ఇక ‘అమ్మ’ దయ !
ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులను ‘అమ్మ’ కరుణించింది. తెలంగాణ అంశంపై తాము స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వివరించేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న మంత్రులకు ఎట్టకేలకు ఈనెల 12న సోనియా దర్శనభాగ్యం లభించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పోర ాటాలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, టీఆర్‌ఎస్-టీడీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ వంటి అంశాలు తమను ఇబ్బందికి గురిచేస్తున్నాయని మంత్రులు సోనియా దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఆ మేరకు వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవు తున్నారు.
ఇప్పటికే తమపై విపరీత మైన ఒత్తిళ్లు ఉన్నాయని, దానిని అధిగమించేందుకు ఇబ్బందులు పడవలసి వస్తోందని వారు సోనియాకు వివరించనున్నారు. ‘మేం మా కష్టాలు మేడమ్‌కు చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణకు అనుకూలంగా మేము కూడా ఏదో ఒకటి చేయక పోతే పార్టీ బతకదని స్పష్టం చేస్తాం. మేము ఉద్యమంలో వెనుకబడితే పార్టీ దెబ్బతింటుందని చెబుతాం. ఇక ఆమె దయ’ అని ఓ మంత్రి వ్యాఖ్యానిం చారు. ఇప్పటివరకూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారి పోయాయి. ఆమె వారిని కలవకుండా అహ్మద్‌పటేల్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీలతోనే మాట్లాడిస్తున్నారు. ఇటీవల సోనియాతో భేటీ కోసం నాలుగురోజులు ఢిల్లీలోనే మకాం వేసి, అమ్మ కరుణించక పోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరిగి రావలసి వచ్చింది.
అయితే, మంత్రులకు మాత్రం అలాంటి అవమానభారం లేకుండా స్వయంగా సోనియాగాంధీనే అపాయింట్‌మెంట్ ఖరారు చేయటంతో ఊపిరిపీల్చుకున్నారు. తమకు అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమని భావించామని, కానీ మేడమ్ కరుణించడం అదృష్టమంటున్నారు. ఇక అంతా అమ్మ దయేనని, ఆమె చెప్పిన దానిని చేయడమే తమ కర్తవ్యమం టున్నారు. ఇదిలాఉండగా, మంత్రుల పర్యటనలో గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన సబితా ఇంద్రారెడ్డి, దానం, ముఖేష్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులకు చేసిన సూచనను వారంతా బేఖాతరు చేసినట్టయింది. కేవలం ఐదారుగురు మంత్రులు వెళితే సరిపోతుందని, ఆ మేరకు మీరు చొరవ తీసుకోవాలని జానారెడ్డిని కోరారు. అయితే, తామంతా సోనియాను కలవాల్సిందేనని, కొందరు మాత్రమే వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని మంత్రులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఢిల్లీకి తెలంగాణ మంత్రులంతా వెళ్లడం ఖాయమయింది. తెలంగాణ అంశంలో సీఎం సూచనను పట్టించుకోవలసిన అవసరం లేదని పలువురు మంత్రులు స్పష్టం చేసినట్లు సమాచారం.
Tag: Telangana, Telangana Report, Telangana News, Srikrishna Commitee, KCR, AP, NEWS, Flok Songs, Songs, Telangana Songs,
NDTV, TV9, AajTak, Namaste Telangana, RajNews, eenadu, Sakshi, Imges, Hot Images
0 comments:
Post a Comment