తెలంగాణ కోసం ఇద్దరి ఆత్మత్యాగం
మెదక్, :ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తు ఇద్దరు వ్యక్తులు ఆత్మత్యాగానికి పాల్పడిన సంఘటన మెదక్ డివిజన్ లో మంగళవారం వెలుగుచూశాయి. మెదక్ మండలం వాడి గ్రామానికి చెందిన ఈర్ల జైపాల్‌రెడ్డి(50) మెదక్ పట్టణంలోని పిల్లల పార్కులో ఉరివే సుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ కోసం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి జేబులో దాచుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. కాంగ్రెస్ ఎంపి, ఎమ్మెల్యేలు చిత్తశుద్దితో వ్యవహరించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు పోరాడాలని డిమాండ్ చేశాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడి పదవులకు అమ్ముడుపోయి ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత నాయకులు పదవులకు అమ్ముడుపోకుండా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కోసం ఉద్యమించాలని సూచించారు. తన ఆత్మహత్యతో ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశాడు.
యువకుడి ఆత్మహత్య
ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం కొనసాగుతున్న ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్ని రాష్ర్ట ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యానికి ఆవేదన చెందిన డిగ్రీ విద్యార్థి ప్రవీణ్‌గౌడ్(20) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. ప్రవీణ్‌గౌడ్ గతంలో చేపట్టిన తెలంగాణ ఆందోళన కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొన్ని సెల్‌టవరెక్కి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లో మంగళవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంపి సంతాపం.
మెదక్ నియోజకవర్గంలో తెలంగాణ కోసం ఆత్మర్పణాలు చేసుకున్న వారికి మెదక్ ఎంపి విజయశాంతి ఫ్రగాఢ సంతాపం తెలిపారు. కాంగ్రేస్ పార్టీకి చిత్తశుద్ది లేకపోవడంతోనే తెలంగాణ ప్రాంతంలో బలిదానాల పరంపర కొనసాగుతుందన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వెంటనే స్పందించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు పోరాడాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. గత వారం రోజులుగా తీవ్ర అస్వస్థతతో ఉన్నందునే తాను పర్యటించలేకపోతున్నానన్నారు.
0 comments:
Post a Comment