దండు క దిలింది...
(సంగారెడ్డి) పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలన్న డిమాండ్‌తో గురువారం హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహణకు జేఏసీ పిలుపు ఇచ్చింది. పోలీసు అనుమతి లేని కారణంగా జిల్లా నుంచి ఉద్యమకారులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా అన్ని రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాజీవ్ రహదారి, రామాయంపేట-హైదరాబాద్, మెదక్-నర్సాపూర్ - హైదరాబాద్, నిజాంపేట-జోగిపేట-హైదరాబాద్, జహీరాబాద్-హైదరాబాద్ రహదారులన్నిటిపై 23 ప్రాంతాలలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు పారా మిలటరీ, ఏపీఎస్‌పీ తదితర పోలీసు బలగాలన్నీ ఆయా చెక్‌పోస్టులలో ఉండి, ఉద్యమకారులెవరూ హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మూడు రోజులుగా ఆయా రహదారులపై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నా వందలసంఖ్యలో ఉద్యమకారులు హైదరాబాద్ వెళ్లి, ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్ మార్చ్‌లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. అలావెళ్లిన వారిలో మెదక్ మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.సత్యనారాయణ, టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ ఎం.రఘునందన్‌రావు, జేఏసీ పశ్చిమ కన్వీనర్ వై.అశోక్‌కుమార్, టీఆర్ఎస్ నాయకుడు జీ.బీరయ్యయాదవ్, బీజేపీ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, కే.జగన్, జేఏసీ నాయకులు సాబేర్ అలీ, ఆబేద్ అలీ, ఈశ్వర్‌ప్రసాద్, ఎంజీ అన్వర్, పద్మారావు, ఎం.విజయరావు, డీ.గోపాల్ రెడ్డి, ఎన్.శ్రీనివాస్, సోమశేఖర్, జగదీశ్వర్, చంద్రశేఖర్, శ్రీకాంత్, టీఆర్ఎస్ యువజన విభాగం కన్వీనర్ వెంకటేశంగౌడ్ తదితరులున్నారు. కాగా మార్చ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లిన టీఆర్ఎస్ నాయకుడు జీ.ఎలక్షన్‌రెడ్డిని అక్కడే పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లావ్యాప్తంగా 1200 మంది అరెస్టు
మార్చ్‌లో పాల్గొంటారన్న ఉద్దేశంతో బుధవారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా 157 మందిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం వెయ్యి మందికిపైగా ఉద్యమకారులను అరెస్టు చేశారు. మిలియన్ మార్చ్‌కు అనుచరులతో కలిసి బయల్దేరుతుండగా మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, పార్టీ నాయకుడు విజయేందర్‌రెడ్డిలతో పాటుసుమారు నలభై మందిని సంగారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. టీఆర్ఎస్ నాయకుడు పిీ.నరహరిరెడ్డి తదితరులను ఇంద్రకరణ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదాశివపేటలో పార్టీ నాయకుడు ఎన్.రాచిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. జహీరాబాద్‌లో సుమారు ఇరవై మంది న్యాయవాదులను, డెబ్బై మంది టీఆర్ఎస్, జేఏసీ, బీజేపీలకు చెందిన వారిని అరెస్టు చేసి జహీరాబాద్, జహీరాబాద్ రూరల్, చిరాగ్‌పల్లి, పోలీస్‌స్టేషన్‌లలో ఉంచారు. జోగిపేటలో ఇరవై అయిదు మంది ఉద్యమకారులను పెద్దశంకరంపేట నుంచి బయల్దేరిన ఇరవై మందిని పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు.
సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కె.రాజనర్సు నాయకత్వంలో సుమారు రెండు వందల మంది మోటారు సైకిళ్లపై బయల్దేరగా పొన్నాల శివారులో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే వారు ముందుకు వెళ్లడంతో నాగులబండ దగ్గర డీఎస్పీ నాయకత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుని వెళ్లిన మాజీ చైర్మన్ రాజనర్సును కొద్దిదూరంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే దుబ్బాకలో 18 మందిని, మిరుదొడ్డిలో 15 మందిని, కొండపాకలో 29 మందిని, గజ్వేల్‌లో సుమారు ఇరవై మందిని, వెల్దుర్తిలో 12 మందితో పాటు మరికొన్ని ప్రాంతాలలో ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎం, డీజీపీ దిష్టిబొమ్మల దహనం మార్చ్‌ను అనుమతించకపోవడంతో ఆగ్రహించిన కొల్చారం మండల జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి, డీజీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఠాణా ఎదుట ధర్నా
నారాయణఖేడ్‌లో బుధవారం తెలంగాణవాదులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఉపాధ్యాయులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన వారు గంటకుపైగా స్టేషన్ ఎదుట ధర్నా చేశారు.
వెలవెలపోయిన రైల్వేస్టేషన్ మిలియన్ మార్చ్ కారణంగా అక్కన్నపేట రైల్వేస్టేషన్ వెలవెలపోయింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, బాసర తదితర ప్రాంతాలకు రోజూ పదిరైళ్లు ఈ స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. అయితే గురువారం ఉదయం రెండు రైళ్లు మాత్రమే నడిచాయి. ఆ తర్వాత అధికారులు రైళ్లను నిలిపేయడంతో స్టేషన్‌కు వచ్చిన ప్రజలు కూడా కొద్దిసేపు నిరీక్షించి మరలా బస్‌స్టేషన్‌లకు వెళ్లిపోయారు.
0 comments:
Post a Comment