రాజ్యసభలోనూ తెలం‘గానం’
న్యూఢిల్లీ, డిసెంబర్ 15 ): తెలంగాణ అంశంపై పార్లమెంటు మరోసారి దద్దరిల్లనుంది. గత సమావేశాల్లో లోక్‌సభలో వాడివేడి చర్చ జరగ్గా ఈసారి పెద్దలసభను తెలంగాణ కుదిపేయనుంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ తెలంగాణపై ఇచ్చిన ప్రైవేట్ మెంబర్ బిల్లు నోటీస్8పై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరగనుంది. తెలంగాణపై రాజ్యసభలో చర్చ జరగటం ఇదే తొలిసారి. దీంతో ఈ అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.ఆ మేరకు ఢిల్లీలో ఉన్న టీఆర్‌ఎస్8 నేత వినోద్‌కుమార్ పలు పార్టీల నేతలని కలిసి, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. తెలంగాణాకు మద్దతు పలికిన బీజేపీ, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, జేడీ(యూ) నేతలతోపాటు కాంగ్రెస్8 సీనియర్ నేత కే కేశవరావును ఆయన కలిశారు. రాజ్యసభలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో సభ్యులు ప్రకాశ్ జవదేకర్(బీజేపీ), డి. రాజా (సీపీఐ), తారిఖ్ అన్వర్ (ఎన్సీపీ), సతీష్ మిశ్రా(బీఎస్పీ) తదితరులకు వినోద్ పూర్తి సమాచారంతో కూడిన నివేదికను బుధవారం అందచేశారు.
బాల్కసుమన్ విడుదల
అక్రమ నిర్భంధాలు, అరెస్టులతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని టీఆర్‌ఎస్8వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. గురువారం రాత్రి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. తన విడుదలకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, అండగా నిలిచిన విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్8 పొలిట్‌బ్యూరో సభ్యుడు, టీఆర్‌ఎస్8వీ రంగాడ్డి జిల్లా వీరమల్ల రాంనర్సింహాగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్, కూకట్‌పల్లి అధ్యక్షుడు పూర్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌డ్డి, ఓయు అధ్యక్షుడు గెల్వ శ్రీనివాస్8యాదవ్ పాల్గొన్నారు.

Take By: T News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Rahasabha Sabha, News
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, Rahasabha Sabha, News
0 comments:
Post a Comment