గిరిజనంపై పంజా
- కవ్వాల్ అడవుల్లో మరో జీవన విధ్వంసం
- నిబంధనలకు వ్యతిరేకంగా టైగర్‌జోన్
- అడవి బిడ్డలను తరిమేసే పన్నాగం
- ఖాళీ చేయాలంటూ ఆదివాసులపై ఒత్తిళ్లు
- పాములు వదిలి భయపెడుతున్న వైనం
- భారీగా నష్టపరిహారం ఇస్తామని హామీలు
- మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.68 కోట్లు
- పరిహారాలకే రూ.100 కోట్లు
- సాయం అందడంపై అనుమానాలు
- కవ్వాల్‌లో కనిపించని పెద్దపులులు
- ఉన్నట్లుగా అధికారుల జిమ్మిక్కులు
- సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు యత్నాలు
- తప్పుపట్టిన మానవహక్కుల వేదిక
- 10లక్షలతోపాటు ఉపాధి కల్పిస్తాం: కలెక్టర్
వారు మనలా పూటకోరకం తినరు. కాలానుగుణంగా ప్రకృతి ప్రసాదించిన దాంతోనే సరిపెట్టుకుంటారు! అడవిలో చెట్టు కాస్తే.. వారింట్లో ధాన్యపు గుమ్మి నిండినంత ఆనందం! చెట్టు ఎండితే దానిపువ్వుతో కల్లుచేసి ఏటమాంసంతో మజా చేస్తారు! ప్రకృతి ఫలాలే తప్ప ప్రభుత్వ పథకాలు వారికి అందని ద్రాక్షలే! కొండకోనల్లోనుంచి పారేనీరే వారికి అమృతం! రోగమొచ్చినా.. రొప్పొచ్చినా ఔషధ నిలయమైన అడవితల్లే కాపాడుతుందనే దృఢమైన నమ్మకం! కవ్వాల్ కొండకోనల్లో ఉంటున్న గిరిజనుల వర్తమాన జీవితమిది! ఇదే వారి తరతరాల చరిత్ర! భవిష్యత్ కూడా ఇలానే ఉంటుందా? లేదు.. వారి భవిష్యత్తు ఇలా ఉండబోవడం లేదు. ఊరుకాని ఊరులో.. తమ భాషకు, తమ సంస్కృతికి, తమ జీవన విధానానికి పూర్తి భిన్నమైనలోకంలో వారు బతుకీడ్చాలి! అడవిలో ఎలాంటి కరువుకాటకాల్లోనైనా దర్జాగా బతికిన గిరిజనులు.. ఇప్పుడు కూలిపని తప్ప మరోటి చేసుకోలేని దుస్థితిని చేరుకోబోతున్నారు. దీనికి కారణం.. వారిపై సర్కారు విసురుతున్న పులి ‘పంజా’!
( ఆదిలాబాద్) పులి వారి జీవితంలో ఒక భాగం. అంతకు మించి ఇంటి దేవత! గోండులకు జన్మనిచ్చిన జంగుబాయి వాహనం పులి. పులి పేరిట ఆకిడి పేరుతో ఏకంగా ఒక పండుగే ఉంది వారికి. ఆ పండుగ రోజు పులి బొమ్మలు తయారు చేసి పూజిస్తారు. చల్లగా చూడమని పులిని వేడుకుంటారు. ఆకలై తినాలనుకుంటే ఒక్క పశువునే తిను.. అన్ని పశువులకూ హాని చేయొద్దని మొక్కుకుంటారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయంలో భాగంగా అడవిలోకి వెళ్లినప్పుడు పులి ఎదురైనా వారి భయం లేదు. తల్లీ.. నీ దారిని నువ్వు వెళ్లు.. మా దారిన మేం పోతాం.. అని చేతులు జోడిస్తే చాలు.. ఆ తల్లి ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోతుందని వారి నమ్మకం. ఆ నమ్మకంపైనే తరతరాలుగా ఇక్కడి గిరిజనులు క్రూరమృగాలు, పశుపక్ష్యాదుల నడుమ నిర్భయంగా బతుకుతున్నారు.
వారి తెగల ఆవిర్భావానికి పులి ఒక సాంస్కృతిక చిహ్నం. అంతెందుకు.. పులిని వారు తోదో అనిపిలుస్తారు. తోదో అంటే తాత అని అర్థం. ఇలా ఇక్కడి గిరిజనులు పులిని ఏకంగా తమ కుటుంబంలో పెద్ద దిక్కుగా పరిగణిస్తారు. వారికి పులితో ఎలాంటి ప్రమాదం లేదు. కానీ.. ఇప్పుడు పులిపేరుతో ప్రమాదం ముంచుకొచ్చింది. ఏళ్ల తరబడి పులులతో అనుబంధాన్ని పెనవేసుకున్న గిరిజనులను ఇప్పుడు ప్రభుత్వం టైగర్ జోన్ పేరుతో తరిమేయాలని చూస్తోంది. అంతరించిపోతున్న పులులను సంరక్షించే పేరుతో.. గిరిజన తెగలు అంతరించిపోయేందుకు ఆస్కారం కల్పిస్తోంది. అదీ నిబంధనలకు పాతరేసి. చట్టాలను చుట్టచుట్టి బుట్టదాఖలు చేసి. మార్గదర్శకాలను బేఖాతరు చేసి. టైగర్ జోన్ పేరుతో ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ అడవులను అభయారణ్యంగా నోటిఫై చేసేందుకు సర్కారు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్న గిరిజనులను అడవి తల్లికి దూరం చేయబోతున్నది. వారి చరివూతను చెరిపే కుట్ర పన్నింది.
దేశానికే వన్నెతెచ్చే ‘టైగర్ జోన్’ ఏర్పాటు చేస్తామంటూ వారిని అడవిలోంచి బయటకు నెట్టే ప్రయత్నాలు చేస్తున్నది. కవ్వాల్ అరణ్యం పెద్దపులులు జీవించడానికి అనువైన ప్రదేశమైతే అక్కడ పులుల సంఖ్య గణనీయంగా ఉండాలి. మరి అక్కడ ఎన్ని పులులున్నాయి? అంటే.. ఒక్క పెద్దపులికూడా లేదనే సమాధానమే వస్తుంది. అయినా సరే అక్కడే టైగర్‌జోన్‌ను ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లుగా రాష్ట్రంలో మరే జిల్లాలో అభయారణ్యాలులేవా? అక్కడ పులులను పెంచేందుకు ఆస్కారంలేదా? ఉంది. అయినాసరే ఇక్కడే పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రవూపభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అడవితల్లినే నమ్ముకుని కాలం వెళ్లదీస్తున్న గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు పక్కా ప్రణాళికకూడా తయారుచేశారు.
ఇది ఆచరణ రూపం దాల్చితే కవ్వాల్ అభయారణ్యం దేశంలోని 41వ పులుల సంరక్షణ కేంద్రం అవుతుంది. తాళ్లపేట్, జన్నారం, ఇంధన్‌పల్లి, బీర్సాయిపేట్, కడం అటవీరేంజ్‌ల పరిధిలో విస్తరించి ఉన్న కవ్వాల్ అడవిలోని 1100 చదరపు కిలోమీటర్ల రేడియల్ డిస్టెన్స్‌లో పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారుల సర్వేకూడా పూర్తవడంతో అడవిని వదిలేందుకు గిరిజనులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
Full News Read Click this Link
http://goo.gl/vkdHE
Or
http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=53224
Take By: T News - http://www.namasthetelangaana.com/News/Article.asp?category=1&subCategory=2&ContentId=53224
Tags: Telangana News, T News, hmtv, Sima Andra, AP News, Political News, Hyderabad News, Hyderabad, Telangana, India News, Adhila Bad, Karim Nagar,
0 comments:
Post a Comment