చిదంబరాన్నీ చేర్చాలి
- ఆయనపై విచారణ జరపాల్సిందే
- సీబీఐ కోర్టుకు స్వామి విజ్ఞప్తి
- రాజా, చిదంబరంల ఉమ్మడి నిర్ణయమది
- అందుకు సాక్ష్యాధారాలున్నాయి
- చిదంబరం మీద ఇదివరలోనూ కేసులున్నాయి
- ఆయనో పాత నేరగాడి కిందే లెక్క
- సాక్ష్యం సందర్భంగా వాదించిన సుబ్రమణ్యస్వామి
- ధ్రువీకృత పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశం
- తదుపరి విచారణ 7కు వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశాన్ని కుదిపేసిన సంచలన అవినీతి కుంభకోణం- 2జీ స్పెక్ట్రం కేసులో టెలికం మాజీ మంత్రి రాజా ఒక్కడినే తప్పుబట్టడం సరికాదని, అప్పుడు ఆర్థికమంవూతిగా పనిచేసిన ప్రస్తుత హోంమంత్రి పీ చిదంబరం కూడా అందులో భాగస్వామేనని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. చిదంబరం సూ చనలు, ఆదేశాల మేరకే రాజా వ్యవహరించారని, అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలున్నాయని స్పష్టం చేశారు. అందువల్ల కేసులో చిదంబరాన్నీ నిందితుడిగా చేర్చాలని, ఆయననూ విచారించాలని కోరా రు. చిదంబరం మీద ఇదివరలోనూ కేసులున్నాయని, ఆయనో పాత నేరగాడి కిందే పరిగణించాలన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో తన ప్రైవేటు ఫిర్యాదుపై సాక్ష్యమిచ్చారు.
తన వాదనలకు మద్దతుగా ఆయన కొన్ని డాక్యుమెంట్లను కూడా సమర్పించారు. ఆయన వాదనలు విన్న కోర్టు సాక్ష్యాలకు సంబంధించి పార్లమెంటు, సంబంధిత శాఖల నుంచి ధ్రువీకృత ప్రతులను తీసుకురావాలని కోరింది. కొందరు ప్రభుత్వ అధికారులతోపాటు ఇతర సాక్షులను పిలవాలన్న స్వామి అభ్యర్థనపై తర్వాత స్పందిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి వాయిదా వేసింది. చిదంబరం, రాజాల సమావేశాల వివరాలు కోర్టుకు విన్నవిస్తానని, వాటి ఆధారంగా న్యాయస్థానం వెంటనే చర్యలకు ఉపక్షికమించే అవకాశముందని ఆ తర్వాత స్వామి విలేకరులతో చెప్పారు. ‘‘ఆ నాలుగు డాక్యుమెంట్లకు సంబంధించి మీరు ధ్రువీకృత ప్రతులను అందజేస్తే సరిపోతుందని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత అవసరమైతే నేరుగానే విచారణ కొనసాగిస్తామని, మీకెలాంటి సాక్ష్యం అవసరం ఉండదని కోర్టు చెప్పడం సంతోషం కలిగించింది’’ అని ఆయన తెలిపారు.
కేబినెట్ నిర్ణయం మేరకు అప్పటి టెలికాం మంత్రి రాజా, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంలకు స్పెక్ట్రం ధరలను సంయుక్తంగా నిర్ణయించే అధికారం లభించిందని సుబ్రమణ్యస్వామి సీబీఐ న్యాయస్థానానికి తెలిపారు. 2001నాటి ధరల ప్రకారం 2008లో స్పెక్ట్రం చార్జీలను ఖరారు చేయడంలో రాజా ఒక్కడినే బాధ్యుడిగా పరిగణించడం సరికాదని, చిదంబరం గట్టి మద్దతుతోనే ఆయన ఆ నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ‘‘టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్), ఆర్థికమంవూతిత్వశాఖ కలిసి చర్చించి స్పెక్ట్రం ధరలను ఖరారుచేస్తా’’మని చిదంబరం 2008 జనవరి 15న ప్రధానమంవూతికి లేఖ రాశారని స్వామి తెలిపారు. ‘‘ధరలపై చర్చించి ఓ నిర్ణయానికి వద్దామా? దానిని ప్రధానికి తెలియజేయవచ్చు’’ అంటూ చిదంబరం అదే ఏడాది ఏప్రిల్ 21న రాజాకు లేఖ రాశారని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2011 ఫిబ్రవరి 24న రాజ్యసభలో చేసిన ప్రకటనను స్వామి గుర్తుచేశారు. 2003నాటి కేబినెట్ నిర్ణయం మేరకు స్పెక్ట్రం ధరలను నిర్ధారించారని, ఆ అంశాన్ని ఆర్థికమంవూతిత్వశాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ సంయుక్తంగా చూసుకుంటాయని ప్రధాని స్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. ‘‘ఆ అధికారంతోనే (2003నాటి కేబినెట్ సమావేశం) ఇద్దరు మంత్రులు నాలుగుసార్లు సమావేశమయ్యారు. 2008 జనవరి 31, మే 29, జూన్ 6, ఆ తర్వాతా కలిసి ఓ అవగాహనకు వచ్చారు. 2008 జూలై 4న ప్రధానమంవూతిని కలుసుకుని తమ నిర్ణయాన్ని తెలియజేశారు’’ అని సుబ్రమణ్యస్వామి వివరించారు. ‘‘ఈ వాస్తవాలనుబట్టి స్పెక్ట్రం ధరల నిర్ణయంలో చిదంబరం ప్రమేయముందన్నది స్పష్టం’’ అని ఆయన వాదించారు. మరికొన్ని ఆధార పత్రాలను సేకరించడానికి తనకు ఇంకొంత సమయం అవసరమవుతుందని చెప్పారు. దీంతో కోర్టు తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి వాయిదావేసింది.
చిదంబరం చాలా తెలివిగా వ్యవహరిస్తారని, ఆయన ఎన్నో నేరాలు చేసిన వ్యక్తని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఆయన అసలు స్వరూపాన్ని బహిర్గత పరుస్తానని చెప్పారు. ‘‘చిదంబరాన్ని అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంది. రాజా కేవలం చిదంబరానికి సబార్డినేట్. చిదంబరం ఎంత అవినీతిపరుడో నిరూపించేందుకు నేను కొత్త నిజాలను తెలియజేస్తాను. ఆయన ప్రమేయమున్న అవినీతి కేసు ఇదొక్కటే కాదు. ఆయన ఎన్నో నేరాలు చేశారు. ఆయన మరీ తెలివైనవారు. లాయరైనందున ఏదో సాకు చూపెట్టుకోవచ్చనుకుంటారు. ఆయనో పాతనేరగాడి కిందే లెక్క. ఈరోజు కాకున్నా మరెప్పుడైనా సెక్షన్ 13 (1) కింద చిదంబరం అలవాటైన నేరగాడని చూపిస్తా’’ అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

Take By: T News
0 comments:
Post a Comment