ముఖం మీద ఉమ్మేసినా పోరు
హైదరాబాద్, మేజర్‌న్యూస్: సీమాంధ్రా నేతలు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎన్ని తిట్లు తిట్టినా సీమాంధ్ర నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడే ఉంటున్నారని మండిపడ్డారు. ‘‘ముఖం మీద ఉమ్మేసినా పోరా’’ అంటూ విరుచుకు పడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ గగన్ మహాల్‌లో తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కేసీఆర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు రాక్షస సంతతికి చెందిన వారని, అందుకే తెలంగాణ వారిని పీక్కుతినేందుకే తెలంగాణకు వచ్చారని ద్వజమెత్తారు. వారిని తెలంగాణ ప్రజలు ఎన్ని తిట్లు తిట్టినా రోషం లేకనే ఇక్క డ పడి ఉంటున్నారని, ‘‘అదే మేం అయితే తల భూమికేసి కొట్టుకుని ఎప్పడో వెళ్ళిపోయే వారం’’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆంధ్ర వారి బూట్లు నాకేందుకే పనికొస్తారని, తెలంగాణ వారికి ఉద్యోగాల్లో, ప్రమో షన్లలో అన్యాయం జరిగినా ఈ సన్నాసులు పట్టించుకోవటం లేద న్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల పరాధీనత, బానిసత్వమే తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలంతా ఏకమైనా రాజకీయ నేతలు మాత్రం ఏకం కావటంలేదని విమర్శించారు. తెలంగాణపై పూటకో మాట మాట్లాడుతున్నారని ఈ ప్రాంత ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రిని ముక్కుపిండి అడగలేరా? ఇంకెందుకు మీరుండి’’ అని ప్రశ్నించారు.
ఒక హైదరాబాద్ పరిధిలోనే 11 కమర్షియల్ టాక్స్ డిప్యుటీ కమిషన్ పోస్టులకు గాను 11 మంది సీమాంధ్రా వారే ఉన్నారని, ఇప్పటికైనా ఐదుగురు తెలంగాణ వారిని డిప్యుటీలుగా నియమించి కిరణ్‌కుమార్ నిజాయితిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆశ్చర్యపోయే విధంగా భవిష్యత్తులో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపుఇచ్చారు. ఈ దీక్షకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కన్వీనర్ కే.ప్రసాద్‌రావు, సోమయ్య, కే.శ్రీనివాస్‌లు తమ సంఘీభావం ప్రకటించారు.
టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రా పెట్టుబడిదారుల రక్షణ కోసమే పనిచేసిందని, తెలంగాణ ప్రజలు ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ సమావేశంలో టీఎన్‌జీఓ అధ్యక్షులు స్వామీగౌడ్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ సి.విఠల్, దేవీ ప్రసాద్, డాక్టర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
3 comments:
మేం కే సి ఆర్ లాగ అసభ్యంగా మాట్లాడం .
దిల్లీలో కూచుని ఎక్కడ బటన్ నోక్కల్నో అక్కడ నొక్కుతం అంటున్నాడు కిరాయపాటి.
తెలంగాణా వచ్చే సవాలే లేదట.
.కెసిఆర్ సభ్యత లేకుండా మాట్లాడతారు ఒక్క హైదరాబాదే కాదుమొత్తంఆంధ్రప్రదేశ్ అంతాఅందరు తెలుగు వాళ్ళది ఎవరికీ ఎవరినీ పోమ్మనడానికి హక్కులేదుకావాలంటే తెలంగా ణావాళ్ళు విశాఖ ,విజయవాడ ,తిరుపతి ,వచ్చి ఉండవచ్చును .రాష్ట్ర విభాజనమంచిదికాదు.
విభజన వల్ల మాత్రమే తెలంగాణా అబివ్రుద్ది చెందదని తెలంగాణా వాదులే అంగీకరిస్తున్నారు. ఐతే ఇప్పుడు జరిగే ఉద్యమం యొక్క అజెండాతెలంగాణా అబివ్రుద్ది ఐతే బాగుంటుందీ. ప్రతేక రాష్ట్రమే అజండా ఐతే. తెలంగాణారాష్ట్రం ఏర్పడిన తరువాత తమ స్వార్ధప్రయొజనాలకోసంకాసుకుకుర్చున్నరాజకీయ తొడేళ్ళ పాలిట పడటం కాయం.అప్పుడు తెలంగానా వాసుల పరిస్తితీ పేనం మీద నుండి పొయ్య లో పడినట్లే .
Post a Comment