ప్లాన్‌చేద్దాం మింగేద్దాం!
- హెచ్‌ఎండీఏ యాక్షన్ ప్లాన్ విడుదల
- ముసాయిదాపై 17 నుంచి చర్చలు.. 45 రోజులు అభివూపాయసేకరణ
- అసలు ఉద్దేశం రియల్‌దందా!.. అభివృద్ధి ముసుగులో వ్యాపారం?
- ఛిద్రం కానున్న పల్లె జీవితం.. పంటపొలాలు మటుమాయం
- సీమాంధ్ర బడాబాబులకు నాటి రాజశేఖరుడి కానుక..
- నేడు ఆచరణలోకి తెస్తున్న కిరణ్.. కేంద్రపాలితం చేసే కుట్రకు పునాది?
దాని పేరు మాస్టర్‌ప్లాన్! నిజంగానే మాస్టర్ ప్లాన్.. రాష్ట్ర రాజధానిని దోచుకునేందుకు సీమాంధ్ర బడాబాబులకు కట్టబె మొన్న గ్రేటర్ హైదరాబాద్ పేరు పెట్టినా.. రింగురోడ్లు చుట్టేసినా.. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ పేరుతో విస్తీర్ణాన్ని నాలుగింతలు పెంచేసి.. చుట్టు పక్కల జిల్లాల మండలాలను కలిపేయాలని చూసినా.. విస్తరణవాదం వెనుక దాగిన పరమార్థం ఒక్కటే! వ్యాపారం! రియల్ వ్యాపారం! సెజ్జులు.. హబ్బులు.. పబ్బులు..! అభివృద్ధి మాటున పెను జీవన విధ్వంసం! పట్నం నీడన ఉన్న పల్లె జీవితాలను పెకలించే కుట్ర! వాటి పునాదులపై దందాల భవన నిర్మాణాలు పెంచే ఆలోచన! గ్రేటర్ పేరుతో నగరం చుట్టుపక్కల మున్సిపాల్టీలను కలిపేసిన తర్వాత జరిగిందిదే! రింగు రోడ్డు పేరుతో రైతుల భూములను కబళించిన తర్వాత కనిపిస్తున్నది ఇదే! ఇప్పుడు మెట్రోపాలిటన్ ముసుగు వేసి చేయబోతున్నదీ ఇదే!
ఒక వేళ తెలంగాణ ఏర్పడినా.. ఈ ముసుగులో హైదరాబాద్‌ను కేంద్ర పాలితం చేసుకుందామని ఆలోచన సీమాంధ్ర సర్కారు మనసులో దాగుందా? ఆ క్రమంలోనే సీమాంధ్ర వ్యాపారుల ప్రయోజనాలను మరింతగా విస్తరించేందుకు, దోపిడీ పరిధి పెంచేందుకు సీమాంధ్ర సర్కారు హెచ్‌ఎండీఏను వాడుకోజూస్తున్నదా? ఇదో అనుమానం!
(టీ న్యూస్, హైదరాబాద్)హైదరాబాద్ పరిధిని ఇప్పుడున్నదానికి నాలుగింతలు విస్తరించేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథార్టీ మాస్టర్ ప్లాన్‌కు.. యాక్షన్ ప్లాన్ ముసాయిదా సిద్ధమైంది! 45 రోజుల పాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కార్యాచరణ మొదలైంది. మహానగరాభివృద్ధి సంస్ధ పరిధి ప్రాంతం - భవిష్యత్ అభివృద్ధి కోసం అంటూ తాజాగా మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రూపొందించారు. 2031 సంవత్సరం వరకు ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ ముసాయిదాను ప్రజల కోసం, సమాచారం కోసం తార్నాకలోని ప్రధాన కార్యాలయంతో పాటు నాలుగు జోనల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు.
ఈ ప్రణాళిక అమలు కోసం గురువారం నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో 17న మేడ్చల్, 19న ఘట్‌కేసర్, 22న శంషాబాద్, 24న శంకర్‌పల్లిలో విస్తృతంగా సమావేశాలను నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజావూపతినిధులకు ఈ సమావేశాలకు రావాలంటూ ఆహ్వానాలు పంపారు. రాబోయే కాలంలో హెచ్‌ఎండీఏ పరిధిని మరింత పెంచే ప్రతిపాదనలూ ఉన్నాయని సమాచారం.
ఇలా మొదలైంది...
2008 ఆగస్టు 25న జీవో 570 ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథార్టీని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి ఏర్పాటు చేశారు. ఇది తెలంగాణపాలిట విషబీజమని అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులు, మేధావులు విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాలు, రంగాడ్డి జిల్లాలో 22 మండలాలు, మెదక్ జిల్లాలో 10 మండలాలు, నల్లగొండ జిల్లాలో 5 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 2 మండలాలను కలుపుతూ మొత్తం 55 మండలాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి నాంది పలికారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ (హుడా) పరిధి 1,692 చదరపు కిలోమీటర్లకు పరిమితమై ఉండగా దాని విస్తీర్ణాన్ని దాదాపు నాలుగింతలు పెంచేసి 7,228 చదరపు కిలో మీటర్ల పరిధితో హెచ్‌ఎండీఏను ప్రతిపాదించారు.
పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ వంటి స్థానిక సంస్థలు లేనందున పలు అభివృద్ధి కార్యక్షికమాలను అమలు చేసేందుకు హుడాను గతంలోనే అందుబాటులోకి తెచ్చారు. అయితే ఎప్పటి నుంచో జిల్లాల అభివృద్ధి కోసం జెడ్పీలు, మండల పరిషత్‌లు ఉండగా వాటిని హుడా స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ పరిధిలోకి విలీనం చేయడం పూర్తిగా రాజకీయంగా తెలంగాణను అడ్డుకునేందుకు చేసిన కుట్రగానే భావించాల్సి ఉంటుందని తెలంగాణ మేధావులు చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ, ఆంధ్ర రాష్ట్రంలో విలీనానికి ముందు ఉన్న రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు సమైక్యవాద పాలకులు పన్నిన కుట్ర ఇదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో నాటి సీఎం వైఎస్ నాటిన విష బీజం.. ఇప్పుడు విష వృక్షంగా ఎదిగిందని, దీని కింద తెలంగాణలోని ఐదు జిల్లాలు విలవిలాే్ల దారుణ స్థితికి చేరుకున్నాయని మేధావులు అంటున్నారు. మహానేత అడుగులకు మడుగులొత్తిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు.. మొత్తం తెలంగాణ ఆకాంక్ష ఉనికినే దెబ్బతీసే ఈ విషపూరిత ప్రతిపాదనకు గుడ్డిగా తలూపారు.
అదే ఇప్పుడు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండగా తయారైంది. అసలు కుట్ర ఆనాడు తెలియలేదనుకున్నా.. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మేల్కొన్నారా? అంటే అదీ లేదు. ఇప్పటికీ ఈ నాయకులు కుంభకర్ణుడిలా గాఢ నిద్రలోనే ఉండటం అత్యంత దురదృష్టకరమని ఉద్యమక్షిశేణులు అంటున్నాయి. సీమాంధ్ర సర్కారు చేసిన కుట్ర నుంచి తెలంగాణ బయటపడాలంటే తెలంగాణవాదులంతా ఒక్కటిగా మళ్లీ మహాసంక్షిగామాన్ని చేయాల్సిన చారివూతక ఆవశ్యకత ఏర్పడిందని పలువురు నిపుణులు అంటున్నారు.
గ్రామాల ఉనికికే ప్రమాదం..
నూతనంగా ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డు (290 కిలోమీటర్)లు, ఇతర నూతన రహదారులు, పలు రహదారుల విస్తీర్ణం ఆయా గ్రామాల మీదుగా ప్రతిపాదించారు. దీంతో ఆయా మండల కేంద్రాల పరిధిలోని గ్రామాల ఉనికికే ప్రమాదం సంభవించే వీలు ఉంది. క్షేత్ర స్థాయి వాస్తవాలకు దూరంగా ప్రస్తుత రహదారుల విస్తీర్ణం, నూతన రహదారుల ప్రతిపాదనలు తయారు చేయడం మాస్టర్ ప్లాన్ విభాగం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో మేడ్చల్ మండల కేంద్రం పరిధిలోని రావిర్యాలా, దబిల్‌పూర్ గ్రామాల పరిధిలో 45 మీటర్‌లు(150 అడుగులు), శ్రీరంగవరం, నూతన్‌కల్, మహేశ్వరం మండల కేంద్రం పరిధిలో గోల్లూర్, శంకర్‌పల్లి మండల కేంద్రం పరిధిలో అనంతప్పాగూడ, బీబీనగర్ మండల కేంద్రం పరిధిలో మధ్వారాం గ్రామాల పరిధిలో 30 మీటర్‌లు రహదారుల విస్తీర్ణం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే గ్రామాలకు గ్రామాలే ఎగిరిపోతాయి.
రహదారుల వలయంలో వ్యవసాయ భూములు
హెచ్‌ఎండీఏ పరిధిలోఇప్పటికే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారు. త్వరలో 290 కి.మీ. పొడవున రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు తయారు చేశారు. ఓఆర్‌ఆర్ కోసం దాదాపు 6,100 ఎకరాల భూములను సేకరించారు. ఇప్పుడు రీజనల్ రింగ్‌రోడ్డుల పేరుతో ఇంతకంటే ఎక్కువస్థాయిలో రైతులు తమ వ్యవసాయ భూములను కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. 70శాతం రీజనల్ రింగ్ రోడ్ల విస్తరణ, 30 శాతం నూతన రోడ్లు, జంక్షన్‌లతో వందల ఎకరాల్లో పచ్చని పంట పొలాలు, పండ్ల, పూల తోటలతో పాటు కూరగాయల క్షేత్రాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మాస్టర్ ప్లాన్‌కింద మహబుబ్ నగర్, మెదక్, నల్లగొండ, రంగాడ్డి జిల్లాల్లోని 40 మండలాల పరిధిలోని రైతులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇవన్నీ వాణిజ్య కేంద్రాలుగా మారిపోనున్నాయి.
click this link : http://www.buxricka.com/?ref=shamsheer
Take By: T News
Tags: Telangana News, Telangana crisis, Telangana issue, Azad, T News, hmtv, tv9, Kiran Kumar Reddy, Telangana agitation, statehood demand, Venkat Reddy,
0 comments:
Post a Comment