స్పెషల్ బాంబ్!
- ఇంధన సర్దుబాటు చార్జీల మోత
- డిస్కమ్ ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదం
- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసిన కమిషన్
- హైకోర్టు తీర్పుకు లోబడి 2008-09 ఎఫ్‌ఎస్‌ఏ అమలు
- 2009-10 ఎఫ్‌ఎస్‌ఏ ఫిబ్రవరి నుంచి వసూలు- విద్యుత్ వినియోగదారులపై రూ. 3038 కోట్ల పరోక్ష వడ్డన
- యూనిట్‌కు 35 నుంచి 40 పైసల భారం
హైదరాబాద్, జనవరి 17 (: గత రెండు సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలుకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. వచ్చే ఫిబ్రవరి నెలనుంచి ఎఫ్‌ఎస్‌ఏ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్దేశించింది. మంగళవారం రాత్రి పదిగంటల వరకు కసరత్తు జరిపి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఈఆర్సీ ఈ ఆదేశాలు జారీచేసింది. గత రెండేళ్లకు సంబంధించి సరాసరిగా ప్రతి యూనిట్‌పై 35 నుంచి 40 పైసల చొప్పున ఇంధన సర్దుబాటు భారం పడనుంది. 2008-09, 2009-10 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి న ప్రతిపాదనల్లో ఈఆర్సీ రూ.3038 కోట్ల మేరకు ఆమోదం తెలిపింది.
2008-09 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు రూ.3,141.97 కోట్ల ఎఫ్‌ఎస్‌ఏను ప్రతిపాదించగా ఈఆర్సీ రూ. 1,638.82 కోట్లకు ఆమోదం తెలిపింది. 2009-10 ఆర్థిక సంవత్సరానికి డిస్కమ్‌లు 1,480కోట్లు ప్రతిపాదించగా ఈఆర్సీ మాత్రం రూ.1,400కోట్లకు సర్దుబాటు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో వ్యవసాయ వినియోగదారులు మినహా మిగతా వినియోగదారులపై సగటున 2008-09 ఆర్థిక సంవత్సరానికి ఒక్కొక్క యూనిట్‌పై 33.88పైసల చొప్పున, 2009-10 ఆర్థిక సంవత్సరంలో 44.05 పైసల చొప్పున అదనపు భారం పడనుంది. రెండు సంవత్సరాలకు సంబంధించి గృహ వినియోగదారులపై ఇంధన సర్దుబాటు సర్‌చార్జీ (ఎఫ్‌ఎస్‌ఏ) అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది.
గత సెప్టెంబర్‌లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ముఖ్యమంవూతికి నివేదిక అందజేసింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల ఇంధన సర్దుబాటు ఛార్జీల మొత్తం దాదాపు రూ.577కోట్లను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరడ్డి ప్రకటించడంతో మిగతా వినియోగదారులు (నాన్ డొమెస్టిక్) హైకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసును గత సెప్టెంబర్‌లో హైకోర్టు బెంచ్ విచారించి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు, ప్రభుత్వానికి చురకలు పెట్టింది. దాంతో 2008-09 ఇంధన సర్దుబాటు చార్జీల అమలు అంశం హైకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉంటుందని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఏను వినియోదారుల నుంచి వసూలు చేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి మనోహరరాజు ‘T’కు వెల్లడించారు.
Take By : T News
0 comments:
Post a Comment