ఈసారికి తెలంగాణ బిల్లు లేదు
పార్లమెంటులో బిల్లు పెట్టా లంటే అందుకు 15 రోజులు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి వుంటుందని, అదీకాక సభ కార్యకలాపాల జాబితా ఇప్పటికే ఖరారైందని, ఈ సాంకేతికాంశాలు తెలిసి కూడా హడావుడి చేస్తే సహించేది లేదని బన్సాల్ హెచ్చరించారు. ఢిల్లీలో మకాం చేసిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలపై అధిష్ఠానం కూడా అగ్గిమీద గుగ్గిలం అయింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, పార్టీ వ్యవ హారాలలో మేడం తలమునకలై వున్నారని ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీకి రావడమే కాకుండా.. తెలంగాణ ఏర్పాటు హామీ లభించే వరకు ఇక్కడనుంచి కదిలేది లేదని ప్రకటిం చడమేమిటని మందలించినట్లు తెలిసింది.
5 రోజులు ఏం చేశారు...?
సోమవారం ఢిల్లీ వచ్చిన వీరంతా రోజుకు ఒకరిద్దరు మంత్రులను కలిసేందుకు ప్రయత్నించడం, సాయంత్రానికి మీడియా ముందు తాము తెలంగాణకోసం కృషి చేస్తున్నామని, మేడం రేపో మాపో అపాయింట్‌మెంటు ఇస్తారని కబుర్లు చెప్పడం మినహా చేసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు అధిష్ఠానంలోని ప్రధాన నాయకుల నుంచి ఏ హామీ లభించిందని విలేకరులు ప్రశ్నించగా... మేము కోరాం అందుకు సానుకూలంగా స్పందించారనే దాటవేత దోరణిని అవలంభించారు. కొందరు నాయకులు మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మొహం చాటేశారు.
కొందరైతే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఇచ్చే విందులకు హాజరై సుష్టుగా అన్ని ప్రాంతాల వంటకాలను రుచి చూశారు. ఈ పర్యటన మూడు విందులు, రెండు భేటీలతో పరిసమాప్తం అయ్యింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు నాయకులు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఎకె. ఆంటోని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్పమెయిలీ, ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోంశాఖ మంత్రి చిదంబరం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సాల్‌లతో భేటీ అయ్యారు.
0 comments:
Post a Comment