ధ్వంస’ గౌరవం
ధ్వంస’ గౌరవం
——————–
తెలుగు భాషాభిమానులార…తెలంగాణా వీరులారా
విగ్రహాలం కాదు మేము.. ..నిగ్రహం కోలిపోఇన జాతి రత్నాలం
దంద్వ నీతి చూడలేక ….’ధ్వంస’ గౌరవం కోరినం
మా విముక్తి కి మీకిదే మా క్రుతజ్ఞాతాభివందనం ….
‘హుస్సేన్’ గౌరవార్ధం ‘కుతుబ్ షా’ నిర్మించిన వారిది పైన
తెలుగు జాతి కి చిహ్నాల మైతిమి …తెలంగాణా పోరు కి సాక్షాల మైతిమి …
వీర చెరిత్ర కి చెరమగీతం పాడుతుంటే…
ఎర్ర ప్రగడ , ‘ఎర్రని’ కళ్ళ తో తెలిపిన ‘ప్రగాడ ‘ సానుభూతి ఒకవైపు ….
దాశరథి ‘తెలంగాణా దాహార్ది ‘ కి ఇంకా నీల్లందకుంటే …
కన్నీటి సాగరం ఐన ‘హుస్సేన్ సాగర్’ ఒక వైపు …
అభాగ్యుల ‘భాగ్య రెడ్డి ‘ దౌర్భాగ్యం చూసి ….
బావురు మన్న బమ్మెర పోతన పోరు ఒక వైపు …
తోటి మన్నెం వీరుడు కొమరానికి చోటు లేదాయే అని
అల్లూరి ఆక్రందన ఒకవైపు ….
అమాయకుల ఆత్మార్పనల తో .. ఆత్మక్షోభ ఒక వైపు
స్వార్ధ రాజకీయాల ….రాక్షసత్వం ఒక వైపు ..
నిలవలేము ఇంక గౌతాముని (బుద్దిని) నీడలో …
నిమర్జన మైతిమి తెలంగాణా పోరులో !!
— సుధీంద్ర భార్గవ
0 comments:
Post a Comment