Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Sima Andra. Show all posts
Showing posts with label Sima Andra. Show all posts

Friday, June 29, 2012

రాయల రచ్చ


rayalatelangana-ఎందుకొస్తున్నదీ ప్రస్తావన?
-తెలంగాణపై హస్తినలో కదలిక వచ్చినప్పుడే తెరమీదకు రాయల తెలంగాణ డిమాండ్
-ఒకరిద్దరు రాజకీయ నేతల్లో తప్ప సీమ ప్రజల్లో లేని ఆ కోరిక
-అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలా?
-రాష్ట్రం ఇవ్వడానికా? పీటముడి వేయడానికా?


తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఏళ్ళ తరబడి ఉద్యమం జరుగుతున్నది. ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇంకా రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలతో ఉద్యమ పోరాటం నడుస్తూనే ఉంది. తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల సొంత రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ నేతలు వ్యూహాత్మకంగా రాయల తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొస్తున్నారు. రాయలసీమకు చెందిన కొందరు నాయకులు గత కొన్ని రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఈ ప్రచారం కొనసాగేలా చూస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలోని పది జిల్లాలతోపాటు సీమలోని రెండు జిల్లా లు కర్నూలు, అనంతపురంలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ తతంగం వెనుక అనేక మతలబులు, రాజకీయాలున్నాయనే అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదు. రాయల తెలంగాణపై ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. రాయల తెలంగాణ పేరిట మరోసారి తెలంగాణ ప్రజలను సీమాంధ్ర పడగ నీడలోకి నెట్టివేసే కుట్ర. ఈ ప్రతిపాదన తెచ్చేవారంతా తెలంగాణ ద్రోహులే. వీరికి వ్యతిరేకంగా శుక్ర, శనివారాల్లో తెలంగాణవ్యాప్తంగా వారి దిష్టిబొమ్మలను దహనం చేయాలి.
- ప్రొఫెసర్ కోదండరాం , తెలంగాణ జేఏసీ చైర్మన్


ఆంధ్రతో విలీనం చేసిన తెలంగాణ ప్రాంతాన్నే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి. రాయల తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం. నేను రాయల తెలంగాణకు సానుకూలమంటూ జరిగిన ప్రచారాన్ని నమ్మొద్దు.
- గండ్ర వెంకటరమణాడ్డి, చీఫ్‌విప్


హైదరాబాద్, జూన్ 28 (టీ మీడియా):రాయలసీమలోని ప్రజల నుంచి ఇప్పటివరకు రాయల తెలంగాణ డిమాండ్ వినిపించకపోయినా కేవలం ఇద్దరు, ముగ్గురు సీమ నేతలు తరచూ ఈ ప్రతిపాదనను వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి హస్తినలో కదలిక వచ్చినప్పుడల్లా ఆ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదనలు ముందుకు నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కొందరు సైతం ఆ ప్రతిపాదనలకు గళం కలుపుతుండటం గమనార్హం. సీఎం మార్పు ఉంటుందని, త్వరలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని రాష్ట్ర మంత్రి జానాడ్డి గురువారం నల్గొండ జిల్లాలో వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణాడ్డి వరంగల్‌లో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం రాయల తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అనంతరం మాట మారుస్తూ రాయలతెలంగాణను ఏర్పాటు చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నదని మాత్రమే తాను చెప్పానని అన్నారు.

అసలు రాయల తెలంగాణ అనే ప్రస్తావన ఎందుకు వస్తున్నది? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికా? లేక తెలంగాణకు పీటముడి వేయడానికా? తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలోనే ఈ ప్రతిపాదనలు రావడంపై రాజకీయవర్గాల్లో, ముఖ్యంగా తెలంగాణవాదుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజలు తమ డిమాండ్‌పై ఎంతో కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే, సమయం, సందర్భం లేకున్నా కొందరు రాయల తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం లేదంటుండటంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ఈ ప్రతిపాదన వెనుక వారి రాజకీయ స్వార్థ ప్రయోజనాలే తప్ప మరో కారణం లేదనే విషయం స్పష్టమవుతోంది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలు ఏనాడైనా రాయల తెలంగాణ కోరుకున్నారా? ఆ దిశగా ఉద్యమాలు, ఆందోళనలు చేశారా? .. అలాంటి దాఖలాలే కనిపించవు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు రాయల తెలంగాణ ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తాము రాయల తెలంగాణకు అంగీకరించే ప్రసక్తే ఉండదని తెలంగాణవాదులు కుండబద్దలు కొడుతున్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీ నిరసన కార్యక్షికమాలకు కూడా పిలుపునిచ్చింది. పది జిల్లాల తెలంగాణ తప్ప మరేదీ తమకు సమ్మతం కాదని మరోమారు స్పష్టం చేసింది.

ఆ ముగ్గురి వల్లే..
రాయల తెలంగాణ ప్రస్తావన రావడానికి ఆ ముగ్గురే కారణం అనేది ప్రధానంగా కనిపిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును మజ్లిస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వస్తే బీజేపీ బలపడుతుందని, భవిష్యత్తులో తమ ఉనికితోపాటు ముస్లింలకు ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన మజ్లిస్ పార్టీని వెంటాడుతున్నది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభావం అంతగా లేదని, తెలంగాణలోని 10 జిల్లాలతో ఆ రెండు జిల్లాలను కలుపుకుని రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఆధిపత్యానికి అడ్డుకట్టవేయవచ్చని మజ్లిస్ భావిస్తోంది. మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆ కోణంలోనే రాయల తెలంగాణ వైపు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఒవైసీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కాగా తొలుత సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించిన మంత్రి టీజీ వెంక మాజీ మంత్రి జేసీ దివాకర్‌డ్డి ఇప్పుడు పదే పదే రాయల తెలంగాణ ప్రస్తావన తీసుకొస్తున్నారు.

వ్యాపార సంబంధాలను దృష్టిలో పెట్టుకుని టీజీ వెంక రాయల తెలంగాణకు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలుపుకుని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ప్రధానంగా చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, కడప జిల్లాకు చెందిన జగన్ లాంటి నేతలతో తన రాజకీయ ఎదుగుదల, పదవులకు ఎలాంటి ఆటంకం ఉండబోదని, భవిష్యత్తులో తాను కూడా బలమైన రాజకీయ నేతగా ఎదిగేందుకు వీలుకలుగుతుందని జేసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయన కూడా ఈ మధ్య గట్టిగా వాదిస్తూ చీటికి మాటికి రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకొస్తున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇటు తెలంగాణలో, అటు సీమలోని ఆ రెండు జిల్లాల్లో రాజకీయ నేతలు ఎవరు కూడారాయల తెలంగాణ కావాలని డిమాండ్ చేయడం లేదు.

సంస్కృతి వేరు.. సమస్యలు జోరు
తెలంగాణ ప్రాంత ప్రజల, సీమలోని రెండు జిల్లాల ప్రజల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, చరిత్ర వేర్వేరు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య నీటి సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) నీటి వినియోగంపై మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజల మధ్య వివాదం నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఏ రకంగానూ సబబు కాదని మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు వెనుక కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రాయల తెలంగాణ ఏర్పాటుతో ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యాబలం అందులో సరిగ్గా సగమవుతుంది. అంటే రాయల తెలంగాణ, ఆంధ్రాలో 21 మంది చొప్పున ఎంపీలు, 147 మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉండేందుకు వీలు కలుగుతుందే తప్ప తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదని తెలంగాణవాదులు అభివూపాయపడుతున్నారు.

జనం వ్యతిరేకిస్తారు: పయ్యావుల కేశవ్
రాయల తెలంగాణ అనేది బాధ్యత లేని నేతల ప్రతిపాదన అని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఈ ప్రతిపాదనను సామాన్య జనం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్న తరుణంలో పయ్యావుల ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.

గండ్రకేమన్న హైకమాండ్ చెప్పిందా: సారయ్య
వరంగల్ సిటీ, జూన్ 28 (టీ మీడియా): ‘రాయల తెలంగాణ ఇస్తామని హైకమాండ్ ఏమన్న గండ్ర వెంకటరమణాడ్డితో చెప్పిందా? ఆయన ఏమన్న హైకమాండ్‌తో మాట్లాడారా’ అని మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయాన్ని గండ్ర చెప్పారని విలేకరులు సారయ్య దృష్టిగాతేగా ఆయన పై విధంగా స్పందించారు. నేను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్‌ను, ఏ తెలంగాణ అన్నది కాదు తెలంగాణ మాత్రం వస్తుందని వివరించారు. నేను రాయల, ఆంధ్రా అని చెప్పడం లేదు, తెలంగాణ మాత్రం వస్తుందని వ్యాఖ్యానించారు.

రాయల తెలంగాణకు కేంద్రం ఓకే: గండ్ర
-సాయంవూతానికి మాటమార్చిన చీఫ్‌విప్
-విలీనమైన తెలంగాణే కోరుతున్నామని వివరణ

వరంగల్,  ప్రతినిధి: అనంతపురం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రాయలతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణాడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలతెలంగాణ ఏర్పడినా హైదరాబాదే రాజధానిగా ఉంటుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని వస్త్తున్న ప్రతిపాదనలను తాము వ్యతిరేకిస్తామన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు, తెలంగాణ అంశానికి సంబంధం లేదన్నారు. గురువారం వరంగల్‌లో ఆయన మాట్లాడారు. అనంతపురం, కర్నూలుతో కలుపుకొని రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తమకు సమచారం ఉందన్నారు. కృష్ణాజలాల విషయంలో, అసెంబ్లీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం ఆమోదం పొందాలంటే కచ్చితంగా సంఖ్యాబలం కావాలని అన్నారు. బహుశా ఆ కారణంగా కేంద్రం ఆ రెండు జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ ప్రతిపాదనకు వస్తోందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ మండిపడటంతో సాయంవూతానికి గండ్ర మాటమార్చారు. గతంలోనే ఎంపీలు ఒవైసీ, కేసీఆర్ రాయల తెలంగాణను కేంద్రం ప్రతిపాదించిందని చెప్పారని గుర్తు చేశారు. తాను సైతం అదే ప్రతిపాదన ఉందని మాత్రమే చెప్పానని వివరించారు. తమకు పాత హైదరాబాద్ రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.

Take BY: T News

Read more...

Monday, December 26, 2011

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Saturday, December 24, 2011

సమన్వయంతో అణిచేద్దాం!

కాంగ్రెస్ సమన్వయ కమిటీ అసలు కోణం ఇదే!
- అందుకే తెలంగాణ వ్యతిరేకులకు చోటు
- ప్రత్యేకవాదం వినిపించేందుకు ఒక్కరూ లేరు
- తెలంగాణ నుంచి ముగ్గురున్నా..ముగ్గురివీ వ్యక్తిగత ప్రయోజనాలే!
- కమిటీ ఏర్పాటులో ముందు జాగ్రత్త


TG-copy talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 23 ():‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు వెనుక తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆకాంక్షలను కట్టడి చేయడానికే ఈ కమిటీని ముందుకు తీసుకువచ్చారా? తెలంగాణకు బద్ధ వ్యతిరేకులను, తెలంగాణపై గట్టిగా మాట్లాడని వారిని కమిటీలోకి తీసుకోవడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏంటి? తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించే ఏ ఒక్క నాయకుడికీ ఈ కమిటీలో ఎందుకు స్థానం దక్కలేదు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఉద్దేశించినట్లు చెబుతున్న సమన్వయ కమిటీ విషయంలో ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలివి!
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తలోదారిన నడుస్తున్నారు కనుక, అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసేందుకు అంటూ సమన్వయ కమిటీని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ చైర్మన్‌గా ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలోకి సభ్యులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏ పదవీ లేదని రుసరుసలాడుతున్న చిరంజీవిని తీసుకోవడంతో పాటు పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ కావూరి సాంబశివరావును తీసుకున్నారు. గతంలో ఈ కమిటీలో ఉన్న జానాడ్డి, కేవీపీ రామచందర్‌రావు, గీతాడ్డిని ఈ సారి పక్కనపెట్టారు. మొత్తంగా ఈ కమిటీలో తెలంగాణ అంశాన్ని గట్టిగా వినిపించే నాయకుడుకానీ, ఉద్యమం అణచివేతకు ప్రభుత్వం ప్రయత్నిస్తే గట్టిగా అడ్డుకునే నేత లేకపోవడంపై ప్రత్యేక రాష్ట్ర వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునేందుకు, అణచివేసేందుకు ముందు జాగ్రత్తగా రూపొందించిన పక్కా పథకమని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులైన వారిని ఈ కమిటీలో నియమించడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్ డీఎస్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలంగాణవారే అయినా.. వీరు ముగ్గురూ అంత గట్టిగా తెలంగాణవాదం వినిపిస్తున్న వారు కాదు.


డీ శ్రీనివాస్ తెలంగాణపై ఏదో ఒకటి చెబుతున్నా ఆయన లక్ష్యం అంతా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద ఆశీస్సులు పొందటం కోసమేనన్నట్లు కనిపిస్తోందని విమర్శలున్నాయి. తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపించటం లేదు. ఏ పదవీ లేనపుడు అంతో కొంతో తెలంగాణ అంటూ మాట్లాడిన డీఎస్ తాజాగా ఎమ్మెల్సీ పదవి దక్కటంతో ఇతరత్రా పదవుల కోసమే అంగలారుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణ అభివృద్ధి మండలిని కేంద్రం వేస్తే.. దానిపై ఆధిపత్యం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇక డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏనాడూ తెలంగాణవాదిగా మాట్లాడకపోవటం గమనార్హం. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఈ పదవిని వాడుకుంటున్నారు తప్పితే తెలంగాణవాదాన్ని వినిపించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయటం లేదని పలువురు తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత కావడంతోనే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. దీని ద్వారా రాష్ట్రంలో కీలకమైన హోం శాఖను తెచ్చుకునేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ శాఖ కోసం పట్టుబట్టిన ఆయన.. అధిష్ఠానం వద్ద ఇప్పటికే తన అభ్యర్థనను ఉంచినట్లు తెలుస్తోంది. ఇక, షబ్బీర్‌అలీ కూడా తెలంగాణకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆజాద్‌తో సన్నిహితంగా ఉండి ఈ కమిటీలో స్థానం పొందారని అంటున్నారు.

ఆయన కూడా తెలంగాణ వాణిని గట్టిగా వినిపించిన దాఖలాలు బహు అరుదు. కాగా, కమిటీలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారందరూ తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారే. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలంగాణవాదుల ముందు మాత్రం తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా ఈ మేరకు ఆయన చేస్తున్న ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా సమైక్యవాదిగానే వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవటం లేదు. కరడుగట్టిన సమైక్యవాదిగా చెప్పుకునే చిరంజీవికి ఈ కమిటీలో ప్రాతినిథ్యం లభించింది. ఆయన తెలంగాణను నేరుగా వ్యతిరేకిస్తున్నారు.

ఆయనకంటే కావూరి సాంబశివరావు మరో రెండు అడుగులు ముందుకు వేసి.. తెలంగాణను గట్టిగా వ్యతిరేకిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ లాబీయింగ్ విస్తృతస్థాయిలో ఉందని, దీనికి జాతీయ నాయకులు కూడా ప్రలోభాలకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో సమైక్యవాదులకు పెద్ద పీట వేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయటం పట్ల తెలంగాణవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కీలక సమయాల్లో కట్టడికే!
తెలంగాణ ఉద్యమం సంధికాలాన్ని దాటుకుని మరోసారి విజృంభించే పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. ఉద్యోగ జేఏసీలు మొదలుకుని సింగరేణి తదితర చోట్ల నుంచి కూడా తెలంగాణ కోసం మరోసారి మహోద్యమానికి సిద్ధమన్న సంకేతాలు అందుతున్నాయి.

రాజకీయ పోరాటాలు కూడా మరింత ఉధృతం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలపైన, ఉద్యమాలపైన సర్కారు గతంలో అనుసరించిన పద్ధతులనే ఈ సారీ అనుసరించవచ్చు. గతంలో 42రోజులపాటు వీరోచితంగాసాగిన సకల జనుల సమ్మెసందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు జులుం ప్రదర్శించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. దీనికి టీ కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకతలు పెల్లుబికాయి. మళ్లీ ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైతే సమన్వయ కమిటీలో మాట్లాడుకుంటాం.. అన్న మాట చెప్పి ప్రభుత్వం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దీంతో టీ కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూయించడానికి, వారు కూడా తమపై ఒత్తిళ్లను సమన్వయ కమిటీపైకి నెట్టేసేందుకు వీలు కలుగుతుందన్న వాదన వినిపిస్తోంది. పైగా టీ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడిన పక్షంలో వారిపై కేసుల విషయంలో సర్కారు తానుఅనుకున్నదే చేసేందుకు సమన్వయ కమిటీని ఉపయోగించుకోవచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 2014 దాకా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ సాగదీస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శలదాడి నుంచి తప్పించుకోవడానికే ఈ కమిటీని ఉద్దేశించారని అంటున్నారు.

కిరణ్ వ్యూహమా?
సమన్వయ కమిటీ ఏర్పాటులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా ప్రధాన భూమికను వహించినట్టు తెలుస్తోంది. ఆజాద్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్న కిరణ్.. రాష్ట్రంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఈ కమిటీ నిర్మాణానికి చొరవ తీసుకున్నారని, ఈ మేరకు ఆజాద్‌ను ఒప్పించారని చెబుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్ ప్రాధాన్యాన్ని పూర్తిగా తగ్గించానని, కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించేలా పథకాల రూపకల్పన చేసి వాటిని అమలు చేస్తున్నట్టు కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. దీంతో జగన్ ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని, వైఎస్‌కున్న పలుకుబడి క్షీణించిందని, దీనివల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని మేలు జరుగుతుందని కిరణ్‌కుమార్‌డ్డి రాష్ర్ట్ర ఇన్‌చార్జి వద్ద గట్టిగా వాదించి, రాష్ట్రంలో తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా కమిటీ నిర్మాణం జరిగేందుకు విజయవంతంగా కృషి చేసినట్టు చెబుతున్నారు.

వైఎస్ అత్యధిక ప్రచారం చేసుకున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రాజీవ్ ఉద్యోగశ్రీ, పావలా వడ్డీకే రుణాలు తదితర కార్యక్షికమాలు పూర్తిస్థాయిలో మార్చివేసి, వైఎస్ పథకాలు రాష్ట్రంలో లేకుండా చేసినట్టు ఆయన అధిష్ఠానం వద్ద చెప్పుకొన్నారని అంటున్నారు. వాటి స్థానంలో రూపాయికే కిలో బియ్యం, రాజీవ్ ఉద్యోగ కిరణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తూ వాటిని కాంగ్రెస్ పథకాలుగా రాష్ట్ర ప్రజలు గుర్తించేలా ప్రచార కార్యక్షికమాన్ని ముమ్మరం చేసినట్టు కూడా కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానానికి వివరించినట్టు సమాచారం.

దీంతో కిరణ్‌కుమార్‌డ్డి అభీష్టం మేరకే సమన్వయ కమిటీ ఏర్పాటైందని, పీసీసీ అధ్యక్షుని హోదాలో కమిటీ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ మినహా ఇతరుపూవరూ కిరణ్‌కుమార్‌డ్డికి ప్రతికూలంగా మాట్లాడే అవకాశం లేదని, దీంతో ముఖ్యమంత్రి తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా కమిటీకి రూపకల్పన జరిగిందని భావిస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అధ్యక్షతన జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో ఆజాద్ ముందు బొత్స సత్యనారాయణ పెద్దగా నిరసనలు తెలిపే అవకాశాలుండవని, అంతా తూతూమంవూతంగా జరుగుతుందనే అభివూపాయం వ్యక్తమవుతోంది.

Take By: T News  

Read more...

Wednesday, December 21, 2011

తెలంగాణ పారిశ్రామిక రంగానికి పూర్వవైభవం తెస్తాం - టెక్కి అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు

-తెలంగాణలో ఉత్పత్తి నైపుణ్యానికి కొదవ లేదు
- పరిశ్రమలను పథకం ప్రకారం అణిచేశారు
- ప్రత్యేక రాష్ట్రంలోనే మన మనుగడ
- రాష్ట్రం ఏర్పడితే ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
- స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా కృషి
- తెలంగాణ పెట్టుబడిదారులకు సలహాలు



DSC_8486-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘‘సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణ పారిక్షిశామిక రంగాన్ని ఛిద్రం చేశారు. నిజాంల కాలంలో నిత్యం కళకళలాడిన పరిక్షిశమలు నేడు కనుమరుగయ్యాయి. వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని టెక్కి అధ్యక్షులు వెంక చెప్పారు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన సీమాంధ్ర పారిక్షిశామికవేత్తల కుట్రలు, కుతంవూతాలను ఎదిరించి ఈ రంగంలో నిలబడ్డారు. పారిక్షిశామిక అభివృద్ధి కోసం ఏర్పడిన ఫ్యాప్సీ ఒక ప్రాంతానికే పరిమితమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పారిక్షిశామిక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తెలంగాణ వాణిజ్య పారిక్షిశామిక మండలి(టెక్కి)ని ఏర్పాటు చేశామని అన్నారు. వెంక టీన్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

(, హైదరాబాద్)ఒక సంస్థ ఉండగా మరొక సంస్థ ఏర్పాటు జరుతున్నదంటే, అక్కడ స్థానికుల ప్రమేయం సరిగ్గా లేకపోవడమే కారణంగా భావించాల్సింది ఉంటుందని టెక్కి అధ్యక్షులు ఎం వెంక చెప్పారు. ఫ్యాప్సీలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు తగిన ప్రోత్సాహం లభించడం లేదన్నారు. తెలంగాణ అస్తిత్వం రక్షించుకునేందుకే టెక్కిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ సంస్థానం అభివృద్ధిలో పరిక్షిశమల పాత్ర ఏంటి?
నిజాం సంస్థానాధీశులు పరిక్షిశమల ద్వారా ఖజానాకు భారీ ఆదాయం వచ్చేలా చేశారు. వ్యవసాయం అభివృద్ధికి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన రాజులు వ్యవసాయ ఉత్పత్తులకు అనుబంధ పరిక్షిశమలను తెచ్చారు. స్పిన్నింగ్ మిల్స్, దాల్, రైస్, షుగర్స్ మిల్స్‌లు ఈ కోవలోనివే. సహజ వనరులు కూడా అధికంగా ఉండడంతో వీటిని ఉపయోగించుకోవడానికి స్టీల్, ఇంజనీరింగ్ పరిక్షిశమలను పెట్టారు. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను కల్పించారు.

సమైక్య రాష్ర్టంలో పారిక్షిశామిక అభివృద్ధి ఎలా జరిగింది? తెలంగాణ పాత్ర ఎంత?
సమైక్య రాష్ట్రంలో పారిక్షిశామిక అభివృద్ధి ఒకవైపే ఎక్కువ జరిగింది. ప్రభుత్వంలో ఉన్నది సీమాంవూధలే. దీంతో వారికే ప్రోత్సాహకాలు ఎక్కువగా లభించేవి. అనుకున్న స్థాయిలో తెలంగాణ వారికి పోత్సాహకాలు దొరకడం లేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పారిక్షిశామిక రంగంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగాయా?
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ పరిక్షిశమల్లో స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. సింగరేణి గనుల్లో అధికార వర్గం అంతా సీమాంవూధలే. దీంతో వారు తమ ప్రాంతానికి చెందిన వారినే కాంట్రాక్టర్లుగా తెచ్చుకున్నారు. స్థానికులకు కాంట్రాక్టర్లుగా ఎదిగే అవకాశం లేకుండా చేశారు. ఆఫీసు స్టాఫ్ ఉద్యోగాల్లోనూ వారే చేరారు. గనిలో పని చేసే కార్మికులు మాత్రమే తెలంగాణ బిడ్డలు. బీహెచ్‌ఈఎల్ తదితర కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. సీమాంవూధులు హైదరాబాద్‌లోనే పరిక్షిశమలు ఏర్పాటు చేసినా, వాటిల్లో స్థానిక తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదు

నిజాం కాలంలో వెలిగిన పరిక్షిశమలు నేడు మూతపడటానికి కారణాలేంటి?
సీమాంధ్ర సర్కారు నిర్లక్ష్యం మూలంగానే తెలంగాణ పరిక్షిశమలు మూతపడ్డాయి. దీనికి ఆంధ్రా అధికారులు ఊతమిచ్చేలా కావాలనే నిర్లక్ష్యం చేశారు. అవి మూతపడేలా చేశారని పరిక్షిశమలు మూతపడిన తీరు చూస్తే అర్థమవుతుంది.

ప్రైవేట్ రంగంలో తెలంగాణ పెట్టుబడిదారుల పాత్ర ఏంటి?
ప్రైవేట్‌రంగంలో తెలంగాణ పారిక్షిశామికవేత్తలు ఎదిగే అవకాశాలు లేకుండా దొడ్డిదారిన అడ్డుకున్నారు. వర్గంలోనూ వారిదే పైచేయి కావడంతో చివరకు రుణ సౌకర్యాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిక్షిశమలను ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి ఆర్థిక సహకారం సరైన పద్ధతిలో అందకపోవడంతో పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన వారు కూడా వెనక్కు తగ్గారు.

తెలంగాణ పారిక్షిశామికవేత్తలకు వ్యాపారం చేయడం రాదనే విమర్శలున్నాయి కదా?
ఈ ప్రచారం పథకం ప్రకారం సీమాంధ్ర పెట్టుబడిదారులు చేస్తున్న కుట్రనే. తెలంగాణ పారిక్షిశామికవేత్తలు మొదటి నుంచి ఉత్పత్తిని పెంచడంపైనే దృష్టి సారించారు. కాకపోతే తెలంగాణ వారికి కుట్రలు, కుతంవూతాలు తెలియవంతే. కానీ.. 80 శాతం సీమాంవూధుల పరిక్షిశమలు వచ్చాయి. అధికార వర్గంలో కూడా వారే ఉండడంతో పరిక్షిశమల లైసెన్స్‌లు, సబ్సిడీలు వారికే ఎక్కువగా వస్తున్నాయి. తెలంగాణ వాళ్లు ఒ ప్రాజెక్టు తీసుకొని వెళితే.. అనుమతులు ఇవ్వకుండా వేధిస్తారు. విసిగించి ప్రాజెక్టులను కాజేస్తారు. చివరకు తెలంగాణ మున్సిపాలిటీల్లో వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కాంట్రాక్టు మొత్తం సీమాంవూధకు చెందిన రాంకీకే ఇవ్వాలని సెక్ర స్థాయి అధికారులు ఓరల్‌గా చెప్పి ఇతరులకు అవకాశాలు లేకుండా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. .

తెలంగాణ కార్మికులు పని చేయరు కాబట్టే.. ఉద్యోగాలు రావట్లేదన్న ప్రచారం ఉంది..
పథకం ప్రకారం జరుగుతున్న దుష్ర్పచారంలో ఇదీ ఒక భాగమే. కుక్కను చంపాలంటే ముందుగా దానిని పిచ్చికుక్క అని ప్రచారం చేయాలన్న తీరుగా, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకూదన్న ఉద్దేశంతో సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులు విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా సీమాంధ్ర పరిక్షిశమల్లో పనిచేసే కొద్ది మంది తెలంగాణ కార్మికులు, ఉద్యోగులు చాలా పోటీతత్వంతో పని చేస్తున్నారు. నిజాం హయాంలోనే వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఇక్కడ ఉన్నారు. వరంగల్‌లో తయారు చేసిన కత్తులు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవంటే ఇక్కడి కార్మిక శక్తి నైపుణ్యాన్ని అర్థం చేసుకోవాలి.

తెలంగాణ పారిక్షిశామిక రంగం కోసం టెక్కి ఏం చేయాలనుకుంటోంది?
తెలంగాణ పారిక్షిశామిక రంగానికి జరిగిన అన్యాయంపై శ్వేత పత్రం తయారు చేస్తాం. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇస్తాం. సర్కారు స్పందించకపోతే ముఖ్యమంవూతిని కలుస్తాం. అక్కడా న్యాయం జరగకపోతే చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మేం తయారు చేసే రిపోర్టు ప్రభుత్వానికి నచ్చే పద్ధతిలో ఉంటుంది. పారిక్షిశామికరంగంలోకి కొత్త వచ్చే ఔత్సాహికులను మేం ప్రోత్సహిస్తాం. ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసుకొని వస్తే దగ్గరుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యేలా సలహాలిస్తాం. మా అనుభవాన్ని వారికి ఉపయోగపడేలా సహకారం అందిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణ అంతటా కొత్త పరిక్షిశమలు వచ్చేలా ప్రయత్నిస్తాం.

ఈ మేరకు టెక్కి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తుంది. ఈ కమిటీల ద్వారా నిత్యం సమాచారాన్ని సేకరించి, సమీక్షించి పారిక్షిశామికాభివృద్ధికి చేయాల్సిన పనులన్నీ చేస్తాం. ఇదే సమయంలో కొత్త ఏడాది మొదటి రోజు నుంచి ఇకపై వచ్చే పరిక్షిశమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చూస్తాం. ఈ మేరకు ప్రతివిషయాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తాం. ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాలలో స్థానికులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే విదేశీ పెట్టుబడుల సహకారాలతో ఐడీపీఎల్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పునరుద్ధరించేందుకు టెక్కి పూనుకుంటుంది. ఈ మేరకు పేపర్ వర్క్ చేస్తున్నాం

Telangana History 

Read Part - 1 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/nizam-in-telangana.html
Read Part - 2 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/2-telangana-history-nizam-in-telangana.html

Read Part - 3 click this link

http://voice2telangana.blogspot.com/2011/12/telangana-history-part-3-and-hyderbad.html


Take By: T News .

Read more...

Monday, December 19, 2011

గ్రూప్-1 ఫలితాలపై అనుమానాలు!

- వరంగల్ కేంద్రం నుంచి 11మంది మాత్రమే ఎంపిక
- చిత్తూరు నుంచి 120 మందికి పైగా ...
- పేపర్‌లీక్ అయిందని కొందరి అభ్యర్థుల ఆరోపణ
- నేడు ఏపీపీఎస్సీ అధికారులను కలుస్తామని వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 18 (): గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో వరంగల్ కేంద్రం నుంచి పరీక్ష రాసిన వారిలో కేవలం 11 మందిని మాత్రమే ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలకు ఎంపిక చేసిందని, అదే చిత్తూరు నుంచి సుమారు 120 మంది పైగా ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.h

పరీక్షా సమయంలో తిరుపతి కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకయిందని, అందుకే ముఖ్యమంత్రి జిల్లా చెందిన చిత్తూరు అభ్యర్థులు ఎక్కువగా ఇంటర్వ్యూలకు ఎంపికయి ట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆదివారం పలువురు గ్రూప్-1 అభ్యర్థులు ‘టీ న్యూస్’తో మాట్లాడారు. వీరు వ్యక్తం చేసిన అనుమానాలకు పరీక్షా సమయంలో జరిగిన సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. మెయిన్స్ పరీక్ష సందర్భంగా తిరుపతిలోని ఓ పరీక్షా కేంద్రంలో కొంత మంది అభ్యర్థులు జవాబు పత్రం (బుక్‌పూట్) ఇవ్వగానే బుక్‌పూట్‌లోని రఫ్ పేపర్లో సుమారు 10 ప్రశ్నలకు సంబంధించి జవాబులు రాశారు. ఒక్కో అభ్యర్థి ఒక్కో ప్రశ్నకు జవాబు రాశారు.

ఇది గమనించిన ఇతర అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి వద్ద నుంచి జవాబు పత్రాలు తీసుకుని కొత్తవి ఇచ్చారు. తిరుపతి పరీక్షా కేంద్రంలో అబ్జర్వర్‌గా ఉన్న ఏపీపీఎస్సీ బోర్డు సభ్యుడు చంద్రశేఖర్.. ప్రశ్నా పత్రం ఇవ్వకుండానే రాసిన జవాబులకు, ఇవ్వబోయే ప్రశ్నాపవూతంలోని ప్రశ్నలను పరిశీలిస్తే అవి అందులో ఉన్నట్టుగా నిర్దారించారు. దీంతో ముందస్తుగా పేపర్ లీక్ అయిందని గమనించిన ఏపీపీఎస్సీ..

ఆ జిల్లా కలెక్టర్‌తో విచారణ చేయించినట్లు సమాచారం. కానీ ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను వాల్యువేషన్ చేశారా? లేదా అన్న విషయాన్ని ఏపీపీఎస్సీ వెల్లడిస్తే తప్పా ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. కాగా, పేపర్ లీకేజీతో పాటు, తెలుగు మీడియం విద్యార్థులకు జరిగిన అన్యాయంపై సోమవారం ఏపీపీఎస్సీ అధికారులను కలువనున్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు.

Take By: T News

Read more...

చిరుకు కేంద్ర మంత్రి పదివి ఇప్పట్లో లేనట్లే!

- మెగాస్టార్‌కు 3 నెలల నిరీక్షణ తప్పదు
- రాష్ట్రం నుంచే రాజ్యసభకు
- మార్చిలో ఎన్నికయ్యే అవకాశం
- ఆచీతూచీ అడుగులేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం

Chiranjivi-12-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 18 (): తన సొంత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తరువాత కూడా ఇంకా పీఆర్పీ అధినేతగానే నెట్టుకొస్తున్న తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి అధికార పార్టీలో తగిన హోదా, గుర్తింపు ఇంకొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. దీని కోసం ఆయన ఇంకా కనీసం మూడు నెలలు నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రివర్గంలో చిరుకు స్థానం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ ఆ ఘడియ కోసం ఆయన ఫిబ్రవరి లేదా మార్చి వరకు వేచి చూడక తప్పదంటున్నారు. రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికలకు నెల, రెండు నెలల ముందుగా లేదా, రాజ్యసభకు ఎన్నికైన వెంటనే చిరుకు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమని ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అప్పటి వరకు ఆయన కాంగ్రెస్‌లో సినీగ్లామర్ కలిగిన నేతగానే కొనసాగనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందర్ని తన వర్గంగా మలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడతానంటూ ఒక వైపు జగన్ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతుంటే, ఆ సర్కార్ కూలిపోకుండా తాను నిలబెడతానంటూ చిరంజీవి అధికార పార్టీకి భరోసా ఇచ్చి అండగా నిలిచారు. దీంతో పీఆర్పీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల మద్ధతుతో కిరణ్ ప్రభుత్వానికి కొండత ధైర్యం లభించింది. ఇందుకు ప్రతిఫలంగా పీఆర్పీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలకు తగిన గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. సోనియాగాంధీ ఆహ్వానం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనంవేసిన చిరుకు కాంగ్రెస్‌లో కీలక గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయన వర్గం ఎమ్మెల్యేలలో కనీసం ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదవులు, మిగతా వారిలో కొందరికి నామినే డ్ పదవులు అప్పగించే యోచనలో ైహైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వాలంటే ముఖ్యమంవూతిని చేయడం లేదా పీసీసీ పగ్గాలు అప్పగించడం. ఈ రెండు ఇప్పట్లో హైకమాండ్‌కు సాధ్యమయ్యేలా లేవంటున్నారు. అదిలేకుంటే ఆ స్థాయిలోనే గుర్తింపు లభించే మరో హోదాను కల్పించడం ద్వారా రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలనేది ఆ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే చిరుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నది. మన రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలంటే మరో మూడు నెలల వేచి చూడాలి. తొలుత కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆ తరువాత ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేయాలనే ఆలోచన ఒక దశలో అధిష్ఠానానికి వచ్చినా, చిరుకు రాజకీయ, పరిపాలన అనుభవం లేక పోవడం, తొలిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి నేరుగా కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావించే హైకమాండ్ వెనకడుగు వేసినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

దాసరి స్థానంలో చిరు ఎంపిక !
రాజ్యసభ దై్వవార్షిక ఎన్నికల్లో భాగంగా మార్చిలో రాష్ట్రం నుంచి ఆరు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో కాంగ్రెస్ 4 స్థానాలను కచ్చితంగా గెలుచుకునే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి కేశవరావు, దాసరి నారాయణరావు, సంజీవడ్డి, రషీద్ అల్వీ, టీడీపీ నుంచి మైసూరాడ్డి, సీపీఐకి చెందిన అజీజ్‌పాషా రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. కాంగ్రెస్ ఖాతాలో వచ్చే నాలుగు స్థానాల్లో ఒకటి చిరంజీవి కోసం అధిష్ఠానం రిజర్వ్ చేసినట్లు ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే రెండు మార్లు దాసరి నారాయణరావుకు రాజ్యసభ అవకాశం కల్పించినందున, ఆయన స్థానంలో ఈ సారి అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రాజ్యసభకు పంపించే ఆలోచనలో హైకమాండ్ ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పటికీ ఎంపికైన కొత్త అభ్యర్థుల పదవీ కాలం మే నుంచి వర్తిస్తుంది. అయితే చిరును రాజ్యసభకు ఎంపిక చేసిన వెంటనే కేంద్రంలో చోటు కల్పించాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అప్పటికీ ఆలస్యమవుతుందని అనుకుంటే రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల ముందుగానే కేంద్రం మంత్రివర్గంలో తీసుకుని స్వతంత్ర హోదా కలిగిన మంత్రి పదవి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Take By: T News

Read more...

Sunday, December 18, 2011

తెలంగాణ ఉద్యోగులపై సర్కారు కుట్ర

- సమ్మెను సక్సెస్ చేసినందుకు కక్షసాధింపు
- ఒప్పందానికి విరుద్ధంగా 240 జీవో జారీ
- 3 నుంచి 4 వేల మందికి పెన్షన్ల నిలిపివేత
- వేలాదిగా ఆగిపోతున్న పదోన్నతులు
- అసలు విషయం తేల్చని సర్కారు
- చోద్యం చూస్తున్న తెలంగాణ మంత్రులు


One105-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకరీంనగర్,: తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సకల జనుల సమ్మెను విరమింపజేసేందుకు ఇచ్చిన హామీలపై మాట తప్పింది. సమ్మె తర్వాత సర్కారు జారీ చేసిన 240 జీవో పుణ్యమాని వేలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. సర్కారు ద్వంద్వ వైఖరి కారణంగా తెలంగాణలో సుమారు 45వేల పైచిలుకు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. నాలుగైదు వేల మందికి పెన్షన్లు అగిపోయాయి. ఆర్హత ఉన్నా పదోన్నతులు అందకుండా పోతున్నాయి. జీవోను సవరించి ఇచ్చిన మాట నిలుపుకోవాలని.. ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించాలని పలుమార్లు సంఘాల నేతలు కోరుతున్నా సర్కారు స్పందించడం లేదు.

ప్రభుత్వ దమననీతితో పది జిల్లాల్లోని వేలాది మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తి, రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో తెలంగాణ ఉద్యోగులకు పూర్తిగా అన్యాయం జరిగే ప్రమాదముంది. టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

ఒప్పందం వేరు.. ఇచ్చిన జీవో వేరు
తెలంగాణ సాధనే ధ్యేయంగా సెప్టెంబర్ 13 నుంచి ఆక్టోబర్ 24వరకు 42 రోజుల పాటు నిర్విరామంగా సాగిన సకల జనుల సమ్మెను విరమింపచేయడానికి ప్రభుత్వం చర్చలకు పిలిచిన విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా 42 రోజుల సమ్మెకాలాన్ని ఆర్ధ వేతన సెలవుగా పరిగణించి మంజూరు చేస్తామని లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి ఉద్యోగ సంఘాలు ఆయిష్టంగానే సమ్మతించాయి. సర్వీస్ బ్రేక్ కాకుండా ఉండటం, పెన్షన్, ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ప్రతిబంధకాలు ఉండవన్న ఒకే ఒక కారణంతో ఉద్యోగ సంఘాల జేఏసీలు దీనికి అంగీకారం తెలిపాయి. అయినా ప్రభుత్వం ఇక్కడా మోసమే చేసింది.

లిఖిత పూర్వక ఒప్పందం ప్రకారం జీవోలు జారీ కావాల్సి ఉన్నా.. అసలు విషయాన్ని పక్కన పెట్టింది. ఒప్పందానికి సంబంధించి 28-10-2011న జీవోనంబర్ 240 విడుదలచేసింది. జీవోలో ఎక్కడా ‘అర్ధవేతన సెలవు’ అంశాన్ని పొందుపరచలేదు. ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

అగిన ఇంక్రిమెంట్లు.. నిలిచిపోతున్న పెన్షన్లు
42 రోజుల సమ్మెకాలాన్ని ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తుండడంతో తెలంగాణ ఉద్యోగులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంక్రిమెంట్లు, పెన్షన్ల మంజూరు, పదోన్నతులు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు ఏడాదికోమారు వార్షిక ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఏడాది పూర్తికాగానే ఉద్యోగి ఖాతాలో అటోమెటిక్‌గా ఇంక్రిమెంట్ కలుపుతారు. ఈ లెక్కన తెలంగాణ జిల్లాల్లో సుమారు ప్రతి నెలా సుమారు 10 నుంచి 15వేల మందికి ఇంక్రిమెంట్ కలుస్తుంది. సమ్మె కాలాన్ని సర్కారు తేల్చకపోవడంతో అక్టోబర్1, నవంబర్ 1, డిసెంబర్ 1న కలువాల్సిన ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. కరీంనగర్ జిల్లాలోనే 6,200 పైచిలుకు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయాయి. పది జిల్లాల్లో సుమారు 45వేల పైచిలుకు ఇంక్రిమెంట్లు ఆగిపోయినట్లు సమాచారం.

ప్రతి నెలలో తెలంగాణలోని ఒక్కో జిల్లాలో 100 నుంచి 120 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వీరికి పెన్షన్ మంజూరు చేసి డబ్బుల కోసం అకౌటెంట్ జనరల్ కార్యాలయానికి ఫైల్ పంపిచాలి. కానీ ఇక్కడ కూడా 42 రోజుల సమ్మె కాలాన్ని ఎటూ తేల్చకపోవడంతో 42 రో జులను సర్వీసులో ఎలా తీసుకోవాలో తెలియక ఫైళ్లను పెడింగ్‌లో పెడుతున్నారు. దీం తో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 3 నుంచి 4వేల పైచిలుకు ఉద్యోగుల పెన్షన్ల మం జూరు నిలిచిపోయింది. బాధిత ఉద్యోగులు నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నా ప్రభుత్వం నుంచి ఎటుంటి స్పష్టత రాలేదని ఉద్యోగులుచెబుతున్నారు. పదవీ విరమణ పొందిన వారి స్థానంలో అన్ని శాఖల్లోనూ నెలవారీ పదోన్నతులు ఉంటాయి. అవి కూడానిలిచిపోయాయి. మొత్తంగా వేలాదిగా పదోన్నతులు నిలిచిపోతున్నాయి.

రాష్ట స్థాయి కేడర్‌లో అన్యాయం జరిగే ప్రమాదం
ప్రధానంగా ఎంపీడీవో, ఎంఆర్‌ఓ, అసిస్టెంట్ డైరెక్టర్ హోదా గల పోస్టులను రాష్ట కేడర్‌గా గుర్తిస్తారు. ఈ విషయంలో సర్వీస్ ఒకే రకంగా ఉన్నా సమ్మెకాలం తేలకపోతే, ఆంధ్రా ఉద్యోగులు ముందకు దూసుకెళ్తారు. తెలంగాణ ఉద్యోగులు వెనుకపడే ప్రమా దం పొంచి ఉంది. తద్వారా ఉన్నత పదవుల పదోన్నతుల్లో భారీగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగనుంది. సమ్మెకాలానికి సరిపోయేలా సెలవుల్లో పనిచేయాలని ఉపాధ్యాయ వర్గానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందనే విమర్శలు వెల్లు టీఎన్‌జీఓల నుంచే సమ్మె ఆరంభమైంది, కాబట్టి వారినే సర్కారు టార్గెట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

మంత్రులు స్పందిస్తేనే సమస్యకు మోక్షం
ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేల్చిచెప్పకపోతే మున్ముందు ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే అస్కారం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణ ఒప్పందానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసేలా ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు ఒత్తిడి తేవాలని పలువురు కోరుతున్నారు.

Take By: T News

Read more...

Saturday, December 17, 2011

జైపాల్ దూరాశ!



jaipal-reddy-caricature talangana patrika telangana culture telangana politics telangana cinema-సొంత గడ్డపై కనిపించని రాజకీయ భవిష్యత్
-అయితే సమైక్యం.. లేదంటే తెలంగాణ కోటా పదవులు
-కాలం కలిసొస్తే ఉపరాష్ట్రపతి పీఠం దక్కేలా వ్యూహం

హైదరాబాద్, డిసెంబర్ 16 ():తెలంగాణవాదాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలపై పదవుల వల విసురుతుంటే మరో వైపు తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని మన నేతలు అందలమెక్కేందుకు అర్రులు చాస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తుది అంకానికి చేరుకున్న దశలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు, హోదాల ఆశలు చూపించి వారిని చల్లార్చిన హైకమాండ్, తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక మంత్రి జైపాల్‌డ్డిపైనా పదవుల బాణం విసిరినట్టు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో అధిష్ఠానం ఒక నిర్ణయానికి రావాల్సిన తరుణంలో జైపాల్‌ను మరో ఏడాదిలో ఖాళీకానున్న ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించనున్నట్లు ప్రచారం మొదలైంది. ఉప రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం ఉండగా ఇప్పుడు జైపాల్ పేరును తెరమీదికి తీసుకురావడం వెనుక అధిష్ఠానం మతలబు ఏమిటో స్పష్టమవుతోందని మేధావులు, తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌ను ఉపరాష్ట్రపతిని చేస్తున్నామంటూ ప్రచారం సాగిస్తూనే ప్రత్యేక రాష్ట్రం విషయంలో నిర్ణయం తీసుకోకుండా దాటవేసే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌లో కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని ఆసరా చేసుకుని జైపాల్‌డ్డి కూడా పదవీ సోపానం ఎక్కే ప్రయత్నంలో ఉన్నారని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. కేంద్ర కేబినెట్‌లో జైపాల్‌కు వచ్చిన బెర్త్ కూడా తెలంగాణ ప్రాంత కోటాలోనే వచ్చింది.

కేబినెట్ హోదాగల ఏకైక కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం 2004, 2009లో అవకాశం కల్పించింది. రాజకీయ అనుభవం, మంచి పార్లమెం అధిష్ఠానంతో దగ్గరి సంబంధాలు కలిగి విశ్వాస పాత్రుడిగా పేరు... వంటివి జైపాల్‌కు అర్హతలుగా ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంత నేతగానే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో గుర్తింపు లభించిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తీసుకురావడానికి తెలంగాణనే అర్హతగా, ప్రామాణికంగా అధిష్ఠానం గుర్తించినట్లు వినిపిస్తోంది. ఉప్పెనలా, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడిచినా, సుదీర్ఘకాలంపాటు రాష్ట్రంలో సకలజనుల సమ్మె కొనసాగినా, పార్టీలకు అతీతంగా ప్రజావూపతినిధులు తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించినా కూడా కేంద్ర కేబినెట్‌లో ఉంటూ జైపాల్‌డ్డి ఎక్కడ కూడా, ఏనాడు కూడా తెలంగాణ విషయంలో స్పష్టంగా మాట్లాడక పోవడం, కేంద్ర మంత్రికి కొన్ని పరిమితులు ఉంటాయంటూ ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర విషయంలో డొంకతిరుగుడు వైఖరి ప్రదర్శిస్తు వచ్చినందుకే ప్రతిఫలంగా అధిష్ఠానం జైపాల్‌కు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కోసం గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలని, పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు జైపాల్‌డ్డిపై గతంలో ఒత్తిడి తీసుకొచ్చారు. మీ నాయకత్వంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తామని కూడా వారు జైపాల్ వద్ద పేర్కొన్నారు.

ఉద్యమం కీలక ఘట్టానికి చేరుకున్న సమయంలో కూడా జైపాల్ హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉఁటూ మౌనం పాటించారు. తెలంగాణవాదం బలపడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో గెలువలేమనే భయం జైపాల్‌ను వెంటాడుతున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి కూడా దారుణంగా ఉంటుందని జైపాల్ భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. తనకంటూ సొంత నియోజకవర్గం లేకుండా ఆయన ఇప్పటికి నాలుగు చోట్ల తిరిగారు. రాజకీయ చివరి అంకంలో ఎన్నికల్లో ఓడిపోయి తెరమరుగు కావడం కంటె రాజకీయాల్లో రిటై్మంట్ కావడమే మంచిదన్న ఆలోచనతో జైపాల్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వారు ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దక్షిణాది వారికి అవకాశం ఇచ్చే సంప్రదాయం ఉందని జైపాల్ తనకు తానే ప్రచారం చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పెద్దగా లాబీయింగ్ లేక పోయినా తెలంగాణ కోటాలో ఉపరాష్ట్ర పతి పదవిపై జైపాల్ కన్నేసినట్లు మరో ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయంలో కనీసం మద్దతుగా మాట్లాడక పోగా తాను ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదిని కాదని, జాతీయ వాదినని ప్రకటించుకుంటూ జైపాల్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణ పట్ల అంటీ ముట్టనట్లుగా వ్యవహరించి సమైక్యవాదుల సరసన జైపాల్ నిలిచారని టీ వాదులు నేటికి మండిపడుతుంటారు. సమైక్యవాదం వైపు మొగ్గుచూపుతూనే తెలంగాణ కోటాలో అందలమెక్కుతూ వచ్చిన జైపాల్‌కు ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి కూడా అదే ఖాతాలో వస్తుందేమోనని పార్టీ నేతలు కొందరు వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 Take By: T News

Read more...

Wednesday, December 7, 2011

హవ్వ..ఇదేం తీరు?

- తెలంగాణపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఒక్కరూ డిమాండ్ చేయరా?
- ఆత్మగౌరవం కంటే పదవులే ముఖ్యమా?
- 700 మంది బలిదానాలను మరిచారా?
- ప్రజాకాంక్ష పట్టదా?.. ఇది ప్రజలకు వెన్నుపోటే!
- ఒక్కరి కోసం 16 మంది విప్‌ను ధిక్కరించారు
- నాలుగున్నర కోట్ల ప్రజల కోసం ఈ మాత్రం చేయలేరా?
- టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదుల మండిపాటు

assembly-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 6 (): టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై తెలంగాణవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఒక్క టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది మేమే అని గప్పాలు కొడుతున్న టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఈ పాటిదా? అని మండిపడుతున్నారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నా, సబ్బండ వర్ణాలు ఏకమై ఉధృతంగా సకలజనుల సమ్మె చేసి తమ ఆకాంక్షను వ్యక్తం చేసినా, ఇవేమీ పట్టనట్లు ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యవహరించడం, అసెంబ్లీలో తెలంగాణపై కిమ్మనకుండా ఉండటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రస్తావన తెచ్చే దమ్ము, ధైర్యం టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎందుకు కొరవడిందని ప్రశ్నిస్తున్నారు.

అసెంబ్లీ చర్చలో కనీసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి సైతం ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రస్తావించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన 16 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులను గడ్డిపోచతో సమానంగా భావించారు. కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను సైతం ధిక్కరించారు. నమ్మిన సిద్ధాంతం, ఇచ్చిన మాట కోసం పదవులు పోతాయని తెలిసికూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్ పెద్దల దిమ్మతిరిగేలా వ్యవహరించి, భేష్ అనిపించుకున్నారు. పలువురి అభినందనలకు పాత్రులయ్యారు. కానీ టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది ఏంటి? ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. తెలంగాణ ఆకాంక్షలను కాలరాసి, ఉద్యమాన్ని అణచివేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రభుత్వానికి మద్దతు పలికారని, తెలంగాణ సాధన కోసం దేనికైనా సిద్ధమే, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెనుకాడమని బీరాలు పోయిన వారు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని తెలంగాణవాదులు రగిలిపోతున్నారు. తెలంగాణ కోసం మీసం మెలేసి, తొడలు గొట్టిన టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు పూర్తిగా ప్రజాకాంక్షకు విరుద్ధంగా వ్యవహరించారు.

అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తడానికి జంకారు. కదిలిస్తే చాలు తెలంగాణ మా లక్ష్యమనే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మిన్నకుండిపోయారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. పార్చున్ కార్లు, ఇతరత్రా ప్రలోభాలకు వారు తలొగ్గారని ఇప్పటికే వారిపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారనే అనుమానాలు తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌తోపాటు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏదో చేస్తారని తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందేనని టీ న్యూస్ సర్వేలో సైతం దిశానిర్దేశం చేశారు. తమ ఆకాంక్షకు కాంగ్రెస్ ప్రజావూపతినిధులు విలువ ఇస్తారని తెలంగాణ ప్రజలు గంపెడాశ పెట్టుకున్నారు.

తీరా అసెంబ్లీ చర్చలో కనీసం తెలంగాణ ఊసెత్తడానికి టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనకాడటంతో వారు భగ్గుమంటున్నారు. పదవుల కోసమే టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాకులాట! పదవుల మీద ఉన్న సోయి, తెలంగాణ ఆకాంక్ష మీద లేకపోవడంతో దారుణమని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవుల మీద ఉన్న మోజులో ఒకశాతం కూడా తెలంగాణపై లేదా? నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్టదా? 700 మంది తెలంగాణ బిడ్డలను బలి తీసుకున్న సీమాంధ్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే ముఖ్యమా? ఆత్మగౌరవం కన్నా, సీమాంధ్ర సర్కారును ఇచ్చే తాయిలాలే ముఖ్యమా? తెలంగాణపై కాంగ్రెస్ నేతల నోరు ఎందుకు మూగబోయిందో చెప్పాలి? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. నాటి చెన్నాడ్డి నుంచి నేటి జానాడ్డి వరకు తెలంగాణను నమ్మించి, నట్టేట ముంచడమే కాంగ్రెస్ నేతల తీరుగా మారిందని పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

అవిశ్వాసానికి మద్దతిచ్చి తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడం, కనీసం తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ ఒక్కరైన సాహసం చేయలేకపోవడం కన్నా దారుణం మరొకటి ఉందడని పేర్కొంటున్నారు. అయితే త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో, పదవుల ఆశతోనే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీలో తెలంగాణపై మాట్లాడేందుకు సాహసించలేదని చెబుతున్నారు. ఐదురోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన సోమవారం సుమారు 16 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ, తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదని టీఆర్‌ఎస్ రాష్ట్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి.

అవిశ్వాసం చర్చ సందర్భంగా శాసనసభలో తెలంగాణపై తీర్మానం చేయాలని టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ పట్టుపట్టాయి. టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా తెలంగాణపై తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతివ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. అయితే ఇందుకు టీ మంత్రులు, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించి, సమ్మతించకపోవడాన్ని తెలంగాణ ప్రజలతో పాటు కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు, కార్యకర్తలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మాట వరుసకైనా తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు ముఖ్యమంవూతిపై ఒత్తిడి చేయకపోవడంతో, ఇక టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధులు ప్రజల్లో తిరగడం కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం చేయాలని డిమాండ్ చేయడం అటుంచితే, తెలంగాణ కోరుకునే పార్టీలపై టీ మంత్రులు ఎదురుదాడి చేయడం విచివూతంగా ఉందని టీ కాంగ్రెస్ ఎంపీ ఒకరు అభివూపాయపడ్డారు.

ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని మేము వెళ్లగలమని ఆవేదన వ్యక్తం చేశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు అదును కోసం ఎదురు చూస్తున్నారని, సమయమొచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని పలువురు అంటున్నారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP