తెలంగాణపై నెలలోగా తేలుస్తాం
నెలలోగా తేలుస్తాం
తెలంగాణపై ఇదే చివరి అఖిలపక్షం.. అందరూ సత్వర నిర్ణయం కోరారు
యువత శాంతియుతంగా ఉండాలి.. తీసుకునే నిర్ణయం మంచిదే అవుతుంది
అన్ని పార్టీలూ అభివూపాయాలు చెప్పాయి.. వాటిని నోట్ చేసుకున్నా.. కేంద్రానికి నివేదిస్తా
ఏపీ ప్రజల సమస్యను అర్థం చేసుకున్నా.. పార్టీల అభివూపాయాలు ఇక్కడ చెప్పలేను
అఖిలపక్షం అనంతరం షిండే వ్యాఖ్యలు
నెల గడువు ప్రస్తావనలేని పీబీఐ కథనం.. నేతలే నెల గడువు సూచించారని వెల్లడి
ఏమీ తేల్చలేదు.. నెలపాటు ధూం తడాఖే
కాంగ్రెస్‌కు తెలంగాణ ఉద్యమ హెచ్చరిక
న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (): న్యూఢిల్లీ, హైదరాబాద్, డిసెంబర్ 28 (టీ మీడియా): రాష్ట్రంలో దీర్ఘకాలంగా నలుగుతున్న తెలంగాణ అంశంపై నెలలోపు నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. శుక్రవారం ఇక్కడ ఎనిమిది రాజకీయ పార్టీలతో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీల అభివూపాయాలను తాను జాగ్రత్తగా విన్నానని చెప్పారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులు తెలంగాణపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారని తెలిపారు. కొందరు నెలలో నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. ‘‘నేను అన్ని పార్టీల ప్రతినిధుల అభివూపాయాలను జాగ్రత్తగా విన్నాను. ఈ సమావేశం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాను. ఒక నెలలోపు మేం ఒక ఫలితంతో వస్తాం.
నెలలోపు ఒక నిర్ణయం ఉంటుంది’’ అని షిండే చెప్పారు. అయితే.. తెలంగాణ విషయంలో నాన్చుడు ధోరణులకు, సాగదీత వ్యవహారాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేదిలేదని, అది ప్రకటించిన నెలగడువులోనూ మునుపెన్నడూ చూడని ఉధృత ఉద్యమాన్ని చవిచూపిస్తామని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. దాదాపు మూడేళ్లుగా కాంగ్రెస్ దోబూచులాటలను గమనిస్తున్నామని, ఇంకా మోసపోయే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఈ చివరి దశలోనూ మోసం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉండగా.. పీఐబీలో ఉంచిన అఖిలపక్ష సమావేశం వివరాల నోట్ కలకలం రేపింది. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని పదే పదే షిండే తన విలేకరుల సమావేశంలో ఉద్ఘాటించగా.. పీఐబీ పోస్ట్ చేసిన కథనంలో ఆ ప్రస్తావనే లేకుండాపోయింది. ఒక దశలో షిండే తన మాట మార్చారని కూడా వాదనలు వచ్చాయి.
సాధారణంగా పీఐబీ కేంద్ర మంత్రుల మాటలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రకటన వెలువరిస్తుంటుంది. అయితే.. కీలకమైన ఈ సమావేశంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలుగా ఉన్న ‘నెల రోజుల్లోపు నిర్ణయం ఉంటుంది’ అన్న వాక్యాన్ని ప్రస్తావించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తున్నది. ఇదెలా ఉన్నప్పటికీ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై జరుగుతున్న ఉద్యమంతో గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రవూపదేశ్ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని షిండే విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలోని యువత శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘యువత శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను. ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మంచిదే ఉంటుంది’’ అని ఆయన చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు ఏం చెప్పారో వెల్లడించేందుకు హోం మంత్రి తిరస్కరించారు.
‘‘జరిగినది ఇన్‌కెమెరా(బహిరంగం కాని) సమావేశం. ఆ వివరాలు చెప్పేందుకు ఇది వేదిక కాదు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభివూపాయాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అని తెలిపారు. తెలంగాణ అంశంపై ఇదే చివరి అఖిలపక్ష సమావేశమని ఆయన అన్నారు. సుహృద్భావపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంపై తాను పూర్తి సంతృప్తితో ఉన్నానని చెప్పారు. అన్ని పార్టీలూ తమ అభివూపాయాలను చెప్పాయని హోం మంత్రి తెలిపారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఎంత మంది ప్రజలు సంతృప్తి చెందుతారన్న విలేకరుల ప్రశ్నకు.. ‘‘ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది సంతృప్తి చెందుతారు. కొంతమందిలో అసంతృప్తి ఉంటుంది’’ అని బదులిచ్చారు. సమావేశంలో అన్ని పార్టీల ప్రతినిధులు చెప్పిన అభివూపాయాలను తాను రాసుకున్నానని తెలిపారు. నిర్ణయం తీసుకోబోయే ముందు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
నెలలోపు తీసుకునే నిర్ణయం తుది నిర్ణయం అవుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా.. నెల రోజుల్లో నిర్ణయం వస్తుందని చెప్పాను కదా.. అన్నారు. పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని చెబుతూ వాటిని అభినందించారు. అన్ని పార్టీలూ సంతృప్తితో సమావేశం నుంచి వెళ్లాయని చెప్పారు.
పదహారు మంది ప్రతినిధులు
రాష్ట్రంలోని ఎనిమిది రాజకీయ పార్టీల నుంచి పార్టీకి ఇద్దరు చొప్పున 16 మంది ప్రతినిధులు తెలంగాణపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పదిగంటలకు హోం మంత్రి షిండే కార్యాలయం ఉన్న నార్త్‌బ్లాక్‌లోని సమావేశ మందిరంలో అఖిలపక్షం మొదలైంది. కాంగ్రెస్ నుంచి రాష్ట్ర మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌డ్డి(తెలంగాణ ప్రాంతం), సీనియర్ నేత గాదె వెంకటడ్డి(సీమాంధ్ర ప్రాంతం) హాజరయ్యారు. టీడీపీ నుంచి సీనియర్ నేత కడియం శ్రీహరి(తెలంగాణ), మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు(సీమాంధ్ర) వచ్చారు. సీపీఐ ప్రతినిధులుగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే గుండా మల్లేష్ పాల్గొన్నారు.
సీపీఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఎమ్మెల్యే జూలకంటి రంగాడ్డి హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంవీ మైసూరాడ్డి(సీమాంధ్ర), కేకే మహేందర్‌డ్డి (తెలంగాణ) హాజరుకాగా.. ఎంఐఎం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, మరో ప్రతినిధిగా జీవీజీ నాయుడు వచ్చారు. టీఆర్‌ఎస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు, సీనియర్ నేత నాయిని నర్సింహాడ్డి పాల్గొన్నారు. హోం మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అఖిలపక్ష సమావేశానికి ప్రత్యేకంగా హాజరయ్యారు.
0 comments:
Post a Comment