శీలం ఖరీదు రూ.5 వేలు!
కుభీర్, ఏప్రిల్ 23 (: ఆడపిల్ల అంగడి సరుకైంది. మృగాడిలా ప్రవర్తిస్తున్న మగాడి ఎదుట బలి పశువవుతోంది. డబ్బున్న వాళ్ల చేతిలో మహిళ ‘పే అండ్ యూజ్’గా మారిపోతోంది. అత్యాచారంపై దేశరాజధాని వీధుల్లో ఆందోళనకారులు ఆగ్రహంతో రగిలిపోతుంటే.. ఆదిలాబాద్ పల్లెల్లో మాత్రం అమానుషం రాజ్యమేలుతోంది. అత్యాచార బాధితురాలి శీలానికి గ్రామ పెద్దలే వెలకట్టి అబలను అపహాస్యం చేస్తున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయించకుండా, అతడికే వత్తాసు పలికారు. ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం పల్సి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి, సరిహద్దులోని మహారాష్ట్ర నుంచి ఓ గిరిజన కుటుంబం వలస వచ్చిం ది. భర్త పాలేరుగా, భార్య కూలీ పనులు చేస్తూ కాలం గడుపుతున్నారు.
ఈనెల 20న ఉదయం 9గంటల ప్రాంతంలో భర్త పనుల కోసం వెళ్లా డు. గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజావూపతినిధి వారి ఇంట్లోకి చోరబడి గిరిజన మహిళ (33)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని ఇరుగుపోరుగు అక్కడకు చేరుకునేలోపే అతగాడు పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పిన భార్య భోరున విలపించింది. అత్యాచా రం చేసిన వ్యక్తి.. గ్రామంలోని నలుగురు పెద్దమనుషులను ఆశ్రయించాడు. తనను గట్టెక్కించాలని రాయబా రం నడిపాడు. దీంతో సోమవారం బాధితురాలి భర్తకు మద్యం తాగించి పంచాయతీ పెట్టారు. బాధితురాలి శీలానికి వెల కట్టారు. జరిమానాగా రూ. 5వేల విధించగా, రూ.35వేలు అక్కడికక్కడే చెల్లించారు. మిగతా రూ.50 వేలు 29న చెల్లించాలని ఆదేశించారు. బాధిత మహిళ సంఘటన జరిగిన నాటినుంచి కుమిలిపోతుండడంతో ఆమెను స్థానిక మహిళలు ఓదార్చుతున్నారు. బాధను దిగమింగేందుకు ఆమె భర్తకు ప్రతిరోజు మద్యం తాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై గ్రామస్తులను ఆరా తీయగా ఘటన వాస్తమేనని చెప్పారు. కుభీర్ ఎస్‌ఐ తోట సంజీవ్‌ను వివరణ కోరగా అత్యాచారం ఘటన తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కేసు నమోదు చేస్తామని సెలవిచ్చారు.
0 comments:
Post a Comment