నిత్యం తోడేళ్ళు సంచరిస్తుండే లోకంలో చెల్లీ ! జర జాగ్రత్త !
ఢిల్లీ ఉదంతం తర్వాత దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. చదువుకునే లేదా ఉద్యోగాలు చేసే తమ బిడ్డలు ఎంత సురక్షితంగా ఉన్నారన్న సందేహం వారిని వెంటాడుతోంది. అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పరిసరాలు ఎంత పదిలమో పరిశీలించుకునేందుకు ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ అందిస్తున్న సూచనలు.
క్రూర మృగాలుండే దట్టమైన అడవుల్లో కూడా ఒకే చక్కటి నిబద్ధత ఉంటుందన్న విషయం మనకు తెలుసు. ఈ క్రూరమృగాలు అనవసరంగా బలహీన జంతువులను తమ వినోదం కోసం చంపవు. చిన్న ప్రాణుల ప్రాణాలతో ఏ క్రూరమృగం చెలగాటాలు ఆడవు. మరి ఇదే నిబంధన మన సభ్య సమాజానికి వర్తిస్తుందా? ఢిల్లీలో మొన్న జరిగిన కిరాతకం, దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇంకా ఎన్నో సంఘటనలు, మనల్ని మరోలా ఆలోచించేట్టు చేస్తున్నాయి.
ఈ కాలంలో ఇటు అమ్మాయిలూ, అటు వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మాయిల భవిష్యత్తు బంగారు బాటగా మారేట్టు జాగ్రత్త పడాలి. అమ్మాయిలను సమస్యల వలయంలో చిక్కుకోకుండా కాపాడుకోవాలి. అమ్మాయిలు కూడా తమను తాము నియంత్రించుకోవాలి. అలాగని ఇంతవరకు జరిగిన విపత్తులకు అమ్మాయిలే బాధ్యులు అని అనుకోవడం, అతిపెద్ద పొరపాటు. అమ్మాయిల జీవితాలు సవ్యంగా ఉండేలా, వాళ్ళు సవ్యంగా ఎదిగి, వాళ్ళ జీవితం మూడుపువ్వులు, ఆరు కాయలు కావడా నికి, వాళ్ళేమి చేయాలి? అమ్మానాన్నల బాధ్యతలేమిటి? అన్న విషయాలను చర్చించు కోవడం సమంజసమే.
చదువు పైనే ధ్యాస
విద్యార్థినులు ఐడిల్‌గా ఉండకూడదు. చదువుతూ పోవాలి. ప్రఖ్యాత సైంటిస్ట్ ఇజాక్ న్యూటన్ కదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుందని, చలనం లేని వస్తువు నిశ్చలంగానే ఉంటుందని తెలిపాడు. ఇది చదువుకూ వర్తిస్తుంది. శ్రద్ధతో చదువుతున్న విద్యార్థి చదువుతూ ఉంటే, పుస్తకమే ముట్టని వాళ్ళు, యధాతధంగా ఉండిపోతారు. అందుకే అమ్మాయిలూ ఎప్పుడూ చదువుతూ పోవాలి. వాళ్ళెప్పుడు చదువు గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఆలోచనలు ప్రవర్తనల కింద మారుతాయి. ఈ ప్రవర్తన అలవాటు కింద మారుతుంది. అప్పుడు సినిమాలు, షికార్లు, బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆలోచనలు మనసులో మెదలాడవని మనకు తెలుసు. అలాగని అమ్మాయిలు సినిమాలు చూడ కూడదని, షికార్లకు వెళ్లకూడదని అనుకోకూడదు. చదువుకుంటూ అవన్ని చేయవచ్చు. కానీ వాళ్ళు బాయ్‌ఫ్రెండ్స్‌తో సమయం వెళ్ళబుచ్చుతూ, తీసు కోవలసిన జాగ్రత్తల్ని మాత్రం మరవొద్దు.
మంచి స్నేహం ఒక కవచం
పాత కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు యోధులు కవచాన్ని ధరించేవారు. ఈ కవచం శత్రువుల కత్తిపోట్ల నుంచి యోధుణ్ని రక్షించేది. స్నేహం కూడా ఈ కవచంలాంటిదే. కవచం శరీరాన్ని కాపాడితే, స్నేహం మనస్సును గాయపడకుండా కాపాడుతుంది. స్నేహం కేవలం మనస్సును బాధలతో తట్టుకునేట్టు కాపాడడమే కాకుండా, మనిషి జీవితం లోనే ఒక సంతోషాన్ని, సంతృప్తిని నింపుతుంది. అందుకే ‘ఏనాయిస్ నిన్’ అనే ప్రముఖ విద్యావేత్త ఉద్దేశ్యం ప్రకా రం ప్రతి మిత్రుడు మనకొక కొత్త ప్రపంచం. మిత్రుడు తారసపడే వరకు మనకు ఈ ప్రపంచమే లేదు. వాళ్ళను కలుసుకున్న తక్షణమే ఈ కొత్త ప్రపంచం ఎల్లలు మనసు స్పర్శిస్తాయి.
హెన్రీ స్టాక్ సుల్లివాన్ అనే ప్రముఖ సైకాలజిస్ట్ మిత్రత్వానికి ఎక్కువ ప్రముఖ్యత ఇస్తాడు. విద్యార్థుల మానసిక మెరుగుదల, ఎదుగుదల మిత్రుల పైననే ఆధారపడి ఉంటుందంటాడు. సమస్యలు ఎదురైనప్పుడు అడాలిసెంట్స్, ప్రధమం గా మిత్రులతోనే చెప్పుకుంటారని, పార్లీ అనే సైకాలజిస్ట్ చెబుతాడు. మంచి స్నేహితురాలు విద్యార్థినికి ఒక కొత్త స్పూర్తిని ఇస్తుంది. ఒక చక్కటి గమ్యాన్ని నిర్ణయించుకొనేందుకు సహకరిస్తుంది. అల్లరి చిల్లరగా తిరుగుతూ, ప్రస్తుత కోరికల సంతృప్తికే ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి స్నేహితు రాలుగా దొరికితే మాత్రం ఒక సమస్యగా మారుతుంది. తాజెడిన కోతి, వనమెల్ల చెరిచింది అనే సామెత మాదిరి, ఈ అమ్మాయి స్నేహం వలన మిగతా పిల్లలు కూడా ఇదే వంతు పాట పాడుతారు. అప్పుడు అమ్మాయిలు ప్రమాదాల్ని ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకే అమ్మాయి స్నేహితులు ఎలాంటి వాళ్ళు అన్నది అమ్మానాన్నలు గమనించాలి. అలాగని అమ్మాయిల పైన మరీ పోలిసీంగ్ కూడా చెయ్యకూడదు.
తెలివితేటలు దేవుడిచ్చిన బహుమానం
మనం ఒక మిత్రుని పుట్టిన రోజు పార్టీకి వెళ్లామని అనుకుందాం. అతనికి మనమొక చక్కటి బహుమానం తీసుకెళ్ళతాము. ఈ బహుమానాన్ని మిత్రునికి ఇచ్చినప్పుడు, అతని దాన్ని దగ్గరున్న చేత్త బుట్టలోకి విసిరేస్తే, మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. లాగి లెంపకాయ కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. మనమిచ్చిన బహుమానాన్ని అవమానపరిస్తే,మనల్ని అవమానపరచినట్టు బాధ పడతాం. మరి తెలివితేటలు దేవుడు మనకి చ్చిన బహుమానం.ఈ తెలివితేటల్ని సరిగ్గా ఉపయోగించి మనం ఎదగకపోతే, దేవున్నే అవ మానపరిచినట్టు అవుతుంది కదా? ఈ విషయాన్ని అమ్మాయిలు గుర్తుంచుకోవాలి. ఒకవేళ అమ్మాయి లు మరచి పోతే అమ్మానాన్నలు గుర్తు చేయ్యాలి.
నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు
మరణం పట్ల అందరికుండే ఆలోచన మనందరికి తెలుసు. మరణం ఖాయమైనప్పటికి, ‘ఇది నాకు వర్తించదు మిగతా వాళ్ళకే ఇది పరిమితం. నేను చనిపోను. అని ప్రతి వ్యక్తి అనుకుంటాడు’ అని జొనాధన్ బ్రూనెస్టీన్ అనే ప్రముఖ ఫిజిషియన్ అంటాడు.
దీన్నే సైకాలజీలో ఎస్కేపిజం అని అంటాము. ఇలాంటి ఎస్కేపిజం మనం అడోలిసెంట్స్ దశలో గమనిస్తాం. ఈ దశలో ఉన్న పిల్లలు, అమ్మాయిలైన, అబ్బాయిలైనా చాలా రాష్‌గా ప్రవర్తిస్తారన్ని మనకు తెలిసిందే. నాకెలాంటి ప్రమాదం వాటిల్లదు, అనే ఆలోచన వీరిది. ఈ దశలో వీళ్ళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ఈ వయస్సులో మరణించడం జరిగితే, 40శాతం పైగా మోటారు ప్రమాదాల్లో జరుగుతుందని సర్వేలు తేలిపాయి. కేవలం మోటార్ సైకిల్స్, కార్లు వేగంగా నడపడమే కాదు, వీళ్ళ జీవితమే ఫాస్ట్‌లేన్‌లో ఉంటుంది. సెన్సేషన్ -సీకింగ్ వీళ్ళ వేదాంతం. అందుకే ఈ వయస్సులో అబ్బాయిలు, అమ్మాయిలు అనవసరమైన రిస్క్ తీసుకుంటారు. చీకటిపడ్డా ఒంటరిగా పోవాలను కుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి సమయాన్ని పట్టించుకోకుండా ఇంటికి రావాలనుకుంటారు. నాకేమీ జరగదులే అని భావిస్తారు. అమ్మానాన్నలు, అమ్మాయిలను ఇలా ప్రవర్తించకుండా నియంత్రిం చాలి. ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న వ్యవహారాలు మనందరి కళ్ళు తెరిపించాలి.
ప్రేమ ఒక ఎండమావి ఈ కాలంలో కొంతమంది అమ్మాయిల సమస్యల్లా, ప్రేమలో పడ్డామని భ్రాంతి పడడం. ఈ భ్రాంతి వీళ్లను , అబ్బాయిలైతే స్వేచ్ఛగా తిరిగేట్టు ప్రేరేపిస్తుంది. ప్రేమించాను అని అనుకున్న అబ్బాయిలైతే సినిమాలు, షికార్లు మొదలవుతాయి. అప్పుడు అమ్మానాన్నల మాటలు నీటి మూటలనిపిస్తాయి. చదువు కాస్తా చట్టబండలౌతుంది. నిజం చెప్పాలంటే ఈ వయస్సులోని అమ్మాయిల్లో చెలరేగే శారీరక ఉత్తేజాన్ని ప్రేమ అని నిర్వచించడం పొరపాటు. ఇది కేవలం ఈవయస్సులో శరీరాల్లో విడుదలవుతున్న హార్మోన్స్ ప్రభావం వల్ల, వీళ్ళలో కలిగే శారీరక ఉత్తేజం అని , ప్రేమ కాదని తెలుసుకోవాలి. అందుకే వీళ్ళు ప్రేమ అనుకునే ఈ మానసిక స్థితి ఎక్కువ కాలం నిలవదు. సైకాలజిస్ట్‌ల సర్వేల ప్రకారం అడోల్‌సెంట్స్ లో ప్రేమనుకొని దగ్గరయ్యేవాళ్ళు, అతి త్వరలోనే మళ్ళీ దూరమవుతారని తేలిపోయింది. అందుకే ప్రేమని భ్రమపడి, కొంతకాలం రాసుకొని,పూసుకొని తిరిగిన అమ్మాయిలు త్వరలోనే తెలుసుకొని, అబ్బాయిలనుండి విడిపోతారు. ఇటు అబ్బాయేమో, ‘మనసు పారేసుకున్నాను,సినిమాలకు, షికార్లకు ఈమెను తిప్పి నా మొత్తం డబ్బు తగలేసాను.
అయినప్పటికి ఈమె నాకు చెయ్యిచ్చింది.’ అనుకొని బాధపడతాడు. ఈ అబ్బాయి కాస్తా పోకిరి వాడైతే లేదా దుష్ట స్వభావం కలవాడైతే అమ్మాయికి ప్రమాదమే. ఇలాంటి అబ్బాయిలు యాసిడ్ దాడులు చేయ్యొచ్చు. ఇంకేదైనా దుష్ట చేష్టలు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే, వయస్సులో ఉన్న అమ్మాయిలు ఎక్కువ సమయం అబ్బాయిలతో ఒంటరిగా కలిసి తిరుగకూడదు. గ్రూప్‌లో అందరితో కలిసి మాత్రమే మెలగాలి. అలాకాకుండా అమ్మాయి ఒంటరిగా అబ్బాయితో కలిసి తిరుగుతూ సమయం గడుపుతుందంటే, అమ్మానాన్నలు తెలుసుకుని తక్షణం రంగంలోకి దూకాలి. పనుల్లో మునిగి, ఆలస్యం చేయకూడదు.

0 comments:
Post a Comment