Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...

Tuesday, December 13, 2011

నిప్పుల కుంపటిపై వైద్యం



- ఇరుకు గదుల్లో ప్రైవేట్ దవాఖానలు
- నిబంధనలకు పాతరేస్తున్న యాజమాన్యాలు
- అగ్నిమాపక వ్యవస్థల్లేని 400 ఆస్పవూతులు
- ప్రమాణాలకు దూరంగా 74 కార్పొరేట్ ఆస్పవూతులు
- ఫీజులు అధికం... ప్రమాణాలు శూన్యం
- రోగులకు భద్రత కల్పించడంలో విఫలం
- నగరంలో ఫైర్‌సేఫ్టీలేని ఆస్పవూతులు
- సర్కారీ ఆస్పవూతుల్లోనూ ఇదే వైనం


steath-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్ నగరంలోని ఆస్పవూతుల్లో చికిత్స కోసం వెళుతున్నారా? జాగ్రత్త. మీరు అడుగులు వేస్తున్నది దవాఖానవైపు మాత్రమే కాదు.. మృత్యువు పొంచి ఉన్న వైద్య కుహరంలోకి కూడా! నిజం. ఇది నమ్మలేని నిజం! నగరంలో 80 శాతం ఆస్పవూతుల్లో నిర్దిష్ట అగ్నిమాపక వ్యవస్థలు లేవు. చిన్నా చితకా.. ఓ మోస్తరు.. కార్పొరేట్.. మొత్తం ఆరువేల పైచిలుకు ఆస్పవూతులు, రోగ నిర్ధారణ కేంద్రాలతో మెడికల్ హబ్‌గా విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరం.. భద్రత కోణంలో మాత్రం కునారిల్లుతున్నది! 50 పడకల ఆస్పవూతులు 556 ఉంటే.. అందులో అగ్నిమాపక దళం నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందినవి 149 మాత్రమే! సూటిగా చెప్పాలంటే 400కుపైగా ఆస్పవూతులు అగ్ని ప్రమాదాల అంచులో చికిత్స అందిస్తున్నాయి. 91 కార్పొరేట్ ఆస్పవూతుల్లో కేవలం 17 ఆస్పవూతులకు మాత్రమే అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు ఉన్నాయి! ఈ ఆస్పవూతుల్లో ఏ క్షణమైనా అగ్నివూపమాదాలు చెలరేగేందుకు ఆస్కారం ఉంది. అదే సమయంలో తప్పించుకుపోయేందుకూ వీటిల్లో తగిన సదుపాయాల్లేవు! ఇది అధికారులు చెబుతున్నమాట! అవును.. కోల్‌కతాలో ఆస్పత్రి నిర్లక్ష్యం భారీ మూల్యం చెల్లించుకుంది.. అదే దిశగా.. హైదరాబాద్ అడుగులేస్తోంది!

హైదరాబాద్, డిసెంబర్ 12 ():కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ కార్పొరేట్ ఆస్పవూతిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 90 మందికిపైగా రోగులు మృత్యువాతపడటంతో మెడికల్ హబ్‌గా ఉన్న హైదరాబాద్ ఉలిక్కిపడింది. ఇక్కడ ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి తరహా ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్నవి 400కుపైగా ఉండటమే ఈ ఉలికిపాటుకు కారణం! ఫైర్‌సేఫ్టీ విషయంలో ప్రధానంగా నాలుగు ప్రమాణాలు ఉంటాయి. అవి.. రోడ్డుకు అందుబాటులో ఉండటం.. ఖాళీ స్థలం, బయటి నుంచి ఏర్పాటు చేసిన మెట్లు,అగ్ని మాపక వ్యవస్థ. వీటిలో సదరు 400 పైచిలుకు ఆస్పవూతుల్లో అన్నింటిలోనూ నూటికి నూరుశాతం లోపాలే ఉన్నాయి. ఆస్పవూతులకు వచ్చే రోగుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆస్పవూతులు.. అగ్ని ప్రమాదాల నివారణ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయి.


hospetal2 talangana patrika telangana culture telangana politics telangana cinemaనగరంలోని ప్రైవేట్ దవాఖానల్లో మౌలిక వసతులు, అగ్నివూపమాదాలు సంభవిస్తే వాటి నివారణకు లేదా.. నష్టం తగ్గింపునకు ఉన్న అవకాశాలపై ( --T---- ) పరిశీలన చేయగా నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. పూర్తి స్థాయి అనుమతులు తీసుకుని ఆస్పవూతులు నిర్మించిన ఉదంతాలు పదుల సంఖ్యలోనే కనిపించాయి. అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం అగ్నిమాపక వాహనం ఆస్పవూతికి చేరుకునే పరిస్థితులు కూడా అనేక చోట్ల లేకపోవడం దిగ్భ్రాంతి కల్గిస్తోంది. ఇలాంటి నిబంధనలు పాటించే వారు నగరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నారు.హైదరాబాద్ డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న మొత్తం 1421 ఆసుపవూతులలో 2010 ఫిబ్రవరికి ముందు ఏ ఆస్పవూతికీ ఎన్‌ఓసీ లేకపోవడం విశేషం. 2010లో ఇద్దరు నర్సులు, ఒక రోగి మరణానికి కారణమైన పార్క్ ఆస్పత్రి ఘటన అనంతరం ఈ ఆస్పవూతులకు హైదరాబాద్ డీఎంహెచ్‌వో నుంచి నోటీసులు జారీ చేశారు.

ఇందులో ఇప్పటి వరకు సుమారు 120 దవాఖానలు ఎన్‌ఓసీ సమర్పించి శాశ్వత రిజివూస్టేషన్ చేయించుకున్నాయి. 2010 మార్చిలో మొదట 37 ఆస్పవూతులకు, ఆ తరువాత 78 ఆస్పవూతులకు, 2010 ఏప్రిల్‌లో 18 ఆస్పవూతులకు ఒకసారి, 130 ఆస్పవూతులకు మరోసారి మొత్తం 326 ఆస్పవూతులకు నోటీసులు జారీ చేశారు. నగరాన్ని ఆనుకుని ఉన్న రంగాడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ సుమారు 750 ఆస్పవూతులు ఉంటే.. ఇందులో కేవలం 300 ఆస్పవూతులకు శాశ్వత రిజివూస్టేషన్‌లు లేవు. కొన్ని ఆస్పవూతుల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లోనే వైద్యం చేస్తున్నారు. కొందరు నివాస గృహాలనే ఆస్పవూతులుగా మార్చేశారు. మరికొందరు తాము నిర్మించిన బహుళ అంతస్థుల భవనాల్లో ఎలాంటి జాగ్రతలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

పార్క్ ఆసుపత్రి విషాదం
hospetal1 talangana patrika telangana culture telangana politics telangana cinemaనగరంలోని సోమాజిగూడలో ఉన్న పార్క్ ఆస్పవూతిలో 2010 ఫిబ్రవరి 2న జరిగిన అగ్నివూపమాదంలో నర్సులు రెస్సా, ఉషారాణితోపాటు రోగి మంగయ్య మృతి చెందగా, మరో 41 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఆస్పత్రి నిర్వాహకుడు డాక్టర్ దామోదర్‌డ్డిపై పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 278, 336, 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ కూడా చేశారు. పార్క్ ఆస్పత్రి ప్రమాదం తరువాత మేల్కొన్న సర్కారు ఫైర్‌సేఫ్టీ నిబంధనలను కఠినతరం చేసింది. ముఖ్యంగా గ్రేటర్‌లో నిర్మించే భవంతుల్లో తప్పనిసరిగా ఈ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. 15 మీటర్ల ఎత్తుదాటిన వాణిజ్య భవనం, 18 మీటర్ల ఎత్తు దాటిన నివాస భవనాలను ఈ నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చారు. ఆయా నిర్మాణాలకు బిల్డింగ్ కమిటీలో అనుమతులు ఇచ్చే సమయంలో అగ్నివూపమాద నివారణ చర్యలపై ప్రత్యేకంగా పేర్కొంటున్నారు.

5 లక్షలతో ఫైర్‌సేఫ్టీ పరికరాలు
ఫైర్‌సేఫ్టీ పాటించాలంటే సుమారు లక్ష నుంచి రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. అందుకే ఎవరూ ఎన్‌వోసీ తీసుకునేందుకు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అయితే వాటిని తనిఖీ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైర్‌స్టేషన్‌తో సంబంధం లేకుండానే అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలిస్తున్నారని స్థానిక ఫైర్ సిబ్బంది పేర్కొంటున్నారు.

అద్దె భవనాలతో ఇబ్బందే...
సొంత భవనాలు ఉన్నవారు ఫైర్‌సేఫ్టీ పరికరాలు అమర్చుకోగలుగుతున్నారు కానీ అద్దె భవనాలలో ఆస్పవూతులు నడుపుతున్నవాళ్లు మాత్రం నానాతంటాలు పడుతున్నారు. వీటి ఏర్పాటుకు భవనాల యజమానులు నిరాకరిస్తున్నట్లు పలు ఆస్పవూతుల నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రభుత్వాసుపవూతులలో అదే పరిస్థితి...
నగరలో సుమారు 106 ప్రభుత్వ ఆస్పవూతులు ఉన్నాయి. ఇందులో పది పెద్దాస్పవూతులు. ఉస్మానియా, గాంధీ, నయాపూల్, ఈఎన్‌టీ, ఛాతి ఆసుపత్రి, కింగ్‌కోఠి, సుల్తాన్‌బజార్, ఈఎస్‌ఐ, నీలోఫర్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, నిమ్స్ వంటి ఆస్పవూతులకే ఇప్పటికీ ఎన్‌ఓసీ లేదు.


చర్యలు తీసుకుంటాం
ఆస్పత్రి లోపల వసతులపై మాత్రమే మేము పరిశీలించి అనుమతి ఇస్తాం. ఇతర శాఖల నుంచి మిగిలిన అనుమతులు తీసుకోవాలి. అయినా అసౌకర్యాలపై ఫిర్యాదు వస్తే పరిశీలిస్తాం. వారిపై చర్యలు తీసుకుంటాం. నగరంలోని ఎన్‌ఓసీ లేని ఆస్పవూతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. చాలా ఆస్పవూతులకు ఇప్పటికీ శాశ్వత రిజివూస్టేషన్లు లేవు. కేవలం తాత్కాలిక రిజివూస్టేషన్లతోనే ఆస్పవూతులను నడిపిస్తున్నారు. వారందరికీ మరొకసారి నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- డీఎంహెచ్‌వో పీ ఉమామహేశ్వరి

ఈ పరికరాలు తప్పనిసరి
భవనానికి హోస్‌రీల్, ఆటోమేటిక్ డిటెక్షన్ అండ్ అలారమ్ సిస్టమ్, ఎన్‌బీసీ నిర్దేశించిన భూగర్భ నీటి నిల్వ ట్యాంక్, ఒక ఎలక్షిక్టిక్ పంప్, ఫైర్ ఎక్స్‌ట్వింగిషర్, డౌన్ కమర్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలి. ఎలక్షిక్టికల్ ప్యానల్ సిస్టమ్ (మాన్యువల్ ఆపరేటెడ్) 900 ఎల్‌పీఎం టెర్రస్ పంప్, బ్యాటరీతో కూడిన ఎమ్జన్సీ లైటింగ్, ఫైర్ అలారమ్ సిస్టమ్ తదితర పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

నెల రోజుల గడువు..ఇక స్కూళ్లు, మాళ్లు కమిషనర్ కృష్ణబాబు
రాజధాని నగరంలోని ఆస్పవూతుల్లో నిర్దిష్టమైన అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు నెల రోజుల గడువు విధించారు. గడువులోగా పనులు మొదలుపెట్టకుంటే మూసివేతలు తప్పవని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ఆస్పవూతుల్లో అగ్నివూపమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పవూతులు, నర్సింగ్‌హోమ్‌లతోపాటు వివిధ ప్రైవేటు ఆస్పవూతుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నగరంలో అగ్నిమాపక వ్యవస్థ లేని ఆస్పవూతుల వివరాలు తెలియజేశారు. వీటిలో అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకోసం ఇప్పటికే అనేకమార్లు నోటీసులు జారీచేసినా వారిలో చలనం లేదన్నారు. అందుకే తాజాగా నెలరోజుల గడువిస్తూ రివైజ్డ్ నోటీసులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీ లేకుంటే ఆస్పవూతుల రిజివూస్టేషన్‌లు ఉపసంహరిస్తామని హెచ్చరించారు. సెల్లార్ కబ్జాలు తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచే వాటి కూల్చివేతలు చేపడతామని చెప్పారు. ఆస్పవూతుల అనంతరం షాపింగ్ కాంప్లెక్స్‌లు, విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని కృష్ణబాబు తెలిపారు. నగరంలో 1860 స్కూళ్లు, కాలేజీలకు అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు కోసం నోటీసులు ఇవ్వగా కేవలం 300స్కూళ్లు మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు సైతం కేవలం 25శాతం మాత్రమే ఫైర్‌సేఫ్టీ ఎన్‌ఓసీలు కలిగివున్నాయన్నారు.
hospetaltalangana patrika telangana culture telangana politics telangana cinema



Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=52698

Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, News, Hospitals,   
 




0 comments:

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP