ప్రజల చేతుల్లో తెలంగాణ ఉద్యమం
కొండపాక,మేజర్‌న్యూస్:తెలంగాణ సాధన ఉద్యమం నాయకుల నుంచి ప్రజాఉద్యమంగా మారి విద్యార్థులు,ఉద్యోగస్థుల చేతుల్లోకి వె ళ్ళింది.2009 నవంబర్ 28న కేసీఆర్ దీక్షతో మొదలైన తెలంగాణ ఉద్యమం భారీ విధ్వం సాలు,సంచలనాలకు తావిచ్చింది.కేసీఆర్ ఖ మ్మం జైలులో నిరాహార దీక్ష విరమించాడనే వార్తలు విన్న విద్యార్థులు కేసీఆర్‌కు వ్యతిరేకం గా ధర్నాలు చేయటంతో మనస్సు మార్చుకున్న కేసీఆర్ చావో రేవో తేల్చుకుంటాననుకుంటా నన్న తదనంతరం మరణశయ్యపైన కేసీఆర్‌ను చూసి చలించిన తెలంగాణ నాయకులు పార్టీ లకు అతీతంగా ఉద్యమాన్ని నిర్వహించారు. తె లంగాణ వాదాన్ని ఢిల్లీ పీఠానికి వినిపించేలా చే శారు.దీని పర్యావసానమే డిసెంబర్ 9న వె లుబడిన ప్రకటన.అనంతరం సీమాంధ్రలో చెలరేగిన ఉద్యమాలతో శ్రీ కృష్ణకమిటీని వే యటం జరిగింది.
దీనితో సంవత్సరం పాటు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో విద్యార్థులు కొ నసాగించారు.వివిధ పార్టీలకు చెందిన నాయ కులు కమిటీ ప్రకటన అనంతరం రాజీనామా లు సమర్పించి తెలంగాణ కోసం పోరాడుతామ ని ప్రకటించారు.ఈ సంవత్సరంలో రాజీనామా చేసిన టీఆర్‌ఎస్ నాయకుల స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణకు మేము సైతం సుము ఖమే అని ప్రకటించుకున్న కాంగ్రెస్,టీడీపీలను ప్రజలు తిరస్కరించారు.తెలంగాణాలో పర్య టిస్తున్న మంత్రులు,ఎమ్మెల్యేలను విద్యార్థులు అడ్డుకుంటూనే ఉన్నారు. మహబూబాబాద్‌లో పర్యటించిన జగన్ పర్యటనను సైతం రాళ్ళ వ ర్షంతో ఆపగలిగారు.
కాంగ్రెస్,టీడీపీ పార్టీల నాయకులు తెలంగాణ జిల్లాల్లో పర్యటించా లంటే వణుకు పుట్టించిన ఘనత ఓయూ, కే యూ విద్యార్థులకు దక్కింది. సంవత్సరం పాటు ఉద్యమాన్ని సజీవంగా నిలిపి శ్రీకృష్ణకమిటీ తప్పుల తడకగా ఉండ టంతో తెలంగాణ ప్రజానీకం మరింత రెచ్చి పోయింది.తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని వారి ఇళ్ల ఎదుట నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం పర్యటనను సైతం బహిష్కరించారు. వేలాది మంది విద్యార్థులపై కేసులు నమోదు చేయబడ్డాయి.పరీక్షలను బహిష్కరించి లా ఠీలు,తూటాలకు ఎదురునిలిచి పోరాడారు.
ఎందరో అమాయకులు అసువులు బాసారు. ఇన్ని జరుగుతున్నా నాయకులు మారలేదు. అడ పాదడపా మాట్లాడే నాయకులకు పదవులు వచ్చాయి.ఇంకేముంది తెలంగాణ గూర్చి మా ట్లాడే నాయకులు టీడీపీ,కాంగ్రెస్‌లో కరువ య్యారు. కళ్లముందే బిడ్డలు చస్తుంటే నోటికాడి బుక్కను ఆంధ్రోళ్ళు గుంజెస్తుంటే ఉద్యోగాలు రాకుండా పోయినా మాట్లాడే నాయకులే లేరు. ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు తెలంగాణ రాకుంటే ఇక రాదు.సమైఖ్యాంధ్ర లో బాంచెపు బతుకు తప్పడు.నాయకులకు స్వలాభం తప్ప ప్రజల అవసరాలు అవసరం లే దు.శాంతియుతంగా ఉద్యమం నడపాలని ఉ ద్యోగ సంఘాలు ఉద్యమాన్ని తమ భుజస్కం దాలపై వేసుకున్నాయి. మొదటి దఫగా సహా యనిరాకరణ మొద లుపెట్టాయి.
మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసు కుని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి లావా దేవీలు జరగకుండా నిరాకరిస్తున్నారు. తెలంగా ణలోని అన్ని ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో సహా య నిరారణోద్యమం కొనసాగుతుంది. తె లంగాణ రాష్ర్ట ఏర్పాటుకు చర్యలు తీసుకోకుం టే ఉద్యోగ సంఘాలు,ప్రజలు విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వ కార్య కలాపాలను స్తంబింపజేసి తెలంగాణ సాధన కోసం పాటుపడటం కొరకే ఉద్యోగ సంఘాల ఆకాంక్ష.
0 comments:
Post a Comment