పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీత
పుణె
: ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరి
శిక్ష అమలైంది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన అనంతరం
పుణె ఎరవాడ జైలులో బుధవారం ఉదయం 7.30 గంటలకు కసబ్‌ను జైలు అధికారులు ఉరి
తీశారు. కసబ్‌ను ఉరి తీసినట్లు మహారాష్ట్ర హోం శాఖ ధ్రువీకరించింది. కేంద్ర
హోం శాఖ కూడా అధికారికంగా కసబ్ ఉరిని ధ్రువీకరించింది.
వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కసబ్‌కు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించలేదు. ముంబయిలోని తాజ్ హోటల్, శివాజీ టెర్మినల్‌లో విచక్షణా రహితంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. 2008లో జరిగిన ముంబయి మరణహోమంలో అజ్మల్ కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డారు. 2008 నవంబర్ 26న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ముంబయికి చేరుకుని మారాణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు.
2010, మే 3న కసబ్‌పై ట్రయల్ కోర్టులో నేర నిర్ధారణ.. హత్య, దేశంపై యుద్దం ప్రకటించినట్లు కేసు నమోదైంది. 2010, మే 6న కసబ్‌కు అదే కోర్టు మరణ శిక్ష విధించింది. 2011, ఫిబ్రవరి 21న బాంబే హైకోర్టు మరణ శిక్షను సమర్థించింది. 2012, ఆగస్టు 29న కసబ్‌కు విధించిన మరణ శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది. 2012 సెప్టెంబర్ 18న రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకున్న కసబ్ క్షమాభిక్ష తిరస్కరణ అనంతరం 2012 నవంబర్ 21న కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది.
26/11/2008 న కసబ్ బృందం సృష్టించిన మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 308 మంది గాయాలపాలయ్యారు. పాకిస్థాన్ కు చెందిన 10 మంది ఉగ్రవాదులు మారాణాయుధాలతో ముంబయిపై దాడి చేసి విచక్షణారహితంగా పౌరులపై కాల్పుల జరిపారు. దక్షిణ ముంబైలోని చత్రపతి శివాజీ రైల్వేస్టేషన్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహాల్ ప్యాలెస్, టవర్, లిపోల్డ్ కేఫ్, కామా హస్పిటల్, నారిమన్ హౌజ్, మెట్రో సినిమా, సెయింట్ జేవియర్ కాలెజీ, మేజాగావ్ తదితర ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. ఈ నరహంతకుల దాడిలో చాలా మంది పోలీసు అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
కసబ్ ఉరితీతపై హర్షం వ్యక్తమైంది : ఖుర్షీద్
న్యూఢిల్లీ : ముంబయిలో మారణహోమానికి పాల్పడ్డ ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. న్యాయమూర్తి నిర్ణయం మేరకే కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటేనని కసబ్ ఉరిశిక్ష అమలు రుజువు చేస్తుందన్నారు. కసబ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినప్పటికి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. కసబ్ ఉరితీతపై పాకిస్థాన్‌కు ముందే సమాచారం పంపామని తెలిపారు.
కసబ్ ఉరిపై స్పందించిన పాక్
న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరితీతపై ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. కసబ్‌కు ఉరి శిక్షను అమలు చేయనున్నట్టు తమకు భారత ప్రభుత్వం సమాచారం అందించిందని, అది అందిన వెంటనే తాము లేఖ ముట్టినట్లు ప్రత్యుత్తరమిచ్చామని పాక్ ప్రభుత్వం వెల్లడించింది. కసబ్ ఉరిపై తమ ప్రభుత్వం స్పందించలేదనడం సమంజసం కాదని పాక్ వ్యాఖ్యానించింది. 2008 సంవత్సరం నవంబర్ 26న ముంబైలోని శివాజీ టర్మినల్, తాజ్ హోటల్‌లపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈదాడులకు పాల్పడ్డ వారు అందరూ భద్రతా దళాల కాల్పుల్లో చనిపోగా కసబ్ ఒక్కడు మాత్రం ప్రాణాలతో పట్టుబడ్డాడు.
మృతులు, బాధితుల కుటుంబాలు హర్షం
26/11 దాడుల్లో మృతులు, బాధితుల కుటుంబాలు కసబ్ ఉరి అమలుపై హర్షం వ్యక్తం చేశాయి. ఆలస్యంగానైనా ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. చనిపోయిన తమ ఆత్మీయుల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. ఎప్పడో చేయాల్సిన పనిని సర్కారు ఆలస్యంగా చేసి ప్రజాధనం, అధికారులు, కోర్టుల సమయం వథాచేసిందని అభిప్రాయపడ్డారు.
కసబ్ ఉరిశిక్ష అములు అనంతరం సంబరాల ఫొటోలు
26/11 దాడుల ఫొటోలు

0 comments:
Post a Comment