తెలంగాణ వ్యతిరేకులకు విద్యార్థిశక్తి సత్తా చూపుతాం
సిద్దిపేట:తెలంగాణ ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా ఉ ద్యమానికి కలిసి రాని వారికి విద్యార్థుల సత్తా ఏమిటో చూపుతామని తెలం గాణ విద్యార్థి ఐక్యవేధిక నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్ అన్నారు.విద్యార్థి శక్తి ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందేనన్నారు.తెలంగాణ ఉద్యమానికి కలి సిరాని వారందరికి ఉస్మానియాక్యాంపస్‌లో నాగంకు పట్టిన గతే పడుతుం దని హెచ్చరించారు. విద్యార్థి చైతన్యయాత్రల పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా పాత బ స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణను నా టి నుంచి నేటి వరకు అడ్డుకుంటున్నది ఆంధ్రాపాలకులేనన్నారు. ఆంధ్రాపాల కులు రాజ్యమేలుతుండటం మూలంగా తెలంగాణ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురవుతూ వస్తుందన్నారు.
ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసిపడుతున్న సమయంలో తె లంగాణ కోసం అమరులైన వారి శవాలపై ప్రమాణాలు చేసి తెలంగాణ వచ్చేవ రకు అలుపెరగని పోరాటం చేసిన ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వెళ్లగానే వైఖరిని మార్చుకుని తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేసి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారన్నారు.విద్యార్థుల త్యాగాలను పరిగణలోకి తీసుకోని నాయకులం దరికి రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదన్నారు. విద్యార్థుల త్యాగాలకు దిగివచ్చే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రకటన చేసిందన్నారు. తెలంగాణాకు అనుకూ లంగా ప్రకటన వచ్చిన 12గంటల్లోనే ఆంధ్రాప్రజాప్రతినిధులు ఏకమై రాజీ నామాలు చేస్తే తెలంగాణ ప్రకటనను కేంద్రం వెనక్కితీసుకుందన్నారు. అదే వి ధంగా తెలంగాణ ప్రజాప్రతినిదులంతా ఆనాడే రాజీనామాలకు సిద్ధమైతే తెలం గాణ ఏర్పాటు అయి ఉండేదన్నారు.తెలంగాణకు జై అనని వారందరికి విద్యార్థు ల శక్తి ఏమిటో రుచిచూపిస్తామన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాదని ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని చూే సే వారెవరికైనా నాడు మహబూబాబాద్‌కు వచ్చిన జగన్‌కు పట్టిన గతే పడుతుం దన్నారు.విద్యార్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్నా,లాఠీలు, తూటాలతో బెది రిస్తున్నాఇప్పటికీ సంయమనం పాటిస్తున్నామని విద్యార్థులంతా ఒక్కసారిగా ఉప్పె నలా కదిలితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు రెండుకళ్ళ సిద్ధాంతాన్ని వీడాలన్నారు. చంద్రబాబు ప్రతిపక్ష మా,తెలంగాణకు పక్షపతమా తేల్చుకోవాలన్నారు.తెలంగాణ బిడ్డలమే అని చెప్పుకుంటున్న గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి సర్కర్‌రెడ్డిగా మారాయని, అందరి కంటే ముందే తెలంగాణ అని నినదించిన దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి ఉ త్తిరెడ్డిగా మారిపోయారన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం యొక్క అడుగులకు మడుగు లు వత్తుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను డిల్లీలో తాకట్టుపెడుతున్నారని ఆ రోపించారు.పదవులు,కాంట్రాక్టర్ల కోసం ప్రజాప్రతినిధులు తాపత్రయపడుతు న్నారే తప్పా ఏ ఒక్కనాడు తెలంగాణ కోసం పనిచేసిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణాలోని ప్రజాప్రతినిధులంతా అధిష్టా నాల వద్ద తెలంగాణపట్ల వైఖరేమిటో తేల్చుకుని ప్రజల ముందుకు రావాలన్నారు.రానున్న పార్లమెంట్ సమావేశా ల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలే అధిష్టానంపై వత్తిడి తీసుకురావాలని లేని పక్షంలో సహాయ నిరాకరణ ద్వారానే తెలంగాణ సాధించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వి ద్యార్థి జేఎసీ నాయకులు అల్లుడు జగన్, శివకుమార్, మ దాసు శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
take by: Suryaa
0 comments:
Post a Comment