జైపాల్ దూరాశ!
-సొంత గడ్డపై కనిపించని రాజకీయ భవిష్యత్
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం
హైదరాబాద్, డిసెంబర్ 16 ():తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పదవుల వల విసురుతుంటే మరో వైపు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని మన నేతలు అందలమెక్కేందుకు అర్రులు చాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తుది అంకానికి చేరుకున్న దశలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు, హోదాల ఆశలు చూపించి వారిని చల్లార్చిన హైకమాండ్, తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి జైపాల్‌డ్డిపైనా పదవుల బాణం విసిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో జైపాల్‌ను మరో ఏడాదిలో ఖాళీకానున్న ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించనున్నట్లు ప్రచారం మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పుడు జైపాల్ పేరును తెరమీదికి తీసుకురావడం వెనుక అధిష్ఠానం మతలబు ఏమిటో స్పష్టమవుతోందని మేధావులు, తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తున్నామంటూ ప్రచారం సాగిస్తూనే ప్రత్యేక రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌లో కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని జైపాల్‌డ్డి కూడా పదవీ సోపానం ఎక్కే ప్రయత్నంలో ఉన్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో జైపాల్‌కు వచ్చిన బెర్త్ కూడా తెలంగాణ ప్రాంత కోటాలోనే వచ్చింది.
కేబినెట్ హోదాగల ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం 2004, 2009లో అవకాశం కల్పించింది. రాజకీయ అనుభవం, మంచి పార్లమెం అధిష్ఠానంతో దగ్గరి సంబంధాలు కలిగి విశ్వాస పాత్రుడిగా పేరు... వంటివి జైపాల్‌కు అర్హతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత నేతగానే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో గుర్తింపు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తీసుకురావడానికి తెలంగాణనే అర్హతగా, ప్రామాణికంగా అధిష్ఠానం గుర్తించినట్లు వినిపిస్తోంది. ఉప్పెనలా, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడిచినా, సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో సకలజనుల సమ్మె కొనసాగినా, పార్టీలకు అతీతంగా ప్రజావూపతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించినా కూడా కేంద్ర కేబినెట్‌లో ఉంటూ జైపాల్‌డ్డి ఎక్కడ కూడా, ఏనాడు కూడా తెలంగాణ విషయంలో స్పష్టంగా మాట్లాడక పోవడం, కేంద్ర మంత్రికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర విషయంలో డొంకతిరుగుడు వైఖరి ప్రదర్శిస్తు వచ్చినందుకే ప్రతిఫలంగా అధిష్ఠానం జైపాల్‌కు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలని, పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జైపాల్‌డ్డిపై గతంలో ఒత్తిడి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తామని కూడా వారు జైపాల్ వద్ద పేర్కొన్నారు.
ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న సమయంలో కూడా జైపాల్ హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉఁటూ మౌనం పాటించారు. తెలంగాణవాదం బలపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే భయం జైపాల్‌ను వెంటాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని జైపాల్ భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా ఆయన ఇప్పటికి నాలుగు చోట్ల తిరిగారు. రాజకీయ చివరి అంకంలో ఎన్నికల్లో ఓడిపోయి తెరమరుగు కావడం కంటె రాజకీయాల్లో రిటై్మంట్ కావడమే మంచిదన్న ఆలోచనతో జైపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వారు ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉందని జైపాల్ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేక పోయినా తెలంగాణ కోటాలో ఉపరాష్ట్ర పతి పదవిపై జైపాల్ కన్నేసినట్లు మరో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కనీసం మద్దతుగా మాట్లాడక పోగా తాను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదిని కాదని, జాతీయ వాదినని ప్రకటించుకుంటూ జైపాల్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి సమైక్యవాదుల సరసన జైపాల్ నిలిచారని టీ వాదులు నేటికి మండిపడుతుంటారు. సమైక్యవాదం వైపు మొగ్గుచూపుతూనే తెలంగాణ కోటాలో అందలమెక్కుతూ వచ్చిన జైపాల్‌కు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కూడా అదే ఖాతాలో వస్తుందేమోనని పార్టీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు.
Take By: T News
0 comments:
Post a Comment