పరకాలలో టీఆర్‌ఎస్ విజయకేతనం ( Parakala )

వరంగల్ : పరకాల ఉప ఎన్నికలో కారు దూసుకెళ్లింది.
పరకాల విజయం టీఆర్‌ఎస్ ఖాతాలో చేరింది. నరాలు తెగే ఉత్కంఠలో ఎట్టకేలకు
టీఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి ఘన విజయం సాధించారు. ఎట్టకేలకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్,
బీజేపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 1562 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి
మొలుగూరి భిక్షఫతి ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి
14 రౌండ్ల వరకు భారీ మెజార్టీగా దిశగా టీఆర్‌ఎస్ దూసుకొచ్చింది. చివరి
నాలుగు రౌండ్ల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. గీసుకొండ మండలంలో చాలా
వరకు కొండా సురేఖకే ప్రజలు ఓట్లు వేశారు. చివరకు సంగెం మండలం ప్రజలు
టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. భిక్షపతి గెలుపుతో కొండా సురేఖ
దిమ్మతిరిగిపోయింది. రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మూడో
స్థానంలో టీడీపీ, నాలుగో స్థానంలో బీజేపీలు నిలిచాయి. కారు దూకుడుకు
ఫ్యాన్, సైకిల్, హస్తం బంగాళాఖాతంలో పడిపోయాయి.
Take By: NT
0 comments:
Post a Comment