రోడ్డుపైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలు
సిద్దిపేట,మేజర్‌న్యూస్: నలుగురు నడిచే రోడ్డే తరగతి గదిగా మారింది.ఉపాధ్యాయులు అక్కడే విధులను నిర్వహించి విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించారు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ నెల 17 నుంచి టీటీ జాక్ పిలుపు మేరకు నిర్వహిస్తున్న సహా య నిరాకరణలో భాగంగా శుక్రవారం నాడు లింగారెడ్డిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సహాయ నిరాకరణలో భాగంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రోడ్డుకు అడ్డంగా బో ర్డును,తెలంగాణ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలం గాణ చరిత్ర, భౌగోళిక స్వరూపం,త్యాగాలు,ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలు వివరిం చారు.
గ్రామ ఎంపీటీసీ బండి రంగయ్య తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకేనని చెప్పారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ వర్కింట్ కమిటీ సభ్యులు మేర్గు మహేష్ మాట్లాడుతూ ఇక నుంచి అన్ని రకాల పలకరింపులు జై తెలంగాణ అనే సాగుతాయన్నారు. రోడ్డు పైనే విద్యార్థులకు తెలంగాణ పాఠాలను బోధించటంతో సిద్దిపేట-చిన్నకోడూరు రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి.ఈ సందర్భంగా విద్యార్థుల తెలంగాణ నినాదాలు,తెలంగాణ గేయాలతో ఆ ప్రాంత మంతా దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి.అశోక్, మురళీ, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment