేశారు. మంత్రులు సచివాలయానికి రాని కాలంలోనే ఎక్కువ ఫైళ్ళు పరిష్కారమయ్యాయని అప్పట్లో సీఎం చెప్పడం తెలంగాణపై టీ మంత్రుల చిత్తశుద్ధి ఏపాటితో చాటిచెప్పింది. ‘‘పదవులు, హోదాలు పోతే ఎవరూ పట్టించుకోరు. తొందరపడి రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ ఉండదు. తెలంగాణపై పోరాడుతున్నట్లు నటిస్తూనే మీ పనులు మీరు చూసుకోండి’’ అంటూ టీ మంత్రుల జోరుకు సీఎం బ్రేకు వేశారన్న ప్రచారం ఉంది. దీంతో బుగ్గకారు, హోదా, పీఎస్8, పీఎలు పోతారని, సర్కార్ పరంగా లభిస్తున్న సౌకర్యాలన్నీ వదులుకోవాల్సి వస్తుందని భావించే టీ అమాత్యులు తెలంగాణవాదాన్ని పక్కనపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం
టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలపైనా ఇదే మంత్రం పని చేసిందని విమర్శలున్నాయి. ‘‘నియోజకవర్గాలకు అభివృద్ధి నిధులు, పనులు కేటాయిస్తాను. పదవుల్లో ఉండి హాయిగా పనులు చేసుకోండి. భవిష్యత్తులో మీకు కావాల్సినవి అన్నీ చూసుకుంటా’’ అనే రీతిలో సీఎం వారికి భరోసా కల్పించడమే కాకుండా ప్రలోభాలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది. టీ కాంగ్రెస్ ఎంపీలది మరో కథ. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలంటూ కేకే నేతృత్వంలో టీ కాంగ్రెస్8 ఎంపీలు దీక్షలు చేపట్టారు. రాజీనామా చేశామంటూ పార్లమెంట్ సమావేశాలకు మొదట్లో దూరం పాటించినా, తరువాత సమావేశాలకు హాజరై తెలంగాణ నినాదాలతో ప్లకార్డులు పట్టి కొంత హంగామా చేశారు. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులతో పోల్చితే.. వారు అధిష్ఠానంతో కొంత ఘర్షణవైఖరిని, పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ.. చివరాఖరుకు వారూ మెత్తబడ్డారు.
నిరసన సెగలతో స్వరం పెంచిన నేతలు
తెలంగాణవాదం రోజురోజుకూ బలపడుతూ రాజకీయ నేతలు తెలంగాణలో తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టీ కాంగ్రెస్ నేతలుస్వరాన్ని పెంచక తప్పలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల శవాల వద్దకు వెళ్ళి తెలంగాణ తెచ్చే వరకు తాము వెనకడుగు వేసేది లేదని ప్రతిజ్ఞలు చేశారు. ప్రజల నుంచి నిరసనలు పెరగడంతో తప్పనిసరై అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు రాజీనామాలు చేయాలని, తెలంగాణ సాధన కోసం కలిసి ఉద్యమించాలని టీ కాంగ్రెస్8 ప్రజావూపతినిధులు, మంత్రులు నిర్ణయించుకున్నారు. టీ కాంగ్రెస్8 స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దికాలానికే దాని పస తేలిపోయింది. కమిటీ చైర్మనే దాని నిర్ణయాలను పాటించని దుస్థితి. ఎట్టకేలకు రాజీనామాలు చేసినా.. పై నాయకత్వం చక్రం తిప్పడంతో రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయన్న వాదన ఉంది. టీడీపీ టీ ఫోరం, టీఆర్‌ఎస్8, సీపీఐ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్8కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండ్‌తో రెండవ సారి రాజీనామా చేశారు. వీరితో పాటు రాజీనామాలు చేయడానికి టీ కాంగ్రెస్8మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు ససేమిరాఅన్నారు.
మరో వైపు నాగం జనార్దన్‌డ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, టీ రాజయ్య తదితరులు పట్టుబట్టి రాజీనామాలు ఆమోదించుకున్నారు. వారి తరహాలోనే మిగతా టీ కాంగ్రెస్8 ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాల కోసం పట్టుబడితే తప్పకుండా ఆమోదం పొందడమో లేక కేంద్రం దిగిరావడమో జరిగేది. కానీ తెలంగాణ జన ఆకాంక్షలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, సీమాంధ్ర పాలకుల ప్రలోభాలకు లొంగి, తెలంగాణకు ద్రోహం చేశారని, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారని నాయకులపై ఉద్యమ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఉద్యమాన్ని బలహీనపర్చే కుట్ర!
పదవులు, హోదాలు, పనులు, పైరవీల కోసం టీ కాంగ్రెస్8 నేతల మధ్య నెలకొంటున్న అంతర్గత కుమ్మలాటలు తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలహీనం చేయడానికి దోహదపడుతున్నాయనే ఆందోళన తెలంగాణవాదుల్లో కనిపిస్తోంది. మరోవైపు టీ కాంగ్రెస్8 నేతల అనైక్యతను ఆసరా చేసుకుని కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా తన ఆట కొనసాగిస్తున్నారంటున్నారు. సెలక్షన్ కమిటీ హస్తినలో ఉందని నమ్మబలికిస్తూ గులాం నబీ ఆజాద్, సోనియాల వద్ద మార్కులు కొట్టేసేలా సీఎం తన స్కోరును పెంచుకుంటున్నారని అంటున్నారు. బలహీనమైన బౌలింగ్‌గా ఉన్న తెలంగాణ అగ్రనేతల కుమ్మలాటలతో, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో క్రికెటర్‌గా సీఎం దీటైన షాట్లతో అధిష్ఠానం వద్ద, రాష్ట్రంలో తన స్కోరు మరింత పెంచుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు.
2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం కేంద్రం తరఫున ప్రకటించారు. ఆ ప్రకటన అలా వచ్చిందో లేదో... సీమాంధ్ర కాంగ్రెస్8 నేతలు మిగతా పార్టీల నేతలను ఉసిగొల్పి పదవులకు రాజీనామాలు చేయడం ద్వారా వచ్చే తెలంగాణను అడ్డుకున్నారు. తదనంతరం తెలంగాణ కోసం రాష్ట్రంలో ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. తెలంగాణ కోరుతూ ఉద్యమకారులు ఆందోళనలు చేపట్టారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థులు సైతం తెలంగాణ కోసం కదం తొక్కారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కొక్కరుగా 700 మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు. కానీ.. టీ కాంగ్రెస్8 నేతల ద్రోహచింతనలో ఏమాత్రం మార్పు రాలేదని ఉద్యమకారులు వాపోతున్నారు.
Take By : T News
0 comments:
Post a Comment