సద్దికట్టిన తెలంగాణ
గంగమ్మను చేరిన గౌరమ్మ..
సంబురంగా సద్దుల బతుకమ్మ
సంబురంగా సద్దుల బతుకమ్మ
ఎంగిలిపూలతో వెలిగిన బతుకమ్మ తొమ్మిదోనాడు సద్దుల
బతుకమ్మగా అవతారమెత్తి గంగమ్మను చేరడంతో తెలంగాణ పూల జాతర ముగిసింది.
మంగళవారం తెలంగాణవ్యాప్తంగా తొమ్మిదోనాడు సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా
జరుపుకున్నారు. బతుకమ్మ గంగమ్మను చేరే తొమ్మిదోనాడు మిగతా ఎనిమిది రోజుల
కంటే పవివూతంగా ఆరాధనాభావంతో చూస్తారు. తెల్లవారుజామునే పూలు సేకరించి
ఒక్కపొద్దులతో నిష్ఠగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అంత్రానికోపాట
(బతుకమ్మ వరుస)పాడుకుంటూ పేర్చారు. ఇంటింటిలో తల్లీబిడ్డలుగా భావించి జంట
బతుకమ్మలను పేర్చారు. పెద్ద బతుకమ్మపైన పసుపు ముద్దను గౌరమ్మగా భావించి
బతుకమ్మ తలపైన ప్రతిష్ఠించారు. పూజగదిలో దేవుని (లక్ష్మిదేవీ) చిత్రపటం
వద్ద ప్రత్యేకంగా పూజలు చేశారు. కొత్త పంటలతో చేసిన పిండివంటలతో సద్దులు
కట్టారు. నువ్వులు, మొక్కజొన్న, పజ్జొన్న, కొబ్బరిబెల్లాలు, పెరుగన్నంతో
చేసిన ముద్దలతో కొత్తబట్టతో సద్ది కట్టి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం
కొత్తబట్టలు ధరించి సామూహికంగా బతుకమ్మను డప్పుచప్పుళ్లతో ఊకుగింపుగా
స్థానిక చెరువుగట్టుకు చేరుకున్నారు.
మహిళలంతా గుమికూడి ఒకరు పాట అందుకుంటే మిగితావాళ్లు కోరస్‌గా చప్పట్లు కొడుతూ, అడుగులు వేస్తూ పాటలు పాడుతూ చెరువుగట్లన్నీ కోయిల గుంపు వలె పాటలతోటలయ్యాయి. చెరువునీళ్లలో బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత ముత్తైదువలు ఒకరికొకరు కుంకుమ బొట్టుపెట్టుకొని మాంగల్యాన్ని పదికాలాలపాటు కాపాడాలంటూ పుస్తెలకు పసుపుగౌరమ్మను అద్దుకున్నారు. తెచ్చుకున్న సద్దులను పంచిపెట్టుకొని వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని పద్మాక్షిగుండం, భద్రకాళి చెరువుగట్టు, ఉర్సు రంగలీలా మైదానం, వడ్డేపల్లి చెరువు, ఖిలా వరంగల్ మెట్టుకోట, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. పరకాల, భూపాలపల్లి, గణపురం, చెల్పూరు తదితర కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
సద్దుల్లో ఉద్యమం: సద్దుల బతుకమ్మ సంబురంలో తెలంగాణ ఆత్మగౌరవ ఆకాంక్ష ప్రతిధ్వనించింది. ఊరూవాడా ఏకమై ముక్తకం జై తెలంగాణ అంటూ నినదించారు. తెలంగాణ ఆకాంక్షకు అద్దంప మహిళాలోకం బతుకమ్మలపైనా జై తెలంగాణ నినాదాల జెండాలను ఏర్పాటు చేశారు. మా తెలంగాణ మాగ్గావాలి..మా నీళ్లు మాకు కావాలి.. మా రాష్ట్రం మాకు కావాలి అంటూ నినాదాలు రాసుకొని ఆకాంక్షను చాటారు.

0 comments:
Post a Comment