హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం
హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ బజార్‌లో మిట్ట మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి భయంతో పరుగులు తీసి పారిపోయినట్లు సమాచారం. దాడి చేసిన దుండగులు పరారీలో ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Take By: T News
0 comments:
Post a Comment