Powered by Blogger.
Related Posts Plugin for WordPress, Blogger...
Showing posts with label Govt Jobs. Show all posts
Showing posts with label Govt Jobs. Show all posts

Saturday, December 8, 2012

ప్రభుత్వ సర్వీసులో నెలకు 3 లక్షలు


ఎల్.ఐ.సి డెవలప్‌మెంట్ ఆఫీసర్
ప్రభుత్వోద్యోగంలో వేతనాలు స్థిరంగా ఉంటాయి. ఎంత పని చేసినా అంతే వేతనం కానీ ఉద్యోగభద్రతకు గ్యారంటీ లేదు ఈ రెండింటినీ మేళవించి జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి) నేటి యువతకు గొప్ప అవకాశం కల్పిస్తోంది.
-నెలకు 2.5 లక్షల ఇన్సెంటివ్ * నెలకు 50 వేల ఆఫీసు వేతనం * ఎంతమంది ఏజెంట్లనైనా నియమించవచ్చు * బ్రాంచీలో సీనియర్ డివిజనల్ మేనేజర్ వరకు ఎదగవచ్చు * ప్రపంచ అగ్రగామి సంస్థలల్లో ఉద్యోగం * కొద్ది సంవత్సరాలలోనే కారు యోగం * బిజినెస్ సామర్ధ్యాన్ని బట్టి ఏకంగా అమెరికా దేశంలో గౌరవ పురస్కారాలు * నిధులు ఖర్చుకాని నిచ్చెన వంటి వ్యాపారం * మీ ఆఫీసుకు మీరే ‘బాస్’.

ఇలా ఇన్ని ప్రయోజనాలు, ఆకర్షణలు గల కెరీర్ ఏదైనా ఉందా అంటే ఎల్‌ఐసి అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ మాత్రమేనని చెప్పాలి. ప్రభుత్వ సర్వెంట్ల వలే నెలవారీ జీతాలకై ఎదురుచూడకుండా నెల నెలా మొత్తం ఇన్సెంటివ్ అందుకునే అత్యుత్తమ కెరీర్ అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్. అయితే ఎ.డి.ఓ కెరీర్‌లో ప్రవేశించిన అభ్యర్ధులు ఎవరైనా ఎదురుగా ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి ‘శ్రమకోర్చే తత్వం’ ఉండాలి. ఏదో నాలుగు ఫైళ్ళు రాసేస్తే నా జీతం నాకు ఠంచనుగా వస్తోందిలే అనే ధోరణి వదిలి, నలుగురు దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్‌ను నచ్చచెప్పే విధులకు స్వాగతం పలికితే నిజంగా ఆకాశమే హద్దు... అని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ఇప్పటికే వేలాదిమంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు మన కంటికి ఎదురుగానే తిరుగుతూ మనతోనే లక్షలాది రూపాయలు ప్రీమియంలు కట్టిస్తూ దర్జాగా కెరీర్‌లో దూసుకుపోతున్నారు. మరి ఇటువంటి అవకాశం తెలియని వాళ్ళూ ఉన్నారు. తెలిసేసరికి అంతంత మాత్రం ఆదాయంలో చేరిన వృత్తిలో పది, పదిహేనేళ్ళు ప్రయాణంచేసి ఉంటారు. ‘యస్... నాకు అంతులేని సంపదకావాలి? అందరూ నా గురించి చర్చించుకునేలా నా జీవితం ఉండాలని’ కోరుకునే ‘కసి... కృషి’ గల యువతీ యువకులకు ఎ.డి.ఓ.పోస్టులు స్వాగతం పలుకుతున్నాయి.

వృత్తి స్వభావం
ఎల్.ఐ.సి. పాలసీ విక్రయం జరుపటంలో పెద్దన్న పాత్ర పోషించేలా పర్యవేక్షణ బాధ్యతలు గల ఉద్యోగం అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్. ఈయనకు ప్రధానంగా 5 రకాల విధులు ఉంటాయని చెప్పవచ్చు. 1. ఏజెంట్లను నియమించుకోవటం 2. ఏజెంట్లకు పాలసీలు ఆకర్షించేలా శిక్షణ అందించటం 3. తన ఏజెంట్ల నుంచి వచ్చే పాలసీదారులకు అవసరమైన ఎల్.ఐ.సి సేవలు అందించడం. 4. నిర్దేశిత బ్రాంచీ పరిధిలో వీలయినంత వరకు పర్యటిస్తూ అత్యధిక పాలసీలు చేయించటం. 5. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లేదా ఇతర అంశాలు మీరయితేనే బాగా చెప్పగలరని ఏజెంట్లు కోరినప్పుడు ఎ.డి.ఓ.లు తప్పకుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా ఎటు చూసినా ఎల్.ఐ.సి పాలసీ విక్రయం చుట్టూనే తిరిగేలా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ విధులుంటాయని చెప్పవచ్చు. నిర్దేశిత బ్రాంచీ ఎల్.ఐ.సి కేంద్రంగా అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఏడాది టార్గెట్లకు సిద్ధమయి ముందుకు పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరు ముందుగా వెళ్తారో, ఎవరు ఎంత త్వరగా పరుగులు పెడ్తారో వారే పాలసీల్లోనే కాదు ఇన్సెంటివ్ తీసుకోవటంలోను ప్రథమస్థానంలో ఉంటారు.

తొలి ఏడాది టార్గెట్
అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయిన అభ్యర్ధులకు 3 నెలలు శిక్షణ ఉంటుంది. 15 రోజులు ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయ పాలసీల, కరస్పాండెన్స్, 45 రోజులు ‘పాలసీ క్రాక్’ చేయటం - ఏజెంట్ల నియామకం, ఇతర అంశాలన్నింటిపై క్లాస్‌రూం శిక్షణ, మిగతా 30 రోజులు ఫీల్డ్ లెవల్ పాలసీ సేల్స్‌పై ‘డోర్ టు డోర్’ ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.. అనంతరం ఎంపికయిన డివిజన్‌లో ఏదేని ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయానికి ఎ.డి.ఓ.ను అటాచ్ చేస్తారు. తొలి ఏడాది లక్ష్యంతో కనీసం 35 మంది ఏజెంట్లను నియమించుకోవాలి. 450 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఏజెంట్ల ద్వారా కొత్తగా చేయించాలి. ఈ పాలసీల మొత్తం ప్రీమియం రూ.12 లక్షలు ఉండాలి. ఇక్కడ టార్గెట్‌ను మించి ఎల్.ఐ.సి బిజినెస్‌ను ఇవ్వవచ్చు. ఇంకా ఎల్.ఐ.సి ఏజంట్లను నియమించుకోవచ్చు. ఏడాది టార్గెట్ పూర్తి చేయటం తప్పనిసరి. ఏడాది కాలం తర్వాత అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్‌ను డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా పిలుస్తారు. ప్రతిఏటా తన ఏజెంట్ల చేత లేదా నూతన ఏజెంట్ల చేత నిర్దేశిత మొత్తంలో ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ అందించాల్సి ఉంటుంది.

ప్రారంభ వేతనం
అప్రంటిస్ పీరియడ్‌లో రూ.20 వేల వరకు స్టయిఫండ్‌ను ఎ.డి.ఓ అభ్యర్ధులు పొందవచ్చు. ఈ వ్యవధి దాటగానే ప్రతినెల రూ.23 వేల వరకు వేతనం అందుకుంటారు. ప్రొబేషనరీ డెవలప్ మెంటు ఆఫీసరు వేతన స్కేలు రూ.11,535 - 28,865 , ఇతర అలవెన్సులు డెవలప్‌మెంటు ఆఫీసర్ అభ్యర్ధులు పొందవచ్చు. తొలి రోజులలోనే రుణ సదుపాయంతో టూ వీలర్ వాహనాన్ని అప్రంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పొందవచ్చు. బిజినెస్ పెర్ఫామెన్స్‌ను బట్టి అనేక రకాల రుణాలు, సదుపాయాలు ఈ ఉద్యోగ అభ్యర్ధులందరికీ ఎల్.ఐ.సి. సంస్థ సమకూరుస్తోంది.

బ్రాంచీ ఆఫీసర్‌గా అవకాశం!
డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా కెరీర్‌లో రాణిస్తోన్న అభ్యర్ధులు ఆసక్తి ఉంటే నిర్దేశిత విధానంలో ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాల్లోని వివిధ కేటగిరి ఆఫీసర్ స్థాయిలో చేరవచ్చు. అయితే ఎ.డి.ఓగా కెరీర్ ప్రారంభించిన 100 మంది అభ్యర్ధులలో కేవలం 20 శాతం మంది మాత్రమే బ్రాంచీస్థాయి పోస్టులపై ఆసక్తి చూపుతున్నారు. కానీ 80 శాతం మంది డెవలప్‌మెంటు ఆఫీసర్‌గా ఏటా వచ్చే బిజినెస్ లక్ష్యాలను సునాయాసంగా చేరుకుంటూ అత్యధిక మొత్తంలో ఇన్సెంటివ్‌లు తీసుకుంటూ అదే డెవలప్‌మెంటు ఆఫీసరుగా కొనసాగుతు న్నారు. ఎల్.ఐ.సి బ్రాంచి పోస్టులవైపు వచ్చే అభ్యర్ధుల పదోన్నతులు ప్రోత్సాహకరంగా ఉంటు న్నాయి. అప్రంటిస్ డెవలప్‌మెంటు ఆఫీసర్ నుంచి డెవలప్‌మెంటు ఆఫీసర్, అసిస్టెంట్ బ్రాంచీ మేనేజర్ బ్రాంచీ మేనేజర్, సీనియర్ బ్రాంచీ మేనేజర్, డివిజనల్ మేనేజర్, సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి వరకు ఎదగవచ్చు. సీనియర్ డివిజనల్ మేనేజర్లు రెండు జిల్లాల్లోగల ఎల్.ఐ.సి బ్రాంచీ కార్యాలయాన్నింటికీ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. సౌత్ సెంట్రల్ జోనల్ ఎల్.ఐ.సిలో 315 బ్రాంచీలలో 4 వేల మంది డెవలప్‌మెంటు ఆఫీసర్లు ఎల్.ఐ.సి పాలసీ బిజినెస్ చేస్తున్నారు. పదిమందిలో కలిసిపోయేలా, పది ప్రాంతాలకు వెళ్లడమంటే ఇష్టమైనటువంటి అభ్యర్ధులకు ఈ ఉద్యోగం బ్రహ్మాస్త్రమే !

నోటిఫికేషన్ వచ్చేసింది
613 ఖాళీలతో అప్రంటిస్ డెవలప్ మెంటు ఆఫీసర్స్ నోటిఫికేషన్ విడుదల యింది. సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ పరిధిలోని 17 డివిజన్లలో 613 ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఏదేని బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. ఎంబిఎ మార్కెటింగ్ పిజిడిఇన్ మార్కెటింగ్ అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పిస్తారు. 21 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు గల అభ్యర్ధులు పోటీపడవచ్చు. రిజర్వేషన్ సదు పాయం గల అభ్యర్ధులకు గరిష్ట వయఃపరిమితిలో సడలింపు ఉంది. ఆన్‌లైన్ పోటీ పరీక్ష , ఇంట ర్వ్యూ ద్వారా అభ్యర్ధులను అప్రంటిస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ పోటీ పరీక్ష 2013, ఫిబ్రవరి 2 మరియు 3 తేదీలలో జరుగనుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ 2012, డిసెంబర్ 22. ఇతర వివరాలకై http://www.licindia.in/careers.htm వెబ్‌సైట్‌లో సంప్రదించండి.

ఎల్‌ఐసి విశిష్టతలు
- ఎల్.ఐ.సిలో కేంద్ర ప్రభుత్వం 100% స్టాక్ హోల్డర్.
-ఎల్.ఐ.సి ఆస్తులు రూ.13.25 ట్రిలియన్‌లు
-243 ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ సొసైటీలను ఐక్యం చేస్తూ 1956లో ఎల్.ఐ.సి ఏర్పాటయింది.
-ఎల్.ఐ.సి హెడ్‌క్వార్టర్స్ - ముంబాయి
-8 జోనల్ ఆఫీసులు 113 డివిజనల్ ఆఫీసు లతో ఎల్.ఐ.సి దేశమంతటా ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది.
-3500 సర్వీసింగ్ ఆఫీసులలో 2048 ఎల్‌ఐసి బ్రాంచీలు మిళితమై సేవలు అందిస్తున్నాయి.
-13,37,064 ఎల్.ఐ.సి ఏజెంట్లు, ఎల్.ఐ.సి.కి ఉన్నారు.

Read more...

Monday, January 30, 2012

నేడు టెట్ ఫలితాలు and డీఎస్సీ నోటిఫికేషన్ నేడే (TET and DSC)

మధ్యాహ్నం 2:30కు వెల్లడించనున్న మంత్రి పార్థసారధి
హైదరాబాద్, జనవరి 29 (): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కే పార్థసారధి సచివాలయంలో మధ్యాహ్నం రెండున్నరకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను www.aptet.cgg.gov.in లో చూడొచ్చు.


డీఎస్సీ నోటిఫికేషన్ నేడే

- సుమారు 22,622 పోస్టులతో ప్రకటన
హైదరాబాద్, జనవరి 29 (): డీఎస్సీ-2012 నోటిఫికేషన్ సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 22, 622 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇటీవల రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) 9569 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను పదోన్నతులతో భర్తీ చేసింది. ఇన్ సర్వీస్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు పదోన్నతులు కల్పించింది. ప్రమోషన్లతో భర్తీ చేసిన పోస్టుల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఈ పోస్టుల స్థానంలో డీఎస్సీలో నేరుగా ఎస్‌జీటీ పోస్టులను భర్తీ చేస్తారు. అయితే ఈ పోస్టుల సంఖ్య, వివరాలపై ప్రభుత్వం నుంచి జీవో విడుదల కావాల్సి ఉంది. సోమవారం మధ్యాహ్నానికల్లా జీవో వస్తే సాయంత్రం లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. లేనిపక్షంలో మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Take By: T News

Read more...

డీఎస్సీకి మరో కొర్రి (DSC)

- బీఈడీ సబ్జెక్టును ఇంటర్‌లోనూ చదివి ఉండాలంటూ కొత్త నిబంధన
- జీవో నెంబర్ 4 జారీ
- వేలాదిమందికి డీఎస్సీ చాన్స్ లేనట్లే!
- రోజుకో నిబంధనతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు
- ఆ నిబంధనను వెంటనే తొలగించాలి
- టీచర్ అభ్యర్థుల మండిపాటు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 29 (): అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధన తెస్తూ అభ్యర్థుల ఆశలను అడియాశలు చేస్తోంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనర్హులుగా చేసిన సర్కారు తాజాగా మరో కొర్రీని తెరపైకి తెచ్చింది. బీఈడీలో చదివిన సబ్జెక్టు కచ్చితంగా ఇంటర్‌లోనూ చదవి ఉండాలనే నిబంధన పెట్టింది. దీంతో వేలాది మంది బీఈడీ అభ్యర్థులు డీఎస్సీకి అనర్హులయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన విద్యార్థులు డిగ్రీలో బీఏ, బీకాంలకు మారి.. బీఈడీలోనూ అవే సబ్జెక్టులు చదివితే.. డీఎస్సీకి అర్హత కోల్పోతారు. దీంతో వారిలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

విద్యాశాఖ మొదటి నుంచి బీఈడీ అభ్యర్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోంది. కొత్త నిబంధనలు తెస్తూ ఒక్క దెబ్బకు వేల పిట్టలన్న చందంగా టీచర్ పోస్టులకు చాలామందిని దూరం చేస్తోంది. దూరవిద్య విధానంలో డిగ్రీ, బీఈడీ చేసినవారిని టెట్‌కు అనర్హులుగా ప్రకటించింది. దీంతో వారు డీఎస్సీ అవకాశం కోల్పోయారు. తాజాగా ఇంటర్, డిగ్రీ, బీఈడీ ఇలా వరసగా అన్నీ చదివి చివరకు టెట్ నెగ్గినా డీఎస్సీ రాయలేని పరిస్థితి. డీఎస్సీ అభ్యర్థులు బీఈడీలో చదివిన సబ్జెక్టును ఇంటర్‌లోనూ తప్పనిసరిగా చదివి ఉండాలన్న నిబంధన విధిస్తూ 9న విద్యాశాఖ జీవో నెం.4ను జారీ చేసింది. ఇంటర్, బీఈడీల్లో ఒకే సబ్జెక్ట్ చదివినవారే డీఎస్సీకి అర్హులని తేల్చింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనల కారణంగా బీఈడీ అభ్యర్థులు ఇప్పటికే ఎస్‌జీటీ పోస్టులకు దూరమయ్యారు. ఇక వారికి మిగిలింది స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) పోస్టులే. తాజా నిబంధనతో చాలామందికి ఈ పోస్టులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి.

ఈ నిబంధన ఎడ్‌సెట్‌కు ఎందుకు లేదు?
బీఏ, బీకాం, బీఎస్సీ చదివిన వారు సంబంధిత డిగ్రీ సబ్జెక్టులో బీఈడీ చేసుకునే అవకాశం ఉంది. బీఈడీలో చదవబోయే సబ్జెక్టును ఇంటర్‌లోనూ కచ్చితంగా చదవాలనే నిబంధన ఎడ్‌సెట్‌లో లేదు. తాజా నిబంధనను ఎడ్‌సెట్‌కూ వర్తింపచేస్తే చాలామంది బీఈడీ చేసేవాళ్లే కాదు. టెట్ పేపర్‌పై ఆందోళన చేస్తున్న తమకు మరో షాక్ ఇచ్చేలా రాష్ట్రవూపభుత్వం ఈ నిబంధన తెచ్చిందని అభ్యర్థులు మండిపడుతున్నారు.

టెట్‌తో సంబంధం లేకుండా  డీఎస్సీకి అవకాశమివ్వండి - పీఆర్‌టీయూ డిమాండ్
హైదరాబాద్, జనవరి 29 (టీ న్యూస్): డీఈడీ పాసైన అభ్యర్థులందరికీ టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ రాసే అవకాశం కల్పించాలని పీఆర్‌టీయూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే టెట్ నిర్వహించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని సంఘం అధ్యక్షుడు పీ వెంకట్‌డ్డి, కార్యదర్శి పూల రవీందర్ విమర్శించారు.

మూలిగే నక్కపై తాడిపండు పడ్డట్లు..
బీఈడీ అభ్యర్థుల పరిస్థితి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం ప్రమోషన్లకే సరిపుచ్చుతామంటున్న ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనతో బీఈడీ అభ్యర్థులను వేధిస్తోంది.
డీ రవీందర్, బీఈడీ అభ్యర్థి


ప్రభుత్వ చెలగాటం
ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులతో చెలగాటమాడుతోంది. జీవో నెం.3ను రద్దు చేసి మా ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపింది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ చదివిన వారు అనివార్య కారణాలతో డిగ్రీలో బీఏ, బీకాం చేసి టెట్ నెగ్గినా కూడా వారికి డీఎస్సీలో అవకాశం కల్పించలేమని ప్రభుత్వం చెప్పడం దారుణం.
- సీత, ఉస్మానియా యూనివర్సిటీ


ఈ నిబంధన అర్థం లేనిది
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనడం అర్థం లేని విషయం. ఇంటర్ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా బీఈడీ చదివే అవకాశం ఎందుకు కల్పించారు. సైన్స్ గ్రూప్‌తో ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్ చదివి బీఈడీ చేసిన వారు మళ్లీ ఆర్ట్స్‌లో ఇంటర్‌లో చదవాలా?
- ఆర్ వెంక బీఈడీ అభ్యర్థి


వెంటనే తొలగించాలి
బీఈడీలో చదివిన సబ్జెక్ట్‌ను ఇంటర్‌లో చదవాలనే నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించాలి.
- గణేష్, బీఈడీ అభ్యర్థి

Read more...

Sunday, January 22, 2012

ఏప్రిల్‌లో సెట్.. మార్చిలో నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 21(): డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పరీక్ష సెట్‌ను ఏప్రిల్ నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా ఈ పరీక్షను స్లెట్‌గా పరిగణించినప్పటికీ ప్రస్తుతం దాన్ని సెట్‌గా మార్చిన విషయం తెలిసిందే. సెట్ నిర్వహణా బాధ్యతలు చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది.

మార్చిలో సెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎస్. సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహించి మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలోగా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ యూజీసీ అక్రిడేషన్ పొందాల్సి ఉంది. సెట్ పరీక్ష ఏర్పాట్లపై యూజీసీ కమిటీ తనిఖీ చేసి సెట్ పరీక్షకు గుర్తింపు ఇస్తుంది. యూజీసీ గుర్తింపు ప్రక్రియ ఫిబ్రవరికల్లా పూర్తయినా మార్చిలో నోటిఫికేషన్ వెల్లడించేందుకు సెట్ నిర్వహణా కమిటీ చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తోంది.

Take By: T News

Read more...

Friday, January 20, 2012

పోలీస్ శాఖలో 820 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్, జనవరి 19 (): పోలీస్ శాఖలోని వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీల భర్తీకి గురువారం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్ సీటీ ఎస్సై పోస్టులు 38, వేలిమువూదల విభాగంలో ఎస్8సీటీ ఎస్సై పోస్టులు 17, పోలీస్8 ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ ఏఎస్సై పోస్టులు 29 భర్తీ కానున్నాయి.

అదేవిధంగా కమ్యూనికేషన్స్ విభాగంలో ఎస్8సీటీ కానిస్టేబుల్ పోస్టులు 516, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్8సీటీ కానిస్టేబుల్ (మెకానిక్) పోస్టులు 32, ఎస్8సీటీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు 188 భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను www.apstatepolice.org వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ మాలకొండయ్య తెలిపారు.

Take By: T News

Read more...

Wednesday, December 28, 2011

మూడు వేల కొలువులు (apspsc.gov.in )

- 2,805 ఉద్యోగాల భర్తీ
- ఒకేసారి 10 నోటిఫికేషన్‌లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
- అత్యధికంగా 1,716 ఏఈఈ పోస్టులు
- జీవో 420 ప్రకారమే ఉద్యోగాల నియామకాలు
- మెరిట్ లిస్టు ఆధారంగానే భర్తీ

హైదరాబాద్, డిసెంబర్ 27 ():రాష్ట్ర ప్రభుత్వంలోని 10 శాఖలకు చెందిన 2,805 పోస్టుల భర్తీకి ఆంధ్రవూపదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మంగళవారం 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్లూఎస్ శాఖల్లోని 1,716 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 432 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో అత్యధికంగా 397అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, అత్యల్పంగా పోర్టు ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఎలక్షిక్టికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 9 ఉన్నాయి. ఇటీవల ఏపీపీఎస్సీ సంస్కరణల ఆధారంగా విడుదల చేసిన జీవో 420 ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. ఈ జీవో ప్రకారం కేవలం రాత పరీక్ష మెరిట్ లిస్టు ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా బోర్డు ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో 420 విడుదల చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూ పద్దతి ఉండాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో 420ని ఉపసంహరించుకోవాలని బోర్డు సభ్యులు ముఖ్యమంవూతికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో అమలుపై గత సోమవారం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే కమిటీ సిఫారసుల మేరకు ప్రస్తుత నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుం దా? లేదా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ల వరకు జీవో 420 అమలు చేసి, మిగితా నోటిఫికేషన్లకు కమిటీ సిఫారసులు వర్తింపజేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ప్రకటించిన తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు www.apspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ప్రకటించారు.

Take By: T News

Read more...

Lorem Ipsum

Blog Money Valuation
My blog has been valued at... $606.24

Blog Valuation Tool from BlogCalculator.com

Entertainment blogs
Blogarama - The Blog Directory Reference - FreeDirectorySubmit.com, a Social-aware, SEO-friendly web directory submission service. Top Traffic Wholesaler - Offers Lowest Targeted Traffic..
World's leading company in Online Website Advertising since 2005.. Offering high volume targeted traffic - Greatest Place To Buy - Lowest Price To Get. Website Monitoring by InternetSeer Promote Your Blog http://www.powerhits4u.com/images/125x125.gif Online Marketing Blog Directory blogville.us Blogs lists and reviews voice2telangana.blogspot.com/ Comprehensive Web Page Data Trust Rank for voice2telangana.blogspot.com - 0.39 Future Google PR for voice2telangana.blogspot.com - 2.45

  © Blogger templates Newspaper III by Ourblogtemplates.com 2008

Back to TOP