సిన్నబోతున్న సింగరేణి
-ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు 123వ వసంతంలోకి సింగరేణి
-సింగరేణిని ముంచిన సీమాంధ్ర సర్కారు
-నేడు వ్యాపార సరుకుగా మార్చి
-అడ్డగోలుగా తవ్వేస్తున్నారు
-యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ
-ఉద్యోగాలపై ప్రైవేటీకరణ దెబ్బ
-యాంత్రీకరణతో మరో ఎసరు
-30 వేల మంది కార్మికుల తొలగింపు
-నాడు ప్రాంత పరిశ్రమల కోసమే
( కోల్‌బెల్ట్ ప్రతినిధి):‘తల్లి నవ్వితే మాగాణి.. ఎద తలుపు తీస్తే సింగరేణి’ అన్నాడో కవి... కానీ మన సింగరేణి సీమాంధ్ర కడుపునింపితే, మాగాణి భూములు బొందల గడ్డలుగా మిగులుతున్నాయి. తెలంగాణ గర్భాన్ని చీల్చి, నల్లబంగారంతో దేశానికి వెలుగులిస్తున్న సింగరేణి సీమాంధ్ర సర్కారు కుట్రలు, కుతంవూతాలతో కుదేలవుతోంది. శ్రమైక జీవన సౌందర్యం, కార్మికుల అవిక్షిశాంత పోరాటాలతో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, తన ఖాతాలో ఎన్నో రికార్డులను వేసుకున్న ఈ సిరుల తల్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గల్లా పెట్టెలు నింపేందుకు పరిమితమవుతోంది. ఓపెన్‌కాస్టు తవ్వకాలతో నాలుగు జిల్లాల్లో గోదావరి పొడువునా ఉన్న పల్లెలన్నీ బొందల గడ్డలుగా మారాయి. యాంత్రీకరణ పేరుతో సాగుతున్న ఉపరితల బొగ్గు గనుల్లో కనీస ఉపాధి కరువైంది. మరో వందేళ్లకు సరిపడే బొగ్గునిల్వలున్నా నేటికీ కోల్ కారిడార్‌కు మోక్షం కల్పించలేదు. మాంచెస్టర్ ప్రణాళికలకు రూపమివ్వలేదు. కొత్త పరిక్షిశమలను ఏర్పాటుచేయకపోగా ఇక్కడున్న పరిక్షిశమలను సీమాంధ్ర సర్కార్ మూసివేసింది. మరోవైపు కోల్ కారిడార్ పేరిట కొత్త బావుల ఏర్పాటుకు ప్రణాళికలు రచించి, మరింత దోపిడీకి తెరలేపుతోంది. నాలుగు జిల్లాల్లోని వందలాది గ్రామాలు దుమ్ముధూళితో కన్నీళ్లు పెడుతున్నాయి. అయినా సీమాంధ్ర సర్కారు కనికరించడం లేదు. అంతే కాదు సింగరేణిలో గడిచిన ఆరు సంవత్సరాల్లో వివిధ ప్రమాదాల్లో 83 మంది మృత్యువాత పడ్డారు. ఇదేకాలంలో శ్వాసకోశ వ్యాధులతో 120మందికిపైగా చనిపోయారు. ఇన్ని కష్టాల మధ్య పనిచేస్తున్న నల్ల సూరీళ్లకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. డిసెంబర్ 23తో 123వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణిపై నమస్తే తెలంగాణ ఫోకస్..ఉత్తర తెలంగాణలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులు తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన వరం. హైదరాబాద్ లేని తెలంగాణను ఎట్లా ఊహించలేమో, సింగరేణి లేని తెలంగాణను కూడా ఊహించలేం. 1889లో నిజాం కాలంలో అవతరించిన సింగరేణి నిజాం పారిక్షిశామిక అవసరాలకు ముడి సరుకును అందించే బొగ్గునే కాదు ఒక నూతన పారిక్షిశామిక విప్లవాన్ని సృష్టించింది. ఆంధ్రవూపదేశ్ అవతరణకు పూర్వదశ సింగరేణి నిజాం ఏలుబడిలో ఉన్న కాలం. ఈ రెండు దశలను ఒకసారి పరిశీలిస్తే పారిక్షిశామిక ప్రగతికి ముడి సరుకును అందించే బొగ్గు పరిక్షిశమను ప్రభుత్వ రంగంలో కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్లే నిజాం రాజు అంతవరకూ బ్రిటీష్ వారి ఆధీనంలో ఉన్న హైదరాబాద్ దక్కన్ కంపెనీ నుండి మెజార్టీ షేర్లు కొనుగోలు చేసి దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వరంగ సంస్థగా సింగరేణికి ఖ్యాతి తెచ్చారు. నిజాం ఎంతటి నిరంకుశ రాజయినప్పటికీ తన దేశ అవసరాలకు తన ప్రజల అవసరాలకు భంగం కలిగించేలా వ్యవహరించలేదు. నిజాం స్టేట్ అవసరాల కోసం పరిమిత స్థాయిలో బొగ్గు తవ్వకాలు సాగించారు. నిజాం ఏలుబడిలో సింగరేణిలో సాగిన మొదటి 66 సంవత్సరాల కాలంలో మొత్తం బొగ్గు తవ్వకాలు 50 మిలియన్ టన్నులకు మించలేదు. ఆతర్వాత పరిస్థితిని పరిశీలిస్తే 2009-10 ఆర్థిక సంవత్సరంలోనే 50.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. నిజాం కాలంలో జరిగిన మొత్తం బొగ్గు ఉత్పత్తికి సమానంగా ఒక్క సంవత్సరంలో బొగ్గును తవ్వడం జరిగింది. ఈ విధంగా సింగరేణి నుండి తవ్విన బొగ్గు సంపద ఎవరికి లాభాలు పండిస్తుందో, ఎవరికి కన్నీళ్ళు మిగిల్చిందో తేలాల్సిన అంశం!!
నిజాం స్టేట్‌లో ఫ్యూడల్ దొరలు, భూస్వాములు, దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌ల దోపిడీలు, దౌర్జన్యాలు తీవ్ర స్థాయిలో ఉండేవి. నీ బాంచెన్ కాల్మొక్త అంటూ ప్రజలు అణిగిమణిగి ఉండేవారు. దొరల దోపిడీ పీడను భరించలేక పారిపోయి వచ్చినవారికి సింగరేణి ఉపాధి కల్పించి అక్కున చేర్చుకున్నది. బొగ్గు గనుల్లో పని పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నప్పటికీ ఊళ్ళలో దొరతనం భరించలేనివారికి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్న పారిక్షిశామిక ప్రాంతం ఆకర్షించింది. మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన బ్రిటీష్ అధికారుల పెట్టుబడిదారి స్వభావరీత్యా ఒక నూతన పారిక్షిశామిక సంస్కృతికి అంకురార్పణ జరిగి తదనంతర కాలంలో కార్మిక వర్గ చైతన్యానికి నాంది పలికింది. సింగరేణి కార్మికులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సింగరేణి కార్మికులు వందలాది మంది గెరిల్లా యోధులుగా పాల్గొని పోరాటంలో అమరులయ్యారు. సింగరేణి చరివూతలో కార్మిక ఉద్యమంలో అదొక ఉజ్వల ఘట్టం. 1952లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వనరులు స్థానిక అభివృద్ధికి దోహదపడటం, బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం అనే రెండంచెల అభివృద్ధి విధానం ఎజెండా మీదికి రావడం జరిగింది.
రాష్ట్ర అవతరణతో తలకిందులైన పరిస్థితి
1956 నవంబర్ 1న ఆంధ్రవూపదేశ్ అవతరణతో పరిస్థితి మొత్తం తలకిందులైంది. స్థానిక వనరులు స్థానిక ప్రజలకు చెందకుండా ఉమ్మడి రాష్ట్రం పేరిట దోచుకుపోయే ప్రాంతీయ నయా వలస విధానానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ప్రాంత అవసరాలకు పరిమితమై సాగించే బొగ్గు ఉత్పత్తి రాష్ట్ర అవతరణ తర్వాత ఆంధ్ర ప్రాంత అవసరాలను కూడా తీర్చాల్సివచ్చింది. బొగ్గు వ్యాపార సరుకుగా మారింది. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసి సొమ్ము చేసుకునే విధానం మొదలైంది. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాల అవసరాలను తీర్చే విధంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఏర్పడింది. నిజాం కాలంలో కొత్తగూడెం, ఇల్లందు, బెల్లంపల్లి ప్రాంతాలకు పరిమితమైన బొగ్గు తవ్వకాలు ఆంధ్రవూపదేశ్ అవతరణ తర్వాత కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మాదారం, గోలేటి, అటు వరంగల్ జిల్లా భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు విస్తరిస్తూ పోయారు. ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటికి 1956-57లో 1.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గత సంవత్సరం 2009-10 నాటికి 50.4 మిలియన్ టన్నులకు చేరుకున్నది. వార్షిక ఉత్పత్తి 25 రెట్లకు పెరిగిపోయింది. ఇలా ఉత్పత్తి అయ్యే బొగ్గును ఆంధ్రవూపాంతానికి తరలించి బొగ్గు ఆధారిత పరిక్షిశమలను అక్కడ నెలకొల్పడం జరిగింది. తెలంగాణ ప్రాంతం కేవలం ముడి సరుకును అందించే ప్రాంతంగా మిగిలిపోయింది. అదే సమయంలో బొగ్గును వ్యాపార సరుకుగా మార్చి అమ్మకాలు సాగించిన మిగులు నిధులను కూడా ఉమ్మడి రాష్ట్రం పేరిట తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రవూపాంత అభివృద్ధికి ఖర్చు చేయడం మొదలైంది. రాష్ట్రానికి కేటాయించిన బొగ్గులో మూడింట రెండొంతులు రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు వినియోగిస్తున్నాయి. మిగతా బొగ్గు రాష్ట్రంలోని 46 సిమెంట్ కంపెనీలు, 43 స్పాంజ్ ఐరన్ యూనిట్స్, 19 సీపీపీ యూనిట్లు మాత్రమే కాకుండా వార్షికంగా 4200 టన్నులకు మించి వాడే 182 చిన్న పరిక్షిశమలకు కేంద్ర బొగ్గు శాఖ ఉత్వర్వుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఉత్పత్తిలో 92 శాతం సరఫరా చేయాల్సి వస్తోంది. ఇట్లా వినియోగించే పరిక్షిశమల్లో 80 శాతం ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులవే.
విద్యుత్‌లోనూ అన్యాయం
తెలంగాణలోని రామగుండంలో 2600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎన్‌టీపీసీ, కొత్తగూడెంలోని ఏపీ జెన్‌కోకు చెందిన 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్‌కు సింగరేణి బొగ్గే సరఫరా అవుతున్నది. ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి చేకూర్చే విధంగా మొదటి పిట్ హెడ్ వద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం లాభదాయకం అనే అంతర్జాతీయ నిపుణుల అభివూపాయాన్ని కూడా కాలదన్ని సింగరేణికి చెందిన మణుగూరు ఏరియాలో ఏపీ జెన్‌కో మొదట నిర్మించతలపెట్టిన 1260 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వందల కిలోమీటర్ల దూరానికి ఇక్కడి బొగ్గు తరలించుకు పోయే విధంగా అప్పటి ఏపీఎస్‌బీ చీఫ్ ఇంజినీర్ నార్ల తాతారావు తన పలుకుబడితో విజయవాడకు తరలించి అక్కడ విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారన్న వాదన ఉంది. రామగుండంలోని ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించడం వల్ల ఎన్‌టీపీసీ నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ 71 శాతం తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరిలకు సరఫరా అవుతోంది. కేవలం 21 శాతం మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు. అందులో తెలంగాణకు అందుతున్నది నామమావూతమే. కానీ ఈ ప్లాంట్ కోసం సేకరించిన 10 వేల ఎకరాల భూమి తెలంగాణవారిదే. ఆ మేరకు ఈ ప్రాంత వాసులు నిర్వాసితులయ్యారు. గత 30 ఏళ్లుగా నష్టపరిహారం సక్రమంగా అందక నిర్వాసితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 10 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ నుంచి మళ్ళించారు.
ఆ మేరకు అక్కడ ఆయకట్టు తగ్గింది. ఇలా రామగుండం ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే ప్రతి యూనిట్‌కు ఇక్కడి బొగ్గునే ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యుత్‌లో మాత్రం ఒక్కశాతం కూడా ఈ ప్రాంత రైతులకు చెందడం లేదు. కొత్తగూడెం ఏపీ జెన్‌కో కేటీపీఎస్ నుండి ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 70 శాతం ఉభయగోదావరి జిల్లాలకే కేటాయించారు. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు తప్ప ఇందులో తెలంగాణకు వచ్చేదేమీ లేదు. వీటీపీఎస్‌లో 1260, రాయలసీమలో 420 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పారు. ఇటీవల వీటీపీఎస్ సామర్థ్యాన్ని కూడా పెంచారు. సి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్‌టీపీసీ సింహావూదిలో విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేసే 1000 మెగావాట్లు మొత్తంగా కోస్తాంవూధకు ఇప్పించి ఆ ప్రాంత అవసరాలు తీర్చుకుంటున్నారు. రామగుండం బీ థర్మల్ కేంద్రాలను కూడా మూసి తెలంగాణ ప్రజలను మరింత అష్టకష్టాలకు గురిచేశారు.
సంపద శాశ్వతంగా దక్కకుండా కుట్రలు
తెలంగాణ బొగ్గు సంపద శాశ్వతంగా తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర పాలకులు కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాప్టివ్ మైన్స్ పేరుమీద బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడం జరుగుతోంది. అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ ఎంత వేగవంతంగా జరుగుతున్నదో గత సంవత్సరం కంపెనీ ప్రకటించిన వార్షిక నివేదికలోని ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిస్తే అర్థమవుతుంది. 2008-09లో సింగరేణిలో జరిగిన వార్షిక ఉత్పత్తి 44.55 మిలియన్ టన్నులు. ఇందులో 32.46 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 13 ఓపెన్ కాస్టు గనుల నుండి రాగా 37 భూగర్భ బావుల నుండి 12.9 మిలియన్ టన్నులు వచ్చింది. అందులో 8 మిలియన్ టన్నులు మిషన్ మైనింగ్ ద్వారా ఉత్పత్తి జరిగింది. కేవలం 4.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రం మానవ శ్రమ ఆధారిత హ్యాండ్ సెక్షన్ ద్వారా జరిగింది. బొగ్గు ఉత్పత్తిలో నాలుగింట మూడో వంతు పాత్ర వహిస్తున్న ఓపెన్‌కాస్టు గనుల్లో 80 శాతం పనులు ప్రైవేటు కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. 14 ఓపెన్‌కాస్టు గనుల్లో పన్నెండింటిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లే పనిచేస్తున్నారు. సింగరేణికి వచ్చే సగం లాభాలు వీరి జేబుల్లోకే పోతున్నాయి.
విపరీతమైన విధ్వసం
ఆంధ్ర పాలకుల వలస దోపిడీసింగరేణి కార్మికుల మూలుగుల్ని పీలుస్తున్నది. అణిచివేత, హక్కుల హరింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. 1989-90లో 1.16 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికుల సంఖ్య ప్రస్తుతం 65 వేలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. . 2020 నాటికి మరో 30 వేల మంది పదవీ విరమణ ద్వారా బయటికి పోనున్నారు. పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న ఓపెన్‌కాస్ట్ విధానం వల్ల ఇప్పటికే తెలంగాణలో 74 ఏజెన్సీ ప్రాంతంలోని తాండాలు, ఊర్లు నేలమట్టమయ్యాయి. వారి బతుకులు సర్వనాశనమయ్యాయి. పెద్ద ఎత్తున వాగులు, వంకలు, అడవులు నాశనమవుతున్నాయి. సంపద తెలంగాణది అయితే లాభాలు సీమాంధ్ర బడాబాబుల జేబుల్లోకి పోతున్నాయి. నిజాం కాలంలో తవ్వి తీసిన బొగ్గు నిజాం స్టేట్‌లోని పరిక్షిశమలైన రైల్వే, రోడ్డు, ట్రాన్స్‌పోర్ట్, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పొగాకు, వస్త్ర, సిమెంట్ తదితర పరిక్షిశమల అవసరాలను తీర్చేది. ఈ ప్రాంతంలో తవ్వి తీసిన బొగ్గు ఈ ప్రాంత పారిక్షిశామిక అవసరాలకు వినియోగించడం వల్ల ఆ మేరకు పారిక్షిశామిక అభివృద్ధి ఫలితాలు ప్రాంత ప్రజలకు దక్కాయి. పర్యావరణ విధ్వంసం కూడా పరిమితంగా ఉండిపోయింది. బొగ్గు తవ్వకాల వల్ల నిజాం కాలంలోని 66 సంవత్సరాలు పర్యావరణ విధ్వంసం ఇవాళ ఒక్క సంవత్సరంలోనే జరిగిపోతుంది.
కుంభకోణాలు.. అప్పులు
కేంద్ర ప్రభుత్వం అవలంబించిన నూతన బొగ్గు విధానం విదేశీ బొగ్గు దిగుమతులకు కల్పించిన రాయితీలు వారికి మార్కెట్ సృష్టించడానికి కల్పించిన కోల్ లింకేజ్ డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు వందల కోట్ల కుంభకోణాలకు దారి తీశాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ రంగ పరిక్షిశమను నిర్వీర్యపరిచి నూతన బొగ్గు బ్లాకులను పెద్ద ఎత్తున ప్రైవేటు పరం చేస్తూ పోయింది. వారికి ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకునే స్వేచ్ఛను, అనేక రాయితీలను, చట్టపరమైన వెసులుబాటును కల్పించింది. సింగరేణి దశాబ్దకాలంగా లాభాలు సాధిస్తున్నప్పటికీ ఈ పరిస్థితుల వల్లే ఈ రోజుకీ అప్పుల్లోనే కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి వడ్డీలు చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి 700 కోట్లు, అటు కేంద్రానికి 400 కోట్లు పన్నులు, రాయల్టీల పేరిట చెల్లించడం, మరోవైపు 400 కోట్ల రూపాయలు డివిడెంట్లు ఇవ్వడం ఆగ లేదు. గత పది సంవత్సరాల్లో ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరిగితే పన్నుల రూపంలో రాయల్టీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటిన్నరట్లు, కేంద్ర ప్రభుత్వానికి 20 రెట్లు పన్ను చెల్లింపులు పెరిగాయి. గత సంవత్సరం బొగ్గు అమ్మకాల ద్వారా వచ్చిన 6396 కోట్లలో నాలుగింట మూడు వంతులు ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబుల్లోకి, అలాగే ప్రభుత్వం బొక్కసంలోకి వెళ్ళిపోయింది. సింగరేణి తరతరాల దోపిడీ నుండి విముక్తి పొందాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే మార్గం లేదని కార్మికులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటికి 44 సార్లు సమ్మె చేశారు. మరో వందరోజుల సమ్మెకూ సై అంటున్నారు.
ఇదీ ఆటుపోట్ల సింగరేణి
ప్రకృతి వల్ల ఏర్పడిన సహజ ఇంధనం బొగ్గు. గోదావరి నదీ తీరమంతా ఉన్న ఈ బొగ్గుతో వేలాది పరిక్షిశమలు పని చేస్తున్నాయి. 1771లో మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో గల రాణిగంజ్ వద్ద బొగ్గు తవ్వకం ప్రారంభించగా 1850 నుంచి తవ్వకాలు రెగ్యులరైజ్ అయ్యాయి. మధ్యవూపదేశ్‌లో 1862లో, ఆతరువాత 1871లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో గల సింగరేణి గ్రామంలో బొగ్గును కనుగొన్నారు. బ్రిటిష్ అధికారి విలియం కింగ్ కనుగొన్న ఈ బొగ్గును 1989 నుంచి దక్కన్ కంపెనీ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. 1920లో సింగరేణి కంపెనీగా సంస్థ పేరు మారింది. బొగ్గు గనులు ప్రారంభమయి 123 సంవత్సరాలవుతున్నది. సింగరేణి యాజమాన్యం 2003 నుంచి ప్రతీ సంవత్సరం సింగరేణి దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సింగరేణి భారతదేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. 51 శాతం రాష్ర్టం, 49 శాతం కేంద్రం వాటాలు ఉన్న సంస్థ. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ప్రవేశపెట్టిన నూతన పారిక్షిశామిక, ఆర్థిక విధానాల ఫలితంగా తీరు మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడులు లేవు. అయితే ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి డివిడెంట్‌ను, ఇతర పన్నులను వెయ్యి కోట్లకుపైగానే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పొందుతున్నాయి. దీంతో ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ప్రారంభించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం సింగరేణి నాలుగు వేల కోట్లకుపైగా అప్పు చేసింది. ఇలా ప్రతి ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మట్టిలో కలిసిన మోడల్ మాంచెస్టర్
-ఉన్న పరిక్షిశమల మూసివేత.. ఊసేలేని కొత్త పరిక్షిశమలు
-నడిరోడ్డున ఉద్యోగులు.. తరిగిపోతున్న సింగరేణి సిరులు
(కరీంనగర్ ప్రతినిధి/గోదావరిఖని):సింగరేణిలో మరో వందేళ్లకు సరిపడా నిల్వలున్నాయి. గడిచిన 122 ఏళ్లలో సింగరేణి ఇప్పటి వరకు 1050 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఇంకా 8 నుంచి 10వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. ఏటా 10శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతున్న సింగరేణి సంస్థకు బొగ్గు ఆధారిత పరిక్షిశమలు నెలకొల్పుకోవడానికి కావల్సిన అన్ని వనరులూ ఉన్నా.. అ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. ఒకప్పుడు 1.20 లక్షల మంది కార్మికులతో కిటకిటలాడిన సింగరేణి నేడు కేవలం 65వేల మంది కార్మికులకే పరిమితమైంది. సింగరేణి బొగ్గు ఆధారితంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రామగుండంలో నెలకొల్పిన 2600 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్టీపీసీ మినహా మరే పరిక్షిశమ లేకుండా పోయింది. గతంలో రామగుండంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో ‘ఎ’ థర్మల్, ‘బి’ థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా వాటిలో ‘ఎ’ థర్మల్ కేంద్రం మూతపడింది. బొగ్గు ఆధారిత పరిక్షిశమ అయిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 11 ఏళ్ల క్రితమే మూసేశారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా విద్యుత్ కోత వల్లే ఎఫ్‌సీఐని మూసివేయాల్సి వచ్చిందని సర్కారు నిస్సిగ్గుగా ప్రకటించింది. నైజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థ విస్తరించి ఉన్న జిల్లాల్లో 80 పరిక్షిశమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించగా, సీమాంధ్ర సర్కారు వాటిని తుంగలో తొక్కింది. నిజానికి ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నుంచి మంచిర్యాల మీదుగా కరీంనగర్ జిల్లా గోదావరిఖని వరంగల్ జిల్లా భూపాలపల్లిని కలుపుతూ అక్కడి నుంచి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు పారిక్షిశామిక కారిడార్ నిర్మించాలని ప్రతిపాదనలు వెళ్లినా ఏనాడూ పట్టించుకోలేదు.
బొగ్గు మనది.. వెలుగులు మందివి..
బొగ్గు మనది.. నీళ్లు మనవి.. శ్రామికులు మనవాళ్లు. కానీ వెలుగులు మాత్రం మందికి.. మనకు మాత్రం చీకట్లు..! ఇదీ మన దౌర్భాగ్యం! సింగరేణి బొగ్గు ఆధారిత పరిక్షిశమగా 200 మెగావాట్ల విద్యదుత్పత్తి లక్ష్యంగా రామగుండంలో 1978 నవంబర్ 14న అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఎన్టీపీసీకి పునాది రాయివేశారు. 1983 అక్టోబర్ 23న ఉత్పత్తి మొదలైంది. నాటి నుంచి నేటివరకు అంచలంచెలుగా 7 యూనిట్ల ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ దక్షిణాదిరాష్ట్రాలకు వెలుగులు పంచుతోంది. నిజానికి ఇంత భారీ ప్లాంటు తెలంగాణలో ఉండటం గర్వకారణమే అయినా, అ మేరకు కేంద్రం మనకు వాటా కేటాయించకపోవడం దారుణం. 2,600 మెగావాట్లలో మన రాష్ట్రానికి దక్కుతున్న వాటా కేవలం 29 శాతం మాత్రమే! తమిళనాడుకు 22 శాతం, కర్ణాటకకు 16 శాతం, కేరళకు 12 శాతం, గోవాకు 5 శాతం, పాండిచ్చేరికి 2 శాతం, మిగిలిన 14 శాతంలో కొంత ఇతర రాష్ట్రాలకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆ 29 శాతం వాటా కేవలం మన పది జిల్లాకు దక్కేది.
తప్పని కరెంటు కోతలు...
ఎన్టీపీసీ ఉత్పత్తిలో మన రాష్ట్ర వాటా కేవలం 29 శాతం మాత్రమే ఉండటంతో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. తెలంగాణలోని మెజార్టీ రైతులు వ్యవసాయ మోటార్లపై అధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఎన్టీపీసీ ఉన్నా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరెంటు కోసం అన్నదాత కన్నీళ్లు పెట్టని రోజంటూ ఉండదు. 2006-07లో 500 మెగావాట్ల సామర్థ్యంతో 7యూనిట్ ప్రారంభించినప్పుడు తమకు కనీసం ఇరవై శాతం అదనంగా విద్యుత్ కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కోరారు. కానీ.. కేంద్రం కరుణించలేదు. ఏటా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నుంచి 6 టీఎంసీల నీటిని ఎన్టీపీసీ వాడుతోంది. ఈ నీళ్లతో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కనీసం మరో 60వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. సింగరేణి అధారంగా నడుస్తున్న ఎన్టీపీసీలో మన వాటా పెరిగితే తప్ప తెలంగాణకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.
ఇవీ మైలురాళ్లు
అంగ్లేయుల పాలన కాలంలో ఖమ్మం జిల్లా ఇల్లందు సమీపంలో ఓ నల్లరాయి మండుతూ కనిపించింది. ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన అప్పటి బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త విలియం కింగ్ అక్కడ తవ్వకాలు జరపగా, బొగ్గు నిక్షేపాలు బయట పడ్డాయి.
1870 - బొగ్గు నిక్షేపాల కోసం బ్రిటిష్ ప్రభుత్వం అన్వేషణ
1889 - బొగ్గు ఉత్పత్తికి అంకురార్పణ
1920 - అంగ్లేయుల నుంచి హైదరాబాద్ సంస్థానం స్వాధీనం, ‘దక్కన్ కంపెనీ’గా నామకరణం
1945 - లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు
1949 - రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి, సింగరేణిగా నామకరణం
1951 - విద్యుత్తు సౌకర్యంతో డ్రిల్లింగ్ పనుల ప్రారంభం
1953- బ్యాటరీతో నడిచే క్యాప్ ల్యాంపుల (టోపీ లైట్లు) ప్రవేశం
1974 - భూఉపరితల గనులకు శ్రీకారం
1976 - యంత్రాల ప్రవేశం
1983 - లాంగ్‌వాల్ విధానంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
1986 - బ్లాస్టింగ్ గ్యాలరీ విధానంతో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
1992, 1996 - ఖాయిలా పడ్డ పరిక్షిశమల జాబితాలోకి సింగరేణి
1994 - జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఓసీపీ(ఉపరితల గని)-2 ఏర్పాటు
1998 - గుర్తింపు కార్మిక సంఘాల ఏర్పాటు
2002 - నష్టాలను అధిగమించి లాభాల బాట
2009 - అడ్రియాల్ మైన్ వద్ద లాంగ్‌వాల్ ఏర్పాటు
2010 - ఫిబ్రవరి 14 అదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200ల
మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి శంకుస్థాపన
Take By: T News
0 comments:
Post a Comment