తెలంగాణకు ద్రోహం చేయడంలో చెన్నారెడ్డి మించిన జగ్గారెడ్డి
సంగారెడ్డిటౌన్,మేజర్‌న్యూస్:తెలంగాణకు 1969లో మర్రి చెన్నారెడ్డి ద్రోహం చేశాడని అదే తరహాలో నేడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అత న్నిఏమాత్రంతీసిపోకుండా తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని మాజీఎమ్మెల్సీ,టీఆర్ఎస్ పోలీట్ బ్యూరో సభ్యుడు సత్యనారాయణ,జిల్లా బీజేపీ అ ధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డిలు ఎమ్మెల్యేపై తీవ్ర స్థా యిలో విరుచుకు పడ్డారు. సిఎం పర్యటనకు ని రసనగా జిల్లా బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందం గా వ్యాపారస్తులు,విద్యాసంస్థలు మూసి వేయగా సిఎం పర్యటనను అడ్డుకుంటామన్న నేపథ్యంలో టీఆర్ఎస్,బీజేపీ,జేఏసీ నాయకులను అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ విలేక రులతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప క్కదారి పట్టించేందుకే రచ్చబండ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నారని జేఏసీ పిలుపు మేరకు సిఎం పర్యటనకు బంద్ నిర్వహించినా జిల్లా పర్యటన కు రావడం అనైతికమన్నారు.వచ్చినా పారా మి లటరీ బలగాలతో రావడం ఎందుకని అది ఆం ధ్ర దురంకారానికి నిదర్శన మన్నారు.సిఎం రాక సందర్భంగా తెలంగాణ వాదులను ఉగ్రవాదుల్లో రాత్రి రాత్రికి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖం డించారు.
తెలంగాణ ఉద్యమంలో చిత్రహింస లు,నిర్బంధాలు కొత్త కాదని, ప్రజాస్వామిక వా దులు ఈచర్యను ఖండించాలని పిలుపునిచ్చా రు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తుంటే తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ ఎమ్మెల్యే అనుచరులు బంద్‌ను విఫలం చేయిం చేందుకు గాను వ్యాపారస్తులను బెదిరించడం అనాగరిక చర్యగా అభివర్ణించారు.వ్యాపార సం స్థలను మూసి వేసిన యజమానులను షాపులను తెరవకపోతే ధ్వంసం చేస్తామని బెదిరించడం ఎంత వరకు సమం జసమని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే పోలీ సులు ఏం చేస్తున్నారని గుండాయిజం చేస్తున్న వారికి పోలీసు అండదండలు అందిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఇప్పటికైనా పట్టణంలో భ యానక వాతావరణానికి గురి చేయకుండా ప్ర జాప్రతినిధిగా గుర్తెరిగి ప్రజాసంక్షేమానికి కృషి చేయాలని కోరారు.సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్,ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, మా జీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, కేసీఆర్ యువసేన నాయకులు చంద్రశేఖర్,హన్మం త్రావు,మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.
take BY: Suryaa.com
0 comments:
Post a Comment