తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య
అల్లాదుర్గం,ఐడిఏబొల్లారం,మేజర్‌న్యూస్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతుందని తనకు ఉద్యోగం రాదని, జగ్గారెడ్డి అనుచరుల బెదిరింపులు తాళలేక మరో విద్యార్థి కుసుమం రాలిపోయింది. స్థానికులు సుసైడ్ నోట్ వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన గార్లపల్లి యాదగిరి( 22) శనివారం రాత్రి తన స్వగృహంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో బిఎ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యాదగిరి తెలంగాణ ఉద్యమంలో ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనేవాడు. ఇప్పటి వరకు తెలంగాణ తొందరలోనే వస్తుందని భావిం చాడు.ఇక తెలంగాణ రాదేమోనని ఆత్మస్థైర్యం కోల్పోయి స్వంత గ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో ముస్లాపూర్ గ్రామంలో శోకసంద్రంలో మునిగింది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ేసీఆర్ సదాశివపేటలో నిర్వహించిన సభకు వెళుతు సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫెక్సి బోర్డులను ధ్వంసం చేశాడు. దీంతో జగ్గారెడ్డి అనుచరులు తారా కళాశాలకు వచ్చి తనను హెచ్చరించి భయబ్రాంతులకు గురి చేసినట్లు తన సుసైడ్ నోట్‌లో రాశాడు. యాదగిరి ఆత్మహత్యతో ముస్లాపూర్ గ్రామంలో తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. తన అంత్యక్రియలకు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్, కవితలు పాల్గొని జయప్రదం చేయాలని కోరాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న యాదగిరి రాసిన సుసైడ్ నో ట్ ముస్లాపూర్ గ్రామస్తులను, తెలంగాణ ఉద్యమ కారులను కంటతడిపెట్టించింది.
పూజ్యులైన అమ్మకు నమస్కారం... అమ్మా నన్ను కన్నందుకు నీ పాదాలకు నమస్కారం నాన్న లేకున్నా నన్ను చదివించి ఇంత వాడిని చేశావు. ఉద్యోగం రాదు దానికి కారణం సీమాంద్ర నాయకులు రానివ్వరు అందుకోసమే చనిపోవా లనుకున్నా. నీవు మాత్రం బాధపడకూడదు. నీకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజ లు అండగా ఉంటారు. నీవు ఒంటరి కాదు నీ పేరు చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. నీవు మాత్రం తముళ్లను బాగా చూసుకో. ఇలా వెళుతున్నందుకు నన్ను క్షమించు అనే రాతలు ఉద్యమకారులను, గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. తెలంగాణ కోసం చేపడుతున్న సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని సంగారెడ్డి వెళ్లి అటు నుండి సదాశివపేటలో జైబోలో తె లంగాణ సినిమా చూసినట్లు సుసైడ్ నోట్‌లో తెలిపాడు. ఉద్యమంలో భాగంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫ్లెక్సి బోర్డులను చింపి వేసి జగ్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన అనుచరులు మరు సటి రోజు కళాశాలకు వచ్చి బెదిరించినా తాను భయపడ లేదని సుసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
యాదగిరి విద్యాబ్యాసం
మొదటి తరగతి నుండి యాదగిరి చదువుల్లో చురుకైన విద్యార్థిగా పేరొందాడు. 10వ తరగతి వరకు హత్నూరలో, ఇంటర్మీడియట్ నల్లవాగులో, డిగ్రీ సంగారెడ్డి తార కళాశాలలో విద్యనబ్యసిస్తున్నాడు.సంగారెడ్డిలోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అంతలోనే అసువులు బాశాడు.
అంత్యక్రియలకు హాజరైన హరీష్‌రావ్
తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డ యాదగిరి అంత్యక్రియలకు ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావ్‌తో పాటు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రఘునందన్ రావ్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరి అంత్యక్రియలకు హాజరైన నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
యువకుడి అత్మహత్యాయత్నం
జిన్నారం మండలం బోల్లారం పోలిస్‌స్టేషన్ పరిధిలోని కోత్తబస్టాండులో ఓ వ్యక్తి కిరోసిన పోసుకోని నిప్పంటించుకోన్న సంఘటన బోల్లారంలో చోటుచేసుకోంది. ఆదివారం రాత్రి ఎడున్నరగంటల సమయంలో బోల్లారంకు చేందిన ఎండి ము స్తాప్ కిరోసిన్ సోసుకోని నిప్పుంటించుకోవటంతో శరీరం పూర్తిగా కాలి పోయింది.జై తెలంగాణ జైజై తెలంగాణ అంటు నినాదలు చేస్తు కుప్పకూలడంతో స్థానికులు మంటలు అర్పె ప్రయత్నం చేశారు.ఎండి ముస్తాప్ సుధీర్ఘమైన నాలు గు పేజిలలో తెలంగాణ గురించి దాని అంశం తెలంగాణ బిల్లు పార్లమెంటులో పేట్టాలని నా మరణం అంతంలేదు తెలంగాణ అరంబం అంటు రాశాడు.అతని స్థానిక అస్పత్రికి తరలించారు.
take By: Suryaa.com
0 comments:
Post a Comment