గుజ్జర్ల తరహా పోరాటం
హైదరాబాద్, ఆగస్టు 9 : తెలంగాణ కోసం గుజ్జర్ల తరహా పోరాటం చేయబోతున్నట్లు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తమ పిలుపు కోసమే అంతా ఎ దురు చూస్తున్నారని చెప్పారు. 'శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 31లోగా నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకోవడానికి పెద్ద ఉద్యమానికి తెర తీయబోతున్నాం. ఇందుకు అన్ని వర్గాలు సిద్ధమవుతున్నాయి.
పార్టీ శ్రేణులు కూడా సన్నద్ధం కావాలి' అని పిలుపునిచ్చారు.ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సోమవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఇందులో ఎంపీ విజయశాంతి, టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు ఇతర ఎమ్మెల్యేలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా, నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు, ప్రత్యేక ఆహ్వానితులుగా విద్యార్థి నాయకులు బాల్క సుమన్, కిశోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది డిసెంబర్‌లో 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభను వరంగల్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జంట నగరాల్లోనూ తెలంగాణ జేగంటలు మోగుతున్నాయ ని, ఈ విషయాన్ని తాను బోనాల పండుగలో స్వయంగా చూశానని చెప్పా రు.ఉప ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు గుండెలు చీల్చి ప్రత్యేక రాష్ట్రం కా వాలని కోరితే.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ధ్వజమెత్తారు. 'ప్ర భుత్వాన్ని ఢీకొంటామని ఒకడు.. పడగొడతామని ఇంకొకడు.. నిలబెడుతామని మరొకడు అంటున్నారు. వీటి మధ్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటంలేదు' అని మండిపడ్డారు. ఎరువుల కొరత, అంటువ్యాధులపై ఆందోళనలు చేసి, ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరారు.
చంద్రబాబును నేనేమన్నాను
సీమాంధ్ర మంత్రులకు అధికార మదం నెత్తికెక్కి తెలంగాణ డిమాండ్‌ను జాతి వ్యతిరేకమన్నారని కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిగిలిన పా ర్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ చంద్రబాబు చేపట్టిన బాబ్లీ ఆందోళన ను ప్రస్తావించారు. 'నేను చంద్రబాబు తెరువుకే పోలేదు. ఆయన నన్ను ఖబడ్దార్ అన్నారు. నేను ఏం అన్నానని అలా అన్నారు? నాటకాలు ఆడారనే నే ను చెప్పాను. ఇది ఉన్నదే కదా?' అని ప్రశ్నించారు.
ఆదిలాబాద్ జిల్లాలో రూ. 300 కోట్లతో పూర్తయ్యే సదర్‌మాడ్ ప్రాజెక్టును పట్టించుకోకుండా, బాబ్లీ సమస్యపై మాట్లాడితే నమ్మాలా? అని మండిపడ్డారు. మేకవన్నె పులులను, తోడేలు తోలు కప్పుకున్న వారిని ఉప ఎన్నికల్లో ప్రజలు గుర్తించారని పరోక్షంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రైతుల ప్రయోజనాల కోసం ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఆందోళనలు చేయాలని, మంత్రులను ఘెరావ్ చేయాలని పిలుపునిచ్చారు.ఫలితాలు మాత్రం తాను చెప్పినట్లే వచ్చాయని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయన్నారు. 'మళ్లీ ఎన్నికలొస్తే.. కేసీఆర్, విజయశాంతి తిరుగుతారు.. గెలుస్తామని అనుకోవద్దు.
పార్టీని బలోపేతం చేయండి. ప్రజల్లో మమేకం కండి. రాబోయే రోజుల్లో భూకంపం.. మహాయుద్ధం సృష్టించడానికి, మరింత ప దునుగా ముందుకెళ్లడానికి తయారుగా ఉండండి. అంతిమంగా రాష్ట్ర సాధన దిశగా వెళ్లాలి' అని పిలుపునిచ్చారు.
This news take by : Andrajyothi.com
0 comments:
Post a Comment