సెల్యులాయుడ్ స్మైల్
‘హంటర్ వాలీ’ సినిమాలో ఒక్క ఉదుటున ఎగిరి గుర్రంపై కూర్చొని సవారీ చేసిన ‘నాడియా’ కాదు. సజల నయనాలతో తెర నిండా దుఃఖాన్ని నింపిన మీనాకుమారి కాదు. అద్భుతమైన సౌందర్యంతో ప్రేక్షకుల హృదయాలలో డ్రీమ్‌గర్ల్‌గా నిలిచిపోయిన హేమమాలినీ కాదు. కానీ అలాంటి ప్రత్యేకతలు లేకున్నా స్టార్‌గా ఎదిగింది స్మితా పాటిల్. ఎందుకంటే ‘సహజ నటన’ అనే ఒకే ఒక్క ప్రత్యేకత ఆమెకున్న అర్హత, ఆభరణం. నటనే ప్రధానంగా ఆరిపోని వెలుగులు చిమ్మిన తార స్మితాపాటిల్....
‘స్వాతంవూత్యానంతరం భారతీయ సినిమాల్లో అత్యుత్తమమైన వంద సినిమాలను ఎంపిక చేస్తే పావు భాగం ఆమె నటించిన చిత్రాలే ఎంపిక అవుతాయి’ స్మిత నటించిన సినిమాల పట్ల కొందరికున్న అభివూపాయం ఇది. అంతగొప్ప నటి ఆమె. స్మిత పేరు చెప్పగానే భూమిక, మంథన్, గమన్, చిదంబరం, ఆక్రోష్, చక్ర, అర్థ్, అర్థ్‌సత్య, మిర్చిమసాలా, దేబ్‌శిషు వంటి దృశ్య కావ్యాలు గుర్తుకువస్తాయి.
నవ్య ధోరణికి అండగా...
న్యూస్ రీడర్ నుంచి మరాఠీ థియేటర్ ఆర్టిస్టుగా మొదలైన ఆమె కెరీర్‌లో తొలిచిత్రం అరుణ్ కోప్‌కర్ డిప్లొమా కోసం తీసిన ‘తీక్షిశామాధ్యం’. ఆ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన చిత్రం ‘చరణ్‌దాస్ చోర్’(1975)లో. స్మిత నటిగా ఇండవూస్టీలోకి వచ్చిన సమయంలో భారతీయ నవ్య సినిమా ధోరణి ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. అప్పటి దాకా సత్యజిత్‌రే, మృణాల్‌సేన్ వంటి వారు నవ్య సినిమాను తమ భుజాలపై మోస్తుంటే, ఆ ఉద్యమానికి ఊతమిస్తూ శ్యామ్‌బెనెగల్, బుద్ధదేవ్‌దాస్, ఆదూర్, అరవిందన్, గౌతమ్‌ఘోష్ వంటి కొత్త తరం దర్శకులు రంగ ప్రవేశం చేశారు. వాళ్లకు ఓంపురి, సీర్‌ద్దీన్‌షా, షబానాలతో పాటు స్మితాపాటిల్ వంటి నటి తోడు కావడంతో భారతీయ నవ్య సినిమా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోగలిగింది.
ఎన్నో పాత్రలు.. ప్రశంసలు
అయితే స్మితాపాటిల్‌కు కలిసొచ్చిన అంశం... శ్యామ్‌బెనెగల్ దృష్టిలో పడటం. ఎందుకంటే ‘నిశాంత్’ (1975) చిత్రంలో నటించిన తరువాతే స్మిత పరిక్షిశమ దృష్టిలో పడిపోయింది. ఆ వెంటనే వచ్చిన మంథన్ (1976)లో హరిజన స్త్రీగా నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నది. గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన ఈ చిత్రం డాక్టర్ కురియన్ ప్రారంభించిన శ్వేత విప్లవ నేపథ్యంలో అగ్రవర్ణాల- హరిజనుల నడుమ సామరస్యాన్ని నెలకొల్పడం ప్రధాన అంశంగా తయారైంది. ఈ సినిమాలో స్మిత నటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మంథన్ తర్వాత శ్యామ్‌బెనెగల్ తీసిన ‘భూమిక’ (1976)లో స్మిత నటన హిమాలయా శృంగాన్ని అందుకున్నది. స్వతంత్ర భావాలు గల యువతిగా, స్త్రీ వాదిగా తెరపై ఆమె ఒదిగిపోయింది. తొలితరం హిందీ- మరాఠీ చిత్రాల నటి హంసా వాడే ర్ (లోక్ శాయర్ రాంజోషి- 1947) జీవితకథే భూమిక చిత్రం. ఆ చిత్ర కథ ఏమిటంటే... ఆమె జీవితంలో నలుగురు మగాళ్లకు స్థానం ఉంటుంది. జీవితం గురించి సరైన అవగాహన లేని వయస్సులోనే తన తల్లి స్నేహితుడు, పర్సనల్ సెక్రటరీ(అమోల్‌పాలేకర్)తో వైవాహిక జీవితం విసుగు చెంది దర్శకుడి (అనంతనాగ్)తో కలిసి జీవిస్తుంది. అతనితోనూ ఇమడలేక, ఆ తర్వాత రచయిత(నసీర్)తో, మరికొంత కొంతకాలం ఓ ఫ్యూడలిస్టు (అవూమిష్‌పురి)తో కూడా కలిసి ఉంటుంది. ఎక్కడా ఇమడలేక చివరికి స్వతంవూతంగా బతుకు సాగించాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ చిత్రంలో అమోల్ పాలేకర్, స్మితలు పోటిపడి నటించారు. ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటిగా ‘ఊర్వశి ’అవార్డు వచ్చింది. ‘ఆక్షికోష్’ చిత్రంతో ఆమె రెండోసారి ‘ఊర్వశి’ అవార్డు అందుకుంది.
పన్నెండేళ్లే...
సహజనటిగా స్మిత సాధిస్తున్న విజయాల పరంపర చూసిన సత్యజిత్‌రే వంటి మహాదర్శకులు సైతం ఆమె ఇంటి తలుపు తట్టారు. ఆయన దర్శకత్వంలో స్మిత ‘సద్గతి’, ‘పికూ’ చిత్రాలల్లో నటించింది. ఇలా వరుస సినిమాల్లో ఒకదానికొకటి విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి తన సినీ జీవన జైత్రయావూతను కమర్షియల్ తారలకు తీసి పోకుండా కొనసాగించడం భారత సినీ పరిక్షిశమలో ఒక్క స్మితాకే సాధ్యమైంది.
మహేష్‌భట్ ముక్కోణపు ప్రేమకథతో తీసిన ‘అర్’్థ లో షబానా ఆజ్మీ భార్యగా నటిస్తే, స్మిత ప్రేయసిగా నటించింది. వివాహేతర సంబంధాల కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో ప్రియుడి పట్ల వెర్రి వ్యామోహం చూపే నటనతో ఆమె డామినేట్ చేసింది. స్మిత, షబానాలు ఈ సినిమాలో పోటీపడి నటించారు.
స్మిత నటించిన చిత్రాలల్లో ఇంకా ప్రస్తావించుకోదగిన వాటిలో చిదంబరం, నక్సలైట్, భిగిఫల్కే, అనోఖి రిస్తా, అమృత్, పేట్ ప్యార్ అవుర్ పాప్, వారిస్, అంబర్త...ఇలా చాలా చిత్రాలే ఉన్నాయి. 12 ఏళ్ల కాలంలో మొత్తం ఆమె నటించిన చిత్రాలు 85. వీటిలో హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి, మలయాళం, తెలుగు భాషల్లో ఉన్నవి. తెలుగులో ఆమె నటించిన చిత్రం ‘అనుక్షిగహం’.
పద్మశ్రీగా..
ఆర్ట్ సినిమాల్లోనే కాకుండా స్మిత ‘నమక్ హలాల్’, ‘శక్తి’, ‘బద్లే కి ఆగ్’, ‘ఆజ్ కి ఆవాజ్’ వంటి కమర్షియల్ చిత్రాల్లో నాయకిగా నటించి మెప్పించింది. స్మిత రెండుసార్లు జాతీయ అవార్డును, ‘అంబర్త’ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డు, కేంద్ర ప్రభుత్వ ‘పద్మశ్రీ’(1985)అవార్డులు అందుకున్నది. ప్యారిస్‌లో ఆమె చిత్రాలతో కూడిన రెట్రాస్పిక్టివ్ ఒకటి జరిగినప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు కోస్టాగావూవిస్ స్మితను సన్మానించారు. సత్యజిత్‌రే తర్వాత ఇలాంటి గౌరవం అందుకున్న ఏకైక భారతీయ కళాకారిణి స్మితనే.
ఫ్యామిలీ నేపథ్యం
స్మితా పాటిల్ 1955లో పూనాలో మహారాష్ట్ర రాజకీయ నేత శివాజీరావ్ పాటిల్ ఇంట పుట్టింది. తండ్రితో ఆమె సంబంధాలు అంతంత మాత్రమే. తల్లి విద్య ఒక నర్స్. తల్లిదంవూడుల మధ్య సరైన అనుబంధం లేని కుటుంబ వాతావరణంలో నర్సింగ్ క్వార్టర్స్‌లో ఆమె పెరిగింది. ఆడపిల్లలా కాకుండా ఆత్మవిశ్వాసంతో అబ్బాయిలను సైతం హడపూత్తించేది. మగ రాయుడిలా మోటార్ బైక్ రైడింగ్ చేసేది. సెంట్ జేవియర్ కళాశాలలో చదివేందుకు బొంబాయి రావడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అక్కడే శ్యామ్‌బెనెగల్ స్మితను తొలిసారిగా చూశారు. సినీ నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడు అప్పటికే వివాహితుడైన రాజ్ బబ్బర్‌ని పెళ్లిచేసుకోవడం, తల్లి కావాలనుకోవడం, ఇండవూస్టీని విస్మయ పరిచింది. కానీ ‘కెరీర్‌కన్న మాతృత్వపు మాధుర్యమే గొప్పదని’ చెప్పింది స్మిత.
దురదృష్టం...
అయితే 1985లో మలయాళ చిత్రం ‘ చిదంబరం’ షూటింగ్‌లో ఉండగా ఆ చిత్రంలోని సహనటుడు గోపితో ‘నాకెంతో సమయం లేదు. వచ్చే ఏడాది డిసెంబర్31 తర్వాత నేను ఈ లోకంలో ఉండను. నా జీవిత కాలం ఒక ఏడాదేనని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు’ అని చెప్పింది. విచివూతమేమిటంటే... ఆ మాటలు అబద్ధం కాలేదు. ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చాక 1986 డిసెంబర్13న తన జీవన నాటకంలో పోషిస్తున్న భూమికను ముగించింది. భారతీయ సినిమాకే ఆమె మరణం ఎన్నటికి తీరని లోటైంది. స్మిత మరణించినప్పుడు భారతదేశంలోని అన్ని భాషల పత్రికలు ఆమెకు నివాళిగా సంపాదకీయాలు రాయడం గొప్ప విషయం.
చివరగా- ఎందరో సినీ విమర్శకులు స్మితను ప్రముఖ నటి షబానా ఆజ్మీతో పోల్చిన సందర్భాలున్నాయి. కాని ఎవ్వరితోను పోల్చనలవి కాని నటిమణీ ఆమె. వాస్తవిక సమాంతర చిత్రాల అభినేవూతిగా స్మితాపాటిల్ భారతీయ చిత్ర రంగంలో సృష్టించిన చరిత్ర మరెవ్వరికి సాధ్యం కాదు.
స్మిత అంటే ఒక హరిజన స్త్రీ..
ఓ గిరిజన మహిళ..
సగటు స్త్రీ....
గరీబ్ ముస్లిమ్ ఔరత్..
వేశ్యా పాత్రధారి..
ధైర్యశాలి...
ఇలా ఎలాంటి భూమికకైనా జీవం పోసే అరుదైన నటి స్మితాపాటిల్.
నేడు ఆమె వర్ధంతి
సందర్భంగా
ఈ నివాళి.
రిస్క్‌ను కూడా
స్మిత తన పాత్ర పోషణలో ఎంత శ్రద్ద తీసుకుంటుందో, ఆ పాత్రను పండించడానికి కూడా అంతగా రిస్కు తీసుకునేది. దేబ్‌శిశు సినిమా కె్లైమాక్స్ షూటింగ్ నాటి సంఘటనే దానికి సాక్ష్యం. ఈచివూతంలో సీత పాత్రలో స్మిత ఓ కలగంటుంది. ఆ కలలో కాళికగా మారి కత్తి చేత బట్టి ప్రతినాయకుడిని మట్టు బెడుతుంది. ఈ సన్నివేషం షూట్‌చేసే రోజున గాలి వానతో వాతావరణం అంతా అల్లకల్లోలంగా ఉండింది. దీంతో షూటింగ్ కుదరదని దర్శకుడు ఉత్పలేంద్ చక్రవర్తి చెప్పినా ఆ వాతావరణమే సన్నివేషానికి బలాన్నిస్తుందని మంచి బ్యాక్ డ్రాప్‌గా ఉంటుందని పట్టుబట్టి షూటింగ్ జరిపించింది. నిజంగా కూడా ఆ సన్నివేషమే సినిమాకి ప్రాణం పోసిందని విమర్శకులూ ప్రశంసించారు.
అమ్మను సినిమాల్లోనే చూస్తాను
‘మా అమ్మ నటనను నేను అమితంగా ఇష్టపడతాను. నేనామెను బయట ఎన్నడూ చూడలేదు. కాని సినిమాల్లోనే చూసుకుంటాను. సినిమాలు చూడటం ద్వారానే ఆమె నాకు తెలుసునన్న భావన కలుగుతుంది. ‘నమక్ హలాల్ ’ చిత్రంలో అమితాబ్‌తో కలిసి అమ్మ పాడిన ‘ఆజ్ రపట్ జాయేతో హమే న ఉఠయ్యో’ పాట నాకెంతో ఇష్టం’
-- ప్రతీక్ బబ్బర్ (స్మితాపాటిల్ కొడుకు)
‘నటనలో సున్నితత్వం, భావోద్వేగాల అభివ్యక్తీకరణలో నూతనత్వాన్ని ఆవిష్కరించిన స్మితా పాటిల్ భారతీయ సినిమాల్లో నటీమణుల అందానికి ఉన్న పూర్తి నిర్వచనాన్నే మార్చివేసింది’
-- గోవింద్‌నిహలని.
‘స్మితకు పెట్టని ఆభరణాలు ఆమె కళ్లు. కదలకుండానే అద్భుతమైన నాటకీయకతను పండిస్తుందామె. హావభావాలతో శృంగార రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగిన ఏకైక నటి స్మిత’
-- అమోల్ పాలేకర్.
Take By: T News
Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, స్మిత, Telangana News,
Tags: T News, hmtv, tv9, Cinema, Images, sex, hot images, Movies, Tollywood, Bollywood, Hollywood, Dacanwood, స్మిత, Telangana News,
0 comments:
Post a Comment