చల్లారిన ఢిల్లీ
-ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ విచారణ
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-భద్రత కల్పిస్తాం: ప్రధాని మన్మోహన్
-ఆందోళనకారులను మావోయిస్టులతో పోల్చిన షిండే
-4న డీజీపీలు, సీఎస్‌లతో భేటీ
-మహిళలమీద నేరాలపై సమీక్ష
-ఢిల్లీ దిగ్బంధం.. తీవ్ర ఆంక్షలు.. భారీగా బలగాలు.. ఆందోళనల కట్టడి
-బాధితురాలి ఆరోగ్యం విషమం
-గ్యాంగ్ రేప్ కేసులో వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-ఆందోళనకారులను రెచ్చగొట్టారంటూ రాందేవ్, వీకే సింగ్‌పై కేసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని ప్రారంభం
దేశవ్యాప్తంగా
తీవ్ర ప్రజాక్షిగహానికి కారణమైన యువతి సామూహిక అత్యాచార ఘటనపై సత్వర
విచారణకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కేసులో రోజువారీ విచారణ జరపడానికి
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్యాంగ్ రేప్
ఘటనతోపాటు ఇతర అత్యాచారాల కేసుల విచారణకు ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్
కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మురుగేశన్
ధ్రువీకరించారు. ఇందుకు జనవరి 2 తర్వాత నోటిఫికేషన్ వెలువడనుంది. యువతి
గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రతకు సంబంధించి
అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు.
‘‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక
నేరానికి బాధితురాలిగా మారిన యువతి పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన
చెందుతోంది’’ అని చెప్పారు. ఇండియాగేట్ వద్ద హింసాత్మక ఆందోళనలకు దిగిన
నిరసనకారులను హోం మంత్రి షిండే మావోయిస్టులతో పోల్చే ప్రయత్నం చేశారు.
ఇండియా గేట్ వద్ద మావోయిస్టులు వచ్చి ఆందోళన చేసినా ప్రభుత్వం
స్పందించాలా? అని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఏసీపీలపై
ఢిల్లీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు
దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీలో సోమవారం ఎక్కడ చూసినా భద్రతా వలయాలు
కనిపించాయి. ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి.
గ్యాంగ్ రేప్ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ విచారణ!
-ఢిల్లీలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు ఏర్పాటు
-జనవరి 2 తర్వాత విచారణ
-గ్యాంగ్ రేప్‌పై చర్యలకు ఉపక్షికమించిన ప్రభుత్వం
-ఇద్దరు ఏసీపీలపై సస్పెన్షన్ వేటు
-వారంలోగా చార్జిషీట్: పోలీసులు
-చట్టాల సమీక్షపై జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు
న్యూఢిల్లీ,
డిసెంబర్ 24:యువతి సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాక్షిగహం
వెల్లు నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్షికమించింది. ఈ కేసులో సత్వర
విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఫాస్ట్‌వూటాక్ కోర్టుల
ఏర్పాటు విషయమై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి
షీలాదీక్షిత్ సోమవారం చీఫ్ జస్టిస్ మురుగేశన్‌తో భేటీ అయి చర్చించారు. ఈ
నేపథ్యంలో జనవరి మొదటి వారంలో హస్తినలో ఐదు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు
ప్రారంభం కానున్నాయని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీ మురుగేశన్ మీడియాకు
ధ్రువీకరించారు. ఇటీవలి గ్యాంగ్ రేప్ ఘటన సహా.. అత్యాచార కేసుల్లో రోజువారీ
విచారణ జరిపేందుకు ఈ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. సెలవుల అనంతరం హైకోర్టు
జనవరి 2న తిరిగి ప్రారంభం కానుంది. ఆ వెంటనే ఫాస్ట్‌వూటాక్ కోర్టుల
ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. మరోవైపు గ్యాంగ్ రేప్ ఘటనకు
సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లపై సస్పెన్షన్ వేటు
వేసింది.
ఈ నెల 16న నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల యువతిపై జరిగిన
కిరాతక సామూహిక అత్యాచారం ఘటనపై ఢిల్లీ సహా, దేశవ్యాప్తంగా ఆందోళనలు
జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ఢిల్లీ
లెప్టినెంట్ గవర్నర్ తేజిందర్ కన్నా తన పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని,
నగరానికి చేరుకున్నారు. ఆ వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, మహిళా సంఘాల
ప్రతినిధులతో చర్చలు జరిపారు. దేశ రాజధానిలో మహిళల భద్రతకు అనుసరించాల్సిన
కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. మరోవైపు గ్యాంగ్ రేప్ కేసులో వారం
రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు
కారణమైన ఆరుగురు నిందితులపై దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని తెలిపారు.
ఆదివారం నాటి హింసాత్మక ఆందోళనకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులు
నమోదుచేశారు. అలర్లకు ప్రోత్సహించారని, హింసకు ప్రేరేపించారనిఆర్మీ మాజీ
చీఫ్ వీకేసింగ్,బాబా రాందేవ్‌పై కేసులు పెట్టారు.
జస్టిస్ వర్మ కమిటీ పని మొదలు
లైంగిక
దాడుల కేసుల్లో సత్వర న్యాయం, దోషులకు శిక్ష పెంపుదల విషయమై ప్రస్తుతమున్న
చట్టాలను సమీక్షించడానికి ఏర్పాటైన ముగ్గురు న్యాయకోవిదులతో కూడిన జస్టిస్
వర్మ కమిటీ సోమవారం తన పనిని ప్రారంభించింది. ఈ అంశంపై జనవరి 5న
ప్రజాభివూపాయాన్ని తెలియజేయాలని కమిటీ నోటీసును జారీచేసింది.
కానిస్టేబుల్ పరిస్థితి విషమం :
ఢిల్లీ
గేట్ వద్ద నిరసనల సందర్భంగా చెలరేగిన ఘర్షణలోగాయపడిన పోలీస్ కానిస్టేబుల్
పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్ సౌకర్యం కొనసాగుతోందని
వైద్యులు సోమవారం తెలిపారు.
ఆపదలో ఆదుకునే ‘167’
అత్యాచార
నిరోధానికి ఢిల్లీలో ఓ హెల్ఫ్‌లైన్ ప్రారంభంకాబోతోంది. 167 నంబర్‌తో ఈ
సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఆపదలో ఉన్న మహిళలు ఆ నెంబర్‌కు
ఫోన్ చేయగానే క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని వారి రక్షించే
ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్
విజ్ఞప్తి మేరకు టెలికంశాఖ మూడు అంకెల హెల్ఫ్‌లైన్‌ను కేటాయించిందని
సోమవారం కేంద్ర టెలికం శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
భద్రత కల్పిస్తాం.. ఆందోళన వద్దు
-ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్
యువతి
గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో ఆందోళన చెందవద్దని, మహిళల భద్రత సంబంధించి
అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు.
శాంతియుతంగా ఉండాలని ఆందోళనకారులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ముగ్గురు కుమ్తాలకు తండ్రిగా నేనూ
మీలాగే ఆందోళన చెందుతున్నా. ఈ కిరాతక నేరానికి బాధితురాలిగా మారిన యువతి
పట్ల నా భార్య, కుటుంబం కూడా ఆందోళన చెందుతోంది’ అని చెప్పారు. ఈ ఘోరమైన
ఘాతుకానికి సంబంధించి జరిగిన జాప్యంపై పరిశీలన జరుపుతామని, మహిళల భద్రతకు
సంబంధించి అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఆందోళనల్లో
హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఆందోళనకారులు.. మావోయిస్టులు!
-ఇద్దరికీ పోలిక పెట్టిన షిండే
-ఇండియా గేట్‌కు వెళ్లి.. చర్చలు ఎందుకు నిర్వహించాలి
-కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు
-4వ తేదీన అన్ని రాష్ట్రాల డీజీపీ, సీఎస్‌లతో భేటీ
-మహిళలపై నేరాలపై సమీక్ష
న్యూఢిల్లీ,
డిసెంబర్ 24: గ్యాంగ్‌రేప్ ఘటనపై రగిలిపోయి ఉద్యమిస్తున్న ఆందోళనకారులను
ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే వివాదాస్పద వ్యాఖ్యలు
చేశారు. ఇండియాగేట్ వద్ద ఆగ్రహంతో దాడులకు దిగిన ఆందోళనకారులను
మావోయిస్టులతో పోల్చారు. గ్యాంగ్ రేప్ ఘటనపై వెల్లు ప్రజాక్షిగహాన్ని
అర్థం చేసుకోలేక రాజకీయపార్టీలు సతమతమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు
చేయడం గమనార్హం. ‘‘ హోంమంత్రి ఇండియా గేట్ దగ్గరికెళ్లి.. చర్చలు జరపాలని
చెప్పడం చాలా సులువు. రేపొద్దున్న ఏదైనా పార్టీ కూడా ప్రదర్శన
నిర్వహిస్తే..అప్పుడు కూడా హోంమంత్రి వెళ్లాల్సిందే. రేపొద్దున్న
కాంగ్రెస్, బీజేపీ కూడా ఇక్కడ ప్రదర్శనలు నిర్వహిస్తాయి. మావోయిస్టులు కూడా
ఆయుధాలతో ప్రదర్శనలు నిర్వహిస్తారు’’ అని ఆయన వివిధ ఇంటర్వ్యూలలో
పేర్కొన్నారు. ‘‘ఈ పరిస్థితి రేపొద్దున్న ఏ ప్రభుత్వానికైనా రావచ్చు.
ప్రభుత్వం ఎందుకు వెళ్లాలి?’’ అని ప్రశ్నించారు. ఆందోళనకారులను
మావోయిస్టులతో పోలుస్తున్నారా? అని ప్రశ్నించగా ‘‘శాంతి భద్రతల నుంచి
దీనిని వేరు చేయలేరు. ఆందోళన మొదలైననాటి నుంచి నిరసనకారుల ప్రతినిధులతో
నేను మాట్లాడుతూనే ఉన్నాను.
వారు న్యాయం కోరుతున్నారు. ఏ రకమైన
న్యాయం మేమివ్వగలం’’ అని అన్నారు. ఇండియా గేట్ వద్ద ఆదివారం జరిగిన
హింసాత్మక ఆందోళన వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై
విచారణ జరుపుతున్నామని తెలిపారు. జనవరి నాలుగున అన్ని రాష్ట్రాల డీజీపీలు,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి.. మహిళలపై జరుగుతున్న
దాడులు, అత్యాచారాలపై చర్చిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు లైంగిక
హింసకు గురవుతున్నారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఢిల్లీలో
యువతి గ్యాంగ్ రేప్ ఘటనపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి
లేదా, అఖిలపక్షం భేటీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ఆయన తోసిపుచ్చారు. ఆయన
సోమవారం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యారు. ఇటీవల గ్యాంగ్
రేప్ ఘటనతోపాటు మహిళలపై లైంగిక దాడులపై విచారణకు ఫాస్ట్‌వూటాక్ కోర్టులు
ఏర్పాటు చేయాలని ఆయన చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తిచేశారు. అత్యాచారాలపై సత్వర
విచారణ, శిక్ష పెంపు విషయమై ప్రస్తుతమున్న చట్టాలను సమీక్షించడానికి
ఏర్పాటు చేసిన కమిటీకి నివేదిక సమర్పించడానికి నెల రోజులపాటు గడువు
ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌వైపు దూసుకొచ్చిన ఆందోళనకారులపై
పోలీసుల అణచివేతను షిండే సమర్థించారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్‌ను
ముట్టడించేందుకు ప్రయత్నించడం సరికాదని పేర్కొన్నారు.
అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం
-ఆగని అంతర్గత రక్తవూసావం
-ఇంకా కృత్రిమ శ్వాసలోనే : వైద్యులు
న్యూఢిల్లీ,
డిసెంబర్ 24: ‘గ్యాంగ్ రేపుకు గురైన పారామెడికల్ విద్యార్థి ఆరోగ్య
పరిస్థితి సోమవారం మరింత దిగజారింది. ఆమె ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు’
అని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ యువతి మానసికంగా
దృఢంగానే ఉన్నారని తెలిపాయి. నిన్నటికన్నా పరిస్థితి ఏ మాత్రం
మెరుగుపడలేదని ఆమెకు వైద్యం అందిస్తున్న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి
సూపరింటెండెంట్ డాక్టర్ బీడీ అథానీ తెలిపారు. అంతర్గతంగా రక్తవూసావం
అధికమైందన్నారు. అది గడ్డకట్టి కొత్త సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. గత
రాత్రికూడా విపరీతంగా రక్తవూసావం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఆమెకు
ఇంకా కృత్రిమంగానే శ్వాసను అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 16న
ఢిల్లీలో నడుస్తున్న బస్సులో గ్యాంగ్ రేపు ఘటన తర్వాత ఈ పారా మెడికల్
విద్యార్థినిని (23) వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆస్పవూతిలో చేర్పించిన
విషయం తెలిసిందే. అప్పటి నుంచి వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఆ ఆమ్మాయి
ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని వెల్లడించారు. ఉష్ణోక్షిగత 102 నుంచి 104
డిగ్రీల మధ్య ఉంటోందన్నారు. బైలిర్బిన్ లెవల్ 5.5 శాతానికి తగ్గిందన్నారు.
ప్లెట్‌పూట్స్ కూడా తగ్గాయని చెప్పారు. ఇది ప్రమాదకర పరిస్థితిని
సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా అవయవాలు సాధారణంగానే పని
చేస్తున్నాయని, చికిత్సకు బాగానే స్పందిస్తున్నాయని వివరించారు. ఆమెకు
సైకాలాజీ కౌన్సెలింగ్ ఇంకా కొనసాగుతోందని సైకాలాజీ విభాగం డాక్టర్ రస్తోగీ
చెప్పారు. అంతర్గతంగా ఎన్నిగాయాలైనా ఆమె మాత్రం ఎలాంటి ఒత్తిడికి, ఆందోళనకు
గురికావడంలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ యువతి పరిస్థితి ఇంకా విషమంగానే
ఉందని, ప్రమాదం నుంచి బయటపడలేదని ఐసీయూ ఇన్‌చార్జి డాక్టర్ పీకే వర్మ
తెలిపారు. ఆమె పరిస్థితి అలాగే కొనసాగుతోందని వివరించారు. కాగా,
ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని బాధితురాలి తండ్రి సోమవారం విజ్ఞప్తి
చేశారు
0 comments:
Post a Comment