Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Telugu News. Show all posts
Showing posts with label Telugu News. Show all posts

Sunday, December 23, 2012

పెన్సిల్ హిస్టరీ - Pencil History


pencil
హోంవర్క్ చేయాలంటే పెన్ను కావాలి. బొమ్మలు గీయాలంటే.. పెన్సిల్ కంపల్సరీ! మరి పెన్సిల్ ఎలా తయారయిందో.. ఆ కథాకమామీషు ఏంటో తెలుసా? ఇంగ్లాండ్‌లో జోసెఫ్ డిక్సన్ అనే ఓ పేదవాడు ఇల్లు గడవడానికి చిన్న దుకాణంలో పనికి కుదిరాడు. యజమాని చెప్పింది గుర్తు పెట్టుకునేందుకు ఏం చెయ్యాలో తెలియక, ఓ నల్లటిరాయితో గోడమీద రాసుకునేవాడు. ఆరోజు నుంచీ క్రమం తప్పకుండా డిక్సన్ యజమాని చెప్పిన విషయాలను గోడమీద నల్లరాయితో రాసేవాడు. ఆ నల్లటిరాయే ‘గ్రాఫైట్’. రోజులు గడుస్తుండగా డిక్సన్‌కు ఓ చిన్న ఆలోచన వచ్చింది. ఆ గ్రాఫైట్ రాయిని పొడి చేసి కొంచెం ముద్దగా ఉండటానికి ఆముదం లాంటి పదార్థాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాసి చూశాడు. బాగానే ఉంది. కానీ.. కొంచెం బరువుగా ఉండి రాసేందుకు అంత వీలుకాలేదు.
kids
అంతేకాదు చేతులు కూడా నల్లగా తయారయ్యాయి. దీంతో చాలా ప్రయోగాలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఒక ఉపాయం తట్టింది. ఒక సన్నటి కొయ్యముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంధ్రం చేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను అందులో నింపి, బాగా ఎండిన తర్వాత రాశాడు డిక్సన్. అంతే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా రాస్తోంది అది కూడా సన్నగా. చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడంలాంటి లక్షణాలు కలిగిన దాన్ని చూసి చాలా సంతోషపడ్డాడు డిక్సన్. అలా పెన్సిల్ తయారైంది. గ్రాఫైట్ అనేది కర్బన సమ్మేళనం. మొదట్లో పెన్సిళ్లు గుండ్రంగా వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో ఇప్పుడు రకరకాల పెన్సిళ్లు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి.

Read more...

Thursday, December 20, 2012

నిత్య శృంగారి.. ఈ తాత!

96 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు తండ్రితాతా పెళ్లి చేసుకుంటావా? అనడిగితే.. బోసినోటితో చిరునవ్వులొలికిస్తూ.. ఈ వయసులో నాకెవరు పిల్లనిస్తార్రా? అంటూ సిగ్గుపడిపోయే తాతల గురించి తెలిసిందే! కానీ.. ఈయన మాత్రం అలాంటి తాతకాదు.. 96 ఏళ్ల వయసులోనూ ఓ బిడ్డకు జన్మనివ్వగలిగిన ముదుసలి! పెద్ద వయసులో తండ్రి అయి.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈయన పేరు రాంజీత్ రాఘవ్! హర్యానాలోని సోనిపేటలో ఖర్‌ఖోడా అనే గ్రామానికి చెందిన ఈయన సాధించిన ఘనత గురించి అందరికీ తెలిసిందే. కాకపోతే.. తన ఘనత వెనుక అసలు రహస్యాలను ఇటీవల ఒక పత్రికతో రాంజీత్ పంచుకున్నాడు. తాను ప్రతి రోజూ రాత్రి తన భార్య శకుంతలతో మూడుసార్లు శృంగారంలో పాల్గొనడం, బాగా పాలు తాగడం, నెయ్యి వాడటమే తాను మరోసారి తండ్రి కావటానికి కారణమని వెల్లడించాడు. ‘‘తన భార్యను సుఖపెట్టాలని ప్రతి పురుషుడూ కోరుకుంటాడు. ఇందులో తప్పేమీ లేదు.

నేనిచ్చే సలహా ఏమిటంటే.. పాలు తాగండి. ఆల్మండ్‌లు, పండ్లు తినండి. రోజూ వ్యాయామం చేయండి. మల్లయుద్ధం అయితే మరీ మంచిది. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు మల్లయోధుడినే’’ అని రాంజీత్ చెప్పాడు. 2010లో ఈ జంట తమ తొలి సంతానం కరంజీత్‌కు జన్మనిచ్చారు. అప్పటికి అదే రికార్డు. కాగా.. తాజాగా ఆ రికార్డును ఆయనే అధిగమించారు. తాను పూర్తి శాకాహారినని రాంజీత్ తెలిపారు. ఈయన ఘనతను జంతు సంరక్షణ కోసం పాటుపడే పెటా కూడా గుర్తించింది. 96 ఏళ్ల వయసులోనూ శృంగారాన్ని అనుభవిస్తున్నది శాకాహారం వల్లేనని పేర్కొంటూ ఒక ఫొటో కూడా తయారు చేసింది. ఈ పోస్టరును అన్ని సంతాన సాఫల్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని భావిస్తోంది!

Read more...

Saturday, December 8, 2012

కాసేపు హీరో మరికాసేపు జీరో

తీవ్రమైన అసహనం... అశాంతి. కాసేపు తనకు తానే గొప్ప... మరి కాసేపటిలో తీవ్రమైన న్యూనతాభావం కలిసి టీనేజిలోకి ప్రవేశించిన వారి మానసిక పరిస్థితిలో సంచలన మార్పు వస్తుంది. టీనేజర్ల అంతరంగమేమిటో అవలోకిద్దాం.

టీనేజ్‌కి ముందు పిల్లలు తమ తల్లిదండ్రులు అందించిన సహాయ సహకారాల మీద పూర్తిగా ఆధారపడతారు. అయితే టీనేజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు తమ వ్యక్తిత్వం మీద నిలబడాలనే తపనతో తల్లిదండ్రుల సహాయాన్ని స్వీకరించటానికి ఇష్టపడరు. అదే సమయంలో తమకు తాము అడ్జెస్ట్ కావటమూ చాతకాదు.

ఎవరిని నిందించాలో తెలియక, అసలు కారణం అంతుపట్టక సహాయానికి రాబోయిన తల్లిదండ్రుల మీద విసుగు చెందుతారు.

పైగా వీళ్ళను సినిమాలలోనూ పత్రికలలోనూ కనిపించే ప్రకటనలు ఈ దుస్తుల్ని ధరించు, ఆ సబ్బును వాడు, ఈ చెప్పులను వేసుకో, ఇలా ప్రవర్తించు, అలా ప్రవర్తించు అంటూ రెచ్చగొడుతుంటాయి.

ఆ బాపతు ప్రకటనలు అందించే అంచనా లకూ వాస్తవ జీవితంలో లభించే సౌకర్యాలకూ పొత్తు కుదరకపోవటం కూడా వాళ్ళు బోరు చెందటానికి ఒక కారణంగా ఉం టుంది.
ఇది నాణానికి ఒకవైపు మాట!

రెండో వైపున -
వాళ్ళు ఇప్పుడిప్పుడే బాల్యంలోంచి యవ్వనంలోకి అడుగు పెడుతుంటారు.
ఎంతో వైవిధ్యంతో కూడుకున్న జీవితాను భవాలు ఎదురుగా ఉంటాయి.

కాలేజీకి వెళ్ళటం, ఫలానా కోర్సు చదవటం, చదువులో లేక ప్రేమలో తోటివాళ్ళతో పోటీ, మనస్సును ఆకట్టుకునే క్రీడా ప్రపంచం, ఉద్వేగాల్ని వశీకరించుకునే సినిమా ప్రపంచం, వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.

ఒక్క క్షణాన తమకు తాము ఎంతో ప్రాముఖ్యత కలవాళ్ళుగా భావిస్తారు. మరుక్షణమే తమనెవరూ పట్టించుకోవటం లేదని బాధ చెందుతుంటారు.

భవిష్యత్తులో తానేదో సూపర్‌స్టార్ అయిపోవా లనీ, గొప్ప క్రీడాకారుడు కావాలనీ ఆశలు పెంచుకుంటారు. అనుకోకుండా ఎక్కడ నుంచో ఆస్తి వచ్చి పడుతుందని కలలు కంటుంటారు.
కానీ వాటిలో ఏ ఒక్కటీ ఎన్నాళ్ళు గడిచినా జరగవు. (ఏడాది రెండేళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో ఎక్కువ కాలమేనన్న సంగతి మర్చిపోవద్దు!) ఫలితంగా జీవితం ‘బోర్’ అనిపిస్తుంది.
టీనేజర్స్ మీద తోటివాళ్ళ ప్రభావం అధికంగా ఉంటుందన్న సంగతి ముందే చెప్పుకున్నాం.

తోటివాళ్లు తనను మెచ్చుకోవాలని ఉంటుంది లోలోపల. కానీ వాళ్ళు తనను లెక్కచేయటం లేదనిపించినప్పుడు, నిర్లక్ష్యం చేస్తున్నారనిపించి నప్పుడు వాళ్ళు బోర్‌గా కనిపిస్తారు.
పిల్లలు స్కూలు బోరు కొడుతోందని అంటున్నారంటే స్కూలులో వాళ్ళు రాణించలేక పోతున్నారనీ, చదువులో వెనకబడుతున్నారనీ అర్థం. అక్కడ వాళ్ళకు పాఠాలు సరిగ్గా అర్థం కావటం లేదనో లేక మరేదో అసౌకర్యానికి ఫీలవుతున్నారనో అనుకోవాలి.

చాలా అరుదైన సందర్భాలలో మాత్రం కొందరు బ్రిలియంట్ స్టూడెంట్స్ తమ తెలివితేటలకు తగ్గ చదువు స్కూలులో లభించక పోయినా బోరు చెందుతారు.

కారణం ఏమైనప్పటికి టీనేజర్లలో బోర్ ఫీలింగ్‌ను గమనించి వారికో వ్యాపకం కల్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే వారిలో క్రమేపి నిరాశ ఏర్పడే ప్రమాదముంది. మొత్తం మీద టీనేజర్ల అంతరంగం అంతా పలు ఆలోచనలతో నిండి స్థిరంగా ఉండదు. వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.

Read more...

Monday, November 19, 2012

16రీళ్ల తెలుగు సినీమాయ!


Cinema44
కోస్తా మిగులు సంపద సృష్టించిన కోట్లు
గతం వైభవం.. నేడు దిగజారుడే నైజం
కొన్ని సామాజికవర్గాలదే ‘డైరెక్షన్’
కొందరు తెరపైనే కథానాయకులు.. వేషం తీస్తే ఫక్తు వ్యాపారవేత్తలు.. కబ్జాకోరులు
రాజధానిలో వందల ఎకరాలు స్వాహా
స్టూడియోల పేరుతో భూములు కట్ చేస్తే మల్టీప్లెక్సుల వ్యాపారాలు
కథ - స్క్రీన్‌ప్లే - దర్శకత్వంనమస్తే తెలంగాణ
రీళ్ల డబ్బాల్లోకి కోస్తా సంస్కృతి..అదే రాష్ట్ర సంస్కృతిగా ‘షాట్’

మద్రాస్ నుంచి తరలి వచ్చి.. తెలంగాణ నడిబొడ్డున పాగావేసిన సీమాంధ్ర సినీ పెద్దలు.. తెలుగు సినిమా రంగాన్ని దిగజార్చిన తీరుపై.. హైదరాబాద్‌ను గుప్పిటపట్టిన వైనంపై.. తెర అసలు స్వరూపాలపై నమస్తే తెలంగాణ సంధిస్తున్న అక్షర శస్త్రాలు.. రేపటి నుంచి..

నిన్న మొన్నటి సినిమా అంటే.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి!ఇది పదహారు రీళ్ల తెలుగు సినీమాయా ప్రపంచం! పుష్కలంగా పారే నీళ్లతో మూడు పంటలూ పండగా పేరుకున్న మిగులు సొమ్ముతో కామందులు ఆక్రమించిన కళా సామ్రాజ్యం!! నలుపు-తెలుపు కాలం నుంచి.. సప్తవర్ణాల దాకా..! మూకీ.. టాకీల నుంచి.. డాల్బీ డిజిటల్ సరౌండ్ స్టీరియో సౌండ్ ఎఫెక్ట్‌ల దాకా! పౌరాణికాల నుంచి జానపదాలకు ఎదిగి.. సాంఘిక, సామాజిక అంశాలను స్పృశిస్తూ.. అభ్యుదయాన్ని కాంక్షించి.. విప్లవనాదాలు చేసి.. ఫక్తు వ్యాపార ధోరణికి జారి.. బూతును, ఆడపడుచు అర్ధ నగ్న అందాలను వెండితెరపై అమ్మకానికి పెట్టే దిగజారుడు స్థాయికి పడిపోతున్న నాలుగు ఆటల.. మూడు గంటల దందా! మాఫియా, మత్తుమందుల వ్యాపారాలతో ఇప్పుడు మరింత పాతాళంలోకి! కళను నమ్ముకున్న కొందరు దర్శక నిర్మాతలు.. వారు తీసిన కొన్ని ప్రగతిశీల సినిమాలకు మినహాయింపు! ఎక్కువ మందికి సినిమా పెట్టిన పెట్టుబడికి..

అంతకు రెట్టింపు.. వీలైతే పదింతలు సంపాదించుకునే యావే! అందుకే వారికేమీ పట్టవు! సమాజం పట్ల కొరవడిన బాధ్యత.. ఉపాధ్యాయులంటే హాస్యగాళ్లు.. పురోహితులంటే అర్భకులు.. సామాజిక వర్గాలంటే చులకన భావం.. బడుగు జీవులంటే అవహేళన.. అస్తిత్వ ఉద్యమాలంటే ఎక్కడలేని అలుసు! మద్రాస్ నుంచి వస్తూ.. అనేక రాయితీలు తెచ్చుకుని, చట్టాలు మార్పించేసుకుని, హైదరాబాద్‌లో మకాం వేశారు! అంతా ఒక ప్రాంతం వారే! వారు తీసిందే సినిమా.. వారు చూపిందే బొమ్మ! రాష్ట్రం మొత్తం చూసే సినిమా! కానీ.. ఒక ప్రాంతంలో ఒకటిండు సామాజికవర్గ కుటుంబాల భావనలే కథాంశాలు! ఒకే ఒక్కడు.. హీరో! ఎక్కడో కోనసీమ పల్లెల నుంచి వచ్చి.. వంద మందిని ఒకేసారి మట్టికరిపించేస్తాడు! ఒకప్పుడు పాత్రల్లో జీవించేవారు.. ఇప్పుడు నటించడం మానేశారు! గొంతు బాగాలేకపోతే.. డబ్బింగ్.. ఫేస్‌లో హీరో చార్మ్ లేకుంటే ప్లాసిక్ సర్జరీ! అంతా బ్లూస్క్రీన్ మాయ! నాటి తారలు మృదు మధుర శృంగారభావనలను హావభావాలతో ఒలికిస్తే.. నేడు ఒక్కటే సూత్రం ఎక్స్‌పోజింగ్! ఒకప్పుడు సినిమారంగం అంటే కళాపోషణ! ఇప్పుడు ‘కళ’ తప్పి.. పోషణే మిగిలింది! ఆ పోషణ కుటుంబం గడిచేందుకు కాదు.. తరతరాలు గడించకపోయినా.. ఇబ్బంది లేకుండా! నిన్న మొన్నటి సినిమా అంటే..

ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. అండ్.. ఎంటర్‌టైన్‌మెంట్! ది డర్టీ పిక్చర్!! విద్యాబాలన్ మాట నూటికి నూరుపాళ్లూ తప్పు! ఇప్పుడు సినిమా ఒక ఎంటర్‌ప్రైజ్! తండ్రుల నుంచి కొడుకులకు.. కొడుకుల నుంచి వాళ్ల కొడుకులకు.. వాళ్ల నుంచి వాళ్ల కొడుకులకు! ఇదో వారసత్వ పరిక్షిశమ! పాలకులు ‘మన’వాళ్లే! కోరుకోవడం ఆలస్యం. కోట్లు పలుకుతున్న ఎకరాలకెకరాలు.. కారుచౌకగా దఖలు పడతాయి! స్టూడియోల నిర్మాణానికి తెచ్చుకున్న భూమిలో మల్టీప్లెక్స్‌లు మొలిచి.. వ్యాపార సామ్రాజ్యాలుగా ఎదుగుతాయి! అడ్డికి పావుశేరుకు కొట్టేసిన భూములు అమ్మకానికి వీల్లేకపోయినా.. కోట్లకు చేతులు మారుతుంటాయి! స్థానిక డిస్ట్రిబ్యూటర్లు.. దుకాణాలు మూసేసుకోవాల్సిందే! థియేటర్లు రాసిచ్చేయాల్సిందే! కార్మిక నాయకుడిగా కదనరంగాన దూకిన కథానాయకులు..

వేషం తీసేస్తే ఇక్కడ కబ్జాకోరులు! తెరపై హీరోయిన్‌కు కన్నుగీటి.. ప్రేమను బకెట్ల కొద్దీ కురిపించే హీరోలు.. తెర వెనుక కాసుల లెక్కల్లో మునిగితేలుతుంటారు! మానవతావాదాన్ని చాటే మహానటులు.. నిజ జీవితంలో నటులే! హీరోయిన్ బొడ్డు అందంగా చూపడంపై ఎంత శ్రద్ధ పెడతారో.. నగరం నడిబొడ్డున భూములు కొట్టేయడానికీ అంతే తపన! రీళ్ల డబ్బాలు కురిపించిన నోట్ల కట్టలతో జూబ్లీ.. బంజారా గుట్టలను భక్షించి.. మయసభలు కట్టుకున్న సినీమాంవూతికులు! ఇప్పుడు ఆ గుట్టల పరిరక్షణే ధ్యేయం! అందుకే అస్తిత్వ ఉద్యమాలంటే వారికి అసహ్యం.. ఉద్యమాలు విజయం సాధిస్తే తాము కట్టుకున్న కోటలు ఎక్కడ కూలిపోతాయోనని! తెలంగాణ జీవనశైలి అంటే అదేదో పరాయి దేశపుదన్న ఆలోచన! తెలంగాణ యాస అంటే రౌడీలు గూండాలు, అనాగరికులు, లేబరోళ్లు మాట్లాడే భాషగా నిర్ణయం.. ఈ ప్రాంతంలో ఉండేది వారేనని ఒక తీర్మానం! కోస్తా జిల్లాల సంస్కృతే రాష్ట్ర సంస్కృతిగా చిత్రీకరణ.. ఒకటి కాదు.. వంద కాదు.. వేల రీళ్లు తిరిగినా ఇదే దృశ్యం! ఇడ్లీ సాంబారు ప్రస్తావనలే తప్ప.. జొన్న రొట్టెలు, అంబలి కనిపించవు! పండుగల్లోనూ అదే తీరు! ఒకానొక కాలంలో సంక్రాంతి పండుగ ప్రస్తావన లేని సినిమాల్లేవంటే ఆశ్చర్యమే! ఇప్పటికీ అదే తీరు! రాష్ట్రంలో సగభాగం ఎంతో గొప్పగా జరుపుకొనే బతుకమ్మ పండుగ పేరే ఇటీవలి కాలంవరకూ రాష్ట్రంలోని ఏ సినిమా హాల్‌లోనూ వినిపించలేదంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఉందో వివక్ష! జమీందారు అకృత్యాలపై హీరో పోరాటాలే తప్ప.. రజాకార్లపై తెలంగాణ రైతులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు వెండితెర వేల్పులకు కనిపించలేదు. ఇక వామపక్ష అభ్యుదయ, విప్లవ భావజాలాలను ఏం చేస్తారు? తీసే సినిమాల్లోనూ వాస్తవాల వక్రీకరణలు..

ఒక ప్రాంతంపై దూషణభాషణలు! అదే సొంత ప్రాంతమైతే.. పాత్రలకు అత్యున్నత శిఖరాలు! అందుకే వారికి కొమురం భీమ్ పోరాటం కనిపించదు! మన్యంవీరుడెవరంటే అల్లూరి సీతారామరాజే! నటశేఖరుడు చెప్పాడుగా మరి! ఖాకీ నిక్కరు చొక్కా వేసుకుని.. యోగిలా జీవితం గడుపుతూ గిరిజనులను ఏకం చేసిన అల్లూరి సీతారామరాజు.. కాషాయ వస్త్రాలతో.. విల్లంబులతో వెండితెరపై కొత్త.. నాగరిక ముద్ర వేసుకుంటాడు! కొమురం భీం సినిమా విడుదలకు ఏళ్లు పడుతుంది.. నైజాం నవాబును గడగడలాడించిన కొమురం భీం మన్యంవీరుడంటే వాళ్ల మనసు నచ్చదు! ఆ యోధుడి జీవితాన్ని తెరకెక్కించాలంటే మళ్లీ ఆ ప్రాంతపువాడే తలపెట్టాలి! జీవన శైలిలోనూ అదే తీరు. ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు..అంటూ భార్యాభర్తలు సాగునీటి కాల్వల నుంచి నీళ్లు చేదుతున్న పాటల దృశ్యాలే! ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి.. ఎన్నడూ మెతుకెరుగని తెలంగాణ రైతు కష్టాన్ని పాట సినిమా కథలో తేవాలంటే మళ్లీ తెలంగాణ కలమే రావాలి! ఇప్పుడు పైత్యం మరింత ముదిరింది. మొన్నటిదాకా తెలంగాణపై పరోక్షంగా విషం కక్కిన దర్శకాక్షిగేసరులు.. ఇక నేరుగా యుద్ధం చేస్తున్నారు. తెలంగాణవాదంపై మునుపెన్నడూ లేని విధంగా విరుచుకుపడుతున్నారు.. కెమెరామెన్ గంగతో రాంబాబు ఒక ఉదాహరణ మాత్రమే! సినిమా ఒకనాడు వినోదం, కళ.. తదుపరి వినోదం, అభ్యుదయం.. కొన్నాళ్లకు వినోదం, వ్యాపారం..కాలం గడిచే కొద్దీ ఆస్తుల సేకరణ.. ఇప్పుడు ఆస్తుల రక్షణ! తెలుగు సినిమా పరివర్తనా క్రమమిది!

- T News

Read more...

Tuesday, September 18, 2012

కదిలింది తెలంగాణ

 Image121న యూపీఏ మిత్రపక్షాల భేటీ సోనియా కోర్టులో ‘ప్రత్యేక రాష్ట్రం’
నిర్ణయాధికారం ఆమెకే వదిలిన సీనియర్లు త్వరలోనే అఖిలపక్ష సమావేశం!
తెలంగాణపై మెజార్టీ సభ్యుల మూడు ప్రతిపాదనలు


- తెలంగాణ ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం
- బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణ ప్రకటన
- రాష్ట్రం ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులపై కమిటీ ఏర్పాటు, 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం
- సీఎం, ప్యాకేజీలతో సరిపెడదామన్న కొందరు!
- అధినేత్రి నివాసంలో సీనియర్ నేతల భేటీ
- ఆంటోనీ, చిదంబరం, షిండే, పటేల్‌తోపాటు ఆజాద్, వాయలార్ రవి కూడా హాజరు
- 80 నిమిషాల పాటు మంతనాలు
- తెలంగాణపైనే ప్రధాన చర్చ
- ఇంకా నాన్చలేమన్న రవి
- చర్చల సారాంశం ప్రధానికి వివరించిన రవి, పటేల్
- అనంతరం కేసీఆర్‌తో ఫోన్‌లో సంప్రతింపులు


()‘తెలంగాణ’ కదిలింది! హస్తినలో కాంగ్రెస్ నేతలను కదిలించింది! తెలంగాణ మార్చ్ పేరుతో ఈ నెల 30న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున జరగబోయే కార్యక్షికమం ఒకవైపు.. హస్తినలో మకాం వేసిన టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కొనసాగిస్తున్న దౌత్యం మరోవైపు.. కేంద్రంలో తెలంగాణపై చర్చ చేపట్టాల్సిన అనివార్య పరిస్థితిని తీసుకువచ్చాయి. అసలు కేసీఆర్ హస్తినకు ఎందుకొచ్చారో తెలియదంటూ ఒకరు.. తెలంగాణపై చర్చలే జరగడం లేదని మరొకరు!! చర్చల ప్రక్రియకు అడ్డుపుల్ల వేసేలా సీమాంధ్ర నేతలు చేసిన వాదనలన్నీ వట్టివేనని తేలిపోయింది. కేసీఆర్ ఢిల్లీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ జరిగిన సంప్రతింపులకు కొనసాగింపుగా సోమవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో తెలంగాణ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. తొలుత ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు సంచలన నిర్ణయాల నేపథ్యంలో తలెత్తిన కొత్త రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినా.. చివరికి మొత్తం చర్చ తెలంగాణపై కేంద్రీకృతమైందని తెలిసింది. రెండు రోజుల్లో యూపీఏ మిత్రపక్షాల సమావేశాన్ని నిర్వహించాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

పార్టీపరంగా ఒక నిర్ణయంతీసుకుంటాం గనుక ఆ తర్వాత అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం, వాయలార్వ్రి, ఆజాద్‌తో పాటు సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాధారణంగా కోర్‌కమిటీ సమావేశాలకు రవి, ఆజాద్ హాజరుకారు. కానీ.. వారిని కూడా సమావేశానికి పిలవడం చర్చ తెలంగాణపైనే జరగనుందన్న సంకేతమిచ్చింది. దానికి అనుగుణంగానే కోర్‌కమిటీ చర్చలు నడిచాయి. ఈ సమావేశం 80 నిమిషాలపాటు జరిగింది.

ఈ సమావేశం సందర్భంగా తెలంగాణ అంశంపై సీనియర్‌లు అధినేవూతికి తమ అభివూపాయాలను నివేదించినట్లు తెలిసింది. కేసీఆర్‌తో గత కొన్ని రోజులుగా జరిగిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి అధినేవూతికి వివరించినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని ఇంక ఎంత మాత్రమూ నాన్చడానికి వీల్లేదని అధినేత్రి ముందు రవి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల వివరాలను ఆజాద్ సైతం అధినేవూతికి వివరించారని సమాచారం. కొద్ది రోజుల క్రితం టీ జేఏసీ నేతలు తెలంగాణ మార్చ్ విషయంలో ఆజాద్, రవిలతో సీరియస్‌గా చర్చించడం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో జరిగే ఈ చలో కార్యక్షికమానికి సంబంధించి సన్నాహకాలపై కేంద్ర హోం శాఖ తన గూఢచార వర్గాల ద్వారా సేకరిస్తున్న అంశాలను షిండే వివరించినట్లు సమాచారం. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన కవాతు, ఆ సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు సూచనలు!: తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలనే అంశాన్ని కోర్‌కమిటీ సమావేశం ఏకక్షిగీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పరిష్కార మార్గాల విషయంలో ప్రధానంగా మూడు సూచనలు వచ్చినట్లు సమాచారం. తెలంగాణను ప్రకటించి, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుకోవటం.. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి, బేషరతుగా హైదరాబాద్ సహిత తెలంగాణను ప్రకటించటం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, రాజధాని, నీటి వనరులు తదితరాలపై తేల్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి, 2014 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం.. ఈ సూచనలను మెజార్టీ సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి, ప్యాకేజీ తదితర తాయిలాలు ఇవ్వడంతో సరిపెట్టాలని ఒకరిద్దరు పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ మార్చ్ జరిగిన మరుసటి రోజు జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సజావుగా నడిపించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నదని తెలుస్తోంది. ఇప్పటికే సకల జనుల సమ్మె దెబ్బను రుచి చూసిన కాంగ్రెస్ పెద్దలకు సెప్టెంబర్ 30 సెగ ముందుగానే తగిలిందని అంటున్నారు. సోమవారం జరిగిన చర్చలపై దాని ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో జరుగుతుందని భావిస్తున్న అఖిలపక్ష సమావేశానికి సమయం నిర్ణయించడంతో పాటు, తెలంగాణపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే విషయాన్ని సోనియాకే వదిలిపెట్టినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా బంతి సోనియా కోర్టుకు చేరింది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.

కుతూహలం కలిగించిన రవి వ్యాఖ్యలు
ఉదయం నుంచి వివిధ సమయాల్లో రవి విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు సమావేశంలో చర్చ జరిగిన తీవ్రతను ప్రతిబింబించాయి. వివిధ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం కోసం ఆయా దేశాల రాయబారులతో ఢిల్లీలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత రవిని మీడియా చుట్టుముట్టింది. ‘కేసీఆర్ మిమ్మల్ని కలవడం నిజమేనా?, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకోబోతున్నారా?, తెలంగాణ ఎప్పుడిస్తారు? చర్చలు ఎప్పుడు ముగుస్తాయి? అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీటికి సంయమనంతో సమాధానాలిచ్చిన రవి.. ‘‘కేసీఆర్ నాతో తెలంగాణ అంశంపైకాకుండా మరే విషయం మాట్లాడుతారు? ఆయన నాకు మంచి మిత్రుడు.

ఇప్పటికి మేం రెండు సార్లు భేటీ అయిన విషయం వాస్తవమే’’ అని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాల్సి ఉంది. ఇప్పుడే నేనేమీ చెప్పలేను’’ అని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్‌ను బలవంతపెట్టబోమని అన్నారు. అయినా విలీనంఅనేది ఊహాజనితమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్ విలీనం విషయం 2014 ఎన్నికల ముందు ఎలాగూ తెలుస్తుంది కదా.. అంటూ అప్పటిదాకా ఓపికపట్టాలని అన్నారు. ఆ తర్వాత సోనియాతో భేటీకి ముందు మరోసారి రవిని మీడియా ప్రశ్నించింది. మళ్లీ అవే ప్రశ్నలతో విసుగెత్తిన రవి.. ‘‘ఇప్పటికి మీరు 20సార్లు అవే ప్రశ్నలు అడిగారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అవును.. కేసీఆర్ కలిశారు.

కేసీఆర్‌తో మాట్లాడాను. మాట్లాడొద్దా? అన్నీ మీకు చెప్పాలా? మీకేం కావాలో నేను చెప్పలేను. నేనేం చెప్పదల్చుకున్నానో అదే చెబుతాను. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే చెప్పకుండా ఉండము కదా! తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తాం’’ అన్నారు. తెలంగాణ మార్చ్‌ను నిరోధించలేమని ఆయన వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడిన గంట సేపటికే సోనియాతో భేటీకి రవి హాజరవడం విశేషం.

నిర్ణయం తప్పదంటున్న ఏఐసీసీ వర్గాలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవటం పార్టీకి సాధ్యం కాదని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ‘‘అంతటి దుస్సాహసానికి ఒడిగడితే జరుగుబోయే పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తెలుసు’’ అని ఒక సీనియర్ నేత చెప్పడం గమనార్హం. సమావేశం అనంతరం నిర్ణయాన్ని పార్టీ అధినేవూతికే వదిలేసినట్లు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో మరో దఫా చర్చలను అధినేత్రి కొనసాగిస్తారని సమాచారం.

ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఉంటుందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. వాయలార్ రవి ఒక అధికారిక కార్యక్షికమం నిమిత్తం మంగళవారం చైనా వెళుతున్నారు. ఈలోపే 21న యూపీఏ మిత్రపక్షాల భేటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. రవి తిరిగి ఢిల్లీకి చేరుకున్న తర్వాత 22న కేసీఆర్‌తో రవి మరోవిడత సంప్రతింపులు జరుపుతారని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, సోనియాతో తాము జరిపిన చర్చల సారాంశాన్ని వాయలార్ రవి, అహ్మద్‌ప ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు వివరించారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఈ ఇద్దరు నేతలు.. ఆయనతో 15 నిమిషాలు భేటీ జరిపి, విషయాలు వివరించినట్లు సమాచారం.

అనంతరం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాలని రవి తొలుత భావించినా.. ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చుకున్న ఆయన.. ఫోన్‌లోనే కేసీఆర్‌ను సంప్రతించారు. కోర్‌కమిటీ భేటీ తర్వాత మీడియా వాహనాలన్నీ తననే అనుసరిస్తుండటంతో కేసీఆర్‌ను నేరుగా కలవాలన్న ఆలోచనను రవి ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి కేసీఆర్‌తో రవి ఫోన్‌లోనే సంప్రతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొదటి నుంచీ గట్టి నమ్మకంతో ఉన్న కేసీఆర్‌కు సోమవారం సాయంత్రం నాటి పరిణామాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని, తన నిరీక్షణకు ఫలితం దక్కనుందన్న సంతోషంలో తమ నాయకుడున్నారని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఒకరు టీ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

‘‘చూద్దాం. భగవంతుడున్నాడు. తెలంగాణ ప్రజల 66 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే రోజు ఎంతో దూరంలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను రాసే అదృష్టం మీకే దక్కనుంది’’ అని కేసీఆర్‌కు ఆంతరంగికుడైన ఆ నేత చెప్పడం గమనార్హం

Take BY: T News

Read more...

Sunday, February 12, 2012

జూనియర్ వైద్యులు(జూడా)లతో చర్చలు విఫలం



Geetha talangana patrika telangana culture telangana politics telangana cinema- స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నారు
-13 అంశాల్లో 11 అంగీకరించాం
-సమ్మె విరమణపై విన
-వారి వెనుక రాజకీయ శక్తులు
-కేబినెట్ ఉపసంఘం ఆరోపణ
-చర్చలు జరుగుతుండగానే బెదిరించారు
-రేపటి నుంచి తలలు పగులుతాయన్నారు
-స్టైపెండ్‌పై పక్కదోవ పట్టిస్తున్నారు
-అత్యవసర సేవలు మెరుగుపర్చాలి
-సమ్మెపై వెనక్కి తగ్గం: జుడాల స్పష్టీకరణ
-ఉద్యమ కార్యాచరణపై నేడు ప్రజా సంఘాలతో చర్చ

హెదరాబాద్, ఫిబ్రవరి 11 (): జూనియర్ వైద్యులు(జూడా)లతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూడాల డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. శుక్రవారం సాయంత్రం నుంచి జూడాలు అత్యవసర సేవలు నిలిపివేయడంతో ప్రభుత్వ ఆస్పవూతుల్లో పరిస్థితి విషమించింది. మరణాల సంఖ్య పెరుగుతోందనే వార్తల నేపథ్యంలో శనివారం సాయంత్రం చర్చలకు రావాలని జూడాలను ఆహ్వానించింది. సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు మంత్రులు ఆనం రామనారాయణడ్డి, గీతాడ్డి, కొండ్రు మురళి, జూడాల తరపున జూడాల సంఘం ప్రతినిధులు ఆదిత్య, ఫణి మహేష్, నరేష్, హనుమాండ్లు, అస్లంబాబా, అశోక్, కిరణ్, కార్తీక్, రేవంత్ పాల్గొన్నారు. అయితే.. చర్చల పట్ల మొదటి నుంచీ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిన ప్రభుత్వం ఈసారి కూడా అదే వైఖరి కొనసాగించింది. స్టైపెండ్ పెంపు సహా చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖజానాపై ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నందున, ఈ చర్చల్లో ఆర్థిక మంత్రి ఆనం కీలక పాత్ర పోషించాల్సింది. కానీ ఆయన తన చాంబర్‌లోనే ఉన్నారు. తొలి విడత చర్చల్లో గీతాడ్డి, కొండ్రు మురళి మాత్రమే పాల్గొన్నారు.

doc talangana patrika telangana culture telangana politics telangana cinemaసుమారు రెండున్నర గంటల పాటు చర్చించిన తర్వాత మంత్రులు ఇద్దరు ఆనంను కలిసి పరిస్థితి వివరించారు. ఈసారి ఆనంతో సహా వెళ్లి మళ్లి చర్చలు జరిపారు. ఇలా రెండు పర్యాయాలు విడతలుగా చర్చించినప్పటికీ అంతిమంగా చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం మంత్రులు గీతాడ్డి, కొండ్రు మురళీ మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమవడానికి జూడాల వైఖరే కారణమని దెప్పి పొడిచారు. ‘ జూడాల సమ్మె ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు అనేక పర్యాయాలు మంత్రులు వారితో చర్చలు జరిపారు. ప్రతి సారి ఏవో క్లారిఫికేషన్స్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇన్ని గంటల పాటు చర్చించినా స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నారు. మంత్రిగా కొండ్రు మురళి కొత్తగా వచ్చారు, ఆయనకు కొంత సమయం ఇవ్వాలని చిన్న పిల్లలకు చెప్పినట్లు చెప్పినా వినడం లేదు. స్టైపెండ్ పెంపుపై మంత్రికి కొంత సమయం ఇవ్వాలని కోరినా మొండికేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుని, ప్రభుత్వం నుంచి స్టైపెండ్ తీసుకుంటూ ప్రజలకు సేవలు చేయడం అంటే ఎంత వరకు సబబు? మాకు విధులు కాదు, నిధులే ముఖ్యమన్నట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’ అని గీతాడ్డి అన్నారు.

ఇదంతా రాజకీయంగా జరుగుతుంది?: మంత్రి కొండ్రు మురళి
‘ఇదంతా రాజకీయంగా జరుగుతుందని మా వద్ద సమాచారం ఉంది. వారు ఎవరి వలలో ఉన్నారో మాకు తెలుసు. జూడాలు చెప్పిన 13 డిమాండ్లలో 11 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. కేవలం స్టైపెండ్ విషయంలో వాళ్లు పట్టుబడుతున్నారు. చదువుకున్న వైద్య విద్యార్థులు ఇలా ఉంటారా? అని నేను అనుకోలేదు. నేను కొత్తగా వచ్చాను, ఏప్రిల్ మొదటి వారం వరకైనా సమయం ఇవ్వాలని అడిగాను. ఆర్థిక మంత్రి ఆనం కూడా జూడాల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో వివరంగా చెప్పారు. అయినా వాళ్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మంచిది కాదు. సమ్మెను విరమించి విధుల్లో చేరాలని, ప్రభుత్వం మీకు మద్ధతుగా ఉంటుందని నచ్చజెప్పినా పట్టించుకోవడం లేదు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు టీసీఎస్ వంటి కంపెనీల్లో రూ.15 వేలు ఇస్తున్నారు. మేం అంతకంటే ఎక్కువగానే ఇస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటుంది. 00 మంది పీజీ విద్యార్థులు సమ్మెలో ఉంటే, 0 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించాం. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేదు.’ అని మంత్రి కొండ్రు మురళి పేర్కొన్నారు.

ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది: జూడాలు
మంత్రుల ఆరోపణలను జూడా ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తాము స్టైపెండ్ గురించి పెద్దగా డిమాండ్ చేయలేదని, గ్రామీణ ప్రాంతాల్లో మాతో చేయించుకునే పనికి స్పష్టమైన నిబంధనలు చెప్పాలని కోరామని అన్నారు. అత్యవసర సేవా విభాగాలను ఆధునీకరించాలని అడిగితే హామీ ఇవ్వలేదన్నారు. ‘ఎన్నో ఏళ్లుగా ఈడిమాండ్ ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రజలు చచ్చిపోతున్నారని మాపై నిందలు వేస్తున్నారు. అవసరమైన ఇంజెక్షన్ అందుబాటులో లేక మా కళ్ల ముందే రోగులు చనిపోతుంటే మేం ఎన్నోసార్లు ఏడ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రజలు చనిపోకూడదనే అత్యవసర వైద్య సేవలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఆస్పువూతులకు ఎస్‌పీఎఫ్ ప్రొటెక్షన్ కల్పిస్తామని చెప్పినా ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు. లైబ్రరీని ఆధునికరించడం ద్వారా పేద ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించే అవకాశముందని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు. అలాగే ప్రధానంగా ఎంసీఐ నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ సిస్టమ్‌ను అమలు చేయాలని చేసిన డిమాండ్‌ను పట్టించుకోకుండా, స్టైపెండ్ కోసం పట్టుబడుతున్నామని ప్రజలకు తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చర్చలు జరుగుతండగానే మమ్మల్ని బెదిరించారు. ఓ వ్యక్తి వచ్చి నేను మంత్రుల తరఫున చెబుతున్నాను, వెంటనే సమ్మెను విరమించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం నుంచి తలలు పగులొచ్చని బెదిరించారు. ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళదామంటే, వాళ్లు మాకు అవకాశం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఏదేమైనా తమ పోరును విరమించబోమని, ఆదివారం సాయంత్రం వివిధ ప్రజా సంఘాలతో చర్చించి భవిష్యతు కార్యచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వ లోపాలు, ఆస్పవూతుల్లో చోటుచేసుకుంటున్న లోపాలను ప్రజలకు తెలియజేస్తామని జూడాలు వెల్లడించారు.

By: T News

Read more...

Tuesday, January 31, 2012

నేడు వేతన ఒప్పందం ఖరారు!

-sccl05 talangana patrika telangana culture telangana politics telangana cinema కేంద్ర మంత్రి జోక్యంతో చర్చల్లో పురోగతి
- రెండు ప్రధాన డిమాండ్లకు కోలిండియా ఓకే

గోదావరిఖని/ కోల్‌బెల్ట్, : ఏడు నెలలుగా ఊరిస్తున్న బొగ్గు గని కార్మికుల తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం ఎంఓయూ కుదిరే అవకాశముంది. కొంతకాలంగా వేజ్‌బోర్డు చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఓం ప్రకాశ్ జైస్వాల్‌తో జేబీసీసీఐ కోర్‌కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు డిమాండ్లపై సానుకూలత వ్యక్తమైనట్లు ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి ‘టీన్యూస్’కు తెలిపారు. కోల్ ఫీల్డ్ అల 4 శాతం, హెచ్‌ఆర్‌ఏ 2 శాతం పెంచేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. కార్మిక సంఘాలు కోల్‌ఫీల్డ్ అల 5 శాతం, హెచ్‌ఆర్‌ఏ 10 శాతం పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ కొంత పట్టు విడవడంతో చర్చల్లో ప్రతిష్టంభన తొలగినట్లయింది. ఐదు దఫాలుగా కోలిండియా యాజమాన్యంతో జాతీయ కార్మిక సంఘాలు జరిపిన చర్చల్లో 25 శాతం వేతనాల పెరుగుదలపై ఇప్పటికే అవగాహన కుదిరింది. అలాగే ఇప్పుడిస్తున్నఅల శాతం పెంచేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో వేతన ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేసే అవకాశముంది. ఈ లెక్కన సగటున ఓ కార్మికుడికి రూ. 3500 వేతనం పెరిగే అవకాశం ఉంది. సింగరేణి సీఎండీ నర్సింగరావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం అధ్యక్షుడు నర్సింహారావు, ఐఎన్టీయూసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బీ వెంకవూటావు, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తదితరులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. మంగళవారం తుదిచర్చల్లో పాల్గొని వేతన ఒపందాన్ని ఖరారు చేస్తారని తెలిసింది.

Take By: T News

Read more...

Monday, January 30, 2012

అధికారానికి బడుగులే!

సామాజిక న్యాయం చట్టుబండలుబీసీలకు రిజర్వేషన్లు ఏవి?
ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమూ అంతంతేఎక్కడా దక్కనిదామాషా వాటా

- పార్టీల్లోనూ టికెట్లు కరువే
- మభ్యపెడుతున్న ప్రధాన పార్టీలు
- సంక్షేమ పథకాల కుప్పల్లో కూరుకుపోయిన బలహీన వర్గాలు
- అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే
- పార్టీ జెండా మోయడానికే పరిమితం!


kulammain talangana patrika telangana culture telangana politics telangana cinema(, హైదరాబాద్)వారికి జెండా మోయడం తెలుసు! తమ నాయకులను అధికారంలోకి తేవడం తెలుసు! పార్టీ కోసం గొంతుచించుకుని అరవగల సత్తా వారిది! నేతలు ఇబ్బంది పడితే తామే ఇబ్బందిపడినట్లు బాధపడే మనస్తత్వం వారిది! ఏళ్ల తరబడి కొన్ని కొన్ని పార్టీలను నమ్ముకుని ఉన్నారు! అగ్రకుల పార్టీ నేతలకూ ఆ విషయం తెలుసు! అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే అంత ప్రేమ! కానీ ఆ ప్రేమ వారితో జెండా మోయించేంత వరకే! ఓట్ల పండగలో వెంట తిప్పుకోవడం వరకే! మహా అయితే అందులో ముఖ్యమైన వారికి ఐదో పదో పదవులు, కొన్ని ప్రయోజనాలు కల్పించడం! అంతవరకే! కానీ వారిలో ఎవరూ ఆ పార్టీలో కీలక స్థానాలకు ఎదగలేరు! ఇక ముఖ్యమంత్రి పదవంటే మాటలా! ఇది దశాబ్దాలుగా రాజకీయ కుల సమరంలో ఎప్పుడూ ఓడిపోతున్న బడుగు వర్గాల కార్యకర్త పరిస్థితి! ఓట్ల పరంగా అధిక సంఖ్యాకులైనప్పటికీ.. అధికార పంపిణీలో మాత్రం చిన్నచూపే! టికెట్లు కేటాయించే దగ్గర మొదలు.. గెలిస్తే కీలక పదవులు కట్టబె అదే వివక్ష! బడుగులకు రాజ్యాధికారం సహించని తత్వమేనన్నది కడుపుమండినవారి విమర్శ! అది అగ్రకుల తత్వమేనన్నది సమాజాన్ని కాచివడపోసిన వారి మాట! ఏది ఏమైనా.. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నాయి! అగ్రకుల పెత్తనంలో కొనసాగుతున్న పార్టీలు వారిని ఆ స్థాయికి తీసుకురావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి! ఇది నగ్న సత్యం!రాష్ట్ర చరివూతలో అప్పుడు ఇప్పుడూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం అందని పండుగానే ఉంది. ఓట్ల రాజకీయాల కోసం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ఈ పార్టీలే దానికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేందుకు చిత్తశుద్ధితో ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోకపోవడం గమనార్హం.

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తే తమ ఆటలు సాగవనేది గమనించిన ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలు బీసీలు ఉద్యమాలతో సంఘటితం కాకుండా దృష్టిమళ్ళించే చర్యలకు పాల్పడుతున్నాయన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించినవారిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నప్పటికీ.. అధిక శాతం ఓట్లున్న బీసీలకు రాజకీయపార్టీలు తగిన రీతిలో టిక్కెట్లు కేటాయించకపోవడం వల్ల ‘పదవుల్లో’ లేకుండా పోతున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అని రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం చేస్తూ అగ్రకుల పక్షపాత పార్టీలుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఆంధ్రవూపదేశ్ ‘రాజకీయ అధికార’ సామాజిక నేపథ్యమే ఇందుకు నిదర్శనం. 1955 నుంచి 2004 వరకు జరిగిన శాసనసభ, పార్లమెంటు (లోక్‌సభ, రాజ్యసభ) ఎన్నికల్లో వివిధ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థుల కుల నేపథ్యం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నది. వాస్తవానికి భారత రాజ్యాంగం పౌరులందరికీ ‘రాజకీయ సమానత్వం’ ఇచ్చింది. దీన్ని అన్ని స్థాయిల్లో ఆచరణలో నెరవేర్చాల్సిన బాధ్యత పార్టీలు, అవి ఏర్పాటు చేసే ప్రభుత్వాలపైనే ఉంది. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయి. ప్రధానంగా చట్టసభల్లో బలహీనవర్గాలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు వారి వారి జనాభా దామాషా నిష్పత్తిలో ప్రాతినిధ్యం లభించకపోవడానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలదే బాధ్యతగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో సీఎం, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి స్పీకర్, మంత్రులు, అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, పార్టీ అధినాయకులు, కేంద్రంలో, రాష్ట్రంలో నియమితులైన మంత్రుల సామాజిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుంటే రాజకీయ సమానత్వం చట్టుబండలైన విషయం బట్టబయలు అవుతుంది.

గత అరవై సంవత్సరాల కాలంలో రాజకీయ నిర్ణయాధికారం అందరికీ సమానంగా రాలేదనేది నగ్నసత్యం. రాజకీయాధికారం సాధించిన కొన్ని అగ్రకులాలు జనాభా రీత్యా అల్ప సంఖ్యాకులైనప్పటికీ వారు తమ చేతుల్లోకి అధికారాన్ని వినియోగించుకుని త్వరితగతిన అభివృద్ధి సాధించగలిగారు. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వ్యవస్థ అంతా ఆ కీలక ‘నిర్ణయాధికారం’ చుట్టూ పరివూభమిస్తున్నది. నిర్ణయాధికారం లేని కారణంగా జనాభా పరంగా 0% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, జనాభాలో సగభాగమైన మహిళలు వెనుకబాటుతనానికి, అసమానతలకు, వివక్షకు, దోపిడీకి నిరంతరం గురవుతున్నారు. ఫలితంగా ఈ వర్గాలు అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడి రాజకీయాధికార వ్యవస్థల్లో భాగస్వామ్యంలేక కేవలం ‘ఓటర్లు’గా మిగిలిపోతున్నారు. రాజకీయ నిర్ణయాధికారం కలిగిన కమ్మ, రెడ్డి కులాలకు ప్రస్తుతం కాపులు కూడా జతకలుస్తున్నారు. దీంతో మెజారిటీలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు స్వయం నిర్ణయాధికారం, స్వయం ప్రతిపత్తి, రాజకీయ స్వావలంబన, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి వాటిని కోల్పోతున్నారని బడుగు వర్గాల నేతలు విమర్శిస్తున్నారు.

బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్, టీడీపీలు
ఆంధ్ర రాష్ట్రంలోనూ, ఆ తర్వాత ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల(బీసీ) కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించాయి. అయితే ఆచరణలో బీసీలైన బలహీనవర్గాలకు ఆయా సంక్షేమ పథకాల ఫలితాలు అందలేదు. సంక్షేమ పథకాలపై వివరీతంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వాలు ఆయా వర్గాల నుంచి గణనీయమైన ఓట్లను రాబట్టుకున్నాయి. కానీ బలహీనవర్గాల జీవితాల్లో ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో బ్యాంకుల జాతీయకరణ, సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ, ఇరవై సూత్రాల అమలు, ఆర్థిక సరళీకృత విధానాలు తదితర అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నప్పటికీ వెనుకబడిన కులాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన కృషి జరగలేదన్నది జగద్విదితం. వివిధ సంక్షేమ పథకాలు అన్నీ నిద్రావస్థలో నిమగ్నమయ్యాయి. ఫలితంగా బీసీ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ భ్రమల నుంచి బయటపడి 192లో ఎన్.టి.రామారావు ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీని ఆశ్రయించారు. ఎన్టీర్ తన పార్టీని పటిష్టపరుచుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఓట్ల రాజకీయాల్లో బీసీలు అన్ని పార్టీలకు అవసరమైనప్పటికీ వాస్తవంగా బీసీ జనాభా ప్రాతిపదికన అధికారంలో వాటా లభించలేదు. బీసీల సంక్షేమమే పరమావధిగా ప్రకటించిన టీడీపీ.. అధికార పంపిణీ విషయంలో బీసీలకు మొండిచెయ్యి చూపింది. అందుకే మెజారీటీ బీసీలు టీడీపీకి ప్రత్యామ్నాయంగా మరోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఓట్ల రాజకీయాలు, అగ్రకులాల ఎత్తుగడల మధ్య బీసీ ప్రజానీకం ప్రత్యామ్నాయ రాజకీయాలు, అధికారమార్పిడితో సమిధలుగా మారి రాజ్యాధికారానికి దూరమయ్యారు.

టిక్కెట్ల కేటాయింపుల స్థాయిలోనే దగా!
రాష్ట్రంలోని రాజకీయపార్టీలు ఎన్నికల్లో కేటాయించే టికెట్లలో అగ్రతాంబూలం అగ్రకులాలకే దక్కుతున్నదన్నది వాస్తవం. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రెండూ కూడా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లు మినహా దాదాపు 90 శాతం సీట్లు అగ్రకులాలకే ఇస్తున్నాయి. వాటిల్లో కాంగ్రెస్ సహజంగానే తన ఆధిపత్య కులమైన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే.. టీడీపీ తన ఆధిపత్య కులమైన కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. పేరుకు బలహీనవర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ మాటలు చెబుతున్న ఈ రెండు పార్టీలూ తమ తమ సామాజిక వర్గాలకే పదవులు పొందే అవకాశం ఇస్తున్నాయి. పార్టీలు టికెట్ ఇస్తే తప్ప ఎన్నికల్లో పోటీచ చేయలేని ఆర్థిక పరిస్థితులు బీసీలకు మరో ఆటంకం. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశమున్నా బీసీల వద్ద తగినన్ని ఆర్థిక వనరులు, నియోజకవర్గమంతా ఒంటరిగా తిరిగి వ్యక్తిగతంగా ప్రచారం, బలసమీకరణ, ఓటర్లను ప్రభావితం చేసే ఇతర విధాన ప్రకటనలు, ప్రభుత్వ ఏర్పాటు వంటి అవకాశాలు లేకపోవడం వల్ల చాలా కొద్ది మందికి మాత్రమే అవకాశాలు కలుగుతున్నాయి.

నైజాం స్టేట్ విలీనం తర్వాత
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు 1956లో అంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1962 ఎన్నికల వరకు పదవుల్లో కొనసాగారు. హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైంది. 1956లో ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు, ఆంధ్రవూపాంత ప్రజా ప్రతినిధులతో కలిసి ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ ఏర్పాటైంది. మళ్ళీ ఆతర్వాత 1962లో ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు ఒకేసారి సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. 1955లో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో ద్విసభ్య నియోజకవర్గాలున్నాయి. ఆయా స్థానాల్లో జనరల్ అభ్యర్థితో పాటు అదే నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను కూడా ఎన్నుకునే అవకాశం ఉండేది. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతంలో ద్విసభ్య 23 అభ్యర్థులు, తెలంగాణ ప్రాంతంలో ద్విసభ్య 21 మంది అభ్యర్థులు కలిపి మొత్తంగా 44 ద్విసభ్య నియోజకవర్గాల నుంచి ఒక సాధారణ అభ్యర్థితో పాటు ఒక ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్ధి గెలిచే అవకాశాన్ని కల్పించారు. ఆ తరువాత 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా రూపొందించి 54 శాసనసభ స్థానాలను షెడ్యూల్డు కులాలు(ఎస్సీ), షెడ్యూల్డు తెగలు(ఎస్టీ)లకు రిజర్వు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఎస్సీ ఎస్టీలకు 10 స్థానాలు అదనంగా పెరిగినప్పటికీ వారికి కొన్ని జిల్లాల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అంతకు ముందు వరకు ఎస్సీ, ఎస్టీల్లో జిల్లాకు కనీసం ఒక్కరిద్దరికైనా ప్రాతినిధ్యం దక్కేది. కానీ నియోజకవర్గాల పునర్విభజనతో దీనికి గండిపడినట్లయ్యింది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల ఏర్పాటులో స్థానాల గుర్తింపు వల్ల శాసనసభ స్థానాల సంఖ్యలో స్వల్ప మార్పులు జరిగి జిల్లా స్థాయిలో సంఖ్యాపరంగా భిన్నత్వం గోచరిస్తున్నది. మరోసారి నియోజకవర్గాల పునర్విభజన తదుపరి 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాలో న్యాయం జరగలేదనే అభివూపాయం ఇప్పటికీ వ్యక్తం అవుతున్నది. దీంతో అధికార వ్యవస్థలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర పరిమితంగానే ఉంటోంది.




kulam talangana patrika telangana culture telangana politics telangana cinema


Take By: T News

Read more...

Tuesday, January 24, 2012

తెలంగాణ నిరుద్యోగకి ఆంద్రా సర్కార్ దగా!

- పది జిల్లాల్లో 9వేల మందిపై కేసులు
students1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema- హత్యాయత్నం కేసులు సహా కొందరిపై పదుల సంఖ్యలో..
- పిడమర్తి రవిపై 151 కేసులు
- ముందుకొచ్చిన 1.16 లక్షల ఉద్యోగాలు
- కేసులున్న ఉద్యోగార్థులకు మొండి చెయ్యే
- చురుకైనవారికీ దక్కని పోస్టులు!
- కేసుల ఎత్తివేతకు ప్రభుత్వ తాత్సారం
- మరో రెండేళ్లు పట్టే అవకాశం
- ఈలోగా జోరుగా నోటిఫికేషన్‌లు
- హడావిడిగా పరీక్షలకు ఏర్పాట్లు
- పట్టించుకోని టీ ప్రజా ప్రతినిధులు
- ఉద్యోగాలను సీమాంవూధకు తరలించే కుట్ర
- కేసులు ఎత్తేసేదాకా పోరాడుతాం
- తేల్చిచెబుతున్న తెలంగాణ విద్యార్థిలోకం

కళ్లముందు ఆశగా కనిపిస్తున్న లక్షాపదహారువేల ఉద్యోగాలు! వాటిని అందుకునేందుకు పోటీ పడినా.. అడ్డుకుంటున్న కేసులు! ఎత్తివేతకు హామీ ఇచ్చిన కేంద్రం.. ఉలుకూపలుకూ లేకుండా పడి ఉంది! కేంద్రం ఆదేశాలను పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది! ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రాంత నేతలు.. ఇది తమకు సంబంధించిన విషయం కాదని దులిపేసుకుంటున్నారు! తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ హోం శాఖను నిర్వహిస్తున్నా.. జరిగిన న్యాయం లేదు! నిలదీయాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు మనకెందుకుకొచ్చిన వ్యవహారమన్నట్లు చూసీ చూడకుండా పోతున్నారు! మధ్యలో టీ ఎంపీలు కేసుల ఎత్తివేత కోసం నిరసన దీక్షలకు దిగినా..


అది ఉత్తుత్తి దీక్షగా మిగిలిపోయింది! ఉద్యమ శక్తులు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నా.. ఫలితం కనిపించడం లేదు! చూస్తాం.. చేస్తాం.. ఎత్తేస్తాం.. అన్న మాటలే తప్పించి.. కేసుల ఎత్తివేత ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు పడని పరిస్థితి! వెరసి.. తెలంగాణ నిరుద్యోగి మరోసారి దగా పడుతున్నాడు! యూనివర్సిటీ దాటుకుని.. ఉపాధి వేటలో పడుతున్న విద్యార్థి.. దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నాడు! 2009 పరిణామాలు మొదలుకుని.. తాజాగా సకల జనుల సమ్మె వరకూ వివిధ సందర్భాల్లో పెట్టిన కేసులు కలవర పెడుతుండగా దాదాపు 9వేల మంది రానున్న 1.16 లక్షల ఉద్యోగాలకు అనర్హులుగా మిగులుతున్నారు! అటు ఉద్యమాన్ని నీరుగార్చడానికి విద్యార్థులపై పుంఖానుపుంఖాలుగా కేసులు తెరిచిన ప్రభుత్వం..

ఇప్పుడు తెలంగాణ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగుల నోట్లో మట్టికొ సిద్ధమవుతోంది! ఇన్నాళ్లూ జరిగిన మోసాలను భరించి, ఇక భరించలేక తెగించి కొట్లాడే తత్వాన్ని అలవర్చుకున్న విద్యార్థులు.. తక్షణ సమస్యగా ముందుకొచ్చిన కేసుల ఎత్తివేతపై మరో సమరశీల పోరాటానికి సిద్ధపడుతున్నారు! ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించే కుట్రలపై సమరభేరీ మోగిస్తున్నారు!

హైదరాబాద్, జనవరి 23 (టీ న్యూస్): తెలంగాణ ప్రాంతానికి సీమాంధ్ర సర్కార్ మరో ద్రోహం తలపెడుతోందా? లక్షా పదహారువేల ఉద్యోగాలు కల్పించినట్లు చెబుతూ ఉద్యమాన్ని పలుచన చేయడానికి పావులు కదిపిన ప్రభుత్వం.. అవే ఉద్యోగాలను తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కకుండా కుట్ర చేసిందా? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. వాటిని ఎత్తేయడంలో ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందా? కేసుల సంగతి తేల్చకుండానే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ముగించేసేందుకు హడావిడి పడుతోందా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించి, దగ్గరపెట్టుకోవడం గమనిస్తే..

కేసులు లేని విద్యార్థుల భవిష్యత్తుతో సైతం ప్రభుత్వం ఆటలాడుకునేందుకు సమాయత్తమవుతోందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయని విద్యార్థి నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నారని, మరోసారి తెలంగాణకు అన్యాయం చేసేందుకు సర్కారు సిద్ధమవుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈసారి మాత్రం వారి ఆటలు కొనసాగనివ్వబోమని తేల్చి చెబుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పోరుబాట పడతామని హెచ్చరిస్తున్నారు.

cuffs-copy-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaదశాబ్దాల ఆరాటమైన తెలంగాణ కోసం జరుగుతున్న మలిదశ పోరాటంలో విద్యార్థులు అగ్రభాగాన ఉన్న విషయం తెలిసిందే. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చటానికి విద్యార్థులు పోలీసుల లాఠీలు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి పోరాటాలు చేస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వేర్వేరు రూపాల్లో నిరసనను తెలియచేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలకులు విద్యార్థులపై కక్షగట్టారని ఉద్యమక్షిశేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ రాకుండా చేయటానికి శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని చీకటి అధ్యాయాన్ని చాపకింది నీరులా అమలు చేస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నవారిపై పోలీసులతో విచ్చలవిడిగా కేసులు నమోదు చేయించారని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఉద్యమంలో ముందుంటున్న ఒక్కో విద్యార్థిపై పది నుంచి ఇరవై వరకు కేసులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు.

తీవ్రమైనవిగా పరిగణించే రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్‌తోపాటు ఐపీసీ 324, 332, 333, 149, 353, 149, 120(బీ), 147, 148 రెడ్‌విత్ 149, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం చేశారన్న నేరారోపణలపై 307 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేశారని వివరిస్తున్నారు. ఇలా తెలంగాణ జిల్లాల్లో దాదాపు 9 వేల మంది విద్యార్థులపై కేసులు ఉన్నాయని అంచనా. వీటిని అడ్డం పెట్టుకుని పోలీసులు తమను వేధిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఓ కేసులో అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేయటం, బెయిల్ మీద బయటకు రాగానే మరో కేసులో అరెస్టు చూపించి మళ్లీ జైలుకు పంపించటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీని లక్ష్యం తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు భాగం కాకుండా చేయాలన్నదేనన్నది సుస్పష్టమని వారు పేర్కొంటున్నారు.

ఇచ్చిన మాట బుట్టలోకి
‘డిసెంబర్ 9 ప్రకటన’ చేసిన రోజునే అప్పటి వరకూ విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చారు. కానీ మళ్లీ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగింది. ఇదే అంశంలో టీ కాంగ్రెస్ ఎంపీల నిరసనతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసుల ఎత్తివేతకు మరోసారి హామీ ఇచ్చింది. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి ఆదేశాలు కూడా పంపింది. అయితే, ఇక్కడి సీమాంధ్ర పాలకులు మాత్రం ఈ దిశలో అవసరమైనంత వేగంగా చర్యలు తీసుకోవటం లేదు. ఈ విషయమై పోలీసుశాఖలోని సీనియర్ అధికారులతో మాట్లాడితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించినట్టుగానే కేసుల ఎత్తివేత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కొన్ని కేసులను ఇప్పటికే ఎత్తివేశామని, మిగతావాటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు మాత్రం అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావటం లేదు. చట్ట ప్రకారం జరగాల్సిన వ్యవహారం కాబట్టి ఏడాది.. రెండేళ్లు పట్టొచ్చు..అంతకన్నా ఎక్కువ సమయం కావచ్చని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కలిసి కావాలనే ఇలా చేస్తున్నారని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా చేయాలన్నదే దీని వెనక లక్ష్యమని ఆరోపిస్తున్నారు. పోలీస్ పహారాలో ఉద్యోగాల భర్తీకి పరీక్షలను ప్రభుత్వం జరిపిస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.

ఉత్తీర్ణత సాధించినా...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న పరీక్షలకు తెలంగాణ విద్యార్థులు హాజరై ఉత్తీర్ణత సాధించినా వారికి కొలువులు దక్కే పరిస్థితి లేదు. దీనికి కారణం వారిపై కేసులను ఎత్తివేయకపోవటమే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఎవరైనా ఉత్తీర్ణత సాధిస్తే వారిపై పోలీసులతో ఎంక్వయిరీ జరిపిస్తారు. అందలో వారిపై ఎలాంటి పోలీసు కేసులు లేవని నిర్థారణ అయితేనే ఉద్యోగం ఇస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని పోలీసు కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. నమోదైన కేసుల నుంచి వాళ్లు నిర్దోషులుగా బయటపడితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని పోలీసు అధికారులే పేర్కొంటున్నారు. కేసుల ఎత్తివేత ప్రక్రియను పరిశీలిస్తే ఇప్పట్లో అది పూర్తయ్యేలా కనిపించటం లేదు. ఫలితంగా తెలంగాణకు చెందిన దాదాపు 9 వేలమంది విద్యార్థులు సమర్థత ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

కేసులు లేనివారిని సైతం...
కేసులు ఎదుర్కొంటున్నవారి పరిస్థితి ఇలా ఉంటే కేసులు లేనివారిని సైతం ప్రభుత్వం టార్గెట్ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసువర్గాల ద్వారా తెలిసిన ప్రకారమే తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న వేలాదిమంది విద్యార్థుల వివరాలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్, స్పెషల్‌వూబాంచ్ విభాగాల సిబ్బందితో సేకరించి పెట్టుకుంది. వీరిలో మరింత క్రియాశీలకంగా ఉన్నవారిని పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు దూరం చేస్తోంది. 2008లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 2011లో నిర్వహించిన ఎసై్స రాతపరీక్షల్లో ఉస్మానియా వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులకు ఇదే అనుభవం ఎదురైంది. ఉద్యమం కారణంగా తాము పరీక్షలకు పూర్తిగా సన్నద్ధం కాలేదని, కొంత గడువు ఇచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ ఉస్మానియాలో చదువుతున్న విద్యార్థులు పలువురు అప్పట్లో డిమాండ్ చేశారు. వీరిలో దాదాపు 15 మంది విద్యార్థులు ఇదే డిమాండ్‌తో సీఎం, హోంమంత్రి, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌తోపాటు పలువురిని కలిసి వినతిపవూతాలు సమర్పించారు.

వీరి విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వం పోలీసుల ద్వారా వారి వివరాలను మాత్రం సేకరించింది. ఆ తరువాత జరిగిన ఎసై్స రాతపరీక్షలకు వీళ్లంతా హాజరయ్యారు. అయితే, వీరిలో ఏ ఒక్కరూ ఉత్తీర్ణత సాధించలేకపోవటం గమనార్హం. మార్కుల షీట్ల కోసం అడిగితే మీరంతా డిస్‌క్వాలిఫై అయ్యారన్న సమాధానమే అధికారుల నుంచి వచ్చింది. ఇలా చెబుతూపోతే మరిన్ని ఉదంతాలున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వైఖరిపైనే తెలంగాణవాదులు మండిపడుతున్నారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులను పూర్తిగా ఎత్తివేసిన తరువాతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగాల ప్రకటనతో...
ఒకవైపు తెలంగాణ ఉద్యమం నుంచి విద్యార్థులను దూరం చేయటానికి వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. నిన్నమొన్నటి దాకా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చిన పాలకులు తాజాగా వేర్వేరు శాఖల్లో 1.16లక్షల ఉద్యోగాలను ప్రకటించారు. ఈ మేరకు ఆయా శాఖల నుంచి హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయిస్తున్నారు. సాధారణంగా కేసులు ఉంటే విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలకు అనర్హులవుతారు. ఇదే ఆలోచించిన ప్రభుత్వం.. విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామంటూనే జాప్యం చేస్తూ.. మరోవైపు ఉద్యోగాల భర్తీకి మాత్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

- మరోసారి ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు
రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ప్రకటించి విద్యార్థులపై కేసులు ఎత్తేయకపోవటం దారుణం. విద్యార్థులు మళ్లీ ఉద్యమించేలా ప్రభుత్వ చేష్టలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తి వేయకుండా శాశ్వతంగా ఉద్యోగాలకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. విద్యార్థులపై అక్రమంగా బనాయించిన కేసులు ఇప్పటివరకు ఎత్తేయకపోవటం పట్ల ఉద్యోగాల భర్తీలో సీమాంవూధులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా కుట్ర చేస్తున్నది. అన్నం పెడతాం రమ్మంటూనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటి తలుపులు మూసివేసినట్లుగా ఉంది. విద్యార్థులపై పెట్టిన కేసులు భేషరతుగా వెంటనే ఎత్తివేయాలి.
- చుక్కా రామయ్య, విద్యావేత్త


అన్నా టీంపై పెట్టని కేసులు ఇక్కడెందుకు?
అవినీతిపై పోరాడుతున్న అన్నా బృందంపై కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు దానిని ఒక సామాజిక ఉద్యమంగా పరిగణించే కేసులు పెట్టలేదు. తెలంగాణ ఉద్యమమూ సామాజిక ఉద్యమమే. అలాంటప్పుడు తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎందుకు పెట్టారు? ప్రభుత్వం ఉద్యోగాలిచ్చే ఆలోచనతో ఉంటే వెంటనే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి. విద్యార్థులు ప్రజల ఆకాంక్ష కోసం ఉద్య మించారు. అక్రమ కేసుల కారణంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీసాలు లభించటం లేదు. వెంటనే కేసులు ఎత్తివేసి వారికి న్యాయం చేయాలి.
- పీఎల్ విశ్వేశ్వర్ రావు, ఉస్మానియా ఆర్ట్స్ విభాగం మాజీ డీన్


వివక్షకు ఇంతకన్నా
నిదర్శనం ఏం కావాలి?

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా వివక్ష ప్రదర్శిస్తోంది. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగాల భర్తీలో ఈ ప్రాంత విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేస్తోంది. దశాబ్దాలుగా సీమాంధ్ర ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. కేసులు వెంటనే ఎత్తివేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
- డాక్టర్ పి. మధుసూదన్‌డ్డి, ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్


ఉద్యమాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ కుట్ర
తెలంగాణ విద్యార్థులు భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదిక 8వ అధ్యాయంలో ఉద్యమాన్ని అణివేత నిర్వహణకు సూచించిన అంశాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగంగానే లక్ష ఉద్యోగాలు ఆశ చూపి విద్యార్థులు ఉద్యమాల వైపు చూడకుండా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాపార భాగస్వామ్య సదస్సులో ప్రైవేటు రంగంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా సీమాంధ్ర కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉద్యోగాలు సీమాంధ్ర విద్యార్థులకే లభిస్తాయి. తెలంగాణ వారికి మిగిలింది ప్రభుత్వ ఉద్యోగాలు మత్రమే. ఆ ఉద్యోగాలు కూడా దక్కకుండా విద్యార్థులపై కేసులు ఎత్తివేయకుండా భవిష్యత్తులో ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు రావని విద్యార్థులను భయవూభాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ దీక్ష సమయంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తి వేస్తామని ప్రకటించి మూడేళ్లు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేసులు ఎత్తి వేయటం లేదు.
- ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ కన్వీనర్

ఉద్యోగాలతో లింకుపెట్టవద్దు
విద్యార్థులు కేవలం వారి వ్యక్తిగత అవసరాలకు చేసిన ఉద్యమం కాదు. తెలంగాణ ప్రజావూపయోజనాల కోసం వారు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయించింది. ఇది చాలా దారుణం. వెంటనే వారిపై పెట్టిన కేసులు భేషరతుగా ఎత్తివేయాలి. ఉద్యమాల నుంచి విద్యార్థులు ఉద్యగాల వేటలో పడ్డారు. ఉద్యమ కేసులకు ఉద్యోగాలకు లింకుపెట్టవద్దు. కేసులు ఎత్తివేసి తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల విద్యార్థులకు సమన్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- ప్రొఫెసర్ వినయ్‌బాబు, ప్రిన్సిపల్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ

Take By: T News

Read more...

Sunday, January 22, 2012

తెలంగాణ విద్యార్థిపై కేసుల ఉచ్చు

- కేసుల ఎత్తివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ
- ఇంతవరకూ ఎత్తేసింది లేదన్న విద్యార్థులు
- ఇది ‘శ్రీకృష్ణ’ చీకటి అధ్యాయం అమలే!


police talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, జనవరి 21 () నిరసన కొత్త కాదు. ఆందోళన పాతదే. ఉద్యమాలూ ఈనాటివి కాదు! విద్యార్థులో, కష్టజీవులో, అన్యాయానికి గురైనవారో, దుర్మార్గాలపై కడుపు మండినవారో గతంలో ఏదైనా ఆందోళనకు దిగితే.. ఉద్యమం చేపడితే పరిస్థితి చేయిదాటినా.. అలాంటి పరిస్థితి ఉన్నా అదుపులోకి తీసుకోవడం పరిపాటి! వారిని సాయంత్రం దాకా పోలీస్‌స్టేషన్‌లో ఉంచి.. వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టడం మామూలే! కొన్ని మినహాయింపులు ఉన్నా.. అత్యంత తీవ్రమైన అభియోగాలు నమో దు చేసిన ఉదంతాలు కొన్నే! కానీ.. తెలంగాణ విద్యార్థి విషయంలో మాత్రం పక్షపాతం! కుట్ర! విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసేలా.. ఒకరిమీదో వంద మంది మీదో కాదు.. సుమారు 9వేల మందిపై! విద్యార్థులపై మునుపెన్నడూ నమోదు చేయని సెక్షన్లు..! ప్రదర్శనలో పాల్గొన్నందుకు.. దిష్టిబొమ్మ దహనం చేసినందుకు.. కోపంతో ఓ రాయి విసిరినందుకు! ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా! తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా! ఒక కేసులో అరెస్టయి బయటికి వస్తే.. మరో కేసులో అరెస్టు చేసి జైలుకు పంపేంత స్థాయిలో! ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టేంత గుడ్డిగా..! ఇదీ సీమాంధ్ర పాలకులు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడిపై చూపుతున్న వివక్ష! అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకూ ఒక్కరిపైనా కేసులు ఎత్తేయని వైనం!: తెలంగాణ కో సం జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు శ్రీకృష్ణ కమిటీలోని చీకటి అధ్యాయాన్ని సీమాంధ్ర పాలకులు అమలు చేస్తున్నారా? పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసు ఉన్నతాధికారులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారా? ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వారిపై మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రమైన అభియోగాలతో కేసులు పెట్టడం ఉద్దేశపూర్వకమేనా? కేసుల పేరుతో ఇప్పటికీ విద్యార్థులను మానసికహింసకు గురి చేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామన్న హామీని నెరవేర్చకుండానే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు జారీ చేయడమే కాకుండా పరీక్షలు జరపటానికి సన్నాహాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

వేర్వేరు డిమాండ్లపై రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు ఉద్యమాలు చేయటం కొత్తేమీ కాదు. ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఊరేగింపులు, దిగ్బంధనాల ద్వారా డిమాండ్ల సాధనకు వేర్వేరు వర్గాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు పరిస్థితులు అదుపుతప్పి శాంతిభవూదతల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. లాఠీచార్జీలు, కాల్పులు, బాష్పవాయువు గోళాల ప్రయోగాలు జరిగాయి. అయినా ఉద్యమకారులపై తీవ్రమైన నేరారోపణల మీద కేసులు పెట్టిన దాఖలాలు వేళ్ల మీద లెక్కబె సంఖ్యలో కూడా లేవని పరిశీలకులు అంటున్నారు. మహా అయితే పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకోవటం.. వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించటం, చీకటి పడేవరకు పోలీస్‌స్టేషన్లలోనే ఉంచి, ఆ తరువాత వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేయటం ఇప్పటిదాకా జరుగుతూ వస్తున్నది. ప్రజా ఆస్తుల ధ్వంసం జరిగినపుడు మాత్రమే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కేసులు పెట్టేవారు. ఈ కేసులు కూడా ఆయా నిరసనలను ముందుండి నిర్వహించినవారిపైనే ఉండేవి.

తెలంగాణ విద్యార్థులపై కుప్పలకొద్దీ సెక్షన్‌లు
ఉద్యమంలో భాగంగా శాంతియుతంగా ప్రదర్శనలు జరిపినా, ఊరేగింపులు నిర్వహించినా, ధర్నాలు చేసినా మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులపై పోలీసులు వందలాది కేసులు నమోదు చేశారు. ఐపీసీ 324, 332, 333, 353, 34, 149, 120(బీ), 147, 14, 153(ఏ) సెక్షన్లతోపాటు హత్యాయత్నం నేరారోపణల మీద 307 సెక్షన్ ప్రకారం కూడా కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా తీవ్రమైన శిక్షలు పడే అవకాశాలున్న రైల్వే యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు. పోలీసుల ఈ అణచివేత వైఖరికి పరాకాష్ట ఏమిటంటే ఎస్‌సీ, ఎస్‌టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టటం. ఎస్‌సీ, ఎస్‌టీలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయటానికి అవకాశం లేదని తెలిసి కూడా ఈ కేసులు పెట్టారం ప్రభుత్వం, పోలీసుల కుట్రను అర్థం చేసుకోవచ్చని ఉద్యమనేతలు అంటున్నారు.

జైళ్లలో మగ్గేలా చేస్తూ...
అడ్డగోలుగా విద్యార్థులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వీటిని అడ్డం పెట్టుకుని విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విచారణ పేరిట పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కొందరిని అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. బెయిల్‌పై విడుదల కాగానే ఇతర కేసుల్లో మళ్లీ అరెస్టు చేసి కారాగారాల్లోనే మగ్గేలా చేస్తున్నారు. ఇలా విద్యార్థులపై విచ్చలవిడిగా నమోదు చేసిన కేసులపై తెలంగాణ మొత్తం భగ్గుమంది. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఢిల్లీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇక్కడ నిరాహారదీక్షలు చేశారు. దాంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులపై నమోదు చేసిన అన్ని కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి దశలవారీగా రెండు నెలల్లోనే ఈ ప్రక్రియను ముగిస్తామని స్వయంగా ప్రకటించారు.

అయితే, నెలలు గడిచిపోతున్నా ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చటం లేదు. ఈ విషయమై సీనియర్ పోలీసు అధికారులతో మాట్లాడగా కేసుల ఎత్తివేత దశలవారీగా జరుగుతోందని చెబుతున్నారు. దీనికి ఎంత సమయం పట్టవచ్చని అడిగితే ఏడాది పట్టొచ్చు... రెండేళ్లు పట్టొచ్చు అని సమాధానం ఇస్తున్నారు.
కేసులను అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యోగాలను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల వల్ల విద్యార్థులు ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఏ ఉద్యోగాలకైనా దరఖాస్తు చేయొచ్చు. పరీక్షలనైనా రాయవచ్చు. కానీ ఉద్యోగాల నియామకం సమయంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆడిగి, కేసుల పేరుతో నిరాకరించే ఆలోచనలో సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని రకాల కేసులను ఎత్తివేయాల్సిందే.
- గోవర్ధన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ కో కన్వీనర్

 Take By: T News

Read more...

Friday, January 20, 2012

దగా పడిన ధర్మాస్పత్రి

- మందు బిళ్లలకూ దిక్కులేదు
- ఉన్న స్టాక్‌తోనే పంపిణీ మాయ
- మూలన పడిన విలువైన మెషినరీ
- కార్పొరేట్‌తో సర్కారు దోస్తానా!
- 10% కార్పొరేట్ వైద్యం ఉచితం
- కానీ.. కాగితాలకే పరిమితం
- వర్ధిల్లుతున్న ‘కార్పొరేట్ శ్రీ’
- ఈ పథకంలో రూ.3593 కోట్లు ఖర్చు
- ప్రైవేటు కార్పొరేట్‌కేరూ.2853 కోట్లు
- భారీగా అక్రమాలు..బయటపడేవి కొన్నే

Hospital1-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
రెండు తెల్లమందు బిళ్లలు.. రెండు ఎర్రగోలీలు! మహా అయితే ఓ సూదిమందు! గత కొన్నేళ్లుగా సర్కారీ వైద్యం తీరిదే! కొన్ని చోట్ల ఇవీ ఉండవు! మారుమూల పల్లెల్లో సీజనల్ వ్యాధులు విజృంభించినా.. దిక్కులేని పరిస్థితి! ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఏరియా ఆస్పవూతులో, జిల్లా ఆస్పవూతులో గతి! అక్కడా పరిస్థితులు అంతంత మాత్రమే ఉండటంతో సర్కారీ వైద్యం కునారిల్లుతోంది. కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కార్పొరేట్ సేవలో పడిన ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేసిన నిర్లక్ష్యం ధర్మాస్పవూతులను దగా చేస్తున్నది. ప్రభుత్వాస్పవూతుల ఉసురు తీసి.. కార్పొరేట్‌కు ఊపిరిపోస్తున్నది!

ప్రభుత్వ నిండు నిర్లక్ష్యం కారణంగా ధర్మాస్పవూతులు దగా పడుతున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బంది లేక, మందుల్లేక, అధునాతన యంత్రసామగ్రి ఉన్నా.. చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించే దిక్కులేక కునారిల్లుతున్నాయి. అదే సమయంలో ఖరీదైన వైద్యానికి పెట్టిందిపేరైన కార్పొరేట్ వైద్యశాలలు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అక్కడ వైద్యం ఖరీదు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గతంలో ఆ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు.. దాంతో కొంతకాలం పాటు ఆ ఆస్పవూతులు ఈగలు తోలుకున్న పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ప్రభుత్వ పుణ్యమాని ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పవూతులను కాపాడేందుకు, పోషించేందుకు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారన్న విమర్శలు వెల్లు స్థాయిలో వాటికి బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. ఫలితంగా ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు గుప్పెడు రోగాలకు మాత్రమే కోట్లలో ఉంటున్నది తప్పించి.. ప్రజల తక్షణ ఆరోగ్య అవసరాలు తీర్చే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన, ఏరియా, జిల్లా ఆస్పవూతులపైనా ఉండటం లేదని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.

(, హైదరాబాద్)ఈ ఆర్థిక సంవత్సరం మందుల కోసం ప్రభుత్వం రూ.310 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.112కోట్లు గ్రీన్ చానల్ కింద ఇస్తామని నాలుగు నెలలక్షికితం చెప్పింది. ఇప్పటికీ రూపాయి కూడావిడుదలచేయలేదు. మందులు సరఫరా చేసే అనేక సంస్థలు కోర్టు కేసుల్లో ఉన్నాయి.వీటిని పరిష్కరించాలని ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాసినా ప్రభుత్వంగానీ, ఏజీ గానీ శ్రద్ధ పెట్టడం లేదని అధికారులే అంటున్నారు. మందుల పంపిణీలో అవినీతిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మందులు జిల్లా కేంద్రాల్లోని గోడౌన్లలో ఉండడంతో అక్కడికి మందుల కోసం వెళ్లేవారిని రూ.2వేల నుండి రూ.5వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మందులు అయిపోయినా పీహెచ్‌సీల్లోని సిబ్బంది మందులకోసం జిల్లా కేంద్రాలకు వెళ్లడం లేదనే వాదన ఉంది.

ఈ సమస్య పరిష్కారానికి నిపుణుల కొన్ని సలహాలు కూడా చేశారు.అవి.. 1.మందుల కోసం జిల్లా కేంద్రాలకు రాకుండా నేరుగా పీహెచ్‌సీల నుండి ఇండెంట్ తెప్పించడం. 2.శస్త్ర చికిత్సకు అవసరమైన సామాక్షిగికి ప్రతినెలా ముందుగానే ఇండెంట్ పెట్టడం. 3.ఆస్పవూతులకు సరఫరా చేసిన మందుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆస్పవూతుల్లో అందే సేవలపై ఉన్నతాధికారులకు తెలియజేయడానికి ఆన్‌లైన్‌లో సమాచారం ఉంచాలి.4.ఆస్పవూతుల్లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను బోర్డుల రాయాలి. కానీ.. వీటిని ఎవ్వరూ పట్టించుకున్న పాపానపోలేదు.

మూలపడిన మెషినరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పవూతుల్లో దాదాపు రూ.950 కోట్ల విలువైన సామాగ్రి ఉంది. ఇందులో రూ.450కోట్ల విలువైన మెషినరీని ప్రస్తుతం వాడటం లేదు.చిన్నచిన్న రిపేర్ల వల్ల ఇవి మూలపడ్డాయి. ఈ బాధ్యత నిర్వహించాల్సిన ఏపీహెచ్‌ఎంఐడీసీ అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో యంత్రాలు పని చేయక రోగులు ప్రైవేటు ఆస్పవూతులకు వెళ్లి ఆస్తులు కరిగించుకునే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి.

కార్పొరేట్‌తో దోస్తానా
సొమ్ములుం ఆస్పత్రి గడప తొక్కనిచ్చేది అన్న రీతిలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పవూతులు వ్యవహరిస్తున్నాయి. అధికార యంత్రాగం, పర్యవేక్షణ, తనిఖీ, నిఘా వంటివి ఏమాత్రం లేకపోవడంతో కార్పొరేట్ ఆస్పవూతులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. ఇక్కడ వసూలు చేసే చార్జీలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒకే రకమైన రోగానికి, పరీక్షకు పలు ఆస్పవూతులు పలు రకాల చార్జీలు వసూలు చేస్తున్నాయి. చికిత్సతో రోగం కుదిరినా.. ఈ బిల్లులు చూసి వారి గుండెలు గుభేల్మంటున్న పరిస్థితి ఉందన్నవాదన ఎప్పటినుంచో ఉంది. రాజధాని పరిధిలో దాదాపు 2200ప్రైవేటు,కార్పొరేట్ ఆస్పవూతులున్నాయి.ఇందులో 1500 ఆస్పవూతులకే అనుమతులున్నాయని తెలుస్తోంది. వివిధ సేవల చార్జీల వివరాలను నోటీసు బోర్డులో పేర్కొనాల్సి ఉంది. చాలా ఆస్పవూతుల్లో ఇవి కనిపించవు.

ప్రభుత్వం నుంచి వివిధ సబ్సిడీలు పొందిన కారణంగా తమ ఆస్పవూతుల్లో పదిశాతం రోగులకు ఉచిత సేవలు అందిస్తామని ప్రభుత్వానికి అంగీకార పత్రం ఇస్తాయి. ఇలా రాయితీలు, సబ్సిడీలు పొందిన ఆస్పవూతుల్లో ఏ ఒక్కరికీ ఉచిత వైద్యం అందుతున్న దాఖలాలు లేవు. అపోలో ఆస్పత్రి సహా అనేకం ఇదే బాటలో ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రభుత్వం నుండి రూ.200కోట్ల విలువైన భూమిని సాధారణ ధరకు తీసుకుంది. ఇది ట్రస్టు ఆస్పత్రి కనుక తెలంగాణతో పాటు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారూ విరాళాలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా తెలంగాణ నుండి ఒక్కరు కూడా డైరెక్టర్ కాలేదు. కేర్ ఆస్పత్రి యాజమాన్యం గుండె సంబంధ వ్యాధులున్న పిల్లలకు ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ను ఆసరాగా చేసుకుని, అవే ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేస్తూ, ఫౌండేషన్‌కు చూపిస్తూ డబ్బులు దండుకుంటోందనే ఆరోపణలున్నాయి.

కనిపించని తనిఖీలు
ఏటా రాష్ట్రంలో దాదాపు రూ.10వేల కోట్ల విలువైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇందులో రూ.7వేలకోట్లకు పైగా ప్రైవేటు ఆస్పవూతుల జేబుల్లోకి వెళ్తున్నాయని అంచనా. కార్పొరేట్ ఆస్పవూతుల వ్యవహారాలను జిల్లా డీఎంహెచ్‌వో తనిఖీ చేయాలి. కొన్ని తనిఖీ బృందాలూ ఉండాలి. కానీ రాష్ట్రంలోని ఏ ఆస్పవూతిలోనూ తనిఖీలు జరగడంలేదని నిపుణులు అంటున్నారు. నెలనెలా మామూళ్లు అందడంతోనే అధికారులు నిమ్మకుంటున్నారన్న విమర్శలు లేకపోలేదు. మందుల షాపుల్లోనూ తనిఖీలు లేవు. నాశిరకం మందుల అమ్మకాలను నిరోధించేందుకు డ్రగ్ కంట్రోల్ అథార్టీ ఉన్నా.. తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో మెడికల్ షాపుల్లో జరిగే అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని అంటున్నారు.

కార్పొరేట్ శ్రీ
అందరికీ మెరుగైన వైద్యం పేరుతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ.. కార్పొరేట్ ఆస్పవూతులకు కల్పతరువుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 2007లో ఈ కార్యక్షికమాన్ని ప్రారంభించారు. అప్పటిదాకా కార్పొరేట్ ఆస్పవూతుల్లో ఈగలు తోలుకునే పరిస్థితులూ ఉన్నాయి. కానీ.. ఆరోగ్యశ్రీ రాకతో కార్పొరేట్ ఆస్పవూతులు నేడు ధనికులకంటే పేదలతోనే కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం రూ.3593కోట్లు ఖర్చు పెట్టింది. ఇందులో రూ.2853కోట్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పవూతులకు,మిగిలిన రూ.740 కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు బిల్లులు చెల్లించారు. కార్పొరేట్ ఆస్పవూతులకు ఇచ్చిన డబ్బును ప్రభుత్వ ఆస్పవూతుల కోసం ఖర్చు చేసి ఉంటే మళ్లీ ప్రభుత్వ ఆస్పవూతులు జీవం పోసుకునేవని అధికారులు,మేధావులుఅంటున్నారు.ఒకసంస్థ చేసిన సర్వేలో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఆస్పవూతులకు ఖర్చు చేస్తే కార్పొరేట్‌కు దీటుగా పనిచేస్తాయని, పూర్తిగా ఉచిత సేవలందించవచ్చని పేర్కొంది.

అయినా.. కార్పొరేట్‌కు దోచిపెట్టడానికే ఉన్నట్లుగా ఆరోగ్యశ్రీ కింద ఇంకెన్ని కోటె్లైనా ఇచ్చేందుకు సిద్ధమని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీలో అక్రమాలకూ అంతూపొంతూ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పవూతులుఅవసరం లేకున్నా ఆపరేషన్లు చేసి బిల్లులు దండుకుంటున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాకు హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్‌పై ఆరోగ్యశ్రీ ట్రస్టు క్రిమినల్ కేసులు పెట్టింది. గాంధీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎన్‌వీఎన్ రెడ్డి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈ సెంటర్‌పై ఈ నెల 15న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఐపీసీ 406-42కింద క్రిమినల్ కేసు పెట్టారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు, అనవసరమైన హెర్నియా శస్త్రచికిత్సలు చేసి ప్రజలను మోసం చేశారని రిపోర్టులో తేలిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు ఆరోగ్యశ్రీ పరిధిలో అనేకం జరుగుతున్నాయి.

DRRR-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసర్కార్ వైద్యం పూర్తిగా నిర్వీర్యం కావడానికి ప్రభుత్వాలే కారణం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు కార్పొరేట్ ఆస్పవూతులు ప్రైవేటు రంగంలోకి వచ్చాయి. దీనికి ముందు వైద్య వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. రాష్ట్రంలో మొదటి పౌరుడు గవర్నర్ నుండి మామూలు వ్యక్తి వరకు ప్రభుత్వ ఆస్పవూతికి వచ్చి అత్యుత్తమ చికిత్స చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ రానురాను కేటాయింపులు తగ్గిస్తూ కావాలనే ప్రభుత్వ వైద్యాన్ని సర్కారు నిర్వీర్యం చేసింది. ప్రభుత్వమే మందులు, పరికరాల కొరత సృష్టించడం మొదలు పెట్టింది. కార్పొరేట్ రంగం ఆవిర్భవించాక ప్రభుత్వ ఆస్పవూతులకు బడ్జెట్ పెంచాల్సింది పోయి ప్రభుత్వరంగ ఉద్యోగులకు ప్రైవేటు సెక్టార్‌లో ఇన్స్యూన్స్ చేయించి ప్రోత్సహించింది.
- డాక్టర్ నర్సయ్య, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు

తమిళనాడులో ఏ పార్టీ నాయకుడైనా ప్రభుత్వ ఆస్పవూతుల్లో వైద్యం చేయించుకుంటారు. ఆ పరిస్థితి గతంలో మన రాష్ట్రంలోనూ ఉండేది. కానీ నేడు ప్రభుత్వమే కావాలని కార్పొరేట్‌ను ప్రోత్సహిస్తూ సీమాంధ్రవ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త కార్పొరేట్ ఆస్పవూతులొచ్చి కోట్లు దండుకుంటున్నాయి. పేదలకు 20శాతం ఉచితవైద్యం చేస్తామని చెప్పి వచ్చిన వాళ్లు ఒక్కరికీ వైద్యం అందించడం లేదు. లాబీయింగ్‌తో మొత్తం ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఖర్చు పెడుతున్న డబ్బుతోనే ప్రభుత్వ ఆస్పవూతులను కార్పొరేట్‌కు దీటుగా తయారు చేయవచ్చు. కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా వైద్యం చేస్తామంటే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది? నమ్మకం పోయింది కనుకే ప్రభుత్వ ఆస్పవూతులు నిర్వీర్యం అవుతున్నాయి.
- డాక్టర్ రమేష్, తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
Take By: T News

Read more...

Wednesday, December 28, 2011

మూడు వేల కొలువులు (apspsc.gov.in )

- 2,805 ఉద్యోగాల భర్తీ
- ఒకేసారి 10 నోటిఫికేషన్‌లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
- అత్యధికంగా 1,716 ఏఈఈ పోస్టులు
- జీవో 420 ప్రకారమే ఉద్యోగాల నియామకాలు
- మెరిట్ లిస్టు ఆధారంగానే భర్తీ

హైదరాబాద్, డిసెంబర్ 27 ():రాష్ట్ర ప్రభుత్వంలోని 10 శాఖలకు చెందిన 2,805 పోస్టుల భర్తీకి ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్లూఎస్ శాఖల్లోని 1,716 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 432 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో అత్యధికంగా 397అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, అత్యల్పంగా పోర్టు ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎలక్షిక్టికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 9 ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ సంస్కరణల ఆధారంగా విడుదల చేసిన జీవో 420 ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ జీవో ప్రకారం కేవలం రాత పరీక్ష మెరిట్ లిస్టు ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా బోర్డు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో 420 విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ పద్దతి ఉండాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 420ని ఉపసంహరించుకోవాలని బోర్డు సభ్యులు ముఖ్యమంవూతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో అమలుపై గత సోమవారం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుం దా? లేదా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ల వరకు జీవో 420 అమలు చేసి, మిగితా నోటిఫికేషన్లకు కమిటీ సిఫారసులు వర్తింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ప్రకటించారు.

Take By: T News

Read more...

కేబినెట్‌లో మార్పులకు కిరణ్ కసరత్తు!

- సీఆర్, గంటా కోసమే చిరు పట్టు?
- పీఆర్పీ కోటాలో తెలంగాణకు మొండిచెయ్యే..
- బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణ
- బొత్స, కాసు, సబిత, శంకర్‌రావుకు ఉద్వాసన?


హైదరాబాద్, డిసెంబర్ 27 ():సంక్రాంతిలోపే మెగాస్టార్ చిరంజీవి బృందం (పీఆర్పీ) కిరణ్ కేబినెట్‌లో చేరబోతున్నది. చిరు కోటాలో ఈసారికి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత ఉగాది నాటికి జరిగే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పీ శంకర్‌రావు, సబితా ఇంద్రాడ్డిలకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది.తెలంగాణ, రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పీఆర్పీ కోటాలో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఇటీవల ప్రచారం జరిగినా, పదవుల విషయంలో పీఆర్పీ కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపించనున్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పీఆర్పీ అధినేత చిరంజీవి ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడు ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పుకున్నారు. చిరు బృందం నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నప్పటికీ చిరంజీవి తన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికే మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతం నుంచి ఆ పార్టీ టికెట్‌పై ఇద్దరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. వీరిలో వెనుకబడిన తరగతులకు చెందిన అనిల్‌కు తెలంగాణ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగింది.

అయితే చిరంజీవి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. పైగా, సీమాంధ్ర నుంచే సీ రామచంవూదయ్య (కడప ఎమ్మెల్సీ), గంటా శ్రీనివాసరావు (విశాఖ జిల్లా ఎమ్మెల్యే)లకు మంత్రి వర్గంలో తీసుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి కూడా జనవరి తొలి వారంలో తన మంత్రివర్గంలో పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విస్తరణ అనేది పీఆర్పీకే పరిమితం చేయాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత ఉగాది నాటికి చేపట్టనున్న మంత్రివర్గ పునర్వవ్యస్తీకరణలో కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

సీఆర్‌తో కొత్త సమస్యలా?
కడప జిల్లాకు చెందిన పిఆర్పీ ఎమ్మెల్సీ సి.రామచంవూదయ్యను మంత్రివర్గంలో తీసుకోవడం ద్వారా కిరణ్‌కుమార్‌కు కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో సీనియర్ నేత రోశయ్య ఎమ్మెల్యేగా పోటీ చేయక పోవడంతో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌డ్డి ఆయన్ని శాసన మండలికి ఎంపిక చేసి ఆ తరువాత మంత్రివర్గంలో తీసుకున్నారు. రోశయ్య తరువాత కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానందడ్డికి ఆ జిల్లా రాజకీయ సమీకరణలు, ఉప ఎన్నికల నేపధ్యంలో మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతిలో పరాజయం పొందడం, ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కాలం ముగియడంతో ఆయనకు మంత్రిగా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు అదే జిల్లాకు చెందిన పీఆర్పీ ఎమ్మెల్సీ సీ రామచంవూదయ్యకు మంత్రి పదవి కోసం చిరు పట్టుబడుతున్నారు.

నలుగురికి ఉద్వాసన?
ఫిబ్రవరి రెండవ వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 30 వరకు జరిగే అవకాశాలుంటాయి. దీని కంటే ముందు మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరణ, శాఖల మార్పులు చేపడితే బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతానికి పీఆర్పీ నుంచి ఇద్దర్ని తీసుకుని ఖాళీగా ఉన్న శాఖలను వారికి కేటాయించాలని ఆలోచనతో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ విస్తరణలో ప్రస్తుత మంత్రులు బొత్స సత్యనారాయణ, కాసు వెంకటకృష్ణాడ్డి, డాక్టర్ పి.శంకపూరావు, సబితా ఇంద్రాడ్డిలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తోంది. జోడు పదవులు, రానున్న స్థానిక సమరం, ఉప ఎన్నికలు, ఆ తరువాత సాధారణ ఎన్నికల దృష్ట్యా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షుడిగానే బొత్స సేవలు ఉపయోగించు కోవాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బొత్సను మంత్రి పదవి నుంచి తప్పించడం ఖాయమని పార్టీ వర్గాలంటున్నాయి. అదే విధంగా పనితీరు ఆశాజనకంగా లేక పోవడంతో మంత్రి కాసు వెంకటకృష్ణాడ్డి కూడా ఉద్వాసన పలకాలనే ఆలోచనతో సిఎం ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ నుంచి మంత్రి శంకర్‌రావును మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమంటున్నారు. జగన్‌వర్గంతో సంబంధాలున్నాయని ప్రచారంలో ఉండటంతో హోంమంత్రి సబితా ఇంద్రాడ్డికి కూడా మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేక పోలేదని అంటున్నారు.


సబితను అప్పుడు తొలగించకపోయినా హోంశాఖ నుంచి మరో శాఖకు మార్చడం ఖాయమని పారీ ్టవర్గాలంటున్నాయి. ఇప్పటికే హోం శాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పట్టుబడుతున్నట్లు సమాచారం. శంకర్‌రావును తొలగిస్తే ఆయన స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి మరొకరిని సీఎం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే నిజమైతే రంగాడ్డి జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ లేదా, ప్రభుత్వ విప్ కొండ్రు మురళికి మంత్రివర్గంలో అవకాశాలుంటాయని పార్టీ వర్గాలంటున్నాయి. అప్పటి వరకు మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మరో ఒకరిద్దరిని తప్పించడం ద్వారా కొత్త వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనే ఆలోచనతో కిరణ్ ఉన్నట్లు సమాచారం. 

 Take By: T News

Read more...

Tuesday, December 27, 2011

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం

హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ బజార్‌లో మిట్ట మధ్యాహ్నం దారుణం చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వ్యక్తిపై నలుగురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి భయంతో పరుగులు తీసి పారిపోయినట్లు సమాచారం. దాడి చేసిన దుండగులు పరారీలో ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుండగుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 

Take By: T News 

Read more...

Monday, December 26, 2011

అరుదైన వ్యాధి గుర్తింపు

- దేశంలోనే మొట్టమొదటి ఆపరేషన్
- వర్తించని ఆరోగ్యశ్రీతో రోగి ఆందోళన
- ఆదుకోవాలని తెలంగాణ బిడ్డ వేడుకోలు


హైదరాబాద్ డిసెంబర్ 25 (): అరుదైన వ్యాధితో ఏళ్ల తరబడిగా బాధపడుతున్న నల్గొండ జిల్లా గుడిపల్లికి చెందిన రవీందర్‌డ్డి అనే యువకుడికి హైదరాబాద్‌లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఈ వ్యాధి పేరు స్టిఫ్‌మాన్ సిండ్రోమ్. నాలుగేళ్లుగా అప్పులు చేసి దవాఖానల చుట్టూ తిరిగినా ఇది ఏ వ్యాధో అంతుపట్టలేదు.

వ్యాధిపేరు తెలియకపోగా కండరాలు బిగుసుకుపోవడం, కీళ్లు మడవలేని స్థితిలో నాలుగేళ్లుగా రవీందర్‌డ్డి ఇబ్బంది పడుతున్నారు. చివరకు నగరంలోని ‘సన్‌షైన్’ ఆస్పవూతిలో ఉన్న వెన్నుపూస స్పెషలిస్టు నరేష్‌బాబు పరీక్షలు చేసి ‘‘స్టిఫ్‌మాన్ సిండ్రోమ్’’గా గుర్తించారు. ఈ జబ్బు సోకినవారికి వెన్నుపూసకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారానే ఉపశమనం ఉంటుంది. అయితే ఈ మందు గంటకు మించి పనిచేయదు.

ఈ నేపథ్యంలో వెన్నుపూస ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో వెన్నుపూసకున్న ప్రధాన నరానికి నిత్యం సూదిమందు అందేందుకు పొట్టలో ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. ఒక్కసారి నింపితే వంద రోజులకు మందు సరఫరా అవుతుంది. మందు అయిపోతుంటే ఆ మిషన్ ఆలారం మోగిస్తుంది. కాగా రాష్ట్రంలోనే కాక, దేశంలోనే దీనిని మొట్టమొదటి కేసుగా గుర్తించారు.

ఇలాంటి పరికరం అమర్చడం దేశంలోనే మొట్టమొదటి సారి అని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింప చేయకపోవడంపై పేషెంట్ రవీందర్‌డ్డి, ఆయన కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మానవత ధృక్ఫథంతో సాయం అందిచాలని కోరుతున్నారు. మందు నింపుకునేందుకు ప్రతి వంద రోజులకు రూ.5వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Take By: T News

Read more...

మహిళా కమిషన్ చైర్మన్‌గా జయసుధ?

- ఆమె ైవైపే సీఎం మొగ్గు
- అధిష్ఠానం ఆమోదం?
- త్వరలో అధికారిక ఉత్తర్వులు
- జగన్ వర్గం నుంచి వచ్చినందుకు నజరానా?


jaya-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 25 (:సినీనటి, సికింవూదాబాద్ ఎమ్మెల్యే జయసుధను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి స్ఫూర్తితో సినీపరిక్షిశమ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేసిన జయసుధ, ఆయన ప్రోత్సాహంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సికింవూదాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత నాలుగు నెలలకే ఊహించని రీతిలో వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.

వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ ఆయన మరణానంతరం తన రాజకీయ ప్రయాణంపై ఆలోచనలో పడ్డారు. ఆ తరువాత పార్టీకి చెందిన మరి కొందరు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్సార్ తనయుడు జగన్‌కు బాసటగా నిలుస్తూ ఆయనకు మద్దతిస్తూ వచ్చారు. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నప్పటికీ అతనికి అండగా ఉంటూ కాంగ్రెస్‌లో జగన్ వర్గం ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు.

వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించిన జగన్ వర్గం ఎమ్మెల్యేల బృందంలో ఆమె కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ ప్రయోగించిన పునరాకర్షక్ మంత్రం తో జయసుధ జగన్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.

అప్పటి నుంచి ఆమె సీఎం కిరణ్‌కుమార్‌డ్డిని పలు సందర్భాల్లో ఒక మంచి ముఖ్యమంవూతిగా పొగడ్తలతో ముంచెత్తారు. సీఎం కిరణ్ కూడా సినీ గ్లామర్ ఉన్న జయసుధ పార్టీ నుంచి చేజారిపోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సికింవూదాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు పలు అభివృద్ధి ప్యాకేజీలను ప్రకటించారు. అంతే కాకుండా పునరాకర్షక్ మంత్రంలో భాగంగానే ఇచ్చిన హామీ మేరకు జయసుధకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కిరణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవికి వన్నె తెచ్చే నాయకురాలి కోసం పార్టీ అన్వేషిస్తున్నది. ప్రస్తుతం పార్టీలో జయసుధను మించి ఆ లక్షణాలు, అర్హతలున్న నేతలు ఎవరూ లేరని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. జయసుధకు ఆ పదవి ఇవ్వడం ద్వారా జగన్ వర్గం నుంచి కాంగ్రెస్‌కు వచ్చినందుకు ఆమెకు నజరానాగా చెప్పుకోవచ్చని, జగన్‌కు మద్దతుగా ఉన్న మిగతా ఎమ్మెల్యేలు, నేతలను కూడా సొంతగూటికి రప్పించుకోవచ్చని సీఎం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఈ విషయంలో ఆయన పార్టీ అధిష్ఠానంతో చర్చించి జయసుధ పేరుకు ఆమోదం కూడా పొందినట్లు సమాచారం. గతంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మేరి రవీంవూధనాథ్, కమిషన్ సభ్యులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వీధి పోరుకు దిగడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ కమిషన్‌ను రద్దు చేశారు. అప్పటి నుంచి కమిషన్ చైర్మన్, సభ్యుల పదవులు ఖాళీగానే ఉన్నాయి. నాటి నుంచి పార్టీకి చెందిన పలువురు మహిళా నేతలు ఆ పదవుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Take By: T News

Read more...

బీడీ మతుకుల్ని చుట్టేన్తున్నారు!

- కనీస వేతనాలకు కత్తెరేసే కుతంత్రం
- యాజమాన్యాల అమానుషం
- ‘స్టార్’ సమావేశాల్లో ‘మెజారిటీ’ నాటకం
- అదే జరిగితే సేట్ల జేబుల్లోకి వేల కోట్లు
- భారీ మొత్తాలు కోల్పోనున్న కార్మికులు
- జీవో మార్పుకోసం నెల్లూరు మాజీ ఎమ్మెల్సీ తంటాలు
- దానం, షబ్బీర్, రాజేశ్వర్ పాత్రపై కార్మికుల మండిపాటు
- సమరానికి సిద్ధం.. కాంగ్రెస్‌ను ఖతం చేస్తాం
-జీవో 41 సవరణకు సీమాంధ్ర సర్కారు సిద్ధం


beedip-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema( - నిజామాబాద్):ప్రభుత్వ జీవో ప్రకారం కనీసం వేతనం రూ. 150 చెల్లించలేమని అలా చేస్తే నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదముందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలుకుతున్నారు. సీమాంధ్ర సర్కారులోని పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే బీడీ కార్మికులు వెయ్యి బీడీల ఉత్పత్తిపై రూ.60 నష్టపోయే ప్రమాదముంది. బీడీ కార్మికుల జీవితాలు మసిబారిపోతూనే ఉంటాయి. జీవనాధారంగా ఎంచుకున్న పని వారి జీవితాలను గొప్పగా నిలబెట్టకపోగా, ఆరోగ్యాన్ని పలు విధాలుగా హరించి వేస్తూనే ఉంటుంది.

సంతృప్తికరమైన, సుఖవంతమైన జీవనమో, ఆరోగ్య భద్రతకు హామీయో ఉండదు. అయినా ఏదో రకంగా జీవితాన్ని వెళ్ళదీయాలికదా అనే భావనతోనే కూటికోసం తెలంగాణలో కోట్ల కుటుంబాలు బీడీ పరిక్షిశమనే ఆధారం చేసుకున్నాయి. వాళ్ల ఆరోగ్యాన్ని పీల్చి పిప్పిజేసే ఈ పని సేట్లకు, యాజమాన్యాలకు మాత్రం కోట్ల సంపదను సమకూర్చుతోంది. కార్మికులకేమో సరైన కనీస వేతనాలు లభించవు. సుదీర్ఘ పోరాటం తర్వాత.. ఈ ఏడాది జూన్‌లో వెయ్యి బీడీల తయారీకి కనీస వేతనాన్ని రూ.150గా ఖరారుచేస్తూ జీవో నంబర్ 41 విడుదలయింది. కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, కార్మిక శాఖ, ప్రభుత్వం.. అన్నీ ఏకాభివూపాయానికి వచ్చిన తర్వాతే విడుదలైన ఆ ఉత్తర్వు పని అంతటితోనే ముగిసిపోయింది.

ఆచరణకు రాలేదు. కారణం?.. స్వార్థపర యాజమాన్యాల దురాశ! తమ లాభాలు కొల్లగొట్టుకపోతాయనే అపోహ. అంతే.. ఆ జీవోకు అడ్డుచక్రం వేయాలనుకున్నారు. అధికారంలో ఉన్న నేతలను అందుకు ఉపయోగించుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగారు. కావాలనుకున్న వర్గాలన్నింటినీ సంప్రదించారు. విలాసవంతమైన నక్షత్ర హోటళ్లలో సంప్రతింపుల ప్రహసనం నడిపారు. అన్యాయం కదా అనేవారికి అవకాశమీయలేదు. అన్ని రకాల మాయోపాయాలూ ప్రయోగించారు. చివరికి.. ‘మెజారిటీ’ పేరిట కార్మికుల కడుపు కొట్టేందుకు ఏకమయ్యారు. పదకొండు సంవత్సరాల పోరాటం ఫలితంగా కనీస వేతనాన్ని రూ.102 నుంచి రూ.150కు పెంచాలని ప్రభుత్వాన్ని ఒప్పించగలిగినా.. ఇప్పుడు కుట్రపూరితంగా ఆ మొత్తం రూ.115కు పడిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. స్వార్థపర యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారుకు తోడు ఇక్కడి తెలంగాణ ద్రోహులు కూడా ఈ దారుణానికి అండగా నిలవడం కార్మిక వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. స్వయానా కార్మికమంత్రి దానం నాగేందర్, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, నెల్లూరు జిల్లాకు చెందిన తాజా మాజీ ఎమ్మెల్సీ రాధాకృష్ణ అండదండలతో బీడీ యాజమాన్యాలు జీవో 41ని సవరింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ఈ దారుణ చర్య గురించి తెలుసుకున్న బీడీ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రభుత్వం కుయుక్తులకు తలొగ్గితే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. యాజమాన్యాల ప్రయత్నాలను తిప్పికొ సోమవారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం కావాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకున్నాయి. తెలంగాణలో వ్యవసాయం తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిగా ఎంచుకున్న బీడీ పరిక్షిశమ తనను నమ్ముకున్న కార్మికులను కాపాడుకోలేకపోతోంది. ఆ కార్మికులకు అండగా నిలబడి పోరాడుతున్న సంఘాలను దెబ్బతీసేందుకు ఎన్నో మాయోపాయాలు..

కపట నాటకాలు. ఇప్పుడు ఆ కార్మికవర్గం వెన్ను విరిచేందుకు స్వార్థ యాజమాన్యాలు, సీమాంధ్ర సర్కారు పథకం ప్రకారం పావులు కదుపుతున్న తీరు రోత కలిగిస్తోంది. గుండెలను రగిలిస్తోంది. లక్షల మంది కార్మికులు లడాయిచేసి సాధించుకున్న కనీసవేతనాల జీవోను సవరించే నయవంచన ఎత్తుగడలు ఇప్పుడు తీవ్ర ప్రతిఘటనను చవిచూసే పరిణామాలను కొని తెచ్చుకోనున్నాయి. కుట్రలు ఫలిస్తే ఈ ఒక్క ఆరు నెలల్లోనే తెలంగాణ జిల్లాల్లోని ఏడున్నర లక్షల మంది బీడీ కార్మికులు రమారమి వెయ్యి కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. హైదరాబాద్ కేంద్రంగా సీమాంధ్ర సర్కారు పెద్దలు, బీడీ యాజమాన్యాలు కూడబలుక్కుని నడుపుతున్న గూడుపుఠాణీ వల్ల నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, రంగాడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని లక్షలాది మంది బీడీ కార్మికుల బతుకులు బుగ్గికానున్నాయి.

నయవంచన.. కుట్రల పరంపర..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన ప్రమాణ సూచికల ప్రాతిపదికన కనీస వేతనాలు అందజేయాలని 11ఏళ్లుగా తెలంగాణ జిల్లాల్లోని బీడీ కార్మిక రంగంలో అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా సీమాంధ్ర పాలకులు పట్టించుకోని కారణంగా జాతీయ కార్మిక సంఘాల నేతృత్వంలో 2010 నవంబర్ 1 నుంచి డిసెంబర్ 2 వరకు చరివూతాత్మకమైన సమ్మె జరిగింది. 32 రోజులపాటు కొనసాగిన సమ్మెవల్ల తెలంగాణ జిల్లాల్లోని బీడీ యాజమాన్యాలు కోట్లాది రూపాయల ఉత్పత్తిని కోల్పోయాయి. దీంతో రాష్ర్ట ప్రభుత్వం జోక్యం చేసుకుంది. 56 సంఘాలతో సమ్మె కాలంలోనే నవంబర్ 24, 25, 26 తేదీల్లో చర్చలు జరిపింది. దీని ఫలితంగానే డిసెంబర్ 30న కనీస వేతనాలను ఖరారు చేస్తూ కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ 1381 నంబరుపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

వెయ్యి బీడీల తయారీకి 130 రూపాయలు కనీస వేతనంగా పేర్కొంటు జారీచేసిన నోటిఫికేషన్‌పై మంత్రి దానం నాగేందర్ సమక్షంలో బీడీ యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సమావేశమయ్యాయి. జీవన ప్రమాణ సూచికలు, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రాతిపదికన ప్రతి వెయ్యి బీడీల తయారీకి 150 రూపాయల కనీస వేతనం అమలు పూర్తిగా శాస్త్రీయబద్ధమేనని కార్మికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆ సమావేశంలో స్పష్టంచేశారు. ఆ సమావేశం కొనసాగింపుగానే జూన్ 31వ తేదీన ప్రభుత్వం 130 రూపాయలు కనీస వేతనంగా, 7 రూపాయల 50 పైసలు కరువు భత్యంతోపాటు ఇతర అంశాలపై చెల్లింపుల ద్వారా 150 రూపాయలను ఖరారు చేస్తూ జీవో నంబర్ 41ను జారీ చేసింది.

ఆ జీవోను అమలుచేయాలని కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే బీడీ యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జూలై 6 నుంచి పదిరోజులపాటు అక్రమంగా లాకౌట్ ప్రకటించాయి. సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జీవో అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జూలై 27న త్రైపాక్షిక కమిటీని వేసింది. బీడీ సేట్లకు అనుకూలమైన సంఘాలకు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుబంధ సంఘాల బాధ్యులకు ఎక్కువ సంఖ్యలో కమిటీలో ప్రాతినిధ్యం కల్పించారు. బీడీ పరిక్షిశమతో ఏమాత్రం సంబంధంలేని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ రాధాకృష్ణను (నెల కిందట పదవీ కాలం ముగిసింది) సైతం త్రైపాక్షిక కమిటీ సభ్యుడిగా నియమించారు. ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, డీఎంఎస్, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాలతోపాటు ముఖ్యమైన బీడీ సంఘాల యాజమాన్యం ప్రతినిధులను కమిటీలో చేర్చారు. ఏనాడూ ఆ పని చేయని త్రైపాక్షిక కమిటీ మొక్కుబడిగా సెప్టెంబర్ 12న, నవంబర్ 9న మాత్రమే సమావేశాలు జరిపింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేయకుండానే కార్మిక సంఘాల అభివూపాయాలను మాత్రమే స్వీకరించింది.

రెండ్రోజుల్లోనే తారుమారు.. ఆరునెలల్లోనే వెయ్యి కోట్ల నష్టం
Bidi-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకనీస వేతనాల జీవో అమలుకోసం సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్ కేంద్రంగా చర్చలపేరిట సమావేశాలను నిర్వహించాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 150 రూపాయలు చెల్లించలేమని, నష్టాలతో బీడీ పరిక్షిశమ తరలిపోయే ప్రమాదం ఉందని యాజమాన్య ప్రతినిధులు నమ్మబలికారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాలో కనీస వేతనాలు ఇస్తుండగా లేని నష్టాలు ఇక్కడెందుకు వస్తాయని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

అయినా మెజార్టీ మంత్రాంగాన్ని తెరపైకి తెచ్చిన యాజమాన్యాలు 70 సంఘాల అంగీకారం ఉందంటూ కనీస వేతనాల జీవోను సవరించాలంటూ సర్కారును ఆశ్రయించాయి. వెయ్యి బీడీల తయారీపై ఇప్పుడు ఇస్తున్న 102 రూపాయలను 115 రూపాయలకు మాత్రమే పెంచగలుగుతామని యాజమాన్యాలు చేసిన ప్రతిపాదనకు బీడీ కార్మికసంఘాలు పచ్చజెండా ఊపాయి. సీమాంధ్ర సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న పెద్దల కుట్రలు ఫలించి జీవో సవరణ జరిగితే ప్రతి బీడీ కార్మికుడు వెయ్యి బీడీల ఉత్పత్తిపై భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. జీవో విడుదలైనప్పటినుంచి ఈ ఆరు నెలల కాలంలోనే ఆ మొత్తం రూ. వెయ్యి కోట్ల పైగా ఉంటుంది.

రోజుకు వందకోట్ల బీడీ ఉత్పత్తి
సంక్షోభంలో ఉన్నామంటూ నమ్మబలుకుతున్న సేట్లు కనీస వేతనాలు పెంచితే పరిక్షిశమనే తరలిపోతుందని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. బీడీ కంపెనీలు వెయ్యి బీడీలను 40 కట్టలుగా బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవడం ద్వారా 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు లాభాలను గడిస్తుంటాయి. ఉత్పత్తిచేస్తున్న కార్మికులకు మాత్రం 102 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. ఈ లెక్కన యాజమాన్యాలకు రోజువారీగా అంతులేని లాభాలు వస్తూనే ఉన్నాయి.

ప్రతిరోజు తెలంగాణ జిల్లాల్లో వందకోట్ల సంఖ్యలో బీడీ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక్క దేశాయి కంపెనీలోనే లక్షమంది కార్మికులు 10 కోట్ల బీడీలను ఉత్పత్తి చేస్తున్నారు. శివాజీ, టెలిఫోన్, చారుబాయి, ఠాకూర్, హిమ్మత్‌లాల్ తదితర కంపెనీలు ప్రతిరోజు 3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బీడీలను తయారుచేయిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల మంది, కరీంనగర్‌లో లక్షన్నర మంది, మెదక్ జిల్లాలో లక్ష 20 వేల మంది, ఆదిలాబాద్ జిల్లాలో లక్ష మంది, వరంగల్‌లో 30వేల మంది బీడీలు చుడుతూ జీవనం గడుపుతున్నారు.

గూడుపుఠాణిపై సమరం: ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్
కనీస వేతనాల జీవోను సవరించేందుకు జరుగుతున్న కుట్రను అడ్డుకుంటామని ఏపీ బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ చెప్పారు. జీవో 41ని యథాతథంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. దీంట్లో భాగంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నామన్నారు.

కాంగ్రెస్‌కు కష్టకాలమే: ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్
జీవోను సవరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కష్టకాలం తప్పదని ఏపీ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సిద్ధిరాములు హెచ్చరించారు. సీమాంధ్ర పాలకులు, కాంగ్రెస్ పెద్దలు బీడీ యాజమాన్యాలతో కుమ్మకై్క లక్షలాది మంది తెలంగాణ బీడీ కార్మిక కుటుంబాలను నిలువు దోపిడీ చేయబోతున్నారని ఆయన ఆరోపించారు.

మెజార్టీ సంఘాలపేరిట జీవోను సవరించే కుట్రను అడ్డుకునేందుకు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడాలని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. జీవోను మార్చితే తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీడీ కార్మికుల ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి, కార్మిక మంత్రిని కలిసి మాట్లాడుతామని తెలిపారు.

Take By: T News

Read more...

చంద్రబాబూ ఖబర్దార్..

-కరీంనగర్‌కు రావొద్దు.. ‘తెలంగాణ’ వార్నింగ్
-రెండు కళ్లపై తెలంగాణ మండిపాటు
-వైఖరి తేల్చందే అడుగుపెట్టొద్దు
-తెదేపా నేత పెద్దిడ్డికి హుస్నాబాద్‌లో భంగపాటు
-700 ఆత్మహత్యలు బాబుకు కనిపించలేదా?
-అడ్డుకుని నిలదీసిన తెలంగాణవాదులు
-టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట
-చంద్రబాబును అడ్డుకుంటాం: కోదండరాం స్పష్టీకరణ
-ఆంధ్రా పెత్తనం చాటేందుకే ఆయన పర్యటనలు
-తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలి
-టీడీపీకి స్పష్టత లేనందునే జేఏసీలో కలుపుకోలేదు
-ఆంధ్రా సంపన్న వర్గాల ప్రతినిధులున్నారు
-ఆ నేతలే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ


TRS-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో, రెండు నాల్కల వైఖరితో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు. పుండు మీద కారం చల్లినట్లు ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు వారిని మరింతగా మండిపడేలా చేస్తోంది. ఇటీవల నిజామాబాద్‌లో పర్యటించి చేదు అనుభవాలను ఎదుర్కొన్న చంద్రబాబు కరీంనగర్ జిల్లాలోనూ తిరుగుతానంటే సహించేది లేదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు. ముందుగా తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆ పార్టీ నేత పెద్దిడ్డిని కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో తెలంగాణవాదులు నిలదీశారు.

సమైక్యవాద చంద్రబాబు రైతు పోరుబాట పేరుతో చేపట్టే పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరిగితే సహించేదిలేదని హెచ్చరించారు. పలువురు నేతలు, యువజన, మహిళా విభాగం కార్యకర్తలు పెద్దిడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కోసం 700 మంది ఆత్మబలిదానం చేసుకుంటే చంద్రబాబు నాయుడికి కనిపించలేదా? అని నిలదీశారు. ఈ సందర్భంగా టీడీపీ, టీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల జోక్యంతో పెద్దిడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు చంద్రబాబునాయుడు వైఖరిని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తన వరంగల్, కరీంనగర్ పర్యటనల్లో తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణ వైఖరిని తేల్చని చంద్రబాబును తెలంగాణలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణపై స్పష్టత లేనందునే జేఏసీలో టీడీపీని కలుపుకోలేదని తెలిపారు. ఆంధ్రా పెత్తనం చాటేందుకే బాబు పర్యటనలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై ప్రకటన చేస్తేనే తిరగనివ్వాలని, లేకుంటే నిరసనలు తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు.

రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకుపోతున్న చంద్రబాబుకు ఇక్కడికి తెలుగుదేశం నాయకులు, ప్రజావూపతినిధులే కవచంగా నిలుస్తున్నారని ఆయన తప్పుబట్టారు. తెలంగాణను వ్యతిరేకిస్తున్న ఆంధ్రా నాయకులు మన ప్రాంతంలో తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు సహా ఆంధ్రా సంపన్న వర్గాలకు ప్రతినిధులుగా నిలుస్తున్న తెలంగాణ నాయకులు, ప్రజావూపతినిధులే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో తెలంగాణ కోసం పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే నాయకులను కలుపుకుని ఉద్యమించాలని కోరారు

Take By: T News

Read more...

Sunday, December 25, 2011

క్రిస్మస్‌కు ముస్తాబైన మెదక్ చర్చి



Cherch talangana patrika telangana culture telangana politics telangana cinemaమెదక్, డిసెంబర్ 24 (): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. డయాసిస్ మిషనరీ ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారం రోజులుగా సమష్టి కృషితో ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెవండ్ బిషప్ కనకవూపసాద్ భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఇక్కడ జరిగే వేడుకలకు మెదక్ డయాసిస్ పరిధిలోని హైదరాబాద్, రంగాడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన క్రైస్తవ సోదరులే కాకుండా మతాలకతీతంగా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు రానున్నారు. దాదాపు రెండు లక్షల మంది దాకా రావచ్చని డయాసిస్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

వేడుకలను పురస్కరించుకొని మెదక్‌కు ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ తెలిపారు.

Read more...

కిరణ్‌కు కొత్త టీం!

- కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించిన అధిష్ఠానం
- మంత్రివర్గం నుంచి కొందరినితొలగించినా నష్టంలేదని అంచనా
- వారు జగన్ వైపు వెళ్లరని భరోసా
- ముందుగా పీఆర్పీ కోసం..ఆ తర్వాతే విస్తృత స్థాయిలో.

.
1-(6)-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, డిసెంబర్ 24 ():కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. రాష్ట్ర కాంగ్రెస్, ప్రభుత్వంలో పలు మార్పులకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలనాటికి పార్టీని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ కసరత్తు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డికి మరింత స్వేచ్ఛనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

కిరణ్‌కుమార్‌డ్డి మంత్రివర్గంలో ఆయనకు విశ్వాసపావూతులుగా ఉన్నవారు దాదాపు ఎవ్వరూ లేరని, ముఖ్యమంవూతికి మంత్రులకు మధ్య, మంత్రుల మధ్య పరస్పర విశ్వాసం కొరవడి మొత్తంగా పాలనా యంత్రాంగానికి మంచిపేరు రావటం లేదని, సమిష్టి కృషికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడిందని అధిష్ఠానవర్గం అంచనాకు వచ్చింది.

వచ్చే సాధారణ ఎన్నికలకు సిద్ధం కావాలంటే ప్రభుత్వపరంగా మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టటం కుదరదని కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఆయా కార్యక్షికమాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రత్యేక టీం అవసరమని, ఇందుకు అనుగుణంగానే కిరణ్‌కుమార్‌డ్డి సర్కార్‌ను బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే కిరణ్‌కుమార్‌డ్డికి మంత్రివర్గంలో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌డ్డికి పలుకుబడి తగ్గిపోయి అది కాంగ్రెస్‌కు లాభిస్తోందని, మంత్రివర్గం నుంచి ఎవరిని తొలగించినా ప్రస్తుతం వారు జగన్ వైపు వెళ్లే అవకాశాలు లేవని అధిష్ఠానం భావిస్తోంది.

ఇదే రకమైన ఫీడ్‌బ్యాక్ రాష్ట్రం నుంచి హస్తినకు అందింది. ఎవరిపై వేటు వేసినా వారంతా జగన్‌ను అనుసరిస్తారని, దాంతో రాష్ట్ర కాంగ్రెస్ బలహీనపడుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు భయపడిన మాట వాస్తవమే అయినా మారిన పరిస్థితుల్లో పార్టీకి విధేయులుగా లేనివారందరిపై వేటు వేసి కాంగ్రెస్‌ను నమ్ముకున్న వారినే అందలం ఎక్కించాలని నిర్ణయించారు.


ఇందులో భాగంగా ఒక డజన్ మంది మంత్రులు తప్ప ఎక్కువమందిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అయితే, భారీ స్థాయిలో మార్పులు చేయటం వల్ల మూకుమ్మడి ఫిరాయింపులు జరిగి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, పైగా ఉప ఎన్నికలు త్వరలోనే జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాల వల్ల నష్టమే ఎక్కువన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

అయినా, వైఎస్ భక్తులుగా ఇప్పటికీ ప్రచారంలో ఉన్నవారిపై వేటు వేసి కిరణ్‌కుమార్‌డ్డికి కొత్త టీం ఇచ్చేలా చర్యలు తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారిని గుర్తించే పని కూడా అధిష్ఠానమే తన నెత్తిపై వేసుకుందని, దీంతో కిరణ్‌కుమార్‌డ్డికి రాజకీయంగా ఇబ్బంది ఏర్పడదని అంటున్నారు. కొత్త టీంలో పూర్తిగా కిరణ్‌కుమార్‌డ్డికి అనుకూలురే ఉంటారని, దీంతో భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కావని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగేది ఇంకా నిర్ణయించకపోయినా సంకావూంతి పండుగ తరువాత ఈ కార్యక్షికమం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేవలం చిరంజీవి సూచించిన ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఇతర మార్పులేమీ లేకుండా కొన్నాళ్లు ఇదే కేబినెట్‌ను కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది. కిరణ్‌కుమార్‌డ్డి ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో తమకు కేటాయించిన శాఖలపట్ల కొందరు సీనియర్ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మార్పులు చేయాలని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే డిమాండ్ చేశారు.

కొంతమంది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా కిరణ్‌కుమార్‌డ్డి తనదైన తరహాలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దీంతో సీనియర్ మంత్రులు ఇప్పటికీ ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో లేరనేది వాస్తవం. అలాంటివారు తప్పనిసరి పరిస్థితుల్లో లేదా ప్రత్యామ్నాయం లేనందున మంత్రివర్గంలో అయిష్టంగానే కొనసాగుతున్నారని, పదవులు లేనట్టయితే గుర్తింపు ఉండదనే భయంతోనే వారు కేబినెట్‌లో నెట్టుకొస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, వారి ఆకాంక్షల మేరకు పలు కార్యక్షికమాలు చేపడుతున్నందున తనకు ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురు కాకుండా చూడాలని అధిష్ఠానాన్ని కిరణ్‌కుమార్‌డ్డి అభ్యర్థించినట్టు తెలిసింది.

తెలంగాణ అంశంతో ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు సంక్షిష్టంగా మారాయని, పార్టీ నేతలు కొందరు తనకు అవరోధాలు సృష్టిస్తున్నారని, వారిలో కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే సమంజసంగా ఉంటుందని కూడా కిరణ్‌కుమార్‌డ్డి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ ముందు అన్నట్టు తెలుస్తోంది.

ఆయన అభ్యర్థన మేరకే గట్టి తెలంగాణవాది ఎవరు లేకుండా రాష్ట్రంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారని, భవిష్యత్తులో మంత్రివర్గ పునర్నిర్మాణం కూడా కిరణ్‌కుమార్‌డ్డి అనుకున్నట్టుగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రివర్గంలోనూ కొనసాగటంపట్ల కిరణ్‌కుమార్‌డ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని, త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఆయనను తప్పించాలని కూడా కిరణ్‌కుమార్‌డ్డి కోరినట్టు చెబుతున్నారు.

ఇందుకు అనుగుణంగానే బొత్స సత్యనారాయణపై ఆరోపణలతో కూడిన వాదన అధిష్ఠానం ముందు ఉంచేందుకే మద్యం సిండికేట్ల వ్యవహారం ముందుకొచ్చిందని, ఏసీబీ దాడులు అందుకే జరిగాయని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తనకంటూ మంచి టీం ఏర్పడితే వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి అవకాశాలు మెరుగవుతాయని కిరణ్‌కుమార్‌డ్డి వాదిస్తున్నారు.

Take By: T News  

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP